19, ఏప్రిల్ 2016, మంగళవారం

సమస్య - 2008 (చేపలు గాకులకు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
చేపలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

67 కామెంట్‌లు:

 1. లోపములెంచుచు లోకులు
  వీపున పలుకును పుకారు విచ్చలవిడిగన్
  కోపపు తాపపు మాటల
  చే పలుగాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా!!

  రిప్లయితొలగించండి
 2. ఆపగలేము వదంతుల
  నోపగలేక మన వృద్ధి నుద్రేకముతో
  పాపపు మాటల నుడువుచు వక్రముగ వసిం
  చే,పలుగాకులకు బుద్ధి జెప్పగా తరమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మూడవపాదంలో గణదోషం. ‘పాపపు వర్తనల వసిం|చే...’ అందామా?

   తొలగించండి
  2. నేను సూచించిన సవరణలోను దోషం ఉంది. ‘వసించెడు’ను ‘వసించే’ అని ప్రయోగించరాదు.

   తొలగించండి
 3. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ( కృష్ణ రాయబారము అన౦తరము )

  ఆ పార్థు డనియె హరితో :-

  పాపులు గా౦ధారి సుతులు భ౦డనమున , వా

  రే పోదురు నుసియై > మా

  చే పలుగాకులకు బుధ్ధి చెప్పగ తరమా ?


  { పలుగాకి = క్రూ రు డు }

  రిప్లయితొలగించండి
 4. తాపము దీరగ వాయస
  మూపుగ నదిలో మునుగగ నుష్ణము దగ్గెన్
  దాపున ఎండ్రిని బిలువగ
  చేపలు, గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా!

  రిప్లయితొలగించండి
 5. నల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యులు గారి పూరణ.....
  ఆపగ లేమే లోకుల
  నే పనిపాటయును లేక నూరక తూలన్
  పాపపు పలుకులు; మాటల
  చే పలుగాకులకు బుద్ధిఁ జెప్పఁగ వశమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూరణ బాగున్నది. కాని రెండవపాదంలో యతి తప్పింది. ‘...ఏ పని పాటలను లేక నేఁకటఁ దూలన్’ అనండి.

   తొలగించండి
 6. రిప్లయిలు
  1. ఆపై విహంగ వీక్షణ
   మాపక లోకమ్ము నెఱఁగు మతితో నుండ
   న్నీ పానీయమునఁ గదులు
   చేపలు కాకులకు బద్ధి చెప్పఁగఁ దరమా?

   తొలగించండి
  2. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 7. లోపములెన్నుచునిరతము పాపపుభీతియునులేకపరులకునెపుడు న్శాపములనీయదాదయ
  చేపలుకాకులకుబుధ్ధిజెప్పగదరమా

  రిప్లయితొలగించండి
 8. వీపున వాతలు పెట్టుట
  తాపులు తన్నుటయె మేలు దయ్యమ్మునకున్
  ఓపిక సూనృత సూక్తుల
  చే పలుగాకులకు బుధ్ధి చెప్పగ తరమా

  రిప్లయితొలగించండి
 9. కం**
  లోపల విషమది యుంచుక,
  కాపురు షుడెపుడు మనమున కరుణయె లేకన్!
  పాపపు పనులాపునె,మా
  చే పలుగాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా!!

  అంబటి భానుప్రకాశ్.
  గద్వాల.

  సార్ నమస్కారం. పూరణలు రాయడం కొత్తగా,,,
  సలహాలు, సూచనలు ఇవ్వగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంబటి భానుప్రకాశ్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. పాపపు చూపులచేతను.
  పాపల తామోసగించి భ్రష్టులపగిదిన్
  రేపును జేయగ నూహిం
  చే,పలు గాకులకు బుధ్ధి చెప్పగ దరమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఊహించే... అనడం వ్యావహారికం. ‘ఊహించెడు’ సాధువు. ఆ అర్థంలో ఇక్కడ పూరణ సమర్థం కాదు.

