10, డిసెంబర్ 2023, ఆదివారం

సమస్య - 4611

11-12-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై”
(లేదా...)
“కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో”

(ఉప్పలధడియం భరతశర్మ అష్టావధానంలో ఈరోజు నేనిచ్చిన సమస్య)

15 కామెంట్‌లు:

 1. కందం
  కుట్మలమె బ్రహ్మచర్యము
  గుట్మలము విడ బ్రియురాలిఁ గోరగ ముద్దున్
  గుట్మలపుమోము విచ్చక
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై!

  ఉత్పలమాల
  కుట్మలదంతి ప్రేయసిగఁ గూరెను నాకిక బ్రహ్మచర్యమన్
  గుట్మలమింక వీడెనని కోరఁగ ముద్దును పెళ్లిముందరన్
  గుట్మలమట్లు విచ్చకయె కోమలి మోమున మారి రంగులున్
  కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో! ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కం॥
   ఫట్మనియెనిలువుటద్దము
   పుట్మనెగాజులటుపట్టబోవన్ పిల్లిన్
   ఛట్మనిపించెన్ చెంపన్
   కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై


   గాదిరాజు మధుసూదన రాజు

   తొలగించండి
 2. ఫట్మనగ నాకపోలము
  చట్మని కొట్టిన లతాంగి చప్పున నన్నే
  కుట్మలమున్ బడదోసెనే
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. చట్మని నాకపోలమునఁ శాలిని కొట్టిన దెబ్బ వెంబడిన్
   ఫట్మను శబ్దమే వినిరి బాంధవముఖ్యులు విస్మయమ్ముతో
   కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో
   కుట్మలమందుఁ ద్రోయుటకు కోమలి కెవ్విధి చేతులొచ్చెనో

   తొలగించండి

 3. చట్మని కోపమె జేరగ
  కుట్మల మై తేజరిల్లు కోమలి యపుడే
  ఫట్మని ద్వారమె వేసెను
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై  కుట్మలమోలె తేజరిలు కోమలి యాగ్రహ మంది ద్వారముల్
  ఫట్మని వేసె నన్నుగని పట్టపు రాణికి పారిజాతమున్
  చట్మని యిచ్చినందుకొ బసాలుర సంఖ్య హెచ్చి నందుకో
  కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో.

  రిప్లయితొలగించండి
 4. ఉ.

  కుట్మలమయ్యె నా బ్రతుకు కోమలి చందము హావ భావముల్
  కుట్మలమామె మోము సిరి కోకిల బోలిన గొంతు పల్కగన్
  కుట్మలమైన బుద్ధి యని కూసితి బాల్యపు చేష్ట యంటినే
  *కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో!*

  రిప్లయితొలగించండి
 5. కుట్మలముల గిల్లనగును
  కుట్మలము విధము గ నుండు కూనకు కూడన్
  కుట్మల ముకు వలె సలుపగ
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై

  కుట్మలదంతి = అప్పుడపుడె దంతములు వచ్చుచున్న బిడ్డ

  రిప్లయితొలగించండి
 6. కుట్మలములు వికసించెను
  చట్మని పూబోఁడి సిగను సవరింప జనన్
  కుట్మలములు భువిఁ రాలఁగ
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై

  రిప్లయితొలగించండి
 7. ఇట్మరలని బ్రతిమాలుచు
  అట్మరలగ కౌగిలించి ఆంగాగమునన్
  చట్మని పలు ముద్దులనిడ
  కుట్మలదంతికిఁ గలిగెను కోపము నాపై

  రిప్లయితొలగించండి
 8. కుట్మలముల్ తలోదరికి కూరిమి కొప్పునఁ గూర్చు నిచ్చతో
  కుట్మలదంతి చెంగటను గోముగ నిల్చితి, నన్నుఁ గాంచగన్
  చట్మని హస్తతాడనము సల్పె కపోలము కందిపోవగన్
  కుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో

  రిప్లయితొలగించండి
 9. కం॥ చట్మని పట్నమునఁ బడతి
  కుట్మము వోలె తనరంగఁ గోముగఁ జేరన్
  జట్మని భయపడి పోయెను
  గుట్మల దంతికిఁ గలిగెను గోపము నాపై

  ఉ॥ చట్మని కాంచఁగన్ బడతి చక్కదనమ్మునఁ జెంగలించఁగన్
  గుట్మము వోలె భాసిలుచుఁ గోమలి దాపుకు చేరినంతనే
  చట్మని భీతితోఁ బడతి జాగును సేయక దూరమై చనెన్
  గుట్మలదంతికిన్ గలిగెఁ గోపము నాపయి హేతు వెద్దియో

  ఉప్పదడియం భరత్ శర్మను బ్రహ్మశ్రీ వద్దిపర్తి గారి శతావధానంలో గమనించానండి. చిరంజీవికి ఉజ్వల భవిష్యత్తుంది

  రిప్లయితొలగించండి

 10. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  కుట్మలపు గొలుసు లేదని
  ఫట్మని నాపై విరుచుకుపడె నా సతియున్
  ఛట్మని తలుపులు మూసెను
  కుట్మల దంతికి కలిగెను కోపము నాపై.

  రిప్లయితొలగించండి
 11. కుట్మలమయ్యెనుమోమది
  ఫట్మని మంచము విరుగుగ పలురకములుగా
  ఛట్మని కొరకొర జూచెడి
  కుట్మలదంతికి కలిగెను కోపము నాపై

  రిప్లయితొలగించండి