11-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై”
(లేదా...)
“కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో”
(ఉప్పలధడియం భరతశర్మ అష్టావధానంలో ఈరోజు నేనిచ్చిన సమస్య)
11-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై”
(లేదా...)
“కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో”
(ఉప్పలధడియం భరతశర్మ అష్టావధానంలో ఈరోజు నేనిచ్చిన సమస్య)
10-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”
(లేదా...)
“కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్”
9-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అయ్యలకే కాని మీస మందఱ కేలా?”
(లేదా...)
“అయ్యల కొప్పుఁ గాని కన నందఱ కెందుకు కోఱమీసముల్”
(కవి చౌడప్పకు నమస్సులతో...)
8-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె”
(లేదా...)
“అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా”
7-12-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అత్తకుఁ గను గీటె నల్లుఁ డౌర”
(లేదా...)
“అత్తకుఁ గన్ను గీటె నల యల్లుఁడు మామయె చూచి మెచ్చఁగన్”
6-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలలు గల్లలైనఁ గలుగు ముదము”
(లేదా...)
“కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్”
5-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”
(లేదా...)
“కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ”
4-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్”
(లేదా...)
“గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”
3-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్”
(లేదా...)
“అన్నా యంచు ధరాత్మజాతయె యయోధ్యారాముఁ బిల్చెం దగన్”
2-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”
(లేదా...)
“చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్”
(ఈరోజు చిత్తూరులో ఆముదాల మురళి గారి 'శతావధాన కౌముది' పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను)