మెండుగ పోషకమ్ములను మిక్కిలి శక్తినొసంగు నెప్పుడున్ పండది మంచిదైనఁ; దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్ పండనిదైనఁ కుళ్ళినను వద్దది దానిని పారవేయు మా దండుగమారి పండు వలదందురుగా మన పెద్దలెప్పుడున్
చుండము తోడు చేర సఖి స్తోత్రము మంత్రము చెప్పి స్వాములై పండితులంచు చేరువయి పైటల మాటును చూరగాంచి నీ గండల పైన నమ్మకపు కాండము పైన సవారి! మాలినీ పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
సందర్భము: రామ చంద్రుని దైవంగా భావించే వాడు.. సరసను జేరిన గౌరికి బాలాయోధ్యారణ్యాది కాండములతో గూడిన రామాయణాన్ని ప్రవచించేవాడు.. మన్మథుని జయించిన వాడు ఐన పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతి పండు ఎంత మంచిదైనా తినడానికి మాత్రం పాత్రం కాదు గదా! కాండములు = బాలాయోధ్యారణ్యాది కాండములు ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విభూతి పండు*
దండి మగండు రాఘవుని దైవముగా భజియించువాడు, తా నండను జేరు గౌరికి స మంచిత రీతిని రామ సత్కథా కాండములన్ వచించు జిత కంతునకున్ బ్రియమౌ విభూతిదౌ పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 29.03.20 -----------------------------------------------------------
సందర్భము: కౌసల్యాపి హరేః పూజాం కురుతే రామ కారణాత్ 78 హోమంచ కారయామాస బ్రాహ్మణేభ్యో దదౌ ధనమ్ ధ్యాయతే విష్ణుమేకాగ్ర మనసా మౌన మాస్థితా 79 (అధ్యాత్మ రామాయణం అయో.కాం.3 స) అప్పుడు కౌసల్య (విశాల సామ్రాజ్య భారం నెత్తి కెత్తుకొని) రాజు కాబోతున్న కుమారునికి దేవతలు సహకరించా లని శుభం కలుగా లని ఎంతో సంబరంతో సంకల్పించి (అంతఃపురంలో) హోమం చేయించి బ్రాహ్మణులకు సంతోషంతో ఘనంగా దక్షిణ లిచ్చి, మౌనంగా ఏకాగ్ర చిత్తంతో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ వుండింది. కైక వరాలు కోరిన తర్వాత రాముడు వనగమనానికి సన్నద్ధుడై తల్లికి చెప్పడానికి ఆమె మందిరానికి వెళ్ళినప్పటి దృశ్య మిది. అక్కడ పూజలో నిమగ్నమై యున్నది కౌసల్య ఉపవాస నిష్ఠతో మౌనంతో.. ఎంతో సేపు నిరీక్షించి తల్లితో ఒక చిన్న పండైనా తిను మన్నాడు రాముడు. తింటే పూజకు పనికిరా దన్నది కౌసల్య. అప్పటికే కైక వరాలు కోరిందని, రాముడు వన గమనానికి కృత నిశ్చయు డైనా డని, అవతార ప్రధాన కార్యక్రమం అజేయంగా కొనసాగబోతున్న దని ఆ వెఱ్ఱి బాగుల తల్లికి తెలియదు పాపం. రాముడు అతని తల్లి చేసిన సంభాషణం కేవలం మాటల్లోనైతే ఇలా.. "నీవు విన వదేమి?" "నిష్ఠతోడ విష్ణు పూజ నుంటి" "విను మమ్మ! ఈ చిన్నిపండు మంచిది." "తినఁ బనికిరాదు." రాముడు వివరించి చెప్పినాడు. ఐనా ఆమెకు తెలిసిం దొక్కటే! కథ అడ్డం తిరిగిందనీ.. విధి వక్రించిం దనీ.. పరిస్థితి చేయిదాటిపోయిం దనీ.. అంతే! ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*పిచ్చి తల్లి*
రాఘవుండు, జనని.. రమ్య భాషణ మిదే!
