2, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5262

3-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”
(లేదా...)
“యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్”

6 కామెంట్‌లు:

  1. ఉ.
    రత్న చయంబు లంబుధిని లాలిత రీతిని దాగు పోలు నీ
    నూత్న మహత్తర ప్రతిభ, నోదము గూర్చెడి శక్తి గుండెలో
    రత్నములై యథేచ్ఛగ విరాజిలు గెల్పును జేరు, చిన్నదౌ
    యత్నము జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్ !

    రిప్లయితొలగించండి
  2. రత్నములన మక్కువగల
    రత్నావతి భర్తతోడ రణమును సలుపన్
    రత్నములిడి వేడుకొనెడి
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    రిప్లయితొలగించండి
  3. హత్నువు తో బాధపడుచు
    రత్నము లను బోలు మాటలను తెలిపెను తా
    పత్నికి యిష్టము లేక ప్ర
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ.


    హత్నువు తోడబాధపడు నాతడు మంద స్వరమ్ము తోడ తా
    రత్నము లంటి మాటలను శ్రద్ధగ నూకొను మంచు చెప్పెనే
    పత్నికి చిత్తశుద్ధియును బాధ్యత లేకనె నామ మాత్రమున్
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    అత్నమునఁ గృష్ణుఁ జూడా
    రత్నము గొన పాండు సుతుల ప్రాభవమొప్పెన్!
    నూత్నమె? దైవముఁ బడయక
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!

    ఉత్పలమాల
    అత్నమనంగ నర్జునుడు నార్తిని యాదవ వంశజాతమౌ
    రత్నమనంగ కృష్ణుఁగొని రంజిలఁ గెల్చెను గీత బోధలన్
    నూత్నము లేదు లేదు కద? నోచిన దైవమనుగ్రహింపకే
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య - 5262
      3-10-2025 (శుక్రవారం)
      కవిమిత్రులారా,
      ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
      *“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”*
      (లేదా...)
      *“యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్”*


      కందం
      అత్నమునఁ గృష్ణుఁ జూడా
      రత్నము గొన పాండు సుతుల ప్రాభవమొప్పెన్!
      నూత్నమె? దైవముఁ బడయక
      యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!

      ఉత్పలమాల
      అత్నమనంగ నర్జునుడు నార్తిని యాదవ వంశజాతమౌ
      రత్నమనంగ కృష్ణుఁగొని రంజిల గెల్చెను గీత బోధలన్
      నూత్నము లేదు లేదు కద? నోచిన దైవమనుగ్రహింపకే
      యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్!

      తొలగించండి
  5. కం॥ పత్ని కరపంగ పథమును
    గృత్నుని వోలె పరఁగఁ దగు కిటుకు తెలియకన్
    నూత్న విధమ్ముల నరయక
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    ఉ॥ పత్ని యొసంగ సూచనలు పాటవ మొప్పఁగ సిద్ధిఁ గోరుచున్
    నూత్న విధమ్ము లెన్నుచును నమ్మి శ్రమమ్మును నెల్లవేళలన్
    గృత్నుని వోలె సాగఁ గనుఁ గీర్తినిఁ బద్ధతిఁ గానకున్నచో
    యత్నముఁ జేసినన్ ఫలితముండ దటంచు వచింత్రు సజ్జనుల్

    కృత్ను నైపుణ్యంగా పనిచేయువాడు

    రిప్లయితొలగించండి