జన్మ రాహిత్యము
రచన : పోచిరాజు సుబ్బారావు
పూర్వజన్మమందు పూర్ణము
కానట్టి
మిగులు పాపతతులు మిగుల
కుండ
ననుభవించవలెను నాజన్మ
మిలలోన
జీవులెల్ల విధిగ జేయు
నిదియ.
పాపమంతయు జీవిని బాయు
వరకు
జీవి జన్మించుచుండును
జేతనముగ
పుణ్య కార్యాల వలననే
బోవు నఘము
జన్మ రాహిత్యమున కది
సత్పథ మగు.
గిట్టు మనుజుడు దప్పక
పుట్టు మరల
నతని పాపము విడివడు
నంత వరకు
పుణ్య మార్జన జేయగ
బోవు నఘము
కాన జేయుము పుణ్యము
గలుగు పనులు.
పాప ఫలితము గష్టాలు
వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములఁ
బొందఁజేయు
పాపముల జోలి కేగక బ్రదుకునంత
కాల ముపకృతి జేయంగ వలయు సుమ్ము.