7, డిసెంబర్ 2023, గురువారం

సమస్య - 4608

8-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె”
(లేదా...)
“అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా”

20 కామెంట్‌లు:

  1. ప్రజల సొమ్ము దోచగనెంచి ప్రభువులెల్ల
    ఆంధ్ర వారుణ వాహిని కవధి లేక
    ఏరులై సురాపానమ్ము పార నట్టి
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరింపవలసిన సమస్య


      మరచెమధుమేహమున్నట్లుమామగారు
      త్రాగెపంచామృతమ్మునుతనివితీర
      పయనమైవచ్చుచున్ జూడ బస్సునెక్కి
      అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె

      గాదిరాజు మధుసూదనరాజు

      తొలగించండి
  2. రుచిగ నున్నదని మితిమీరుటగు కీడు,
    పూజ పిమ్మటను మిగిలి పోయినదని
    మ్రింగ పంచామృతపు భాండమెల్ల, కడకు
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

    రిప్లయితొలగించండి
  3. అమరపురము నందు సురల కమరుచుండు
    యమృతపానమ్ము మరణమ్ము నాపు జేయ
    భరణి పయిన పు డమి నుండి ప్రాపణమగు
    యమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. తేటగీతి
      మదిర తెచ్చిన మాలిని మాటలల్లి
      నాట్యశాలకు రమ్మని నటనమాడ
      రోయఁ గీచకుఁడట పరస్త్రీ యధరఁపు
      టమృతపానమ్ము! మరణమ్మునందజేసె!

      చంపకమాల
      అమరుచ దెచ్చియున్ మదిరి యంగన మాలిని నాట్యశాలకున్
      నిమురగ రమ్మురమ్మునఁగ నేరక వ్యూహము గీచకుండటన్
      దెములఁగ జంపెనే వలలు దెబ్బ! పరాంగన మ్రోవిఁ గోరఁగా
      నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు! ద్రాగఁ బోకుమా! !

      తొలగించండి
  5. చం.

    గమనము దుర్లభంబు దివిఁ గాంచము నైజము మానవాళికిన్
    విమలము నందనంబు బలి విష్ణుని ప్రీతుడు శుక్ర సూచనన్
    శమనము లోకులందరికి శక్రుని క్రుష్టము మిశ్రమైనచో
    *నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా!*

    రిప్లయితొలగించండి

  6. పామమది సోకె ననినాటు వైద్యు డొకడు
    సిద్ధధాతువు గొనుమంచు చెప్పెనంచు
    శీనడగు రోగి మితిమీరి చేయ, నదియె
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

    (అమృతము= పాదరసము)


    ప్రమదలు వాసిగా నచట వల్వల శుభ్రము చేయుచుండగా
    కుమతులు స్వార్థ చిత్తులయి కొల్లలుగా నెల కొల్పగా పరి
    శ్రమలవి వ్యర్థముల్ విడువ శంబరమే విషమయ్యె గాదె యా
    అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా.

    (అమృతము = జలము)

    రిప్లయితొలగించండి
  7. అమృతమునకు నానార్థమ్ము లమరుగాదె
    పాలు నెయ్యి నీరు పాదరసము విషము
    పానమొనరింప గరళము ప్రాణముఁగొనె
    నమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె

    అమృతము లభ్యమౌననుచు నంబుధిఁ జిల్కిరి దేవదానవుల్
    శ్రమగొని హాలహాలమది చప్పున వెల్వెడె సాగరంబునన్
    దమకిక నీవెదిక్కనుచు ధైర్యము వీడుచుఁ వేడ నీశ్వరా
    యమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా

    రిప్లయితొలగించండి
  8. తినగతినగ గుల్యమ్మౌను తిక్తముగను
    మితిని మీరిన నేదైన గతిని దప్పు
    నని యెరుకలేని యుక్కివుఁడతిగ సేయ
    నమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె

    రిప్లయితొలగించండి
  9. అమితముగా గొనంగనెది యైనను హానిని గూర్చు నెన్నడున్
    తమిగొని మద్యమున్ మితముదప్పి గ్రహించిన మందభాగ్యుకున్
    క్రమముగ దేహమందు రుధిరమ్ము విషమ్ముగ మారిపోవునా
    అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా

    రిప్లయితొలగించండి
  10. వ్యాధి గలవాడు మిక్కిలి బాధితుండు
    వైద్యుడొ స గిన సల హాలు వమ్ము జేసి
    తినగ త్రాగగ మొదలి డె తియ్య నైన
    నమృత పానమ్ము మరణమ్ము నంద జేసె

    రిప్లయితొలగించండి
  11. తే॥ జలము నేఁడు గరళమయ్యె జగతి నందు
    ఘన పరిశ్రమల్ వ్వర్థముల్ గలుపుచుండ
    మనుజ తప్పిదనము చేత మహిని యిటుల
    నమృత పానము మరణమ్ము నందఁ జేసె

    చం॥ సమముగ నేఁడు వ్యర్థముల సారము వాహిని యందుఁ జేరఁగా
    ను మనుజ వ్యాపకమ్ములను నోచు కొనంగను లేక శుద్ధ నీ
    రమిలను ద్రావు నీరమున రక్షను గాంచఁగ లేకఁ బోవఁగా
    నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞలు ద్రాగఁ బోకుమా


    అమృతము జలము
    త్రాగక తప్పదనుకోండి.
    Water treatment has become a prolific n highly profit making business.

    రిప్లయితొలగించండి
  12. అమరులైరిచేసి దివిజుల నవరతము
    నమృత పానమ్ము, మరణమ్ము నందజేసె
    నమృతమని గ్రోలమద్యము నవనియందు
    గాన రుచిచూడ బోకుము కలను నైన

    డా బల్లూరి ఉమాదేవి

    అమృతసమానమంచునదిహాయినిగూర్చునటంచుమద్యమున్
    అమితముగాను గ్రోలినను యాతన హెచ్చున టంచు నెంచుమా
    మమతనుబూనినియ్యదియెమానుగచెప్పుచునుంటిమిత్రనీ
    అమృతము ప్రాణహానికరమందురువిజ్ఞులు త్రాగ బోకుమా

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అమృత సమమిది యదిగొ సురాలయము
    కన్పడుచునుండెఁ సేవించగ సుర ననుచు
    నధిక మోతాదు మించియు నతడు చేయ
    నమృత పానమ్ము , మరణమ్ము నందఁ జేసె.

    రిప్లయితొలగించండి