3, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4604

4-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్”
(లేదా...)
“గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

20 కామెంట్‌లు:

  1. వలచిన సుందరి మనసును
    గెలువగ గోరిరిరువురు తగినవాడిని కో
    మలిగయ్యాళి వరించెను
    గెలిచిన వాఁడేడ్చె నవ్వె గెలువని వాడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

      “గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

      గెలిచెతనొక్కరాష్ట్రమునుగింజుగలాటలపోరిపోరితాన్
      నిలిచెనుబీదరైతులకునీరుకరెంటువరాలనిచ్చిబొం
      దలనటుబెట్టవోటరులుతప్పుడుమాటలనమ్మి ఆగమై
      గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
  2. బలపము గట్టియుకాలుకి
    అలుపెరుగక తిరిగి గెలుపు నందించంగన్
    కులమును గని పదవులనిడ
    గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్

    రిప్లయితొలగించండి
  3. తెలియదు పాలన యెటులని
    గెలిచినవాఁడేడ్చె ; నవ్వె గెలువనివాఁడున్
    వలయు నిధులు లేవుగదా!
    తిలకించెదమీ కొరతను దీర్చెద రెటులో

    రిప్లయితొలగించండి
  4. అలుపెరుగక పోరాడిగ
    గెలిచెను గద పార్టికాని గెల్చినవాడున్
    నిలదీసిన పదవి దక్కక
    గెలిచినవాడేడ్చె నవ్వె గెలువనివాడున్

    రిప్లయితొలగించండి
  5. కందం
    తులతూగ మంత్రిపదవిని
    గెలిచిన తననెన్నరనుచుఁ గిన్క మునుగుచున్
    గలనెఱవేరని కతనన్
    గెలిచినవాఁడేడ్చె! నవ్వె గెలువనివాఁడున్!!

    చంపకమాల
    కొలువున దీరి మంత్రివలె గొప్పగ గౌరవమొంద నెంచినన్
    గెలిచినఁ దన్ను నెన్నరని కిన్కవహించుచు తిక్కరేగుచున్
    గల నెఱవేరలేదనుచు కంపరమొందుచుఁ గుప్పిగంతులన్
    గెలిచినవాఁడు దుఃఖపడె! గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్! !

    రిప్లయితొలగించండి
  6. అలుపెరుగక వ్యాజ్యముతో
    పలుమారులు కోర్టుచుట్టు పరుగులు దీయన్
    నిలువున వకీలు దోచఁగ
    గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్

    రిప్లయితొలగించండి
  7. అలసటనెఱుగని యత్నము
    గెలుపును గొనివచ్చెననుచు కేరింతలతో
    కులకక మంత్రిపదవికై
    గెలిచినవాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్

    అలసట విస్మరించి తమకందిన గెల్పుకు సంతసింతురా
    కలతల రాజకీయమని కాంక్షలు తీరక తత్తరింతురా
    తలకొని మంత్రివర్గమున దక్కని చోటుకు యంగలార్చుచున్
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    రిప్లయితొలగించండి
  8. కొలనున వడిగా నీదుచు
    గెలిచెదనని పంతమూని గెలిచెను తుదకున్
    జలగలు మేనును పట్టగ
    గెలిచినవాఁడేడ్చె , నవ్వె గెలువనివాఁడున్


    లలనకు బెండ్లి సేతునని రాజు స్వయంవరమంచు పెట్టుచున్
    బిలువగ రాజ పుత్రికను పెండిలి యాడదలంచి జేర నా
    మెలతుక కౌర్ణ్య వర్ణమున మేటి గజమ్మును బోలి యుండగా
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్.

    రిప్లయితొలగించండి
  9. కలతవహించి యాస్తుల తగాదలు తీరక జ్ఞాతితోడఁదా
    పలుమరు న్యాయవాదులకు పైకము దోఁపుగ గుమ్మరించగా
    గెలిచెనొకండు సర్వమును గేలిగ కోల్పడి యెట్టకేలకున్
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    రిప్లయితొలగించండి
  10. ఫలితము కై కృషి చేసియు
    వ లచును దనను బదవి యని వాంఛి o చిన నూ
    కలగా మిగుల గ న య్యె డ
    గెలిచిన వాడే డ్చె నవ్వె గెలువని వాడున్

    రిప్లయితొలగించండి
  11. కం॥ గెలిచినఁ దను తన పక్షము
    గెలువక నోడంగ నకట గెలువనివానిన్
    వలచెను గొప్ప పదవి యని
    గెలిచిన వాఁడేడ్చె నవ్వె గెలువనివాఁడున్

    చం॥ వలువలు విత్తమున్ మిగుల పంచి జనాళికి విస్తరమ్ముగన్
    గెలిచినఁ దాను బాధపడె గెల్వక పోవఁగ నాధిపత్యమున్
    ఫలితము శూన్యమయ్యె ప్రతి పక్షము పొందఁగ నాధిపత్యమున్
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    రిప్లయితొలగించండి
  12. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    “గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

    గెలిచెతనొక్కరాష్ట్రమునుగింజుగలాటలపోరిపోరితాన్
    నిలిచెనుబీదరైతులకునీరుకరెంటువరాలనిచ్చిబొం
    దలనటుబెట్టవోటరులుతప్పుడుమాటలనమ్మి ఆగమై
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  13. బలిమినగెలువగమదిలో
    తలచుచువిరజిమ్మెతాను ద్రవ్యమునెంతో
    తలచినపదవియునందక
    గెలిచినవాడేడ్చె నవ్వె గెలువని వాడున్


    రిప్లయితొలగించండి
  14. పలుకెను తీపి మాటలను బల్కెన
    నేకము కోసె కోతలున్
    గెలుచుట కేవియో పలికి, గెల్చియు
    చెప్పిన మాటలన్నియున్
    నిలుపు కొనంగ భంగపడి నిక్కము
    నిత్యము బాధజెందె నా!
    గెలిచినవాడు దు:ఖపడె గెల్వనివానికి
    దక్కె సౌఖ్యమున్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సులువుగ వాగ్దానములిడి
    సలుపగ ధనమేమి లేక సతమతమగుచున్
    నిలువగ లేదు కలిమియని
    గెలిచిన వాడేడ్చె,నవ్వె గెలువని వాడున్.

    రిప్లయితొలగించండి
  16. కందం
    ధుమధుమలాడుచు నరకుని
    సమయింపంగ నొక కన్ను, చక్రినొకటియే
    శమియింప, సత్య నయనాల్
    కమలాప్తుఁడు చంద్రుఁడన్నఁ గల్ల యెటులగున్

    మత్తేభవిక్రీడితము
    ద్యుమణిన్ బోలుచు నిప్పులన్ నరకుపై యుంకించి యుద్ధమ్మునన్
    సమయింపన్నయనంబునొక్కటిగనన్, సంరంభ శ్రీకృష్ణునిన్
    శమియింపన్ రథమందునొక్కటిగనన్ సత్యాంబ నేత్రమ్ములున్
    కమలాప్తుండు శశాంకుఁడౌట నిజమే కాదందువా సత్కవీ!

    రిప్లయితొలగించండి
  17. గెలిచిన‌ పిమ్మట తెలిసెను
    విలువే శూన్యము పదవికి‌ విత్తము‌ రాదే‌!
    వలముగ‌ ధనమును‌ పంచిన‌
    గెలిచిన వాఁడేడ్చె! నవ్వె‌ గెలువనివాఁడున్!!

    రిప్లయితొలగించండి