20, ఏప్రిల్ 2016, బుధవారం

పద్యరచన - 1200

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

 1. కొంచెము త్రాగిన నిట్టుల
  మంచముపై బైకులుంచి మత్తుగ క్రిందన్
  మంచియు చెడుదెలియక తా
  మించుక జ్ఞానమ్ములేక నిటుబండెదరా ?

  రిప్లయితొలగించండి
 2. నాగరికత యనుచు నవయువకులు నేడు
  మత్తులోన బడుచు మంచి చెడుల
  జాడ మరచిపోయి చైతన్య రహితులై
  అస్తవ్యస్తముగనె నటమటింత్రు.

  బయటనుండునట్టి బండ్లులోపలనుండె
  మనుజులుండు నట్టి మంచ మెక్కె
  మంచ మెక్కునట్టి మనుజులు నేలపై
  మత్తులొనపడుచునొత్తిగిలిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘అస్తవ్యస్త’ మన్నపుడు ‘స్త’ గురువై గణదోషం. ‘...యటునిటులై వార లలమటింత్రు’ అందామా?

   తొలగించండి
 3. బయట నుండు బండ్లు ప్రక్క మీదను బెట్టి
  నిదుర బోవు చుండె నేల మీద
  చిత్తుగాను ద్రాగి మత్తులో మునుగంగ
  చేయిజారిపోవు జీవితాలు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘నిదురబోవుచుండ్రి’ అనండి.

   తొలగించండి
 4. వీరి కన్న మనము వింతైన రీతిగా
  పట్టు పరుపు మీద వరలినాము.
  ఎవరి యదృష్టమేరీతి నెఱుగ గలము
  నేల పరుపాయె వీరికి కాల మహిమ

  రిప్లయితొలగించండి
 5. అవసరమైన వారికి అథోగతి. అనవసరమైన వారికి అందలం. అని నిర్జీవ పదార్థాలైన బండ్లు హేళనగా అనుకుంటున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి భావంతో పద్యం చెప్పినా మొదటి రెండు పాదాలు ఆటవెలది, తరువాతి రెండు పాదాలు తేటగీతి అయ్యాయి. మూడవపాదంలో గణదోషం.
   తే.గీ.
   వీరికన్న మనము గన వింతరీతి
   పట్టుపరుపుల మీదను వరలినాము
   ఎవ్వరి యదృష్ట మేరీతి....
   లేదా..
   ఆ.వె.
   ... ఎవరి భాగ్య మెట్టి దెఱుగ మన తరమె
   నేలయె పరుపాయె కాలమహిమ.

   తొలగించండి

 6. చిత్రమయ్యదిచూడగజిత్రమాయె బైకురెంటినిపరుపుపైబదిలపరచి వారునిద్రించెనేలపైవాహయేమి
  పిచ్చివారలవోలెనుబేల!చూడు

  రిప్లయితొలగించండి
 7. నిద్రా దేవీ కృత చిర
  భద్రాశ్రిత సన్నిధాన పరమాసక్తున్
  క్షుద్రోపాసను ఘన ని
  త్యోద్రేకాత్మునిఁ దరింప నుర్వి నలవియే

  రిప్లయితొలగించండి
 8. 1.
  అతితెలివో మరి? వెర్రో?
  గతితప్పిన మతులనిచట కనుగొన వచ్చున్
  శృతిమించిన యను రాగమ
  ది త్యాగగుణమనగ రాదు తెలియగ రాదే

  2.
  మనసు లేని దైన మాన్యుల సేవించు
  యంత్రమైననేమి యధిక మదియు
  ఇంధనమును ద్రావి ఇలనంత తిరుగుచున్
  ప్రభువుసేవ జేయు బంధువదియె

  3.
  వేలువోసి కొన్న విలువైన వాహనమ్
  పరుగు లెత్తి యలసి పడక నెక్కె
  వెర్రి తలకు నెక్క పిచ్చిచేష్టలతోడ
  అనవసరపు ప్రేమ లవధి దాటె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పద్యాలు బాగున్నవి.
   మొదటి పద్యంలో ప్రాస తప్పింది. ‘రాగము| శ్రుతి తప్పిన జీవితముల చోద్యము గాదే’ అందామా?
   మూడవపద్యంలో వాహనమ్ అని హలంతంగా ప్రయోగించారు. ‘విలువైన యా బండి’ అనండి.

