31, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3325 (పతి సంపర్కము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"
(లేదా...)
"పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై"

30, మార్చి 2020, సోమవారం

సమస్య - 3324 (మదిరాపాన విశేష...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"
(లేదా...)
"మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"
(మొన్న మాచర్లలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

29, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3323 (పండు మంచిది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పండు మంచిది తినఁ బనికిరాదు"
(లేదా...)
"పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్"

28, మార్చి 2020, శనివారం

శార్వరి ఉగాది పద్య సంకలనము

        నిన్న ప్రకటించిన ఉగాది పద్య సంకలనం అందరికీ ఆనందాన్ని కలిగించింది. సామూహిక భాగస్వామ్యంతో పుస్తకంగా ముద్రించాలని అందరి కోరిక. ఈ కరోనా వ్యగ్రత తొలగిన తర్వాత అలాగే చేద్దాం. ఇప్పుడు తొందర లేదు.
        అయితే ఇప్పటి పి.డి.యఫ్.లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. కొందరు పంపిన ఉగాది పద్యాలు నా అజాగ్రత్త వల్ల తప్పిపోయాయి. మరికొందరు "అయ్యో... మాకు తెలియదండీ. ఇప్పుడు పంపించమంటారా?" అని అడిగారు.
        ఎలాగూ పొరపాట్లు సరిచేసి శుద్ధప్రతిని సిద్ధం చేయబోతున్నాను కనుక తప్పిపోయిన కవిమిత్రులు తమ ఉగాది పద్యాలను పంపించ వలసిందిగా కోరుతున్నాను.
        మీ పద్యాలను shankarkandi@gmail.com అన్న చిరునామాకు మెయిల్ చేయండి. లేదా నా వాట్సప్ నెం. 7569822984 కు పంపించండి.

సమస్య - 3322 (నవ వాసంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవ్య వత్సరమిదె కరోనా యనంగ"
(లేదా...)
"నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

27, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3321 (కుసుమపత్రంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"
(లేదా...)
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

26, మార్చి 2020, గురువారం

సమస్య - 3320 (బారె శరణమయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బారె శరణమయ్యెఁ బండితులకు"
(లేదా...)
"బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్"

25, మార్చి 2020, బుధవారం

ఉగాది కవి సమ్మేలనం

శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలతో...
ఉగాది కవి సమ్మేళనం
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని
మీరు వ్రాసిన ఖండికలను కాని, పద్యాలను కాని
ఇక్కడ ప్రకటించ వలసిందిగా
కవిమిత్రులకు ఆహ్వానం!

సమస్య - 3319 (సకల జనాళి భీతిలఁగ...)

కవిమిత్రులారా,
ఉగాది శుభాకాంక్షలు 2020 కోసం చిత్ర ఫలితం

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"
(లేదా...)
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ"

24, మార్చి 2020, మంగళవారం