శ్రీ మిస్సన్న మహాశయా! శుభాశీస్సులు. నేను చెప్పుదామనుకొని మళ్ళీ ఎందుకులే అని ఊరుకొన్నాను. మా తమ్ముడు చి. డా. మూర్తి అదే సలహా మీకు చెప్పేడు. చాలా సంతోషము. స్వస్తి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ రామకథాభిమానం ఎన్నో పూరణలలో ప్రతిబింబింది. ఎటువంటి సమస్యనైనా ముందు రామాయణ పరంగా పూరించే అవకాశం వున్నదా అని పరిశీలిస్తారనుకుంటాను. త్రిజటా స్వప్నవృత్తాంతంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. మిత్రుల పూరణల గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, వలపు కడలిలో ప్రియుని పలుకుల అలలా? ఏమి భావనాచాతుర్యము! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. నరసింహ మూర్తి గారి సవరణ బంగారానికి తావి అబ్బినట్లయింది. సంతోషం! మీ రెండవ పూరణను అవగాహన చేసికొనలేకపోతున్నాను! * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ మనోహరమైన పద్యమాధుర్యాన్ని మళ్ళీ చవిచూపిస్తున్నందుకు మహదానందంగా ఉంది. ‘మన వాక్కు హితమై, మితమై, సత్యమై ఉండా’లని పెద్దలు చెప్పారు. ఆ సూక్తికి అద్దం పడుతున్నది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు. మిస్సన్న గారి పద్యంలో సముచితమైన సవరణ సూచించినందుకు ధన్యవాదాలు. * సహదేవుడు గారూ, ‘కలలు కనండి, సాకారం చేసుకోండి’ అన్న కలాం మాటను పూరణలో చక్కగా ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. నేమాని వారి సూచన గమనించారు కదా! ‘నలలలలుగ’ కూడా అర్థం కాలేదు. * రాజేశ్వరి అక్కయ్యా, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నా పద్యరచన చేస్తున్నారంటే ఏమని ప్రశంసించను? ధన్యవాదాలు. లక్కరాజు వారు ప్రశంసించినట్లు ‘సింప్లీ సూపర్బ్’! వారి సందేహమే నాది కూడా! మీ విద్యుదాటంకం తొలగిందా? ఇక్కడ మేమూ కరెంటు కోతలతో బాధపడుతున్నాము. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ లక్కరాజు గరికీ . సోదరులు + గురువులు శ్రీ శంకరయ్య గారికీ ధన్య వాదములు . ఇక ....పవరు వచ్చింది గానీ పాలు పెరుగు , లాంటి కొన్ని నిత్యావసర వస్తువులు ఇంకా ఇబ్బంది గానె ఉన్నాయి కాఫీలు టీలు లేవు . ఒకటి రెండు రోజుల్లో మెరుగు పడ వచ్చును. .మీ అందరి ఆదరాభి మానములకు ధన్య వాదములు
గురువు గారికి ధన్యవాదములు. మిస్సన్న గారి పూరణ, భావుకత అమోఘము. చాలా,చాలా బాగుంది. అయ్యో,రాజేశ్వరి అక్కయ్య గారికి యింకా కాఫీ, టీ ల కిబ్బందంటే బాధగా నుంది. ఇకపై ఇలాంటి వాతావరణ చిక్కు లొస్తాయంటే వెంటనే మా డాలస్ వచ్చేయండి. మా హ్యూగోలో అయితే రాళ్ళు,కఱ్ఱలు పెట్టయినా మా యింటి వెనకాల వంట చేసేసుకోవచ్చు. చిన్న ఊళ్ళ సుఖమే వేరు !
తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు. అమెరికాలో తుఫాను ప్రభావమునకు చాల రాష్ట్రములు గురి యగుట విచారణీయము. మా అబ్బాయి కిశోరు కుటుంబము కూడా న్యూ జెర్సీలో చాలా ఇబ్బంది పడ్డారు. కరెంటులేక 4 రోజులు మిత్రులు బంధువుల ఇళ్ళలో నున్నారట. శ్రీమతి రాజేశ్వరి గారు కూడా అదే ప్రాంతము వారగుటచేత వారు కూడా ఇబ్బంది పాలయిరి - చాలా విచారించేము. అప్పట్లో మీ ఊరికి రావచ్చు ననుకొనినా విమాన సర్వీసులు కాని రోడ్డు ప్రయాణము గాని అవకాశము లేదు కదా? ఏలాగున వత్తురు? ఆహ్వానించి నందుకు సంతోషము. స్వస్తి. అన్నయ్య సన్యాసిరావు
అయ్యా! శ్రీ రామకృష్ణ గారూ! శుభాశీస్సులు: డా. నరసింహమూర్తి గారి పద్యములోని "సత్య మథుర ప్రజ్ఞా వాక్" అనే సమాసములో "ర" లఘువుగానే ప్రయోగింపబడినది. ప్ర హ్ర మొదలగు శబ్దముల ముందు వచ్చు అక్షరమును అవసరమును బట్టి గురువుగా గాని లేక లఘువుగా గాని వాడుకొనవచ్చును అని వ్యాకరణ సమ్మతము. స్వస్తి.
కల గనుచు మంచి భవితను
రిప్లయితొలగించండిసలుపుచు తగు పనుల పూర్తి సాధనములతో
బలమైన కృషిని జేసిన
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.
పలికె త్రిజట యట రాక్షస
రిప్లయితొలగించండికుల వనితల తోడ దనకు గోచరమగు రా
గల పరిణామము లనుచును
కలలే వాస్తవములగుచు గడు సుఖము లిడున్
తలపులు తనువులు సగమై
రిప్లయితొలగించండికలలో విహరించు వేళ కన్నెకు మదిలో
వలపుల జలనిధి ప్రియు పలు-
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.
(పలుకు+అలలు)
రిప్లయితొలగించండిగురువు గారికి, అన్నయ్య గారికి నమస్సులు. మిత్రులకు అభివందనములు.
తలచిన సద్భావమ్ములు
పలికినచో సత్య మధుర ప్రజ్ఞా వాక్కుల్
చెలగిన నుపకారమ్ములఁ
గలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా మీ పద్యము !
రిప్లయితొలగించండితలపులు తనువులు నొకటై
కలలో విహరించు వేళ కన్నెకు మదిలో
వలపుల జలనిధి ప్రియు పలు-
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్.
కలలుఁగనండనుచు'కలాం'
రిప్లయితొలగించండికలసాకారమగునట్లుకష్టపడమనెన్
విలువైనమాటనిజమది
కలలేవాస్తవములగుచుఁగడుసుఖములిడున్!
శ్రీ మిస్సన్న మహాశయా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినేను చెప్పుదామనుకొని మళ్ళీ ఎందుకులే అని ఊరుకొన్నాను. మా తమ్ముడు చి. డా. మూర్తి అదే సలహా మీకు చెప్పేడు. చాలా సంతోషము. స్వస్తి.
మిస్సన్న గారి పద్యం డాక్టరు గారి మెరుగు చాలా బాగున్నాయి
రిప్లయితొలగించండిమూర్తి మిత్రమా! మీరు దిద్దిన మెరుగు!
రిప్లయితొలగించండిఈ రోజు మీ దర్శనం!!
నేమాని పండితార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమరొక ప్రయత్నం.
తలపులు పలుకులు కృతములు
కలుముల సతి పతివి చరణ కమలము లైనన్
కలలేమి నిజములేమిటి?
కలలేవాస్తవములగుచుఁగడుసుఖములిడున్!
కలవర పడు మనమున బడు
రిప్లయితొలగించండికలలే కల్లలగు చుండ కష్టము దోచున్
కలుగు సిరులే యని దెలుపు
కలలే వాస్తవములగుచు గడు సుఖము లిడున్.
వలయముల వంటి యూహలు
రిప్లయితొలగించండినలలలలుగ వ చ్చు చుండి య దృ శ్య మగుచున్
కలలుగ మారుచు నుండిన
కలలే వాస్తవము లగుచు గడు సుఖము లిడున్ .
అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 2వ పాదములో 7వ గణము (యదృశ్య) అని జగణము వేయుట వలన గణభంగము జరిగినది. సవరించండి.
ఇలలో తీరని కోర్కెలు
రిప్లయితొలగించండికలకల మునురేపి మదిని కలతను పెంచన్ !
నిలకడ మీదను నొకపరి
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్ !
రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ సింపుల్ గ బాగుంది.
రిప్లయితొలగించండిశాండీ తర్వాత న్యు జెర్సీ ఎల్లా ఉంది. విద్యుత్ వచ్చిందా మీకు?
ఇలలో తీరని కోర్కెలు
కలకల మునురేపి మదిని కలతను పెంచన్ !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅలుపెరుగక శ్రమ పడుచున్
పలువురకున్ సాయపడుచు పరవశమగుచున్
మలినములెరుగని మనసుకు
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ రామకథాభిమానం ఎన్నో పూరణలలో ప్రతిబింబింది. ఎటువంటి సమస్యనైనా ముందు రామాయణ పరంగా పూరించే అవకాశం వున్నదా అని పరిశీలిస్తారనుకుంటాను.
త్రిజటా స్వప్నవృత్తాంతంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిత్రుల పూరణల గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
వలపు కడలిలో ప్రియుని పలుకుల అలలా? ఏమి భావనాచాతుర్యము! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
నరసింహ మూర్తి గారి సవరణ బంగారానికి తావి అబ్బినట్లయింది. సంతోషం!
మీ రెండవ పూరణను అవగాహన చేసికొనలేకపోతున్నాను!
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ మనోహరమైన పద్యమాధుర్యాన్ని మళ్ళీ చవిచూపిస్తున్నందుకు మహదానందంగా ఉంది.
‘మన వాక్కు హితమై, మితమై, సత్యమై ఉండా’లని పెద్దలు చెప్పారు. ఆ సూక్తికి అద్దం పడుతున్నది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారి పద్యంలో సముచితమైన సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.
*
సహదేవుడు గారూ,
‘కలలు కనండి, సాకారం చేసుకోండి’ అన్న కలాం మాటను పూరణలో చక్కగా ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
నేమాని వారి సూచన గమనించారు కదా! ‘నలలలలుగ’ కూడా అర్థం కాలేదు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
కరెంటు లేక ఇబ్బంది పడుతున్నా పద్యరచన చేస్తున్నారంటే ఏమని ప్రశంసించను? ధన్యవాదాలు.
లక్కరాజు వారు ప్రశంసించినట్లు ‘సింప్లీ సూపర్బ్’!
వారి సందేహమే నాది కూడా! మీ విద్యుదాటంకం తొలగిందా? ఇక్కడ మేమూ కరెంటు కోతలతో బాధపడుతున్నాము.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ లక్కరాజు గరికీ . సోదరులు + గురువులు శ్రీ శంకరయ్య గారికీ ధన్య వాదములు .
రిప్లయితొలగించండిఇక ....పవరు వచ్చింది గానీ పాలు పెరుగు , లాంటి కొన్ని నిత్యావసర వస్తువులు ఇంకా ఇబ్బంది గానె ఉన్నాయి కాఫీలు టీలు లేవు . ఒకటి రెండు రోజుల్లో మెరుగు పడ వచ్చును. .మీ అందరి ఆదరాభి మానములకు ధన్య వాదములు
గురువు గారికి ధన్యవాదములు. మిస్సన్న గారి పూరణ, భావుకత అమోఘము. చాలా,చాలా బాగుంది.