   తొలగించండి
 9. కలయందున్నవె వాహనాల్ గనగ?లోకాలన్నిగాలించియున్
  అలుపున్ బొందగ మంచమున్ పరుపు పై నాక్షేప మే మెంచకే
  నిలుపన్ జేయుచు| మిత్రు లిద్దరును సాన్నిద్యాన నిద్రించగా?
  చెలువం బందున చేరు భామలగ విచ్చేయంగ?సంతోషమే| {కలలోని సన్నివేశము}

  రిప్లయితొలగించండి
 10. చిత్తు గాను మందు కొట్టి చిందు లాడు చుండగన్
  చిత్త మంత మత్తు లోన చేరి పోవ నంతటన్
  హత్తు కుండె నేల మీద హాయి మీర వారలే
  ఎత్తి పెట్టె మంచ మందు నింధ నాల వాహనాల్

  రిప్లయితొలగించండి
 11. తలను వంచెను మనిషి యంత్రాల ముందు
  వేగమున కంటె ప్రాణాల విలువ తగ్గె
  దేశ ప్రగతికి నడిచెడు తెరువు మరచి
  నిదుర మత్తున పడియుండె నేటి యువత

  సన్నగిల్లెను యువశక్తి సాహసమ్ము
  వక్ర మార్గాల వ్యసనాలు విక్రమించ
  అణిగె ప్రాణాలు, నింధన మనుదినమ్ము
  హెచ్చ వేగము, వాడుక రెచ్చి పోయి

  రిప్లయితొలగించండి

 12. కాలమహిమ నిపుడు గాంచుడు కనులార
  తప్పతాగినట్టి తరుణు లెల్ల
  బొంత పైన నిద్ర పోవుచు నున్నారు
  మనుజు లెక్కు నవియు మంచ మెక్కె.

  రిప్లయితొలగించండి
 13. "అటునిటులైవారు నటమటింత్రు"
  ఇంతకు మునుపు (2)వపద్యంలో అన్నా గణదోషమే ఔతుందేమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
   ‘అటునిటులయి’ అని టైపు చేయబోయి ‘అటునిటులై’ అన్నాను. మన్నించండి.

   తొలగించండి
 14. వీరి కన్న మనము వింతైన రీతిగా
  పట్టు పరుపు మీద వరలినాము.
  కట్టుబాటు దప్పి కల్లును సేవించి.
  వీరు నేల బడిరి భీరులగుచు.
  ,,,,,,
  పొరబాటును గమనించి,సవరించి పంపుతున్నాను.

  రిప్లయితొలగించండి
 15. వీరి కన్న మనము వింతైన రీతిగా
  పట్టు పరుపు మీద వరలినాము.
  కట్టుబాటు దప్పి కల్లును సేవించి.
  వీరు నేల బడిరి భీరులగుచు.
  ,,,,,,
  పొరబాటును గమనించి,సవరించి పంపుతున్నాను.

  రిప్లయితొలగించండి
 16. ఫోము బెడ్డు పైన పోవుటెటుల నిద్ర
  నెండ కాలమందు నేసి లేక!
  గరుకు నేల పైన గురక దీయుదమంచు
  బండ్లు పైకి జేర్చ దిండ్లు దిగెను!

  రిప్లయితొలగించండి

 17. కాలమహిమ నిపుడు గాంచుడు కనులార
  తప్పతాగినట్టి తరుణు లెల్ల
  బొంత పైన నిద్ర పోవుచు నున్నారు
  మనుజు లెక్కు నవియు మంచ మెక్కె.

  రిప్లయితొలగించండి
 18. దోచుకున్నట్టి బండ్లను దాచుకొనగ
  చోటుదొరకని దొంగలు గూటిలోన
  మంచములపైన చక్కగా నంచితాము
  నిదురబోయిరి రాతిరి నిబ్బరముగ

  రిప్లయితొలగించండి
 19. మత్తు మహిమ

  మద్య పానమ్ము చేసిన మంద మతులు

  మంచి చెడ్డలు తెలియని పసుల వోలె

  అమ్మ నాలిగా,నాలిని యమ్మగాను

  దలచి యక్రుత్య మొనరింత్రు ధరణి పైన.

  విద్వాన్, డాక్టర్, మూలె రామమునిరేడ్డి, ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549

  రిప్లయితొలగించండి
 20. మత్తు మహిమ

  మద్య పానమ్ము చేసిన మంద మతులు

  మంచి చెడ్డలు తెలియని పసుల వోలె

  అమ్మ నాలిగా,నాలిని యమ్మగాను

  దలచి యక్రుత్య మొనరింత్రు ధరణి పైన.

  విద్వాన్, డాక్టర్, మూలె రామమునిరేడ్డి, ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549

  రిప్లయితొలగించండి
 21. దండమయా! దండమ్ములు!
  పిండమ్ములు మావి రెండు ప్రీతిని మీరన్
  మెండుగ మోసిన నలసట
  నిండుగ తీర్చుచు పరుపున నిదురించండీ!

  రిప్లయితొలగించండి