భోగములందు మానసము మున్గగ నీయక నెల్లవేళలన్ త్యాగపుబుద్ధి ధీనజను లందరినిన్ కృప బ్రోచుచున్ ,కడున్ రాగముతోడుతన్ సతము రామునినామసుధన్ ముదమ్ముతోత్రాగినవానిజీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హైదరాబాదులో ఒక వివాహానికి వెళ్తున్నాను. మీ పూరణలపి, పద్యాలపై వెంటవెంటనే స్పందించక పోవచ్చు. మన్నింంచండి.
ఏగెను లంకకున్ జనని కింపగు వార్తను చేరవేయగన్సాగెను రామమూర్తి తను సందిట జేర్చెడు సేవలందునన్నాగని భక్తి తత్పరత నార్తిగ నామ సుధారసమ్ములన్ద్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!
రోగము పారగా నిలను రోగికి నిచ్చెడు నౌషధమ్ముగా;భోగము నందు లాలసత బోయి మనస్సున భ్రాంతి బాయగా;త్యాగపు వెన్నెలల్ బ్రతుకు దారిన గాయగ; రామ నామ సుధన్త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
భోగము లెన్నియున్న పరిపూర్ణ సుకావ్య రసార్ద్రతంబులౌరాగము లేకయున్న తగు రంజన యుండదు పండితాళికిన్వేగమె కాలమెంతయును విజ్ఞత వాడుచు జ్ఞానవారధింద్రావిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
చివరి పాదం లో సవరణ.....త్రాగిన వాని జీవితము...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భోగములొంది గుల్కక నభూతగతిన్ వనసీమకేగి యా యోగుల సేమమున్ గనుచు హోమము గాచిన రామచంద్రునిన్ తా గనజూచు దాసునిగ, ధారుణి రామరసమ్ము నిత్యమున్ త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
మిత్రులందఱకు నమస్సులు!త్రాగెద! రామనామ మధు ♦ రమ్య సుధారస మింపు మీఱఁగన్ద్రాగెద! రామ భక్తి నెదఁ ♦ దాలిచి రామ రసమ్ముఁ బ్రేమగన్ద్రాగెద! రామ మంత్ర యుత ♦ తారక నామ రసమ్ము నిత్యమున్త్రాగినవాని జీవితము ♦ ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!!
త్రాగును నొక్క జుక్క సుర దండిగ నుమ్ము గృహమ్ము నందునన్ తూగును.సంఘమందు నొక తుచ్ఛుడుగానపకీర్తి పాలవన్,సాగిలి మ్రొక్కి రామునకు స్వాదువు రామ రసాయనమ్ము,తా త్రాగిన, వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
భాగవ తోత్త మాశన నిభ మ్మట తారక నామ మంత్రము న్నాగమ సార తుల్య దురితౌఘ వినాశము భవ్యదాయియున్ రాగసమేత సుందరము రామ సునామ రసామృతమ్మునుం ద్రాగినవాని జీవితము ధన్య తరమ్ము ధరా తలమ్ము నన్
. లోగడ యాత్రికుల్ దెలుప లోపము లేవియు లేకబస్సునన్సాగుచు దక్షణాది,తగు సంతస మందున నుత్తరాదిలోదాగినయాత్రలన్దిరిగిదండము బెట్టుచు యాత్ర తీర్థముల్త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
రోగము చేరనీక మన లోపలి గుండెకు మంచి చేయునేబాగుగ శక్తినిచ్చి తనుభారము కుంచుచు కాంతి పెంచునేమూగిన ముడ్త మాపి బహు పోషకకారి జలామృతమ్మునిన్త్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
త్రాగినవారిజీవితముధన్యతరమ్ముధరాతలమ్మున న్సాగునెసామి!యీపలుకుసంఘమునందుననమ్మరెవ్వరు న్ద్రాగినవానిజీవితముధన్యతనొందదునమ్ముడీసుమా త్రాగుటమానుచోభువినితద్దయుసౌఖ్యమునొందునోగదా!
యోగులు జ్ఞానపూర్ణులు మహోన్నతులెల్లరు పల్కుచుందురే భాగవతోత్తముల్లిలను భక్తి సుధామకరందమున్ సదాత్రాగినవారి జీవితము ధన్యతరమ్ము ధరా తలమ్మునన్ భోగము గోరువారిల కబోదులు కాంచరు దైవశక్తినే
మూగిన ధూళిలో శిలకు ముక్తినొసంగిన రామచంద్రునిన్సాగర మందు వారధిని చక్కగ గట్టిన జానకీ పతిన్బాగుగ గొల్చుచున్ మదిని భక్తిగ నామరసమ్ము నిత్యమున్త్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!!!
