4-10-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్”(లేదా...)“బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్”
(ఈమధ్యే ఎవరిదో అవధానంలో విన్న సమస్య. గుర్తు లేదు)
కందంతీరిరి కవులున్ గంగాతీరమ్మున విశ్వనాథ తీర్థమునందున్భూరిగ వారల కవనపుబారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్!
ఉత్పలమాలతీరిరి కోవిదుల్ శివుని తీర్థమనంగను కాశికాపురిన్భూరిగ సాహితీ పచన భోజ్యము గైకొని పద్యవిద్యలోవారల పాటవమ్ములను పంచెడు సత్కవనంపువేడ్కలన్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
ఉ.భూరి మహా ప్రతాపుడయి పూర్ణ శశాంకుని పోలు కీర్తితో మీఱెడి కృష్ణరాయలట మేల్కవితల్ వినిపింప చక్కనౌ తీరున వాక్స్వురూపమున తెల్లని కాంతులు నింపి యింపు ద ర్బారున నృత్యమున్ సలిపె భారతి, సత్కవులెల్ల మెచ్చగన్ !
తీరుగ భువనవిజయమునజేరిరి కవివరులు కొలువు సేయఁగ విభుఁడేవారల నలరింపఁగ దర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
వారష్టదిగ్గజ కవులుజోరుగ పాండిత్య ప్రతిభ జూపుచు నచటన్ భూరిగ జెప్పెడి కవనపు బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్.చేరికవీంద్రులెల్ల నట శ్రేష్ఠుని మెప్పును పొందనెంచుచున్ వారలు సత్కవిత్వమును పాటవమొప్పగ చెప్పుచుండ సత్సారుల గానమాధురికి దండుడు తన్మయు డయ్యె గాంచ దర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్.
నీరజజన్ముని కొలువున తారసపడు భక్తుల గని తన్మయమొందన్నేరుగ నచ్చట జేరినబారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
తీరుగ కృష్ణరాయని నుతించుచు రాజసభాస్థలమ్మునన్జేరిరి కావ్యగానమును సేయఁగ సత్కవివర్యులత్తరిన్వారి మనోవికాసమును వావిరి గూర్చఁగనెంచి రాజదర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
జోరుగ నుత్పల మాలికధీరుడు పెద్దన వచింప దిగ్గజ వరుడైభూరిగ కృష్ణ నృపతి దర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్కోరగ కృష్ణ భూవరుడు కోవిదులే కొలువైన తావునన్హోరున సత్వరంబునొక యుత్పల మాలిక సంస్కృతాంధ్రముల్చేరిక తోడ పెద్దన వచింపగ భూపతి కృష్ణ రాయ దర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
బారున నాట్యము సేయగభారతి వేతనము గొనుచు పరగుచు నుండ న్ జేరియు ప్రతి రాత్రియు నా బారున నృత్యమును సలి పె భారతి వేడ్కన్
కందం
రిప్లయితొలగించండితీరిరి కవులున్ గంగా
తీరమ్మున విశ్వనాథ తీర్థమునందున్
భూరిగ వారల కవనపు
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్!
ఉత్పలమాల
తొలగించండితీరిరి కోవిదుల్ శివుని తీర్థమనంగను కాశికాపురిన్
భూరిగ సాహితీ పచన భోజ్యము గైకొని పద్యవిద్యలో
వారల పాటవమ్ములను పంచెడు సత్కవనంపువేడ్కలన్
బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
ఉ.
రిప్లయితొలగించండిభూరి మహా ప్రతాపుడయి పూర్ణ శశాంకుని పోలు కీర్తితో
మీఱెడి కృష్ణరాయలట మేల్కవితల్ వినిపింప చక్కనౌ
తీరున వాక్స్వురూపమున తెల్లని కాంతులు నింపి యింపు ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి, సత్కవులెల్ల మెచ్చగన్ !
తీరుగ భువనవిజయమున
రిప్లయితొలగించండిజేరిరి కవివరులు కొలువు సేయఁగ విభుఁడే
వారల నలరింపఁగ ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
రిప్లయితొలగించండివారష్టదిగ్గజ కవులు
జోరుగ పాండిత్య ప్రతిభ జూపుచు నచటన్
భూరిగ జెప్పెడి కవనపు
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్.
చేరికవీంద్రులెల్ల నట శ్రేష్ఠుని మెప్పును పొందనెంచుచున్
వారలు సత్కవిత్వమును పాటవమొప్పగ చెప్పుచుండ స
త్సారుల గానమాధురికి దండుడు తన్మయు డయ్యె గాంచ ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్.
నీరజజన్ముని కొలువున
రిప్లయితొలగించండితారసపడు భక్తుల గని తన్మయమొందన్
నేరుగ నచ్చట జేరిన
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
తీరుగ కృష్ణరాయని నుతించుచు రాజసభాస్థలమ్మునన్
రిప్లయితొలగించండిజేరిరి కావ్యగానమును సేయఁగ సత్కవివర్యులత్తరిన్
వారి మనోవికాసమును వావిరి గూర్చఁగనెంచి రాజద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
జోరుగ నుత్పల మాలిక
రిప్లయితొలగించండిధీరుడు పెద్దన వచింప దిగ్గజ వరుడై
భూరిగ కృష్ణ నృపతి ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
కోరగ కృష్ణ భూవరుడు కోవిదులే కొలువైన తావునన్
హోరున సత్వరంబునొక యుత్పల మాలిక సంస్కృతాంధ్రముల్
చేరిక తోడ పెద్దన వచింపగ భూపతి కృష్ణ రాయ ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
బారున నాట్యము సేయగ
రిప్లయితొలగించండిభారతి వేతనము గొనుచు పరగుచు నుండ న్
జేరియు ప్రతి రాత్రియు నా
బారున నృత్యమును సలి పె భారతి వేడ్కన్