18, ఏప్రిల్ 2016, సోమవారం

సమస్య - 2007 (పగ గల్గినవాఁడె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

55 కామెంట్‌లు:

 1. సగమౌ నిల్లాలుండన్
  సుగతులొసఁగు సౌమనస్య సుతులున్, వెతలన్
  బొగలెడు ప్రజపై దయఁ జూ
  పగఁ 'గల్గి'న వాడె సౌఖ్యవంతుడు జగతిన్!

  రిప్లయితొలగించండి

 2. నొగులున్జెందునునిరతము పగగల్గినవాడె,సౌఖ్యవంతుడుజగతి
  న్బగజోలికినేబోవక
  తగురీతిన్మసలుకొనునుదానుగనెపుడున్

  రిప్లయితొలగించండి
 3. పగలును నిశియును మనసున
  పగలేమియులేక శాంత పద్ధతి నొరులన్
  తగు మర్యాదను తా జూ
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 4. సుగములు కడగండ్లు సతము
  సగపాలుగ నున్నగాని సతమత పడకున్
  నగవుచు ప్రగతిని సాధిం
  పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రగతి సాధింపగ గల్గిన మీ పూరణ బాగున్నది.
   ‘పడకన్| నగుచును ప్రగతిని...’ అనండి.

   తొలగించండి
 5. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  పగ మాని బయట తిరిగెడు --
  పగతుర పై , లో గల. రిపు వర్గము నిక నా
  ప గలిగి , యా ధాటికి సై
  పగ గల్గిన వాడె సౌఖ్యవ౦తుడు జగతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంతశ్శత్రువుల ధాటిని ఆపగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. పగ జగతికిన్ననర్థము
  పగయడగించన్ విశేష ఫలదాయకమౌ
  రగిలెడిదౌ యాపగ నా
  పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 7. రగిలెడు నరి షడ్వర్గపు
  సెగలను తట్టుకు నిలబడి స్థిర చిత్తముతో
  తెగువన వాటి నివారిం
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరిషడ్వర్గాలను నివారింపగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. రగిలెడి కోర్కెలు ద్రుంచెడి
  పగగల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్
  సగటున మనిషికి బ్రతుకగ
  అగచాట్లను వీడినపుడె?ఆనందమగున్|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రగిలెడు కోరికలపై పగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మగువను తక్కువ జేయక
  తగినంతగ ప్రేమ జూపి తనలో సతియే
  సగమను భావన కలిగిం
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సతి తనలో సగమనే భావన కలిగింపగ గల్గిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. భగ భగ లాడెడు గుండెన
  సెగలను తొలగించి ప్రేమ సిరులను పరిపూ
  ర్తిగ నెయ్యమునే తా నిల
  పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండవ పూరణలో నెయ్యమును నిలుపగ గల్గిన సుఖం లభిస్తుందన్నారు. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  2. ఔనండీ.....ఇది బాగుందీ గురువు గారికి ధన్యవాదములు

   తొలగించండి
 11. కవిమిత్రులారా,
  నిన్న ఒక మిత్రుడు ఒక మాట అన్నాడు... “గతంలో అందరి పూరణల క్రింద ఒక్కచోటనే సమీక్షలు చేసినప్పుడు వారి వారి సంబోధనలు అవసరం. ఎలాగూ ఇప్పుడు ఒక్కొక్కరి పూరణ క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరం’ లోనే టైపు చేస్తున్నావు కదా! ఇక సంబోధనలు ఎందుకు? ఆ ప్రత్యుత్తరం వారికి సంబంధించిందే కదా!”
  నిజమే అనిపించింది. సరే! ప్రయోగించి చూద్దాం అనుకున్నాను. మీ స్పందన ఎలా ఉంటుందో?

  రిప్లయితొలగించండి

 12. పగతో నిండినమదిలో
  రగులుచునుండును సతతము రణగొణ ధ్వనితో
  సెగలను గ్రక్కెడి పగనా
  పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.


  పొగతో కన్నులు మండగ
  సగటుగృహిణినిగనిమగడు సరసము లాడన్
  సొగసుగ సతికోపమునా
  పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పగను, కోపము ఆపగ గల్గిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి

 13. పగతో నిండినమదిలో
  రగులుచునుండును సతతము రణగొణ ధ్వనితో
  సెగలను గ్రక్కెడి పగనా
  పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.


  పొగతో కన్నులు మండగ
  సగటుగృహిణినిగనిమగడు సరసము లాడన్
  సొగసుగ సతికోపమునా
  పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 14. శ్రీరాం కవి గారి పూరణ....