త్రాగకు మద్యపానమును దార సహించదు గీములోపలన్త్రాగకు ధూమ్ర పానమును తప్పక రోగములాక్రమించునిన్త్రాగుము సర్వకాలమున రామసుధామృత నామపానమున్త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
త్యాగయ వ్రాసె కీర్తనల తా మది గొల్చుచు వేలవేలుగా నాగకవ్రాసె కోపమున, నమ్ముచు భక్తిని, బాధలందునన్బాగుగ రామదాసు, మరి పట్టుగ రాముని కీర్తనా సుధల్ త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
మానవు డిగపుట్టిమొట్టమొదటగ తల్లిపాలను త్రావి జీవితమ్ము ను మొదలుపెట్టి చెడు నడతకు లోనై మద్యము ధూమము త్రాగుట కన్న రామనామము సుధా పానముత్రాగినవానిజీవితముధన్యతరమ్ము ధరాతలమ్ము నన్
రాహుల్ ఉవాచ: త్రాగితి గంగ తీర్థమును తర్లుచు కాశికి...నిష్ఫలమ్మయే! త్రాగితి జమ్న తీర్థమును తర్లుచు నాగ్రకు...నిష్ఫలమ్మయే! వేగుచు తెల్సితిన్ కడకు వెళ్ళగ...మానసరోవరమ్మునన్త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్ :)
వేగమె వోట్లు కోరుచును ప్రేమను పంచుచు వీధివీధులన్ త్రాగుట వ్యర్థమేననుచు దండిగ నీతులు పల్కుచున్ సదాపోగులు చేసి ద్రవ్యమును పోరున గెల్వగ నామమాత్రమేత్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
భోగములందు మానసము మున్గగ నీయక నెల్లవేళలన్
రిప్లయితొలగించండిత్యాగపుబుద్ధి ధీనజను లందరినిన్ కృప బ్రోచుచున్ ,కడున్
రాగముతోడుతన్ సతము రామునినామసుధన్ ముదమ్ముతో
త్రాగినవానిజీవితము ధన్యతరమ్ము
ధరాతలమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహైదరాబాదులో ఒక వివాహానికి వెళ్తున్నాను. మీ పూరణలపి, పద్యాలపై వెంటవెంటనే స్పందించక పోవచ్చు. మన్నింంచండి.
రిప్లయితొలగించండిఏగెను లంకకున్ జనని కింపగు వార్తను చేరవేయగన్
రిప్లయితొలగించండిసాగెను రామమూర్తి తను సందిట జేర్చెడు సేవలందున
న్నాగని భక్తి తత్పరత నార్తిగ నామ సుధారసమ్ములన్
ద్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరోగము పారగా నిలను రోగికి నిచ్చెడు నౌషధమ్ముగా;
తొలగించండిభోగము నందు లాలసత బోయి మనస్సున భ్రాంతి బాయగా;
త్యాగపు వెన్నెలల్ బ్రతుకు దారిన గాయగ; రామ నామ సుధన్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
భోగము లెన్నియున్న పరిపూర్ణ సుకావ్య రసార్ద్రతంబులౌ
రిప్లయితొలగించండిరాగము లేకయున్న తగు రంజన యుండదు పండితాళికిన్
వేగమె కాలమెంతయును విజ్ఞత వాడుచు జ్ఞానవారధిం
ద్రావిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
చివరి పాదం లో సవరణ.....త్రాగిన వాని జీవితము...
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగములొంది గుల్కక నభూతగతిన్ వనసీమకేగి యా
రిప్లయితొలగించండియోగుల సేమమున్ గనుచు హోమము గాచిన రామచంద్రునిన్
తా గనజూచు దాసునిగ, ధారుణి రామరసమ్ము నిత్యమున్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిత్రాగెద! రామనామ మధు ♦ రమ్య సుధారస మింపు మీఱఁగన్
ద్రాగెద! రామ భక్తి నెదఁ ♦ దాలిచి రామ రసమ్ముఁ బ్రేమగన్
ద్రాగెద! రామ మంత్ర యుత ♦ తారక నామ రసమ్ము నిత్యమున్
త్రాగినవాని జీవితము ♦ ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!!
