1, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5261

2-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో”
(లేదా...)
“బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతుఁ డంద్రెల్లరున్”

5 కామెంట్‌లు:

  1. కందం
    వీలయినన్ని కృతుల పరి
    శీలించి కవనమెఱింగి శిల్పము గనుచున్
    శైలిని తీర్చిన కొదవే?
    బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో!

    శార్దూలవిక్రీడితము
    వీలైనన్ని కృతుల్ పఠించి శ్రవణో పేయమ్ముగన్ బద్యముల్
    శైలిన్ దప్పక పాడుచున్ సృజన భాస్వంతమ్ముగన్ గూడగన్
    మేలైనన్ని వధానముల్ సలిపి సంప్రీతిన్ ఫలమ్మొందగన్
    బాలవ్యాకరణమ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతుఁ డంద్రెల్లరున్

    రిప్లయితొలగించండి
  2. బాలురకు నేర్పు టకొరకు
    వీలుగ సులభమగు రీతి వివరణ నిడుచున్
    మేలుగ ప్రచురించ బడిన
    బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో”

    రిప్లయితొలగించండి
  3. శా.
    ఆలాపించెతి దీపి కైతల సభన్ హ్లాదంబు నిండారె బెం
    గాలే యాతని పుట్టినూరు కద సత్కావ్యంబు గీతాంజలిన్
    హేలం గూరిచి కీర్తి దేశమునకున్ హృద్యంబుగా దెచ్చె, నా
    బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతు డంద్రెల్లరున్!

    రిప్లయితొలగించండి
  4. కం॥ కాలము మారఁగ నేర్వఁగ
    వీలుఁ గనఁగ వ్యాకరణముఁ బ్రియ నామములన్
    జాల కని పరులు వ్రాయఁగ
    బాలవ్యాకరణముఁ గవివరుఁడెఱుఁగడు పో

    శా॥ కాలంబెంతయొ మార వ్యాకరణ మాకాంక్షించుచున్ నేర్వఁగన్
    వీలెంచన్ బరవస్తు చిన్నయదియే వేర్వేరు నామమ్ములన్
    జాలా లభ్యముఁ గాఁగ వ్రాయగనటుల్ సారించి నేఁడెందరో
    బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతుఁ డండ్రెల్లరున్

    కవులకు వ్యాకరణము తెలుసుకాని చిన్నయ సూరి గారి బాలవ్యాకరణ పుస్తకము కాక వేరేవి చదువుకున్నారని యండి

    రిప్లయితొలగించండి

  5. ఏల దొరలె తప్పులు ప
    ద్యాలందున యని వినీతుడడగంగ నుపా
    ద్దేలయ్యయె తెలిపె నిటుల
    బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో.


    ఆలోకింపగ మేటి కావ్యముల వ్రాయంగల్గెడిన్ పండితున్
    మేలంచున్ గణుతింత్రు వాస్తవమిదే మేదిన్ జనాలెల్లరున్
    బేలా దోషములున్న వాటినిలలో వీక్షింప బోడెవ్వడున్
    బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్ బ్రఖ్యాతుఁ డంద్రెల్లరున్?

    రిప్లయితొలగించండి