5, డిసెంబర్ 2023, మంగళవారం

సమస్య - 4606

6-12-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలలు గల్లలైనఁ గలుగు ముదము”
(లేదా...)
“కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్”

17 కామెంట్‌లు:

  1. కన్నకలలుబిడ్డలున్నతులైనట్లు
    కనగనిజములైనకలుగుముదము
    గుండెపగులభయముగొల్పగలుగుపీడ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    గాదిరాజుమధుసూదన రాజు

    రిప్లయితొలగించండి

  2. నీటి యలలవోలె నిదురలో మనుజుండు
    కాంచుచుండు గాదె కలలవెన్నొ
    యపశకున మటంచు నార్యులనెడి పీడ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము.

    రిప్లయితొలగించండి
  3. మనిషికెన్నొ కలలు మస్తిష్కమందున
    మెదలు చుండు నెపుడు, మెదడు దొలుచు!
    రేయి భయము గొల్పి లేపుచుండెడి పీడ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము.

    రిప్లయితొలగించండి
  4. అర్ధరాత్రి నిదుర నాత్రముగాలేచి
    నీరు త్రాగి కాస్త నెమ్మదించ
    భీతి గొల్పినట్టి భీకర మౌపీడ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    రిప్లయితొలగించండి
  5. ప్రక్కవాని ప్రగతి పరిమార్చ గానెంచి
    దుష్టచింత చేసి దుర్నయమున
    కుటిలకర్మ సల్పు కుత్సితుని పగటి
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది
    జనుల మేలు మఱచి సాగించి పాలనన్
    మరల గెలువనెంచి మాటలల్ల
    ప్రజలు మేల్కొనంగ పాపిష్టి యేలిక
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    చంపకమాల
    విలువలు వీడి పాలకులు వృద్ధికిఁ బల్కుచుఁ చెల్లుచీటి నా
    కొలువది శాశ్వతంబనెడు గోరిక గెల్వ మరొక్కమారుగన్
    జెలఁగుచు నిల్వగన్, బ్రజలు సేర్చఁగ నింటికి వారి యూహలన్
    గలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్!

    రిప్లయితొలగించండి

  7. జలధితరంగ మట్లు గడు చంచలమై కదలాడు స్వప్నముల్
    పలువిధ రూపమంచవియె భావతరంగములే యటంచు నా
    ర్యులిల వచించిరెప్పుడొ ప్రయోజన ముండని, భీతిఁ గొల్పెడిన్
    గలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్.

    రిప్లయితొలగించండి
  8. తెరపి నొంద కుండ దినమంత బనిజేయ
    శ్రమము పడిన కతన శయన మెక్కి
    వేగ నిదుర బోవ భీకర మయిన యా
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    రిప్లయితొలగించండి
  9. రంగురంగులకల లక్ష్యమ్ముగావలె
    పగటి కలల వలన ఫలితమేమి
    కాలహరణమైన కార్యాలతో మూఁగ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    విలవిలలాడినాయకులు విజ్ఞత వీడుట గెల్పుకోసమే
    తలపులనెప్పుడున్ గెలుపు తత్తరపాటుకు లోనుచేయగా
    గెలుపు మరొక్కమారనుచు కింజుడు స్వప్నములందుఁ దేలడా
    కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్

    రిప్లయితొలగించండి
  10. మనసు కుందు పడిన మనుజుల కిలలోన
    కలత జెందు రీతి కలలు వచ్చు
    కనులు తెరచి చూడ కలత దీర్చఁగ పీడ
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    రిప్లయితొలగించండి
  11. కలతలు రేగఁగా మది చికాకున కుందెడు వేళలందు నా
    తలపులు మాటిమాటికిని తల్లడమొందగ జేయు రీతిగా
    కలలుగ రూపుదిద్దుకొని కన్నుల ముందర నిల్చు నిద్రలో
    కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్

    రిప్లయితొలగించండి
  12. గా ఢ నిద్ర యందు కల్లోల మొనరింప
    వచ్చు పీడ కలలు హెచ్చు గాను
    గనులు దెరచి చూడ వెను వెంట మాయ మౌ
    కలలు కల్ల లైన గలుగు ముదము

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ మధురమైన కలలు మదికి హాయినొసఁగు
    నిదుర కిచ్చు కొంత నిండుదనము
    నిదురఁ జెఱచు కలలు మదిని దొలచు నట్టి
    కలలు గల్లలైనఁ గలుగు ముదము

    చం॥ కలను పరీక్ష దప్పుటను గాంచఁగ దిగ్గున లేచి చూడఁగన్
    వలచిన భామ స్వప్నమున వాంఛగ మిత్రుని బెండ్లియాడఁగన్
    గలతగ లేచి చూడఁగను గష్టము నొందుచు నర్ధరాత్రినిన్
    గలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతులున్

    రిప్లయితొలగించండి
  14. చం.

    పలుకులు తేనియల్ మృదువు వాసవ వృత్రుల స్నేహబంధమున్
    బలముగ నింద్రశక్తి చనెఁ బాండవమధ్యముఁ జంప యుద్ధమున్
    గొలుచుచు మాహలన్ దినరు గోవుల మాంసము మ్లేచ్ఛతుల్యులే
    *కలలవి కల్లలైనపుడె కల్గును మోద మెడంద శాంతిలున్.*

    రిప్లయితొలగించండి
  15. కలలువి రాత్రి నిద్రగొను కాలమునందున
    వచ్చుచుండు నా
    కలలును దెల్పుచుండు గడు కష్ట సుఖంబుల
    గూర్చి వింతగా
    పలు పలు రీతిగా బడుచు బాధ విశాదము
    బెంచునట్టి యా
    కలలవి కల్లలైనపుడె గల్గును మోదమెడంద
    శాంతిలున్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కనులు మూయగానె కలలు గను మనసు
    కలలవి భయపెట్టు కనుల ముందు
    నిజమనుచు భ్రమించు నిశ్చలత్వము లేని
    కలలుఁ గల్లలైన గలుగు ముదము.

    రిప్లయితొలగించండి