3-4-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ”(లేదా...)“దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
కందంఏలాగు? సాధ్యమంచునుగూలఁబడకుమయ్య! మొదటి గురువు లఘువులైచాలిన పద్యమయిన శార్దూలం బిభరాజమగుచుఁ దోఁచెన్ సుకవీ!
పాలన గురించి దెలుపుచు ,నాలుక తిరగని విధముగ నడపించినదౌమేలగు పదముల ఘి శార్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
మేలుగ 'మసజసతతగ' నువీలుగ 'సభరనమయవ' గ విభజించినచోచాలును గతిమారిన శార్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
ఏలా తర్జనభర్జనల్ సుకవి నీకేలా విచారమ్ము శార్దూలంబందలి యాది గుర్వుఁగొని యస్తోకంబుగా దానినిన్మేలౌజేయ లఘుద్వయమ్ముగ వెసన్ మీమాంస చేయంగ శార్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్
చాలిక తొలిగురువు బదులునాలుగు పాదాల మొదట నయముగ లఘువుల్లీలగ నిగుడించిన శార్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
సౌలభ్యంబని బల్కి చూపితిరహో శార్ధూలమత్తేభముల్మూలంబందున నక్షరాల బదులే పొంకించి హ్రస్వంబులన్వాలాయించి యొనర్చిరా విబుధులే వాగ్వాదమేలేక శార్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్
మూలంబున గల యా దీర్ఘాలను మార్చి ఖలునివలె హస్వమ్ములుగా నేల పలుక నది గన శా ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ.బాలుండైనను చేయబోవడు కదా పాండిత్యమున్ గల్గియున్ మూలంబున్ గనకుండ చెప్పితివిటన్ మూఢుండవై నీవు దీర్ఘాలే హ్రస్వము లైన పద్యమదియే కాంచంగ ఛందమ్ము శార్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”
కందం
రిప్లయితొలగించండిఏలాగు? సాధ్యమంచును
గూలఁబడకుమయ్య! మొదటి గురువు లఘువులై
చాలిన పద్యమయిన శా
ర్దూలం బిభరాజమగుచుఁ దోఁచెన్ సుకవీ!
పాలన గురించి దెలుపుచు ,
రిప్లయితొలగించండినాలుక తిరగని విధముగ నడపించినదౌ
మేలగు పదముల ఘి శా
ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
మేలుగ 'మసజసతతగ' ను
రిప్లయితొలగించండివీలుగ 'సభరనమయవ' గ విభజించినచో
చాలును గతిమారిన శా
ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
ఏలా తర్జనభర్జనల్ సుకవి నీకేలా విచారమ్ము శా
రిప్లయితొలగించండిర్దూలంబందలి యాది గుర్వుఁగొని యస్తోకంబుగా దానినిన్
మేలౌజేయ లఘుద్వయమ్ముగ వెసన్ మీమాంస చేయంగ శా
ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్
చాలిక తొలిగురువు బదులు
రిప్లయితొలగించండినాలుగు పాదాల మొదట నయముగ లఘువుల్
లీలగ నిగుడించిన శా
ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ
సౌలభ్యంబని బల్కి చూపితిరహో శార్ధూలమత్తేభముల్
తొలగించండిమూలంబందున నక్షరాల బదులే పొంకించి హ్రస్వంబులన్
వాలాయించి యొనర్చిరా విబుధులే వాగ్వాదమేలేక శా
ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్
రిప్లయితొలగించండిమూలంబున గల యా దీ
ర్ఘాలను మార్చి ఖలునివలె హస్వమ్ములుగా
నేల పలుక నది గన శా
ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ.
బాలుండైనను చేయబోవడు కదా పాండిత్యమున్ గల్గియున్
మూలంబున్ గనకుండ చెప్పితివిటన్ మూఢుండవై నీవు దీ
ర్ఘాలే హ్రస్వము లైన పద్యమదియే కాంచంగ ఛందమ్ము శా
ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”