1, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4602

2-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”
(లేదా...)
“చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్”

(ఈరోజు చిత్తూరులో ఆముదాల మురళి గారి 'శతావధాన కౌముది' పుస్తకావిష్కరణలో పాల్గొన్నాను)

26 కామెంట్‌లు:

  1. కనినంతనె మాటగలిపి
    వినిపింతురు‌ మంచిపలుకు వెటకారముదా
    గును వారిపలుకులందున
    చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”

    రిప్లయితొలగించండి
  2. ఘనమగు చరిత్ర నెరుగక
    చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్
    నని పలు కరాదు, దానిని
    వినియాపుర జనులు నిన్ను విమతిడనంగన్

    రిప్లయితొలగించండి
  3. పనిపాట లేని వారలు
    దినమంతయు వీధులందు దిరిగెడి వారున్
    గనరారే ఎటులందుము
    చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    వినయము గలుగుచు, నెదిరిం
    చిన వెనుకాడక యడంచి సింహస్వప్న
    మ్మననొప్పనుండ 'యోధులు'
    చెనటులకున్, 'నిలయము గద చిత్తూరు గనన్'

    మత్తేభవిక్రీడితము
    వినయమ్మొప్పగ నుండి పెద్దలకు దీవింపంగ నా పిన్నలన్
    గుణవంతుల్ దగు దైవభక్తి పరులై గోవిందునర్చించుచున్
    హననంబెంచఁగ సజ్జనాలిపయి సింహస్వప్నమై పాపఁగన్
    జెనటుల్ మాత్రమె, వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  5. ఘనులౌ ఎరిగిన వారలు
    "చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్"
    అనియనగా భావ్యమ్మే
    సునిశితముగ జూడ యన్ని చోట్లను లేరే

    రిప్లయితొలగించండి

  6. వినిపించదుమంచిదెలుప
    చెనటులకున్,నిలయముగదచిత్తూరు గనన్
    మనకై హరియీమండల
    ముననిలిచెసతులనుగూడిభూరిగతానే

    రిప్లయితొలగించండి

  7. జనహృదయమ్ముల దోచిన
    ఘనులెందరొ గలరనుటయె కల్లయె కాదే
    కన పండితులేల్లరు మె
    చ్చె, నటులకున్ నిలయము గద చిత్తూరు గనన్


    వినరా సోదర నింద సేయ దగునే విశ్వమ్ములో గాంచగన్
    ఘనులున్ పండిత పామరుల్ గడుగయల్ ఖట్వాఫ్లుతుల్ కూడియున్
    మనుటన్ జూతుము వాస్తవమ్ము ప్రతి గ్రామంబందు నెట్లందువో
    చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  8. తెనుఁగు తమిళ కన్నడిగులు
    ననునిత్యము కలసిమెలసి యాప్తులవోలెన్
    మనుగడ సేతురు, కాదది
    చెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్

    రిప్లయితొలగించండి
  9. పనిమంతులు గుణవంతులు
    ఘనతవహించిన ప్రవరులు కవులున్ జిత్తం
    బును సరసాంబుధినిన్ ముం
    చె నటులకున్ నిలయము గద చిత్తూరు గనన్

    కనరారో పరమాత్మపై నిరతమున్ గావ్యాలు పొంకించగా
    ఘనకీర్తుల్ విబుధుల్ మహామహులుగా గంభీర సత్సారులున్
    బనిమంతుల్ గుణవంతులున్ సరసమౌ పాథోనిధానంబుఁ ముం
    చె నటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. ఘనులకు నాయక మణులకు
    సునిసిత చిత్తము న మెలగు శోభి త ప్రజకు న్
    మునుకొని మహిత ముదము గూ
    ర్చె నటుల కున్ నిలయము గద చిత్తూ రు గన న్

    రిప్లయితొలగించండి
  11. కననీ పట్టణమందు నెన్నఁడును సంకాశంబుగా ద్రావిడుల్
    తెనుఁగుల్ కన్నడిగుల్ వసింప కడు నుద్దీప్తంబుగా నర్మిలిన్
    ఘనమౌ కీర్తిగడించెనీ పురము, నిర్ఘాతంబు గాదే యనన్
    చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్?

    రిప్లయితొలగించండి
  12. కం॥ కన మూడు భాషల ప్రజలు
    వినయము విజ్ఞతను బడసి వెలయఁగ నిచటన్
    వినలేను నుడువఁగ నిటులఁ
    “జెనటులకున్ నిలయము గద చిత్తూరు గనన్”

    మ॥ కనఁగా నిచ్చట మూడు భాషల జనుల్ గారుణ్య మొప్పారఁగన్
    మనుచున్ సాగిరి మిత్రభావమును సమ్మానించుచున్ సర్వదా
    యనఁగన్ రాదొకొ నిట్టులెవ్వరు పరీహాసంబుకైనన్ జనుల్
    “చెనటుల్ మాత్రమె వాసముందురు గదా చిత్తూరులో నెప్పుడున్”

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఘనులెందరొ కలరిచ్చట
    జనుల మదిని దోచిన నట సామ్రాట్టుల్
    కన పాత్రలోన జీవిం
    చె,నటులకున్ నిలయము గద చిత్తూరుగనన్.

    రిప్లయితొలగించండి
  14. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    “గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

    గెలిచెతనొక్కరాష్ట్రమునుగింజుగలాటలపోరిపోరితాన్
    నిలిచెనుబీదరైతులకునీరుకరెంటువరాలనిచ్చిబొం
    దలనటుబెట్టవోటరులుతప్పుడుమాటలనమ్మి ఆగమై
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి