క్షీరసాగరమధనము
రచన : శైలజ
మంధరగిరి కవ్వముగను
బంధముగా నాదిశేషు బట్టగ
గిరి నా
నంధువుగ హరి కమఠమై
సింధువు మధనమ్ము జేయ
చెలువము తోడన్!!!
పొందుగ సురలును దనుజులు
నందముగా కడలి చిలుక
నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటను బట్టె
మృత్యుంజయుడే!!!
మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను
పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవరను గనగ జయజయ
మనుచున్!!!
హరిహరులను గొలిచి జనులు
మరలన్ మధనమ్ము జేయ
మంధరగిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు
చెన్నుగ వచ్చెన్!!!
ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని
శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును
సొగసుగ దివికిన్!!!
వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి
మధుహంతకునున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును
వందన మెపుడున్!!!
రిప్లయితొలగించండిక్షీరసాగరమధనమ్ముజేసినట్టి దేవదానవులబదులుదీనిఖండ కావ్యరూపానమాకిటదివ్యముగను
నందజేసినశైలజ!యందుకొనుము నతులపూర్వకయాశీస్సులతిరయమున
శ్రీ సుబ్బారావు గారికి నన్ను ప్రోత్సహిస్తూ పద్యరూపంలో తమ ఆశీస్సులందజేసినందుకు చాలా ధన్యవాదములు..
తొలగించండిశైలజ శైలిని గాంచగ?
రిప్లయితొలగించండితేలిక పద్యాల చేత తెలివిగ దెలుపన్
మేలగు సాగర మదనము
కాలానికి పంచి పెంచ?కమనీయంబే|
శ్రీ ఈశ్వరప్పగారికి పద్యరూపంలో నా ఖండికను మెచ్చుకుని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదములు...
తొలగించండిఅలతి అలతి పద్యమ్ముల
రిప్లయితొలగించండిసలలితముగ వెలువరించె శైలజ గారల్
కలిసికొని సురాసురులున్
చిలుకంగ నమృత మొలికిన క్షీరాబ్ది కథన్!
శ్రీ సుబ్బ సహదేవుడి గారికి నా ఖండికను మెచ్చి పద్యరూపంలో తమ ఆశీస్సులందజేసినందుకు చాలా ధన్యవాదములు..
రిప్లయితొలగించండినా ఖండికను ప్రచురించిన పూజ్యగురుదేవులకు ప్రణమిల్లుతూ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.....
రిప్లయితొలగించండిధారాశుద్ధిగలిగి మీ ఖండకావ్యము అలరిస్తున్నది. ముఖ్యంగా ధరియించెను పద్యము బాగా ఆకట్టుకున్నది శైలజగారూ!
రిప్లయితొలగించండిచాలా చాలా ధన్యవాదములు లక్ష్మీదేవిగారు..
తొలగించండిక్షీరసాగరమందలి అమృతము వలె నున్నవి. మీ పద్యములు.
రిప్లయితొలగించండిక్షీరసాగరమందలి అమృతము వలె నున్నవి. మీ పద్యములు.
రిప్లయితొలగించండిక్షీరసాగరమందలి అమృతము వలె నున్నవి. మీ పద్యములు.
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు.
"ముందుగ పుక్కిటను బట్టె మృత్యుంజయుడే"
అన్నపుడు యతిభంగమైనట్లు ఉన్నదండీ.
"వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్"
ఇక్కడ వాత్సల్యము అన్న పదము వాడటము సముచితమేనా అని చిన్న సందేహమండీ
భవదీయుడు
ఊకదంపుడు
నమస్తే సర్..మీరన్నది నిజమే అక్కడ మృ రాదు.. భువనేశ్వరుడే అని గాని పురశాశనుడే అని అనుకుని ఏమరుపాటున అలా వచ్చేసింది..చూసుకోలేదు..నా పద్యములను నిశితంగా పరిశీలించి..తెల్పినందుకు చాలా చాలా ధన్యవాదములు..ఇక వాత్సల్యమునకు ఫ్రేమ.. ఫ్రణయము.. అన్న అర్ధాలుకూడా వున్నాయిగా..అందుచే అది సముచితమే అని అనుకుంటున్నా..
తొలగించండివత్స అంటే ఆవు దూడ అని అర్థం ఉంది. అందుకే బిడ్డ మీద చూపించే ప్రేమకే వాత్సల్యం వాడతారని చదివిన గుర్తు. ఇదమిత్థంగా తెలియదు.
రిప్లయితొలగించండి