2, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 866 (సీతాపతి యనఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

19 కామెంట్‌లు:

 1. ప్రీతిగ దలుతము జగతికి
  మాతా పితరులె వారు మాహేశ్వరియే
  ఖ్యాతిని బొందెను సతిగా
  సీతా ! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! మిస్సన్న మహాశయా! నిజ నాతి అనే సమాసమును మరొకమారు పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. ఖ్యాత చరిత్రుండగు నా
  సీతాపతి యనగ రాజశేఖరుడు సుమా
  భూత గణమ్ములకెల్లను
  సీతా! పతి యనగ జంద్రశేఖరుడు గదా

  (రాజశేఖరుడు అనగా -- (1) రాముడు, (2) శివుడు అని 2 అర్థములు కలవు)
  పై పద్యములో విషయమును సీతతో జనకుడు కాని వేరొక పెద్దాయన కాని చెప్పు చున్నట్లు నా భావము.

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, నవంబర్ 02, 2012 8:27:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  నీతికి ప్రతిరూపంబే
  సీతాపతి యనఁగఁ, జంద్రశేఖరుఁడు గదా
  నేతగ నిలచెను జగతికి
  మా తాపత్రయము దీర్చు మాహేశ్వరుడే

  రిప్లయితొలగించండి
 5. నేమాని పండితార్యా! ధన్యవాదములు.

  నీతిగ మెలగుచు తనదగు
  నాతికె మనసిచ్చి మనుట నయమగు గానీ
  నాతికి తనువున సగమిడె
  సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కొడుకు సీతాపతికి మందివ్వమని కోడలు సుశీలకు మామ చంద్రశేఖరుని సలహా :

  01)
  _______________________________

  సీతి కలిగె సీతము నని
  సీతాపతి యనగ ; జంద్ర - శేఖరుడు గదా
  సీతియె పోవుట కొరకై
  శీతాంసురస మిడుమని సు - శీలకు జెప్పెన్ !
  _______________________________
  సీతి = పడిసెము
  సీతము = చలికారు
  శీతాంసురసము = ఆయుర్వేదౌషధం
  (పూర్వం వచ్చేది ! ఇప్పుడు వస్తుందో లేదో ?
  ఎన్నో సాధారణ రోగాల నద్భుతంగా తగ్గించేది !)

  రిప్లయితొలగించండి
 7. భ్రాతా ! విను మొక విషయము
  పీ తాంబర ధారి మఱియు ప్రేతల ప్రభువు
  న్నేతావత చింతించగ
  సీ తా పతి యనగ జంద్ర శేఖరుడు గదా !

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు

  అక్కా తమ్ముళ్ళ మధ్య సంభాషణ
  =====*=====
  రాతిని నాతిగ జేసెను
  సీతా పతి యనఁగఁ, జంద్రశేఖరుఁడు గదా!
  ప్రీతిగ వరముల నిచ్చును ,
  భూతలమున నను చుబల్కె బుడతడు వడిగా !

  రిప్లయితొలగించండి
 9. ఆ తెలుగు రచయిత గిడుగు
  సీతాపతి యనగ ; జంద్రశేఖరుడు గదా
  రీతిగ వ్రాయు ' మన తెలుగు ' -
  జాతి సమస్యల నొసగును శంకర గురువుల్ !

  రిప్లయితొలగించండి
 10. ఆ తెలుగు రచయిత గిడుగు
  సీతాపతి యనగ ; జంద్రశేఖరుడు గదా
  రీతిగ వ్రాయు ' మన తెలుగు ' -
  జాతి సమస్యల నొసగును శంకర గురువుల్ !

  రిప్లయితొలగించండి
 11. శ్రీరాముడు సీతతో అంటున్నట్లుగా......

  భూతాధిపతిమహేశుం
  డేతద్విశ్వంబునందునెల్లజనులకున్
  ప్రీతికలిగించు, వినుమో
  సీతా!పతియనఁగఁచంద్రశేఖరుఁడు కదా!

  రిప్లయితొలగించండి
 12. శ్రీరాముడు హనుమంతుని గూర్చి తన సీతతో అన్నట్లు:

  కోతులలోయొకడంచును
  నీతలపులలోహనుమనునిందించకుమా!
  భూతపతియీబలుండని
  సీతాపతి యనఁగ చంద్రశేఖరుడు గదా!

  రిప్లయితొలగించండి
 13. ఆ తారల మురిపించెడి
  సీతల కౌముదిని కురియు శీతాంశువునే !
  ప్రీతిగ శిరమున నిలిపిన
  సీతాపతి యనఁగఁ జంద్ర శేఖరుఁడు గదా !

  సోదరుల ఆదరాభి మానములు శ్రీరామ రక్షగా మేము న్యూ జెర్సీలొ క్షేమంగానె ఉన్నాము .కాక పోతె పవరు లేనందున ఇబ్బంది తప్పలేదు. అందరికీ కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు గారూ, మనతెలుగు చంద్రశేఖరుడ్ని బాగా ఇరికించారు మీ పూరణలో:-)

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న బంధువుల ఇంట ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రికి ఇల్లు చేరాను. బడలిక కారణంగా నిన్న పూరణలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘సీతా!’ అని సంబోధించి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  మొదటి పాదంలో ‘తలుతుము’ అనండి.
  రెండవ పాదంలో ‘వారు’ అన్నచోట గణదోషం. ‘జగతికి / మాతా పితరులె వారు మాహేశ్వరియే’ అన్నదాన్ని ‘భక్తిని / మాతా పితరులె జగతికి మాహేశ్వరియే’ అందాం.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  గిడుగు వారిని పూరణలో చొప్పించిన విధం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం చక్కని ధారతో పరుగులెత్తింది. మంచి పూరణ. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  సంతోషం. మీ క్షేమ సమాచారం తెలిసింది. విద్యుత్ సౌకర్యం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో?
  క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్లాగుకు పద్యాలను వ్రాసి పంపినందకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. ఈతడె అరువది ఎకరపు
  భూతల వ్యవసాయి; మేటి
  భూధరు డైనన్
  ప్రీతిగ నేలను దున్నెడి
  సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!


  సీత = నాగటి చాలు
  చంద్రశేఖరుడు = KCR

  MEDAK: Farmer K Chandrasekhar Rao hopes to make more than Rs 10 crore per annum by growing and selling vegetables at his 60-acre farm in 2014

  http://m.timesofindia.com/city/hyderabad/KCR-seeks-to-reap-Rs-10cr-from-his-farm/articleshow/28306851.cms

  రిప్లయితొలగించండి
 17. చేతలతో మాటలతో
  కోతుల మాలిమిని పొంది గొప్పగు రీతిన్
  మా తెలగాణను బ్రోచెడి
  సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

  రిప్లయితొలగించండి


 18. ఓ తెంపరీ ! వివాహపు
  ఖాతా తెరిచితివిగా !సుఖము సుఖమేనా ?
  యేతావాతా చెప్పెద
  సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి