21, ఏప్రిల్ 2016, గురువారం

పద్యరచన - 1201

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. మేనక పలికెను మునిగని
  కానుక ప్రేమకు మనకిది కాదనకు సుమీ
  కానలకు బోయి తపమున
  మానిని నేబ్రమ్మ ఋషిగ మనవలె నంటిన్

  రిప్లయితొలగించండి
 2. ఆనాటి నుండియె నబలల్
  మేనకఁ బోలెడు విధమ్ము మేదినియందు
  న్నానక కాదన పురుషుల్
  దీనమ్ముగ సంతతి విడి తిరుగుట నిజమా?


  రిప్లయితొలగించండి

 3. మేనకవిశ్వామిత్రుల
  కూనయెయాపాపమరినికూర్మినిబుట్టె
  న్గానీయిరువురువారలు మౌనముగానుండిరచటమోదములేమిన్

  రిప్లయితొలగించండి
 4. అరిషడ్వర్గంబులనిల
  బరిమార్చగ లేకపోతి భ్రష్టుడనైతిన్
  పరితాపమె మిగిలె నాకు
  హరిహరి ! కామంబు నన్ను నంధుని జేసెన్ .

  రిప్లయితొలగించండి
 5. వనితా జన సంస్పర్శము
  ఘనముని వరజప వినాశ కర మలివేణీ
  తనరార ననంగ శరా
  శని ఘాతము వివ్హలమతిఁ జరియించితినే

  రిప్లయితొలగించండి
 6. .జ్ఞానముగల్గు మౌనికి నిజాయితి లోపమ?మేనకేలనో
  దీన శరణ్యయై దిగులు దెల్పకనుండుట?”పుత్ర మోహమున్
  గానని విశ్వ-మిత్రునకు కానుక పుత్రుని నివ్వ జూపగా”?
  పూనిన కోర్కె కున్ దగిలి పొమ్మను టన్నది మౌని ధర్మమా?

  రిప్లయితొలగించండి
 7. 1.తపము చేయగోరె ధరలోన యానాడు
  గాదిసుతుడు తాను కాదలంచి
  బ్రహ్మ ఋషియు,వజ్రి మేనక యను
  దేవకాంత నంపె దీక్ష చెరుప.

  2.అతివ యాటఁగాంచి యానంద మందుచు
  ఇహము పరము మరచి యింతితోడ
  సలిపె ఋషియు తాను సల్లాపములనెన్నొ
  దేవకార్యమనుచు తపన దీర్చె.

  3.కాలచక్రము తిరుగ కాంత గర్భము దాల్చి
  జన్మ నొసగి తాను జనని యయ్యె
  అంబరమ్మునంటు సంబరాన మేనక
  పలికె నిటుల తాను పరవశాన.

  4.అనురాగ ఫలమిదిగనుము
  మునివర్యా యనుచు వేడె మురిపెము తోడన్
  మునికి మనము చెదరి విడిచి
  చనియెన్ వనమందు సుతను చానలనిర్వురన్.

  5కణ్వుడనెడు మునియుకాంతారమందున
  కాంచి ప్రేమ తోడ పెంచ సాగె
  పెరిగి బాలయు పెండ్లాడి రాజును
  భరతు డనెడి సుతుని బడసె.

  6.ఆడ దాని నిలను నమ్మను చేయుచు
  విడిచి చనుట యొక్క వేడుకాయె
  సర్వ మెరిగి నట్టి స్వాములే యటుచేయ
  దీను రాండ్ర కెవరు దిక్కు చెపుమా.

  రిప్లయితొలగించండి
 8. 1.
  బ్రహ్మర్షిపైన నలిగియె
  బ్రహ్మర్షిగ వెలగ నెంచి రాజ్యము వదిలెన్
  బ్రహ్మజ్ఞానము కొరకై
  బ్రహ్మాండమ్మైన దీక్ష రాజర్షిగొనెన్

  2.
  కౌశికునితపమ్ము గాంచిన యింద్రుడ
  ప్సరస బంపె తపము భంగ పరచ
  మేనక యిల జేరె మౌనిని వంచింప
  ఫలిత మొందె నింద్ర పన్నుగడయె

  3.
  పాలమీగడందు పసుపు గల్పినరీతి
  కాంచనంబు జిలుగు కాంతులీను
  కుసుమ కోమలంబు కోమలి సోయగ
  మ్మనసునేమొ దోచి మరులు గొలుప

  4.
  సుదతియె నడయాడునపుడు
  కదలాడె నితంబులు కడు కమనీయముగన్
  మదగజములజత కేళీ
  మధుర విలాసముల దృశ్య మధురిమ గాంచెన్

  5.
  మందారమొప్పు బుగ్గలు
  మందరపర్వతద్వయంబు మానిని బిగువుల్
  చందురుని వంటి వదనము
  చందన సౌరభ మొలికెడు చక్కని లలనన్

  6.
  మేనక యందము గాంచిన
  మౌనియె తానిలిపె సఖిని మానరమందున్
  మానిని నామమె జపమై
  తానికీ దాసుండగుచును తరుణిని పొందెన్

  7.
  ప్రేమ లోన పడియె నా మహాత్ముండంత
  కలికి విడిచి క్షణము నిలువ లేక
  మదన తాపి యైన మౌనియే నామెతో
  పలుకు చుండె నిట్లు పరవశమున

  8.
  నీవు లేని నాడు నేనన్న వాడను
  పుడమి లోన యుండ బోడు సత్య
  మలరె నాదు జన్మ యంకితమే నీకు
  నన్ను జేర ధాత నిన్ను నిచ్చె

  9.
  మనసులు కలిసెను మరియును
  తనువులు కలిసిన ఫలితము తనయయె బుట్టెన్
  కనులు తెరచిరప్పుడు యా
  వనమున శిశువు ను వదలిరి వనితయు మునియున్

  రిప్లయితొలగించండి
 9. కలిమి,కలికి విలువకాదన రెవ్వరు
  మనిషి యైన,మౌని,మందు డైన
  అవసరాలు దీర ?వివరణ దెలుపరు
  లొకనీతి యెంత లోపమాయె|
  3.ఇదియొక నాటకంబనుచు మేనక నెంచక?ప్రేమపేరుతో
  బదులుగ బిడ్డ నెత్తుకొని బాధ్యత లేకను వచ్చిచేరగా?
  మదియను మందిరాన మహిమాన్విత సార విహీనమాయెగా|
  కదలుము రాకుదగ్గరకు కాల్చకుమో పతి నేను గాదనెన్ {హాస్యనాటక సన్నివేశము}

  రిప్లయితొలగించండి
 10. మునివర! మనసుతను గొనుమ
  యని మేనక జూపగానె హతవిధి! యనుచున్
  వనితకు నే దాసుడనయి
  ఘన తపమును వదలితినని గాధిజు డడలెన్!!!

  రిప్లయితొలగించండి
 11. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  తపమున్ జేసెడు నన్ను తాకితివి | క౦దర్పాస్త్ర
  ఘాతాన. నీ

  వు పడ౦ద్రోసితి | " నేడు కొనుమీ భ్రూణమ్ము
  నీ పుత్రి " న౦

  చపరాధమ్ము విధి౦ప నె౦చితివి | పొమ్మా
  మేనకా ! సర్వ బ౦

  ధ పరిత్యాగికి యోగి కేటి కిక , స౦తానమ్ము |
  పోషి౦చు మా


  క౦దర్పాస్త్రఘాతాన = మన్మదాస్త్రఘాతముచేత

  భ్రూణము = శిశువు . అపరాధమ్మువిధి౦చు =
  శక్ష విధి౦చు .

  రిప్లయితొలగించండి
 12. గాధి పట్టి మేనకల సంగమము భరత
  జాతి కాద్యుని మాతకు జన్మనిచ్చె
  గాక! కామ వాంఛ విడిచి, కనులు తెరచి
  మనుడు, శిశువు ననాధగ మార్చబోకు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్న సవరణతో :
   గాధి పట్టి మేనకల సంగమము భరత
   జాతి కాద్యుని మాతకు జన్మనిచ్చె
   గాక! కామ వాంఛ విడిచి, కనులు తెరచి
   మనుడు, శిశువు ననాధగ మార్చకెపుడు!

   తొలగించండి
  2. చిన్న సవరణతో :
   గాధి పట్టి మేనకల సంగమము భరత
   జాతి కాద్యుని మాతకు జన్మనిచ్చె
   గాక! కామ వాంఛ విడిచి, కనులు తెరచి
   మనుడు, శిశువు ననాధగ మార్చకెపుడు!

   తొలగించండి
 13. మేనకనుగాంచి కౌశ కు మేనుచెదర
  సంగమించెనాయింతితో సంతసముగ
  కలిగె చక్కనికూతురా కాంతకపుడు
  మాలినీ నది యిసుకలో బాలికనిడి
  బాధ్యత ల వీడి యటనుండి వారువెడల
  పక్షిజాతులా బిడ్డకు రక్ష నిచ్చె
  బిడ్డ యే శకుంతల పేర వినుతికెక్కె
  కణ్వ ముని పెంచె బాలికన్ కరము తృప్తి

  రిప్లయితొలగించండి
 14. సరసన్ జేరిన మేనకాప్సరను విశ్వామిత్ర రాజర్షి తా
  మరుకేళిన్ దనియించి పుత్రి బడయన్ మార్మోమిడెన్ చేకొనన్
  స్థిరమౌ సంయతి జేయ బాలికను పోషించన్ భరమ్మంచు,సృ
  త్వరియున్ బిడ్డను వీడిపోయె`దివి కణ్వర్షిప్రపోషించగన్

  రిప్లయితొలగించండి
 15. బుట్టను వేయుచు నన్నున్
  పుట్టించితి వీవు నీదు పుత్రిని ప్రీతిన్
  ముట్టను నేనింక సఖిని
  పుట్టకొ పక్షికొ వదలుము పోనీ నన్నున్!

  రిప్లయితొలగించండి