   తొలగించండి
 11. వీపున మచ్చను గానక
  లోపము లెంచుచు తిరిగెడి గులివిందలకున్
  ఓపిక మీరగ మాటల
  చే,పలు గాకులకు బుధ్ధి చెప్పగ దరమా

  రిప్లయితొలగించండి
 12. చూపులు, మాటలు, చేష్టల
  పాపపు పనులను పడతుల బాధించెడి వా
  డే, పురుషుండని భావిం
  చే, పలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భావించే... అనడం వ్యావహారికం. ‘భావించెడు’ సాధువు. ఆ అర్థంలో ఇక్కడ పూరణ సమర్థం కాదు.

   తొలగించండి
  2. చూపులు, మాటలు, చేష్టల
   చే, పడతుల బాధపెట్టు చెడుగులు చరితన్
   పాపులుగా నిలుతు రనుట
   చే, పలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

   తొలగించండి
 13. ఏపని జేసిన స్వార్థము
  లోపము గలదంచు పలుకు లోకుల మాట
  ల్నాపగ లేమిల నమ్రత
  చే పలుగాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   ‘మాటల్నాపగ’ అనడం వ్యాకరణ విరుద్ధం. ‘మాటల్|సైపగ లేమిల...’ అందామా?

   తొలగించండి
 14. రూపము లేదనుకాకులు,
  కోపమునన్మెలుగువారు కోర్కెలు బెరుగన్
  ఆపక కలుషిత మనసుల
  చే పలుకాకులకు బుద్దిచెప్పగ తరమా?

  రిప్లయితొలగించండి
 15. పాపపు చింతలు నిరతము
  తాపము వారికి నితరుల ధనమును గనినన్
  దాపున లోకులు నొక్కని
  చే పలుగాకు లకు బుద్ధి చెప్పగఁ దరమా

  రిప్లయితొలగించండి
 16. గుఫువు గారికి నమస్కారములు

  చూపులతో హింసింతురు
  యిప్పుడమి నరులు పలుకులె యీటెల్ వారే
  పాపులు నీచులు మాటలు
  చే పలు గాకులకు బుద్ది చెప్పగ దరమా

  తాపంబేలను నిందా
  రోపణలను జేతురంట రుజువులు గనకన్
  కోపించక హిత వాక్కుల
  చే పలుగాకులకు బుద్ధి చెప్పగ దరమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మొదటి పూరణలో ప్రాస తప్పింది. ‘హింసించెద| రీ పుడమి...’ అనండి. ‘మాటలచే’ అని ఉండాలి కదా!
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఓపిక లేకనె జనములు
   2.కోపమున బరుల సతతము శిక్షింపంగన్
   తాపముతో దుర్భాషల
   చే పలుగాకులకు బుద్ధి చెప్ప తరమా!.


   తొలగించండి
  3. మీ తాజా పూరణలో రెండవపాదంలో యతి తప్పింది.

