10, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5270

11-10-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్”
(లేదా...)
“పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే”

9, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5269

10-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్”
(లేదా...)
“కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై”

8, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5268

9-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అపకారులకే లభించు నభినందనముల్”
(లేదా...)
“అపకార మ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్”

7, అక్టోబర్ 2025, మంగళవారం

సమస్య - 5267

8-10-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము”
(లేదా...)
“తిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్”

6, అక్టోబర్ 2025, సోమవారం

సమస్య - 5266

7-10-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ”
(లేదా...)
“తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ”

5, అక్టోబర్ 2025, ఆదివారం

సమస్య - 5265

6-10-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సానిన్ గొల్చిన లభించు సాహిత్యనిధుల్”
(లేదా...)
“సానిన్ గొల్చినవాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్”

4, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5264

5-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా”
(లేదా...)
“మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”

3, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5263

4-10-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్”
(లేదా...)
“బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్”

(ఈమధ్యే ఎవరిదో అవధానంలో విన్న సమస్య. గుర్తు లేదు)

2, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5262

3-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”
(లేదా...)
“యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్”

1, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5261

2-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో”
(లేదా...)
“బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతుఁ డంద్రెల్లరున్”