"నీవు విన వ దేమి?" "నిష్ఠతోడ
విష్ణు పూజ నుంటి" "విను మమ్మ! ఈ చిన్ని
పండు మంచిది." "తినఁ బనికిరాదు."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 29.03.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
పండుగ పూట మెండుగను బంధులు కూడగ, బ్రహ్మాణోత్తముల్
దండిగ మంత్రముల్ నుడివి తంత్రము జేసెడి ముందు పీటపై
కొండొక రీతి కూర్చొనుచు కొద్దిగ మోమున పూయు బూదిదౌ
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
మీ భావనా బలానికి జోహారు
తొలగించండి🙏
తొలగించండి
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పండుగలందు పాడెడిది, ప్రక్కను కూర్చొని దుర్గపూజలో
దండిగ మాటలాడెడిది, తన్నగ వైరుల దండమెత్తుచున్
చండిని బోలు దీది, కడు చక్కగ నుండెడి వంగభూమినిన్
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్ 😊
తొలగించండివిభూతి పండు పొడుపు కథ...
వంగ పండు పొడుచు గధి...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండినా పూరణ ప్రయత్నం 🙏
రిప్లయితొలగించండి*ఆ వె*
తినగ నేను నిపుడు తీరదు కోరిక
తీపి వలదు యనుచు తిట్టి పోసె
షుగరు వచ్చి పడగ సూది పొడిచె గద
*"పండు మంచిది తినఁ బనికిరాదు"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తినగ నిపుడు నేను...వల దటంచు" అనండి.
తనువు బాగు కొఱకు తినగనొక్క యరటి
రిప్లయితొలగించండిపండు మంచిది, తినఁ బనికిరాద
ది మధుమేహ రోగ దేహుల కెంతమా
త్రమును! నోటఁ బెట్ట రాదు సుమ్ము!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమెండుగ పోషకమ్ములను మిక్కిలి శక్తినొసంగు నెప్పుడున్
రిప్లయితొలగించండిపండది మంచిదైనఁ; దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
పండనిదైనఁ కుళ్ళినను వద్దది దానిని పారవేయు మా
దండుగమారి పండు వలదందురుగా మన పెద్దలెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేడిపండు జూడ మేలిమైయుండును
రిప్లయితొలగించండిపొట్టవిచ్చిచూడ పురుగులుండు
కడుపు లోన కాలుగాక! కాదు
పండు మంచిది! తినఁ బనికిరాదు!
తొలగించండిమీరూ ఓ పావు మాత్రమే పద్దెం రాసేసారా హతోస్మి :)
మేడిపండు మంచిదే.. పొట్టవిప్పి పురుగులను ఊది తినేవాళ్ళం చిన్నపుడు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. 'కాలుగాక మిక్కిలి! కాదు..." అనండి.
యాకలి అని వ్రాసాను కాని మిస్ అయింది.
తొలగించండిఒడలు గట్టిపడును, ఓటమిఁ సహియింప
రిప్లయితొలగించండినిబ్బరమ్ము వచ్చు, నేర్పు వచ్చు
నాట లందు నరయ నాటలోన యరటి
పండు మంచిది, తినఁ బనికిరాదు౹౹
'ఆటలో అరటిపండు' అన్న జాతీయాన్ని ప్రయోగిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండిపండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
రిప్లయితొలగించండిపండుట కోసమై సహజ పద్ధతి నాదరణమ్ము సేయకన్
చండ రసాయనమ్ములను సత్వర పక్వము చెందు రీతిగన్
మెండుగ వాడఁ బండినవి మేలొనరింపవు స్వాస్థ్యమందగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చేయక' అన్నది కళ. ద్రుతాంతం కదు. "...సేయకే" అనండి.
ఔను గమనించలేదు. ధన్యవాదములు.
తొలగించండిదేహమునకు పీచు దినుసు నీయ నరటి
రిప్లయితొలగించండిపండు మంచిది ; తినఁ బనికిరాదు
జలుబు బారి పడిన జనులకెన్నటికిని
గుణము నెంచి పండ్లగుడుచ నగును
(దారిన పోయే దానయ్యను తన దొండపందిరి క్రిందకు
తొలగించండిరమ్మనమని పిలుస్తున్న రామయ్య )
ఎండను బోవుచున్న పథి
కేశ్వర !రావయ !కూరుచుండుమీ
నిండుగ నేత్రపర్వముగ
నింపులు నింపెడి దొండపందిరిన్ ;
కొండొక తిండియాశ మరి
కోయకు మెర్రనివాని వింతగా ;
పండది మంచిదైన దిన
పాత్రము గాని దెరుంగు మెప్పుడున్ .
(పథికేశ్వరుడు-మంచిబాటసారి ;నేత్రపర్వము-కన్నులపండుగ )
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పండ్ల గుడువనగును" అనండి.
*******
జంధ్యాల వారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండిమేడిపండు చూడ మేలిమి గానుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పైన చూడ బాగు బాగనిపించెడు
పండు మంచిది, తినఁ బనికిరాదు!
జిలేబి
ఓ పావు మాత్రమే నాది :)
తొలగించండిమేడిపండు చూడ మేలిమి గానుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
ఆవురావుమనుచు ఆబగ తినకురా
పండు మంచిది, తినఁ బనికిరాదు!
నాదినూ పావే....
మీ యిద్దరి పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమేడిపండు గురించి పైన వ్యాఖ్యానించాను.
రిప్లయితొలగించండిచుండము తోడు చేర సఖి స్తోత్రము మంత్రము చెప్పి స్వాములై
పండితులంచు చేరువయి పైటల మాటును చూరగాంచి నీ
గండల పైన నమ్మకపు కాండము పైన సవారి! మాలినీ
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదండిగ నుండుఁ గాని వివిధమ్ముల పండ్లు ఫలాపణమ్ములన్
రిప్లయితొలగించండికొండొకపండు లోన క్రిమి గుంభితరీతుల దూరు, నెంచి చూ
డండటు విశ్వసించఁ దగు నట్టి ఫలమ్మె బలమ్మునిచ్చు, నా
పండది మంచిదైనఁ దిన పాత్రము,... గాని దెఱుంగు మెప్పుడున్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినిండినదీ కరోన ధరణీస్థలి! భీతి వహించి యింటనే
యుండుమ! బైటకేల చనుదోయి? ప్రమాదము! గంజి త్రాగి యేన్
పండుము! వీథిలో దొరుకు వస్తువు నేడు విసమ్ము! నమ్మురా!
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!!
(ఎప్పుడున్... అనుక్షణము)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రబోధాత్మకమై ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండి'చనుదోయి' అంటే అపార్థానికి అవకాశం ఉంది. అక్కడ "చనుటోయి" అంటే బాగుంటుందని నా సూచన.
"చనెదోయి... అని ఉండాలి.. టైపాటండీ🙏ధన్యవాదములండీ"
తొలగించండిశంకరాభరణం ...29/03/2020
రిప్లయితొలగించండిఆదివారం
సమస్య
**** ***
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్!
నా పూరణ
**** **** **
మెండుగ పోషకమ్ములను మేదినిఁ నిచ్చునుఁ బండ్లు ;కానియున్
కొండల వోలె ఆశగల కుంఠుడు సత్వర లాభమెంచుచున్
దండి రసాయనమ్ములనుఁ దాఁ నుపయోగముఁ జేసె...చూడగన్ఁ
బండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఋజువు చేసె నీ కరోన నిజము లెన్నొ
రిప్లయితొలగించండిఅఖిల జనుల నిలిపె నైక్యముగను
కాని ప్రాణహాని కర్కశమ్మేకద
పండు మంచిది తిన పనికిరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిండుగ నంబరంబునను నిత్యము దూర్పున స్వప్రకాశమై
రిప్లయితొలగించండిమెండుగ వెల్గులీనుచును మేదిని జీకటి దొల్గజేయయుచున్
పండిన దొండపండురుచి ప్రాణులనెల్లను మేలుకొల్పెడిన్
పండది మంచిదైన దినపాత్రము గానిదెరుంగు మెప్పుడున్
సూర్యఫలం... బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములాచార్యా!మీ సమస్య చూసేసరికి యెదురుగా ఉదయిస్తున్న యెర్రని సూర్యబింబము కనబడింది!
తొలగించండిపరిష్కారము తోచినది!
పండది రంగులేకయును పండగు సాజపు చర్యతోయనన్,
రిప్లయితొలగించండిపండది పాత్రమౌ ను మరి పండది రోగికి మేలుసేయగన్,
పండగు రంగురంగులుగ పాడురసాయన చర్యతోయనన్
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండు చోట్ల "చర్యతో ననన్" అనండి.
పండది రంగులేకయును పండగు సాజపు చర్యతోననన్,
తొలగించండిపండది పాత్రమౌ ను మరి పండది రోగికి మేలుసేయగన్,
పండగు రంగురంగులుగ పాడురసాయన చర్యతోననన్
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
దూరదేశమేగి దుష్టకరొన బారిఁ
రిప్లయితొలగించండిబడకయె వెనుదిరిగి వచ్చినాడు
ధీరుడైన వాని దిష్టితీసిన నిమ్మ
"పండు మంచిది తినఁ బనికిరాదు"
దుష్టకరొన - వైరియే కదా మనకు
😎
తొలగించండిదిష్టి తీసిన నిమ్మ పండు కాల్చినారా లేక రోడ్డు మీద పడేసారా లేదంటే అందులోనించి వేరేవారికి ట్రాన్స్ఫరావిరై పోవు :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని
దెఱుంగు మెప్పుడున్
సందర్భము: రామ చంద్రుని దైవంగా భావించే వాడు.. సరసను జేరిన గౌరికి బాలాయోధ్యారణ్యాది కాండములతో గూడిన రామాయణాన్ని ప్రవచించేవాడు.. మన్మథుని జయించిన వాడు ఐన పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతి పండు ఎంత మంచిదైనా తినడానికి మాత్రం పాత్రం కాదు గదా!
కాండములు = బాలాయోధ్యారణ్యాది
కాండములు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విభూతి పండు*
దండి మగండు రాఘవుని
దైవముగా భజియించువాడు, తా
నండను జేరు గౌరికి స
మంచిత రీతిని రామ సత్కథా
కాండములన్ వచించు జిత
కంతునకున్ బ్రియమౌ విభూతిదౌ
పండది మంచిదైనఁ దిన
పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
29.03.20
-----------------------------------------------------------
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినమోనమః!
తొలగించండిచిలక ఎంగి లైన చెట్టు న జాంపండు
రిప్లయితొలగించండిచేరి తినగ వచ్చు చిన్న నాడు
గబ్బిలంబు గొరక కడపట మిగిలిన
పండు మంచిది తినఁ బనికిరాదు"
కొరుప్రోలు రాధకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జాంపండు' అన్నది వ్యావహారికం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి["శ్రీరాముని భార్యయైన సీతనుఁ జెఱపట్టి తెచ్చి, భార్యగాఁ గొనఁ బూనుట, వంశనాశనమునకే" నని తన భర్త రావణునకు మండోదరి నచ్చఁజెప్పుచున్న సందర్భము]
"దండిగఁ దెచ్చినట్టిదగు తామరకంటియ సీత, రామునిం
బెండిలి యాడి నట్టి పరు ప్రేయసి! సాధ్వియ! నాథ! యామెనున్
బం డని మెక్కఁ గోరి, చెఱపట్టియు, భార్యగ నొందఁ, గీ డిడున్!
బం డది మంచిదైనఁ, దిన పాత్రము గాని! దెఱుంగు మెప్పుడున్!!"
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిమెండుగ మెచ్చితింద్రుగద మేదిని యందున మానవాళియే
రిప్లయితొలగించండిదండిగఁ గాయు వెట్టను సుధారస తుల్యమె యైననేమి వె
జ్జుండది మూత్రరోగి యెగ జోపుటె మేలని చెప్పెనిట్లుగా
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపండ్లను దయ తోడ ప్రకృతిచ్చె వరమనన్ | స్వాస్థ్యతనిడు, తనువు శక్తి గొనగ |
రిప్లయితొలగించండిషుగరు రోగి తినగ సుస్తిజేయు విషమై
"పండు మంచిది తినఁ బనికిరాదు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ప్రకృతి యిచ్చె వరము" అనండి.
బడిలో చేర్చిన పండుతో వాని తల్లి:
రిప్లయితొలగించండిచూచి,తిరిగి నంత జోరున నమలేవు
పండు! మంచిది తినఁ బనికిరాదు!
పెన్ను మన్ను నింక పేప రైననుగాని
ముట్టబోకు నోట ముప్పు వచ్చు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిమెండగు తీర్థయాత్ర గయ, మెచ్చగ పాత్రత భక్తులెల్లరున్
పిండము పూర్వదేవతల బెట్టిన మీదట విష్ణు సాక్షిగన్
దండము లొగ్గి పండు నొకదానిని వీడగ మోక్ష ప్రాప్తికిన్
పండది మంచిదైన దిన పాత్రము గాని దెరుంగు మెప్పుడున్
పూర్వదేవతలు: పితృదేవతలు
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచాల బాగున్నదండీ,అభినందనలు!
తొలగించండిధన్యవాదాలు గురువు గారు
తొలగించండిసీతాదేవి గారికి నమస్సులు
తొలగించండిఅన్ని రోగ ములకు న వసర మని యండ్రు
రిప్లయితొలగించండిపండు మంచిది తి న : బనికి రాదు
కుళ్ళి పోయి నట్టి కూర గాయలు వండ
చెత్త బుట్ట లోన జేర్చ వలయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎఱ్ఱ రంగుకలుగుజెర్రిజాతిదియైన
రిప్లయితొలగించండిపండుమంచిదితిన,బనికిరాదు
నెలుక కొఱుకు పండు నేరికైనదినగ
విషముజేరుకతనవిడువవలయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(మా వృద్ధాశ్రమంలో ఎలుకలు కొరికిన కూరగాయలనే వండి పెడుతున్నారు. హతోఽస్మి!)
వారిని యీపద్యం చదువమనండి
తొలగించండిమెండుగనాకరోననికమేదినినంతటవ్యాప్తిజెందుటన్
రిప్లయితొలగించండిబండదిమంచిదైనదినపాత్రముగానిదెఱుంగుమెప్పుడున్
బండునుగూడజేరునటభవ్యులుసెప్పిరియాలకించుడీ
మొండిగవాదులాడినబోదురుకాలునిజెంతకేసుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదోర పండ పండ్లు తుష్టిగ భుజియించు
రిప్లయితొలగించండిపండ కున్న నుండు పండు వఱకు
శారికా విహంగ కీర కలుషితమ్ము
పండు మంచిది తినఁ బనికిరాదు
దండిగ నారగించు ఫల దండము లింపుగ దేహ వృద్ధికై
దండము లయ్య విప్రకుల ధర్మము భూసుర వర్య! తామ్ర చూ
డాండము శాక భోజనుల మయ్య నిషిద్ధము వీడు మౌర రాం
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
[రాంపండు +అది = రాంపం డది]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిరుజలు తొలగచేసి రుచులను హెచ్చించు
రిప్లయితొలగించండి*పండు మంచిది, తిన బనికి రాదు *
మామిడి ఫలమదియు మధుమేహ రోగుల
కవని యందటండ్రు నరయుడయ్య.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅన్నికూరలందునవసరమీపండు
రిప్లయితొలగించండిపులుసులందునిదియెబొలుపుమీరు
యిన్నిగుణములున్ననేమిఫలముచింత
పండు మంచిది తినఁ బనికిరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపండుపండుయనుచు పదిసార్లుపిలవంగ
పరుగుపెట్టివచ్చె పసిడిపాప
మామ్మ ముద్దులాడి కమ్మగాపలికేను
పండు మంచిది తినఁ బనికిరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పండు పండటంచు" అనండి.