రిప్లయితొలగించండిఅయ్యో,రాజేశ్వరి అక్కయ్య గారికి యింకా కాఫీ, టీ ల కిబ్బందంటే బాధగా నుంది. ఇకపై ఇలాంటి వాతావరణ చిక్కు లొస్తాయంటే వెంటనే మా డాలస్ వచ్చేయండి. మా హ్యూగోలో అయితే రాళ్ళు,కఱ్ఱలు పెట్టయినా మా యింటి వెనకాల వంట చేసేసుకోవచ్చు. చిన్న ఊళ్ళ సుఖమే వేరు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితమ్ముడు చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఅమెరికాలో తుఫాను ప్రభావమునకు చాల రాష్ట్రములు గురి యగుట విచారణీయము. మా అబ్బాయి కిశోరు కుటుంబము కూడా న్యూ జెర్సీలో చాలా ఇబ్బంది పడ్డారు. కరెంటులేక 4 రోజులు మిత్రులు బంధువుల ఇళ్ళలో నున్నారట. శ్రీమతి రాజేశ్వరి గారు కూడా అదే ప్రాంతము వారగుటచేత వారు కూడా ఇబ్బంది పాలయిరి - చాలా విచారించేము. అప్పట్లో మీ ఊరికి రావచ్చు ననుకొనినా విమాన సర్వీసులు కాని రోడ్డు ప్రయాణము గాని అవకాశము లేదు కదా? ఏలాగున వత్తురు? ఆహ్వానించి నందుకు సంతోషము. స్వస్తి. అన్నయ్య సన్యాసిరావు
నరసింహ మూర్తి గారూ..,
రిప్లయితొలగించండిసత్యమధురప్రజ్ఞా వాక్ అన్నపుడు ర ను లఘువుగనే పరిగణించవచ్చంటారా..
భవదీయుడు
అయ్యా! శ్రీ రామకృష్ణ గారూ! శుభాశీస్సులు:
రిప్లయితొలగించండిడా. నరసింహమూర్తి గారి పద్యములోని "సత్య మథుర ప్రజ్ఞా వాక్" అనే సమాసములో "ర" లఘువుగానే ప్రయోగింపబడినది. ప్ర హ్ర మొదలగు శబ్దముల ముందు వచ్చు అక్షరమును అవసరమును బట్టి గురువుగా గాని లేక లఘువుగా గాని వాడుకొనవచ్చును అని వ్యాకరణ సమ్మతము. స్వస్తి.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమనో వాక్కాయ కర్మలలో శ్రీహరి పదాలపైనే ధ్యాస ఉన్నవారికి కలలైనా వాస్తవమైనా ఒకటే అని చెప్పాలని రెండవ పూరణలో ప్రయత్నించాను. సఫలీకృతుడ నవలేక పోయానని అర్థమైంది.
మిస్సన్న గారి రెండవ పద్యము. ( కవిత్వము కంటె సంపాదకత్వము నా బోటి వారలకు సుళువేమో ! )
రిప్లయితొలగించండితలపులు పలుకులు కృతములు
కలుములు కమలాక్షు పాద కమలము లైనన్
కలలేమి నిజములేమిటి?
కలలేవాస్తవములగుచుఁగడుసుఖములిడున్!
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
========*=======
దొలగును కష్టా లెల్లను
మిగులును నవి నీతి పరులు మెండుగ ధరలో
సులభము గను లోభులకును
గలలే వాస్తవము లగుచు గడు సుఖము లిడున్ |
శ్రీ నేమాని వారికి శత సహస్ర వందనములు ,
రిప్లయితొలగించండిఈ రీతిన సవరించితిని నా భావము లోభులకును, అవినీతి పరులకు కలలు నిజమగుచున్నవి యని
=====*=====
దొలగును కష్టా లెల్లను
మెలగును నవి నీతి పరులు మెండుగ ధరలో
సులభము గను లోభులకును
గలలే వాస్తవము లగుచు గడు సుఖము లిడున్ |
కలవర మాయెను మదిలో...
రిప్లయితొలగించండిగలయమతరజభనసలగ
గణముల యతులన్
మలచుట నా తరమాయను
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్
అలసటతో రాహులుడిల
రిప్లయితొలగించండిగలగల మ్రోగించి డప్పు గాభర నొందన్
గెలువగ మోడియె, ప్రజలవి
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్
రిప్లయితొలగించండికలలన్ గనుమోయ్! అబ్దులు
కలాము చెప్పిరి వినదగు! కలదోయ్ రెక్కల్
ఇలలో వాటికి ! యెగురన్
కలలే వాస్తవము లగుచుఁ గడు సుఖము లిడున్!
జిలేబి