   తొలగించండి
 17. 1ఈపరి పలికెడు జనముల
  నాపగ తరమా జగతిన నయమును లేకన్
  శాపము లిడుచున్ మాటల
  చే,పలుగాకులకు బుద్ధి చెప్ప తరమా?
  2.కోపవశంబున నాలో
  చింపక నితరుల సతతము శిక్షింపంగన్
  తాపముతో దుర్భాషల
  చే పలుగాకులకు బుద్ధి చెప్ప తరమా!.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిజమేనండోయ్... మీదాకా వచ్చేసరికి క్రింద విష్ణునందన్ గారి వ్యాఖ్య కనిపించింది. వెంటనే అది చదివి వారికి సమాధానం ఇచ్చి మీ పద్యాల విషయం మరిచిపోయాను. మన్నించండి.
   మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపూరణ రెండవపాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
 18. శ్రీ కంది శంకరయ్య గారూ, ఊహించే , భావించే అన్న పదాలతో చేసిన పూరణలను మీరు సమర్థనీయం కాదని తిరస్కరించడం న్యాయమే. అదే విధంగా శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణకు మీ చేసిన సవరణలో కూడా 'వసించే' అనే గ్రామ్యం దొర్లింది. పరిహరిస్తే బాగుంటుంది. ఇక అన్నింటి కన్నా ముఖ్యంగా ఇక్కడున్న పూరణలలో- ఈ సమస్యకు తృతీయా విభక్తితో విరుపు సాధించిన - ఏ పూరణా సమర్థనీయం కాదు. ' చేతన్ చేన్ తోడన్ తోన్ ' ద్రుతాన్ని వదిలి పెట్టినప్పుడు చేఁ తరువాత ..."ప" కారం "బ" కారమై తీరుతుంది. ద్రుతాన్ని తెలుగు వారెన్నడో మరిచిపోయారు కానీ ఇంకా ఈ శంకరాభరణంలో సంప్రదాయ వ్యవహారాలకు పెద్ద పీట వేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మన మీదున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. విష్ణునందన్ గారూ,
   ధన్యవాదాలు.
   ఇక ఈ సమస్య నా సృష్టి కాదు. సేకరించినదే. ఏదో అవధానంలో అడిగిన సమస్య ఇది. అక్కడ అవధాని తృతీయా విభక్తి విరుపుతోనే పూరణ చెప్పారు. ఇది నాకూ సందేహాన్ని కలిగించిన మాట వాస్తవం. ఆ పూరణ ఇది...
   పాపమని హితవు చెప్పిన
   క్ష్మాపతి రావణుడు దెచ్చె జానకిని; పగన్
   బాపెడు మెత్తని మాటల
   చే పలుగాకులకు బుద్ధి చెప్పగ దరమా?

   ఇకముందు సమస్యలను ఇచ్చేముందు ఒకటి రెండు సార్లు పరిశీలించి ఇస్తాను. కృతజ్ఞుడను.
   అన్నట్టు... గుండు మధుసూదన్ గారు మీరు అఖండయతిపై చేసిన వ్యాఖ్యపై స్పందించారు. ఒకసారి పరిశీలించండి.

   తొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారూ, ఆ అవధాని ఎవరో ఏకళనుండి పూరించినారో ఏమో ... దానికి ఆమోద ముద్ర లభింపదు.

   శ్రీ గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య పరిశీలించినాను. స్వీయాభిప్రాయాన్ని వారు సరిగా అవగతం చేసుకున్నట్లు లేదు. అఖండయతి గురించిన ప్రాచీన కాలం నుండి నేటి దాకా కవి పండితులలో రక రకాలైన అభ్యంతరాలున్న నేపథ్యంలో , దానికి సంబంధించి నా అభిప్రాయాన్ని సూటిగా మరొక్కసారి ఇక్కడ పొందు పరుస్తాను.

   అఖండ యతి కావాలనే వారు ఒక వర్గం .... అసలు వద్దు అనే వారు ఒక వర్గం .... తటస్థ మార్గావలంబులది మరొక వర్గం ( నేను ఈ మూడవ కోవకు చెందిన వాడిని , శ్రీ గుండు మధుసూదన్ గారు నన్ను రెండవ వర్గం క్రింద పరిగణించినట్లున్నది )

   మా మతమేమంటే
   1. అఖండ యతిని క్వాచిత్కంగా వాడవచ్చును. ఆ పదం సిద్ధ సమాసం వలె సంధి జరిగి కూడా ఏకపదమై భాసించిన మరీ మేలు. (నాస్తి , ప్రాణము , రామాయణము వలె)
   2. ఎవరైనా అఖండ యతి విషయంలో అభ్యంతరపెడితే అక్కడికక్కడ ప్రత్యామ్నాయం చూపించగలిగే నేర్పు ఉండగలగాలి కనుక అభ్యాస కవుల విషయంలో ఈ అఖండ యతి విషయంలో జాగ్రత్తలవసరం .

   ఇదీ ఆ తటస్థ వాదన. సరే , లోకంలో ప్రతి విషయానికి విభిన్న వాదనలున్నట్లే దీనికీ ఉన్నాయి. ఎవరి అభిప్రాయం వారిది. కాదనడానికేం లేదు. ప్రస్తుతానికి ఈ తటస్థ వాదన వైపే నా మొగ్గు.

   తొలగించండి
 19. చూపుచు వివక్ష సతతము
  పాపపు చింతనల తోడ పలుకరె కుజనుల్ ,
  శాపము లిడి మురియగదల
  చే పలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘మురియగ దలచెడు’ అనడం సాధువు. ‘తలచే’ అంటే వ్యావహారికమౌతుంది. గమనించండి.

   తొలగించండి
 20. రిప్లయిలు
  1. వైవిధ్యమైన భావం. బాగుంది.
   మూడవపాదంలో గణదొషాన్ని సవరించండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
   మూడవ పాదాన్ని రెండవ పాదము గా భ్రమ పడి యవస్ధ పడి వ్రాసాను. సవరించిన పద్యమును తిలకించ గోర్తాను.

   ఆ పశువిక, ముక్కోపియ,
   చాపు మెడను మేక, ఘోర చపలత్వము సం
   తాప మసహనమున మెలగఁ
   జేపలు, గాకులకు బుద్ధి చెప్పగఁ దరమా
   (చేపు, అలుగు, ఆకులకు , బుద్ధి చెప్పగఁ దరమా )

   తొలగించండి
 21. శ్రీపతి! నీరూపు గనిన
  నీ పాదము బ్రహ్మ కడిగి నిను శరణనినా
  పాపులు దూరెను జేతల
  చే, పలు గాకులకు బుద్ధి చెప్పగ తరమా!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యాన్ని ఇలా చెప్తే బాగుంటుందని నా సూచన....
   శ్రీపతి! నీ రూపు గనిన
   నీ పదముల భక్తిఁ గొలువ నిష్ఫల మనుచున్
   పాపులు దూరగఁ జే(నీ)తుల
   చే పలుగాకులకు బుద్ధి జెప్పగ తరమా?

   తొలగించండి
  2. మీసూచన చాలా బాగుంది గురువుగారు.. ధన్యవాదములు..

   తొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  ఏ పనియును ససిగాఁ ద
  ప్పోపని రీతిని వహించి పూర్తి యొనర్పన్
  జూపని వారలఁ గని మె

  చ్చే పలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా?

  [మెచ్చు + ఏ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వైవిధ్యంగా పూరించాలన్న మీ ఆలోచన ప్రశంసనీయం. అయితే ‘మెచ్చు+ఏ’ అన్నది ఏ అర్థంలో ప్రయోగించారు? క్రియాపదంగా ‘మెచ్చునట్టి ఏ పలుగాకులు’ అంటే ‘మెచ్చు నే పలుగాకులకు’ అనాలి కదా! విశేష్యంగా తీసుకుంటే ‘గని మెచ్చే’ అన్నది ‘గన మెచ్చే(ప్రశ్నార్థకం)’ అని ఉంటే అన్వయం కుదురుతున్నది. నిశ్చయార్థంగా తీసుకుంటే గని, గన రెండూ అన్వయించవు. ఒకసారి పరిశీలించండి. నా బుద్ధికి తోచినదిది. విశేషార్థం ఉన్నదేమో... వివరించండి. (అన్నట్టు రెండు పాదాల్లోనూ పని గట్టుకొని అఖండ యతిని వేసినట్టున్నారు!)

   తొలగించండి
  2. మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు.

   నా పూరణలో...

   ’లోకులు పలుగాకులు’... అలాగే... ’లోకో భిన్నరుచిః’...కాబట్టి అలాంటి భిన్నరుచులు గలిగిన లోకులలో ఎవరికని బుద్ధిచెప్పడం మన తరమవుతుంది? ఎవరు తప్పును మెచ్చుతారో, ఎవరు ఒప్పును మెచ్చుతారో? వారందరినీ ఒకే గాటను గట్టి పలుగాకులన్నాం గదా...ఆ పలుగాకులలో నెవరికి [ఏ పలుగాకులకు] బుద్ధి చెప్పడం మన తరమవుతుంది?...అని నా భావం. [ఇలాంటి భావం నాకు తెలియకుండానే నా పద్యంలో పలకడానికి ఈ మధ్య జరిగిన సంఘటనలే కారణం కాబోలు! :-( ]

   మెచ్చు + ఏ అనేచోట నేను మెచ్చు...ను క్రియాపదంగానే గ్రహించాను. మీరన్నట్టుగా ’మెచ్చు నే పలుగాకులకు’ అనాలి. కాని, అలా అంటే "సమస్య" పాదం చెడుతుంది. వేరే గత్యంతరం లేదు. సమస్య అలా వున్నది. దానిని మనం మనకు తగువిధంగా అన్వయించుకోవలసిందే తప్ప వేరే దారిలేదని...అలా రాశాను.

   ఇది వైవిధ్యమైన పూరణే. పనిగట్టుకొని అఖండయతిని వేయకున్నా దానంతటదే కుదురుకున్నది. కాల మహిమ! ఏం చేస్తాం? :-)

   భవదీయుడు
   గుండు మధుసూదన్

   తొలగించండి
  3. మరిచాను. శ్రీ విష్ణునందన్ గారి నిన్నటి వ్యాఖ్య చూశాను. వారు చెప్పిన వర్గాలలో నేను మొదటి కోవకు చెందినవాణ్ణి. నన్నయాదులే అఖండవడిని వాడారు మనమొక లెక్కా? అని. అంతేగానీ, విధిలేని పరిస్థితుల్లో అఖండవడిని వాడినా దాన్ని ఎవరైనా ఆక్షేపిస్తే సవరించుకోవడానికి సమర్థుడైనప్పుడే దానిని వాడాలి గానీ, ప్రారంభకులు వాడనవసరం లేదన్నారు. అఖండవడి ఆక్షేపణీయమే కాదు. అలాంటప్పుడు సవరించుకోడానికి సమర్థత ఎందుకు? సవరించనవసరంలేదు అని నా అభిప్రాయం. వారి అభిప్రాయం వారిది. నా అభిప్రాయం నాది. తటస్థునిగా నేనుండలేను మరి. లోకో భిన్నరుచిః! స్పందించి వ్యాఖ్యద్వారా వారి యభిప్రాయాన్ని తెలిపినందులకు వారికి నా కృతజ్ఞతలు తెలుపగలరు. అన్యథా భావించరను విశ్వాసంతో...

   భవదీయుడు
   గుండు మధుసూదన్

   తొలగించండి
 23. పాపపు చూపుల తోడను
  పాపల మోసంబుజేసి భ్రష్టత కేలుం
  జాపెడు నా దుశ్శీలుర
  చే,పలు కాకులకు బుద్ధిచెప్పగ దరమే.

  రిప్లయితొలగించండి
 24. పాపపు పనులను చేయుచు
  తాపసులనుబాధ పెట్టి తామసబుద్దిన్
  కోపము కల్గిన మూర్ఖుని
  చే పలుగాకులకు బుద్ధి చెప్పగ తరమే.

  రిప్లయితొలగించండి
 25. పాపపు చూపులతో పసి
  పాపల నెత్తుకొనివచ్చి బంధింపంగన్
  కోపవశంబున మాటల
  చే పలుగాకులకు బుద్ధి చెప్పగ దరమే

  రిప్లయితొలగించండి
 26. దాపున నున్నది ఫలమని
  పాపము పుణ్యమును వీడి పరుగుల నిడుచున్
  ఆపద నెంచక సమసిలు
  చేపలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా?

  రిప్లయితొలగించండి
 27. ఓపిక మీరగ సుజనులు;...
  పాపులు, పండితులు, కవులు, బలుపగు నేతల్,
  పోపులు, ముల్లాలు, మరియు
  చేపలు, గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా ???

  రిప్లయితొలగించండి