పండుగ దినమంచు వడిగ నంగడి కేగి
రిప్లయితొలగించండిపండు జూడ మెరుగు పసిమి రంగు
పండు కోసి జూడ పక్వమ్ము గాదయో
పండు మంచిది తినఁ బనికిరాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిరాజ ఫలము నేది? రసరాజ మామిడి
పండు మంచిది తిన, పనికి రాదు
తీపి వ్యాధి ప్రజకు తీరని దుఃఖంబు
నిచ్చు ,చేదు రుచి నియమ మగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెద్దలందరికీ నమస్సులు🙏🏼🌷శుభోదయం!
రిప్లయితొలగించండిమొదటిసారిగా ఇక్కడ నా పూరణ ప్రయత్నం 🙏🏼
******
పక్వ మైనరీతి పలువిధమ్ము జ్ఞాన
ప్రభలు గల్గియున్న పరమగురుని
పరవశించి గొలువ భక్తి తోడుగ, తల
పండు మంచిది దిన పనికి రాదు
అరుణ నారదభట్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "పలువిధమ్ముల జ్ఞాన" అనండి.
ప్రక్క యింటి దొడ్డి బండినదా పండు!
రిప్లయితొలగించండి*పండు మంచిది! తినఁ బనికిరాదు*
సంగ్రహించి తెచ్చి చాటుగా నింటికి!
పగులు నీదు బుఱ్ఱ వాడు సూడ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపంచరత్నo వెంకట నారాయణ రావు గారి పూరణ....
రిప్లయితొలగించండిరాజ ఫలము నేది? రసరాజ మామిడి
పండు మంచిది తిన,పనికి రాదు
తీపి వ్యాధి ప్రజకు తీరని దుఃఖoబు
నిచ్చు, చేదు రుచి నియమ మగును.
గండరగండడా వినుము కాదు సుమా తిన చైన వారిలా
రిప్లయితొలగించండివండుక కుక్కనక్కలను పాముల నెల్కల గబ్బిలాల నీ
కండల పెంపుకోస మని గట్టి ప్రమాదమె యొంట రోగముల్
పం డది మంచిదైనఁ దిన పాత్రముగాని దెఱుంగు మెప్పుడున్.
గండరగండడా వినుము కాదు సుమా తిన చైన వారిలా
తొలగించండివండుక కుక్కనక్కలను పాముల నెల్కల గబ్బిలాల నీ
కండల పెంపుకోస మని గట్టి ప్రమాదమె మేన
రోగము
ల్పం డది మంచిదైనఁ దిన పాత్రముగాని దెఱుంగు మెప్పుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
తొలగించండిఅండగ నమ్మ అంజనియె యాకొన బెట్ట ఫలంబు లెన్నియో
నిండదె మారుతీ! కడుపు, నింగిని యెర్రని సూర్యబింబమున్
దండుకొనంగ బోయెదవు తన్మయ మందుచు నీదు దృష్టిలో
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
ఆటవెలది
రిప్లయితొలగించండిఅంతటి హరి నేడు హస్తముఁ జాచిన
దానమీయ ఫలము దారుణమ్ము!
