18, ఏప్రిల్ 2016, సోమవారం

పద్యరచన - 1198

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

22 కామెంట్‌లు:


 1. చిట్టిచెల్లెలుదరినుండిబిట్టుగాను వేయుచుండెనుజడనటప్రేమతోడ అన్న,చెల్లెలబొత్తునునరయమదిని సంతసంబునుగలిగెనునెంతగానొ మార్గదర్శకములువారుమహినిగాదె!

  రిప్లయితొలగించండి
 2. చెల్లీ కదలకు మిప్పుడు
  మెల్లగ నేదువ్వి తలను మెల్పుదలిర్పన్
  మల్లెలు మాలగ గ్రుచ్చుచు
  నుల్లము రంజిల్లు నటుల నుంతును ప్రేమన్.

  రిప్లయితొలగించండి
 3. కలత లెరుగని బాల్యమే కలిమిబలిమి|
  పలుకులందున సత్యమౌ నిలువలుండు.
  స్వార్థ చింతన లేనట్టి బాల్యమన్న?
  దైవ రూపాలె| విలువైన ధర్మ పరులు.|
  2.చిన్నారి చెల్లికి చిరునవ్వు మల్లికి-పాపిడి దీసెడి ప్రాయమేన?
  సోట్టబుగ్గను నొక్కి పట్టును బిగబట్టి-బాధ్యతల్ నెరవేర్చ సాధ్యమేన?
  చిక్కులు సరిజేసి మక్కువనే జేర్చి-దువ్వెన తలదూర నవ్వదేల?
  తనవారి సౌఖ్యమే తనదని భావించి-సోదరి తలదువ్వ మోదమెల?
  అక్క ననురాగ బంధమ్ము దక్కుకొరక?
  చెల్లి సంతోష మందించ చెలిమి కొఱక?
  తల్లిదండ్రులు సమకూర్చు తత్వమేన?
  తెలుప గల్గిన చిత్రమే?విలువ లుంచు|
  3.ఏకాగ్రత పనితనమే
  సాకగ సంతోష బరచు |సాధకు లందున్
  వ్యాకుల మెరుగని బాల్యమె
  లోకములోగొప్పదగు|ప్ర లోభము లేకన్|
  4.కురులరక్ష గూర్చు కూర్పుల నేర్పు కై
  అక్కతలనుదువ్వ ?మక్కువొసగు
  సోయగంబు బెరుగు శోధన లేకనే
  బాల్యమందు మమత మూల్యమేగ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   తల దువ్వుతున్నది అక్క కాదు, అన్న అనుకుంటాను (ఏమో అబ్బాయి బట్టలు వేసుకున్న అమ్మాయి కావచ్చు... ఈ మధ్య ఆడపిల్లలకు మగదుస్తులు, మగపిల్లలకు ఆడదుస్తులు వేసి సంబరపడడం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు నేనే మా మనుమడికి ఒలసారి ఆడపిల్ల దుస్తులు వేసి చూసి ముచ్చటపడ్డాను)

   తొలగించండి
 4. తలదువ్వెద జడవేసెద
  కలవర పడబోకు చెల్లి కమ్మగ నాచే
  తులతోనన్నమ్మును ము
  ద్దలుగా తినిపింతు నీకు తల్లిని నేనై

  రిప్లయితొలగించండి
 5. పనితో యలసిన యమ్మకు
  పెను సాయమునందజేయ పెద్దవు నీవై

  చినదాని తలను దువ్వుచు
  ఘన కార్యము జేయుచున్న గడసరి వీవే

  2.
  తెంపరి తనమును వీడుచు
  చింపిరి తలదువ్వు చున్నచిన్నారీ! భా
  వింపకు భారమనుచును త
  లంపక బాధ్యతలనేతలన్ దాల్చుమికన్

  3.
  ఎంతటి యద్భుత చిత్ర
  మ్మెంతటి యానందమిదియె యేవిధి తెలుపన్
  చింతలనెరుగని బాల్యపు
  సొంతమెగదవింతచేష్ట చోద్యంబగునే.

  4.
  చిలిపి తనముదండిగ యున్న చిన్నదొకతె
  మురిసె తానెంతొ యాటలో ముదము తోడ
  తలకు నూనెను పట్టించి తాను దువ్వె
  చూచినంత మదినదియె చూరగొనియె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యాలు చక్కగా ఉండి ఆనందింపజేశాయి. అభినందనలు.
   ‘పనితో నలసిన...’ అనండి.

   తొలగించండి
 6. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,  చిబుకము జేత వట్టుకొని , చెల్లెలి పై యనురాగ దీపికల్

  ప్రబలగ , కేశవీధి పడు వైఖరి > క ౦ కు తి క న్
  జరి౦ప జే

  సి , బిగుతు గా నమర్చి జడ , జెక్కిలి
  ముద్దిడుచున్ , " పదమ్మ. " య౦

  చు బడికి బ౦పె నాహ ! తన సోదరు
  డె౦తటి గొప్ప వా డొకో

  ( చిబుకము = గడ్డము ; కేశ వీధి = పాపట ;
  కేశవీధిపడువైఖరి = పాపట పడు నట్లు ;
  క౦కుతిక = దువ్వెన ; క౦కుతికన్ జరి౦ప జేసి =
  దువ్వెన నాడి౦చి ; )

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘జోకొట్టుచును నిన్ను, నాన్ననైనను నేనె, చక్కగా నీవేళ, కదలకుండ నున్న, పప్పు నన్నము దిని, వేళకు బొమ్ము’ అనండి.

   తొలగించండి
 8. పొరపాటున డిలీట్ చేశాను.అందుకే మళ్ళీ పోస్ట్ చేశాను మరోపద్యం కలిపి
  1.చిక్కు దీసి నీకు చక్కగ జడవేతు
  అమ్మ వచ్చు దాక నన్ని నేనె
  జోలపాట పాడి జోకొట్టుచూనిన్ను
  కంటి రెప్ప వోలె కాతునమ్మ

  2.అమ్మనైన నీకు నాన్ననైనానేనె
  మంచిగజడవేసి మల్లె లుంచి
  మురిసి పోదునమ్మ ముద్దుల నాపాప
  చిట్టి తల్లివిగద చెల్లి రావె.

  3.జడలు వేతునమ్మ చక్కగా యీవేళ
  కదలకుండ యున్న కుదురు బాగ
  పప్పు యన్నము దిని బడికివేళకు వెళ్ళు
  మంచి చదువు చదివి మన్ననందు.

  4.ఉల్లము రంజిల్లగ నే
  మెల్లగ దువ్వెద కదలకు మిప్పుడ నీవున్
  చల్లని గుడ్డలొ నుంచిన
  మల్లెలను తురిమి ముదమును మదిలో గాంతున్

  రిప్లయితొలగించండి
 9. చిన్నారి చెల్లి జడనుం
  గన్నార్పక నేర్పుమీర కమనీయముగన్
  విన్నాణి యన్న వేయన్
  మిన్నంటిన వారి ప్రేమ మెప్పై యొప్పున్

  రిప్లయితొలగించండి

 10. గోల చేయ బోకు చెల్లి కూటికొరకు నమ్మయున్
  కాలు బయట పెట్ట లేని కాకరేగుచుండినన్
  జోలె పట్టి వీధి వీధి చుట్టిరాగ బోయెనే
  లాల పోసి తలను దువ్వి లాలనమ్ము జేసెదన్!
  జాలి జూపు వారు లేని జన్మకెంత కష్టమో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జాలి చూపు వారు లేని జన్మ కెంత కష్టమో.... మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. ముద్దులొలికెడు చెల్లికి ముదముతోడ
  చేయుచుండె సింగారము చిట్టితండ్రి
  చెల్లి బాధ్యత కొంత తా స్వీకరించి
  అమ్మకిచ్చెను విశ్రాంతి ఇమ్ముగాను

  రిప్లయితొలగించండి