9, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4610

10-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”
(లేదా...)
“కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్”

17 కామెంట్‌లు:

  1. కందం
    దుష్ట నరకుండు కృష్ణుని
    దృష్టిని పడి యంతరించ దీపావళిగా
    నిష్టముగఁ జేసి ముదమున
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే!

    ఉత్పలమాల
    దుష్టము మీరగన్ నరకు దోషము దెల్సి సతీసమేతుఁడై
    వృష్టిగ బాణముల్ విడచి కృష్ణుడు యుద్ధము నందు గూల్చ గా
    నిష్టముగన్ ప్రమోదములు నిండగ మోదము పండి వారివౌ
    కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్!

    రిప్లయితొలగించండి
  2. ముష్టినె నమ్మి బ్రదుకు దుర
    దృష్టుల కిలలో ప్రభుతయె దిక్కై సమ్యక్
    దృష్టిని మేలొనరించగ
    “కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”

    రిప్లయితొలగించండి

  3. అష్టమ గర్భుడు కృష్ణుడు
    దుష్టుని పరిమార్చినంత తోషము కలిగెన్
    భ్రష్టుడు కంసుడు పెట్టిన
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే.



    అష్టమ గర్భమందు తననంతము జేయ జనించు నంచు నా
    దుష్టుడెఱంగినంత పరితోషము వీడుచు బంధిచేసి నా
    భ్రష్టుడు పెట్టినట్టి దురవస్థలవెన్నియొ, నల్లనయ్య చేై
    కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  4. దుష్టుల పాలనంబునను దుర్దశ
    పట్టె దశాబ్ద కాలమున్
    నష్టము బొంది రెల్లరును, నందము
    వొందిరి వారలోడగన్
    కష్టము లెల్లదీరెనని, కంటను
    నీరిడి రెల్ల రయ్యెడన్
    నిష్టగ బోరి యోడగను నిక్కము
    వారికి దిక్కు తోచకన్.

    రిప్లయితొలగించండి
  5. తుష్టిని పొందిరి జీవులు
    గష్టమ్ములు దీరె ననుచుఁ : గన్నీరిడిరే
    భ్రష్టుల మయితిమి పురముకు
    నష్టము కలిగించు రీతి నడచితి మనుచున్

    రిప్లయితొలగించండి
  6. కం॥ నష్టముఁ బొందఁగ నమ్మిన
    దుష్టులు నయవంచనఁ గని దోచఁగ ధనమున్
    గష్టములు దీరిన పిదపఁ
    గష్టమ్ములు దీరెననుచుఁ గన్నీరిడిరే!

    ఉ॥ నష్టముఁ బొంది సైఁచఁగను నమ్మిన వారల ద్రోహబుద్ధితోఁ
    గష్టము లెన్నియో తుదకు క్రమ్మిన మబ్బులు వైదొలంగగన్
    దుష్టుల యాటకట్టగను దోచిన సొమ్మును లభ్యమయ్యెడిన్
    గష్టము లెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్

    సేద తీర్చే ఆనందభాష్పాలండి

    రిప్లయితొలగించండి
  7. నష్ట పడిన హలజీవులు
    శిష్టుని గత యేలుబడి విశిష్టతవలనన్
    బుష్టిగ పంటలు పండగ
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే

    దుష్టులపాలనమ్మున నథోగతి పట్టిన సేద్యకారులన్
    నష్టము పుట్టిముంచెనట నాటితుఫాను తీవ్రమైనదై
    పుష్టిగ చేలు పండి తమ పూర్వపు వైభవమే లభింపగా
    కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్

    రిప్లయితొలగించండి
  8. దుష్టుల పాలన దొలగియు
    నిష్టము గల వారు వచ్చి యి మ్మహి నేలన్
    దుష్టి ని బొందిన జనతతి
    కష్ట ములు దీరె ననుచు గన్నీరి డి రే

    రిప్లయితొలగించండి
  9. కష్టములెన్ని వచ్చినను కాంతను పుత్రుని కోలుపోయి సం
    క్లిష్టము గాఁగ జీవనము క్లేశములన్ సహియించి సత్యమున్
    నిష్టగ దాల్చినట్టి ధరణీశుని గావఁగ నీశ్వరుండు, నీ
    కష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్

    రిప్లయితొలగించండి
  10. దుష్టుని పరిపాలనలో
    కష్టమ్ములకడలి యందు కాతరబడఁగన్
    దుష్టుఁడు గద్దెను దిగగా
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే

    రిప్లయితొలగించండి
  11. నిష్టగ పుత్రుడు కష్టము
    నష్టము లెన్నిటికొనోర్చి నగరమునందున్
    ఇష్టమగు కొలువు బొందగ
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే

    రిప్లయితొలగించండి
  12. కష్ట పడు తల్లిదండ్రుల
    యిష్టమువిని గొప్పచదువు నింపుగ జదివెన్
    స్పష్టమగుపనిలభించగ
    కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దుష్టుడు నరకాసురునిన్
    ఇష్టముతో చంప సత్యయె సుతుండైనన్
    శిష్టులు సంతసమొందుచు
    కష్టమ్ములు తీరెననుచుఁ గన్నీరిడిరే.

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    ఇష్టము గాని కోరికను నీశుని వాసము వారణాసిలో
    పృష్టము రుద్రభూమిని, సుభిక్షగ రొక్కము కోలుకానిచే
    దిష్టము గాధిపుత్రదయ, దివ్యులు చంద్రమతిన్ గటాక్షమున్
    *గష్టములెల్లఁ దీరెనని కంటను నీరిడి రెల్లరయ్యెడన్.*

    రిప్లయితొలగించండి
  15. దుష్టుండౌనరకుడుతా
    శిష్టులబాధించుచుండ. శ్రీకృష్ణుండే
    నిష్టసతితో దునుమ తమ
    *కష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీరిడిరే”*

    రిప్లయితొలగించండి