అసుర వైరిఁ దెలిసి యందుకొనన్ బోవు
పండు మంచిది తినఁ బనికిరాదు!!
కండ గలట్టి చంద్రముఖి కప్పురగంది విరాళి పెంచుచున్
రిప్లయితొలగించండిరండని పిల్చుచుండె సమరమ్మునుచేయ శశాంకు వెన్నెలన్
గండరగండడౌ భటుడు కావాలి కాయుచు నుండ నిత్యమున్
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్
పండుముదుసలికిది పనికిరానిదనెను
రిప్లయితొలగించండిమామిడివ్వ?బేది మరలవచ్చు
తెలియజేయవైద్య విలువను గుర్తించి
పండుమంచిదితిన బనికిరాదు!
ఆ.వె//
రిప్లయితొలగించండిప్రాభవమ్మగు భువి పల్నాటిసీమలో
పండినట్టి పండు పండుమిరప !
పరిగడుపున దినిన బాగుసేయుమిరప
పండు మంచిది తినఁ బనికిరాదు !!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"పండు మంచిది తినఁ బనికిరాదు"
సందర్భము:
కౌసల్యాపి హరేః పూజాం
కురుతే రామ కారణాత్ 78
హోమంచ కారయామాస
బ్రాహ్మణేభ్యో దదౌ ధనమ్
ధ్యాయతే విష్ణుమేకాగ్ర
మనసా మౌన మాస్థితా 79
(అధ్యాత్మ రామాయణం అయో.కాం.3 స)
అప్పుడు కౌసల్య (విశాల సామ్రాజ్య భారం నెత్తి కెత్తుకొని) రాజు కాబోతున్న కుమారునికి దేవతలు సహకరించా లని శుభం కలుగా లని ఎంతో సంబరంతో సంకల్పించి (అంతఃపురంలో) హోమం చేయించి బ్రాహ్మణులకు సంతోషంతో ఘనంగా దక్షిణ లిచ్చి, మౌనంగా ఏకాగ్ర చిత్తంతో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ వుండింది.
కైక వరాలు కోరిన తర్వాత రాముడు వనగమనానికి సన్నద్ధుడై తల్లికి చెప్పడానికి ఆమె మందిరానికి వెళ్ళినప్పటి దృశ్య మిది. అక్కడ పూజలో నిమగ్నమై యున్నది కౌసల్య ఉపవాస నిష్ఠతో మౌనంతో..
ఎంతో సేపు నిరీక్షించి తల్లితో ఒక చిన్న పండైనా తిను మన్నాడు రాముడు. తింటే పూజకు పనికిరా దన్నది కౌసల్య.
అప్పటికే కైక వరాలు కోరిందని, రాముడు వన గమనానికి కృత నిశ్చయు డైనా డని, అవతార ప్రధాన కార్యక్రమం అజేయంగా కొనసాగబోతున్న దని ఆ వెఱ్ఱి బాగుల తల్లికి తెలియదు పాపం.
రాముడు అతని తల్లి చేసిన సంభాషణం కేవలం మాటల్లోనైతే ఇలా..
"నీవు విన వదేమి?"
"నిష్ఠతోడ విష్ణు పూజ నుంటి"
"విను మమ్మ! ఈ చిన్నిపండు మంచిది."
"తినఁ బనికిరాదు."
రాముడు వివరించి చెప్పినాడు. ఐనా ఆమెకు తెలిసిం దొక్కటే! కథ అడ్డం తిరిగిందనీ.. విధి వక్రించిం దనీ.. పరిస్థితి చేయిదాటిపోయిం దనీ.. అంతే!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*పిచ్చి తల్లి*
రాఘవుండు, జనని.. రమ్య భాషణ మిదే!
"నీవు విన వ దేమి?" "నిష్ఠతోడ
విష్ణు పూజ నుంటి"
"విను మమ్మ! ఈ చిన్ని
పండు మంచిది." "తినఁ బనికిరాదు."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
29.03.20
-----------------------------------------------------------