  జగతిని సౌఖ్యములు గలుగు
  నగణిత సంపదలఁ గోరి యార్జించినచో
  వగచుట యేలనొ మఱి తలఁ
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుడు జగతిన్.
  (కల్గినవాఁడు = సంపన్నుఁడు)

  రిప్లయితొలగించండి
 15. పగ కాల్చును హృదయమ్మును
  తగదది జనుల కనిశమ్ము దగ నించుక శాం
  తగుణము, కోపము మదినా
  పగ, గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పగ మూడు భవములందున
   తగు భక్తి నయిదిట ముక్తిఁ దరియింతు రనన్
   పగ నెంచిరి జయవిజయలు
   పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్

   తొలగించండి
  2. చక్కని భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. భావ వృత్తము మా తమ్ముడు సోమశంకరానిది.

   తొలగించండి
 16. మిగులక, బడుగుల గతిగని
  తగు రీతిని తృణమునైన దాన మొసగుచున్
  నగుమోమును నిరతము జూ
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 17. జగమున కోపోద్రితునకు
  పగవారలు పెరుగు చుంద్రు ప్రమదము తొలుగున్
  తగు శమమున కోపము నా
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోపము నాపగ గల్గినవానిని గురించిన మీ పూరణ బాగున్నది.
   ‘ఉద్రితము/ఉద్రితుడు’ అన్న పదాలు నిఘంటు శోధనలో కనిపించలేదు.

   తొలగించండి
 18. కం**
  రగులుచు నుండెను భానుడు,
  సగమై పోయెను జలములు సమరం బాయెన్ !
  తగవుల మరచియు నిలతా,
  పగ గల్గిన వాడే సౌఖ్యవంతుడు జగతిన్ !!


  అంబటి భానుప్రకాశ్.
  గద్వాల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంబటి భానుప్రకాశ్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   అయితే ‘ఇలతా పగ..’ అర్థం కాలేదు.

   తొలగించండి
 19. పగలంత శ్రమించుచు స్థిర
  మగు తన యభిమతముగాంచి మన్నించి సదా
  మగనాలి యాగడము లో
  పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 20. తగు రీతిగ పూరణ లిడు
  యగణిత పండిత మాన్యుల యాలోచనకున్
  బ్లాగును సృజియించి జూ
  పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్


  రిప్లయితొలగించండి
 21. తగు రీతిగ పూరణ లిడు
  యగణిత పండిత మాన్యుల యాలోచనకున్
  బ్లాగును సృజియించి జూ
  పగ గల్గిన వాడె సౌఖ్య వంతుడు జగతిన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళి గారూ,
   పద్యం బాగుంది. కొన్ని లోపాలు. రెండవపాదం మూడవ గణం నలం కాని జగణం కాని ఉండాలి. మీరు భగణం వేశారు. మూడవ పాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
   తగురీతిగ పూరణ లిడు
   నగణిత పండిత వరుల సదాలోచనకున్
   బ్లాగును సృజియించియు జూ
   పగ గల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.

   తొలగించండి
 22. శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు మీ సూచనకు ధన్యగాదములు
  ఇది సవరించిన సవరించిన పద్యము
  జగమున కోపోద్రిక్తము
  పగవారల బెంచు చుండు ప్రమదము తొలుగున్
  తగు శమమున కోపము నా
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 23. సవరించినందులకు గురువుగారికి ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 24. సగమగు కాయమనెడి యెరు
  కగలిగి చిత్తము శివపదకమలములను చే
  ర్చగ భక్తి నెరపి జీవిం
  పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా ! గతంలో మీరు ఇచ్చిన సమస్యకు ఈ విధంగా పూరణ వ్రాసాను.. మీరువ్యాఖ్యానించలేదు... ప్రత్యుత్తరం తొలగించ బడిందంటోంది కంప్యూటర్. దయచేసి సవరణలేమైన ఉంటే సూచించండి. మీ అమూల్యమైన అభిప్రాయమునకు, సూచనలకు ఎదురుచూస్తున్నాను.

   తొలగించండి
  2. హనుమంతరావు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడు రోజులుగా ప్రయాణంలోఉండి వెంటనే స్పందించలేకపోయాను.మన్నించండి.

   తొలగించండి
  3. వెంటనే స్పందించిన మీ సంస్కారమునకు, మీ సహృదయతకు జోతలు. పద్య రచనలో తప్పటడుగులు వేస్తున్న నాకు మీ ఆసరా అవసరమని మిమ్ము తొందరపెట్టానేమో అన్యథా తలపవలదు.. నా పద్యం బాగుందన్నారు.. చాలా ఆనందమైంది. మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటూ....

   తొలగించండి
 25. పొగచుట్టను మానుమనుచు
  జగడము చేసెడి రమణికి జంకక నెపుడున్
  నగవుచు పుట్టింటికి పం
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్ :)

  రిప్లయితొలగించండి
 26. పొగలందున వంటింటిని
  తెగ వాగుచు ఫోనులోన తిండిని మాడ్చన్
  వగలాడిని బైటకు పం
  పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్

  రిప్లయితొలగించండి