21, ఏప్రిల్ 2016, గురువారం

సమస్య - 2010 (త్రాగినవాని జీవితము...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
త్రాగినవాని జీవితము ధన్యతరమ్ము ధరాతలమ్మునన్.

పద్యరచన - 1201

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

20, ఏప్రిల్ 2016, బుధవారం

ఖండ కావ్యము – 5 (జన్మ రాహిత్యము)

జన్మ రాహిత్యము
రచన : పోచిరాజు సుబ్బారావు

పూర్వజన్మమందు పూర్ణము కానట్టి
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభవించవలెను నాజన్మ మిలలోన
జీవులెల్ల విధిగ జేయు నిదియ.

పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించుచుండును జేతనముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్యమున కది సత్పథ మగు.

గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు పనులు.

పాప ఫలితము గష్టాలు వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములఁ బొందఁజేయు
పాపముల జోలి  కేగక బ్రదుకునంత

కాల ముపకృతి జేయంగ  వలయు సుమ్ము.

సమస్య - 2009 (వ్యర్థ మొనరింపఁ దగును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

పద్యరచన - 1200

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

19, ఏప్రిల్ 2016, మంగళవారం

ఖండకావ్యము – 4 (క్షీరసాగరమధనం)

క్షీరసాగరమధనము
రచన : శైలజ


మంధరగిరి కవ్వముగను
బంధముగా నాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగ హరి కమఠమై
సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్!!!

పొందుగ సురలును దనుజులు
నందముగా కడలి చిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటను బట్టె మృత్యుంజయుడే!!!

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవరను గనగ జయజయ మనుచున్!!!

హరిహరులను గొలిచి జనులు
మరలన్ మధనమ్ము జేయ మంధరగిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్!!!

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్!!!

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుహంతకునున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్!!!

సమస్య - 2008 (చేపలు గాకులకు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
చేపలు గాకులకు బుద్ధి చెప్పఁగఁ దరమా.

పద్యరచన - 1199

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

18, ఏప్రిల్ 2016, సోమవారం

సమస్య - 2007 (పగ గల్గినవాఁడె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
పగ గల్గినవాఁడె సౌఖ్యవంతుఁడు జగతిన్.

పద్యరచన - 1198

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.