4, డిసెంబర్ 2023, సోమవారం

సమస్య - 4605

5-12-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”
(లేదా...)
“కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ”

15 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అమరెతెలంగాణారా
      ష్ట్రమునిలుపన్ కులువ కుంట చంద్రునికెదుటన్

      కమలాల్తొమ్మిది విచ్చెన్
      కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
    2. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
      “కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”

      కం॥
      అమరెతెలంగాణారా
      ష్ట్రమునిలుపన్ కులువ కుంట చంద్రునికెదుటన్

      కమలాల్తొమ్మిది విచ్చెన్
      కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

      గాదిరాజు మధుసూదన రాజు

      తెలంగాణారాష్ట్రము అంటేనే

      "కలువ కుంట "



      అట్టి కలువ కుంటచంద్రుడుండగనే
      ఎదురుగా వచ్చి తొమ్మిది కమలాలు వికసించాయి (బిజెపీ కమలాలు)
      అంటే హిందూమతస్తులకు ఆప్తుడే అని భావన

      తొలగించండి
    3. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
      “కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్”

      కం॥
      అమరెతెలంగాణారా
      ష్ట్రమునిలుపన్ కులువ కుంట చంద్రునికెదుటన్

      కమలాల్తొమ్మిది విచ్చెన్
      కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

      గాదిరాజు మధుసూదన రాజు

      తెలంగాణారాష్ట్రము అంటేనే

      "కలువ కుంట "



      అట్టి కలువ కుంటచంద్రుడుండగనే
      కలువకుంట వారి తెలంగాణా కలువల కుంటలో కనులకు
      ఎదురుగా తొమ్మిది కమలాలు వికసించాయి
      ఆప్తుడే శత్రువైతే కాదు అని భావన

      తొలగించండి
  2. సుమములు సుకుమారమ్ములు
    కమలును పగలు రవికిరణ కాఠిన్యతచే,
    సుమమిత్రుడు గాజాలడు
    కమలాప్తుఁడు, చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్.

    రిప్లయితొలగించండి

  3. కమనీయంబగు హరి రూ
    పము వర్ణించుచు నొక కవి వ్రాసెను ఘన దై
    వమతని నేత్రములవి గన
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్.



    రమకున్ వల్లభుడాతడై యగము పర్యంకమ్ముగా పాలసం
    ద్రమె వాసమ్ముగ గల్గినట్టి ప్రభువై రాజిల్లు సర్వాత్ముడా
    కమనీయంబగు రూపుడౌ హరిని యుత్కర్షింపగా నేత్రముల్
    కమలాప్తుండు , శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ.

    రిప్లయితొలగించండి
  4. మ.

    క్రమమున్ వేడిని సంజ్ఞ తాళుకొన సంగాతమ్ము దుర్వారమై
    హిమకూటమ్మునకేగె గుఱ్ఱముగ రాహిత్యమ్ము నుద్వోఢయే
    శ్రమతో సూర్యుడు మారె నశ్వముగ విశ్రాంతమ్ము జేకూర్చెడిన్
    *కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ!*

    రిప్లయితొలగించండి
  5. ఉమనిడు రవి శశులిరువురు
    కమలముతో నీటనుండు కలువ విరులకున్
    ‌సమముగ నాప్తులు గనుకనె
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

    రిప్లయితొలగించండి
  6. అమరత్వముకై విబుధులు
    తమ యోచనననుసరించి త్రచ్చిన కడలిన్
    హిముడును లక్ష్మి జనించిరి
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

    అమరత్వంబునకై సముద్ర మథనం బన్వీక్ష రేకెత్తగా
    నమృతాశుల్ మరియున్ నిశాచరులుఁ దా మత్యంత తోడ్పాటుతో
    శ్రమతో ద్రచ్చినఁ బుట్టె లక్ష్మి హిముడున్ రంజిల్లు సైదోడులై
    కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ

    [కమల - లక్ష్మి]


    రిప్లయితొలగించండి
  7. కమనీయముచంద్రవదన
    కమలంబులవంటికనులు‌ కలిగినచూడన్‌
    విమలంబుకదారెండును‌!
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్.

    రిప్లయితొలగించండి
  8. కమలాలయ నుడుగులచెలి
    యుమలొకరూపై లలితగ యుర్విఁ వెలసె నా
    యమ చెవి తాటంకమ్ములు
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

    రిప్లయితొలగించండి
  9. కమలాక్షున్సతి, శైలరాజ సుత, వాక్కాంతల్ భువిన్ దుర్గగా
    నమరెన్ భక్తజనావనా గరిమతోనార్ద్రంపు చిత్తంబుతో
    అమరేంద్రాదులు గొల్వనంచితముగా నాతల్లి తాటంకముల్
    కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ

    రిప్లయితొలగించండి
  10. కం॥ విమలమతులు పలుకరిటుల
    “కమలాప్తుఁడు చంద్రుడన్నఁ గల్ల యెటులగున్”
    కామలాప్తుఁడు సూర్యుండగు
    కమలము ముకుళించుఁ జంద్ర కాంతి తగులఁగన్

    మ॥ “కమలాప్తుండు శశాంకుడౌట నిజమే కాదందువా సత్కవీ”
    కమలాప్తుండిల భానుఁడే యనుట నిక్కంబౌను వాచించఁగన్
    భ్రమయే పద్మ వికాశమున్ శిశిగనన్ భావించ నెవ్వారికిన్
    కమలమ్ముల్ ముకుళించుఁ జంద్రునటు లాకాశంబునన్ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  11. రమకును పతియైన హరికి
    రమణీయమ్ముగ నయనములందొప్పిరిగా
    సమముగ నారవిరాజులు
    కమలాప్తుడు చంద్రుడన్న గల్ల ఎటులగున్

    రిప్లయితొలగించండి
  12. విమల యుమాపతి కన్నుల
    రమణీ యపు కాంతు లొలికి రాజి ల్లు చు నా
    క్రమమున నెల కొనెను గదా
    కమలాప్తుడు ' చంద్రు డన్న. గల్ల యెటు లగున్

    రిప్లయితొలగించండి