త్రాగును నొక్క జుక్క సుర దండిగ నుమ్ము గృహమ్ము నందునన్
రిప్లయితొలగించండితూగును.సంఘమందు నొక తుచ్ఛుడుగానపకీర్తి పాలవన్,
సాగిలి మ్రొక్కి రామునకు స్వాదువు రామ రసాయనమ్ము,తా
త్రాగిన, వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
భాగవ తోత్త మాశన నిభ మ్మట తారక నామ మంత్రము
రిప్లయితొలగించండిన్నాగమ సార తుల్య దురితౌఘ వినాశము భవ్యదాయియున్
రాగసమేత సుందరము రామ సునామ రసామృతమ్మునుం
ద్రాగినవాని జీవితము ధన్య తరమ్ము ధరా తలమ్ము నన్
. లోగడ యాత్రికుల్ దెలుప లోపము లేవియు లేకబస్సునన్
రిప్లయితొలగించండిసాగుచు దక్షణాది,తగు సంతస మందున నుత్తరాదిలో
దాగినయాత్రలన్దిరిగిదండము బెట్టుచు యాత్ర తీర్థముల్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
రోగము చేరనీక మన లోపలి గుండెకు మంచి చేయునే
రిప్లయితొలగించండిబాగుగ శక్తినిచ్చి తనుభారము కుంచుచు కాంతి పెంచునే
మూగిన ముడ్త మాపి బహు పోషకకారి జలామృతమ్మునిన్
త్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్
రిప్లయితొలగించండిత్రాగినవారిజీవితముధన్యతరమ్ముధరాతలమ్మున న్సాగునెసామి!యీపలుకుసంఘమునందుననమ్మరెవ్వరు న్ద్రాగినవానిజీవితముధన్యతనొందదునమ్ముడీసుమా
త్రాగుటమానుచోభువినితద్దయుసౌఖ్యమునొందునోగదా!
యోగులు జ్ఞానపూర్ణులు మహోన్నతులెల్లరు పల్కుచుందురే
రిప్లయితొలగించండిభాగవతోత్తముల్లిలను భక్తి సుధామకరందమున్ సదా
త్రాగినవారి జీవితము ధన్యతరమ్ము ధరా తలమ్మునన్
భోగము గోరువారిల కబోదులు కాంచరు దైవశక్తినే
మూగిన ధూళిలో శిలకు ముక్తినొసంగిన రామచంద్రునిన్
రిప్లయితొలగించండిసాగర మందు వారధిని చక్కగ గట్టిన జానకీ పతిన్
బాగుగ గొల్చుచున్ మదిని భక్తిగ నామరసమ్ము నిత్యమున్
త్రాగిన వాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్!!!
త్రాగకు మద్యపానమును దార సహించదు గీములోపలన్
రిప్లయితొలగించండిత్రాగకు ధూమ్ర పానమును తప్పక రోగములాక్రమించునిన్
త్రాగుము సర్వకాలమున రామసుధామృత నామపానమున్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
త్యాగయ వ్రాసె కీర్తనల తా మది గొల్చుచు వేలవేలుగా
రిప్లయితొలగించండినాగకవ్రాసె కోపమున, నమ్ముచు భక్తిని, బాధలందునన్
బాగుగ రామదాసు, మరి పట్టుగ రాముని కీర్తనా సుధల్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.
మానవు డిగపుట్టిమొట్టమొదటగ తల్లిపాలను త్రావి
రిప్లయితొలగించండిజీవితమ్ము ను మొదలుపెట్టి చెడు నడతకు లోనై మద్యము
ధూమము త్రాగుట కన్న రామనామము సుధా పానము
త్రాగినవానిజీవితముధన్యతరమ్ము ధరాతలమ్ము నన్
రాహుల్ ఉవాచ:
రిప్లయితొలగించండిత్రాగితి గంగ తీర్థమును తర్లుచు కాశికి...నిష్ఫలమ్మయే!
త్రాగితి జమ్న తీర్థమును తర్లుచు నాగ్రకు...నిష్ఫలమ్మయే!
వేగుచు తెల్సితిన్ కడకు వెళ్ళగ...మానసరోవరమ్మునన్
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్ :)
వేగమె వోట్లు కోరుచును ప్రేమను పంచుచు వీధివీధులన్
రిప్లయితొలగించండిత్రాగుట వ్యర్థమేననుచు దండిగ నీతులు పల్కుచున్ సదా
పోగులు చేసి ద్రవ్యమును పోరున గెల్వగ నామమాత్రమే
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్