4, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5264

5-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా”
(లేదా...)
“మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”

19 కామెంట్‌లు:

  1. చ.
    అరుదగు యుద్ధ నైపుణిని యమ్ములు సింగిణి జేత బూని నీ
    కరము ప్రతాప లక్షణము గాంచగ జంద్రుని బోలు మోముతో
    బెరిగిన గుబ్బ చన్నులను బెంపగు బొల్పును గల్గి కాంతి జి
    మ్మ రణము గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో !

    రిప్లయితొలగించండి

  2. అరయగ వెన్నెల మదనుని
    శరముల యట్లు మది గ్రుచ్చ జవ్వని విరహా
    గ్ని రగులుచు నీదరికి కా
    మ రణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా.


    సరసిరుహారి చందిరిక శంకువు రాల్చు శరమ్ములట్లుగా
    తరుణి దరత్తు గ్రుచ్చుకొని తాపము పెంచగ చక్రభేదినిన్
    విరహము తాళలేనని ప్రవీరుడ వంచు దలంచి తాను కా
    మ రణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో.

    రిప్లయితొలగించండి
  3. కందం
    దొరుకును నర్తనశాలను
    సరసమ్మని కీచకుండు సాగుచు గనఁగన్
    కొరకొర, వలలుండనె "నీ
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా!"

    చంపకమాల
    దొరుకును సోయగమ్మనుచు తొందరపాటున నాట్యశాలలో
    జొరపడి కీచకుండు వడి సొంపులమాలిని కొంగులాగినన్
    గొరగొర చూచెడున్ వలలుఁ గ్రోధిగ తాకఁగ నిట్లుఁ బల్కె, నీ
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో?

    రిప్లయితొలగించండి
  4. అరుదగు రోగము నొందగ
    సరియగు విరుగుడు మనకడ సమకూరంగా
    ఇరుకాటము లేకుండెడి
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి
  5. తరుణము సంధ్యా సమయము
    విరిశరముల దొర చెలగఁగ విరితూపులతో
    పరవశమున లెక్కింపక
    మరణమ్మునుఁ, గోరి వచ్చె మానిని గనుమా

    రిప్లయితొలగించండి
  6. కరమునదాల్చి పూశరము కాముడు కీరము వాహనమ్ముగా
    సరగున నేగుదెంచి వనజాక్షి పయిన్ సుమబాణమేయగన్
    విరహముఁ సైపలేక సరవిన్ నినుగూడగ, లెక్కసేయకన్
    మరణముఁ, గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి
  7. [ధర్మరాజు భీమునితో పల్కిన మాటలుగా....]

    విరహము తాళగలేనని
    దురాత్ముడగు కీచకుండు తోడ్పడమనగా
    త్వరితంబా కీచక దు
    ర్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

    విరహము తాళలేననుచు వేదిజ వెంబడె కీచకుండిటన్
    గరువలిపట్టి!చిత్తమున కల్గిన తప్పర మట్టగించగా
    వరమును పొందనెంచుచు కువాదుడు కీచక కుట్టుతేలు దు
    ర్మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. పరువము నందునున్న సుమబాలను పెండిలి యాడి నిన్నునున్
      పరిణయమాడ నెంచతిని పట్టణ మందు రహస్యంబుగన్
      ఎరుగుచు నిట్టసంగతి మదింతియు మిక్కిలి క్రోధ మొంది నీ
      మరణము గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

      తొలగించండి
  9. తరుణము దొరికె న టంచును
    సరగున దండె త్త దలచి సాహస మున దా
    నురిమెడి మేఘము వలె భా
    మ రణమ్మును గోరి వచ్చె మానిని గనుమా!

    రిప్లయితొలగించండి
  10. కం:మరణించు కీచకున్ గని
    కరకుగ భీముండు పలికె కాముక! స్త్రీపై
    మరులు గొను పాప ఫలమై
    మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా!

    రిప్లయితొలగించండి
  11. చం:హరిని వరించి రుక్మిణి మహార్ద్రత శాంభవి దల్చి యిట్లనెన్
    "వరము నొసంగు మమ్మ హరి పాణిని బట్టగ ! నన్యు నొల్ల,నీ
    కరుణయొ,యట్టి నీ కృపయు గానగ సాధ్యము కాని దైనచో
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”
    (రుల్మిణి కృష్ణుని భర్తగా కోరినప్పుడు పార్వతీపరమేశ్వరులను ప్రార్థించింది.నీ కరుణయో,మరణమో ఏదో ఒకటి కోరి ఈ స్త్రీ వచ్చింది.ఎలా ఆదరిస్తావో!అని కరాకండి గా అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  12. కం॥
    చెఱుపగు మాదక సేవన
    పురుషులతో పాటు నేడు పొలతులు చేయన్
    పొరిమత్తున తొర తూలుచు
    మరణమ్మునుఁగోరి వచ్చె మానిని గనుమా!!

    రిప్లయితొలగించండి
  13. హనీమూన్ కు వెళుతున్న మిత్రునికి సలహా యిస్తున్న మిత్రుడు

    కం॥ తరగని భీతినిఁ దెలిపెద
    ”మరణమ్మును గోరి వచ్చె? మానిని గనమా”
    సరగున నమ్ముకు మరయుము
    తరుణి విధము నడవడి యటు తప్పక సఖుఁడా

    చం॥ పరవపు మోహమొందుచును భార్యలు భర్తలఁ జంపు చుండ “నీ
    మరణముఁ గోరి వచ్చినది మానిని? నీవెటుల నాదరింతువో!”
    తరగని భీతి నేను గని తప్పనిఁ దల్చకు తెల్పు చుంటినే
    మరువకు మప్రమత్తతను మన్నన సేయుము హెచ్చరించితిన్

    రిప్లయితొలగించండి
  14. (3)చం:కరకుగ నుండు మోరి కొడుకా!యిది కోడలు కాదు దయ్యమై
    పరిపరి నాకు,నాయనకు బాధల దెచ్చుచు నుండె,దీనికిన్
    సిరి పయి రంథి యెక్కు వయి,శీఘ్రమె యాస్తిని బొంద గోరి నా
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!
    (నీ పెళ్లాం నా చావుని కోరుతోంది అని,నువ్వు దాని తో కరుకు గా ఉండాలని ఒక తల్లి కోడలి మీద సాడీలు చెపుతోంది.నేను తొందరగా పోతే ఆస్తి వస్తుండని పెళ్లి చేసుకున్నది అని.)

    రిప్లయితొలగించండి
  15. గురు వగు నీ సముఖమ్మునఁ
    దరుణీ మణి వొంద శాంతి తగు నంచు వెసన్
    గురుతర నిజ బాధా వి
    స్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా


    నరులకుఁ జెప్ప నేల మఱి నారుల కైనను యక్ష రాక్ష సా
    మరులకు నైన దుర్భరము మాతృ వియోగము నిశ్చయమ్ముగాఁ
    బరమపదింపఁగా జనని వారక తద్దిన మందు మాతృ సం
    స్మరణముఁ గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

    రిప్లయితొలగించండి


  16. పూరణ నేపధ్యం : తన సుత అయిన సంధ్యని హతించకుండా ఆదరించమని రేయిని(నిశని) భానుడు వేడుకొనుచూ..

    చంపకమాల.

    శరణము వేడె భానుడు నిశంబును "నాసుత కోమలంబగున్
    కిరణములొల్కు సంధ్య పరుగేగెను నీయడ సంతసంబుగన్
    కరుణను జూపుమా హితము గాదుగ కాంతపు కాంతినార్పుటన్
    మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!"



    రిప్లయితొలగించండి