30, మార్చి 2020, సోమవారం

సమస్య - 3324 (మదిరాపాన విశేష...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"
(లేదా...)
"మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"
(మొన్న మాచర్లలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

84 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  పదరా! పోదము బీరుబుడ్లు గొనుచున్ బజ్జీలు బోండాలతో...
  గదినిన్ గూడుచు బంధుమిత్రువులతో గమ్మత్తులన్ గాంచగా;
  కదనం బందున కీర్తి నొందు నగరిన్
  కైతల్ భలా క్రోలగా...
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా!

  పోదము = మదిరా మత్తుల వ్యావహారికము

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   కదనం బందున దాహమొందు తఱినిన్ గగ్గోలునున్ చేయగా
   ముదమున్ గొల్పెడి నీరమున్ కుడువగన్ పోరాడగా వెల్లువౌ
   నదులే లేకయె పోవగా నచటనున్,...నాట్యమ్మునున్ జేయుచున్
   మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా

   తొలగించు
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పోవగా' అనడం సాధువు కాదు. "నదులే లేని పరిస్థితుల్ గలుగగా..." అందామా?

   తొలగించు
 2. హృది రససుధాఝరులొలుకు
  సదమలమూర్తులు,కవిత్వసంజ్ఞానమతుల్
  విదితు లవధానకవితా
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్

  రిప్లయితొలగించు
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. ఇదియేమి చిత్రమో సఖ!
   సదనంబును చూడగ భళి సాహిత్యముప
   ట్లదిటముగ తన్మయత్వపు
   మదిరాపానరతులు గద మాచర్ల జనుల్!


   జిలేబి

   తొలగించు
 4. అందరికీ నమస్సులు 🙏
  నా పూరణ

  *కం||*

  అదిరెను భాషను జూచిన
  పదములు జెప్పగ తడబడు పరికింపగ మే
  మెదురుగ నిలబడ దెలియును
  *"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"*!

  మరో ప్రయత్నం 🌹🌹

  *కం||*

  అదిరెను తెనుగన మక్కువ
  యదిరెను కవి హృదయముగన యచ్చటి జనులా
  మదినిట తలచిన పద్యపు
  *"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"!!*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మరో పూరణ 🌹🌹🌹

   *కం||*

   అదిగో కవిసమ్మేళన
   మదిగో యవధానమిచట మాకై జనులే
   కదలక నిలబడి రెటులనె
   *"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్??"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🙏🙏

   తొలగించు
  2. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  3. ధన్యోస్మి శంకరార్యా 🙏🙏

   శతాధిక వందనములు 🙏🙏

   తొలగించు


 5. చైంచిక్ జాల్రా :)


  సదనమ్మందు ప్రకాశ మైన ముఖముల్! సాహిత్యమీమాంసకుల్
  కుదురైనట్టి వికాసవీచికలతో కూటమ్ము గా దోచెడిన్
  పదునైనట్టి కరాళికా ప్రతిమలున్! ప్రావీణ్యులై సాహితీ
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా!  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. 👌

   మీరు కూడా అవధానుల ధోరణిలో చిక్కారు

   తొలగించు

  2. అవధాని గారి పూరణ:

   హృదయాంభోజవికాసతత్వరుచితోనేపాఱుచుంబాఱకే
   యిది యద్దంచని తెల్పనేల సుకరంబౌనట్టి యేకార్యమున్
   బదిలంబున్ బొనరింతురింకనిదిగో వాసించగా సాహితీ
   మదిరాపాన విశేషమత్తులుగదా మాచర్ల వాసుల్ సదా

   తొలగించు


  3. --మీరు కూడా అవధానుల ధోరణిలో చిక్కారు :)
   అవధానంబును చేసి వేసెదమికన్ హల్వా జిలేబీయమై :)

   నెనరుల్స్

   జిలేబి

   తొలగించు
  4. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అవధానంబును జేసి మించెదవికన్ వహ్వా యనన్ విజ్ఞులే"

   తొలగించు

  5. నమో నమః అంత సీను లేదు :)

   ఏదో టైంపాసు బఠాణీలు మాత్రమే కాకుంటే అప్రస్తుతానికి పిలిచేరంటే తయార్ :)   నెనరుల్స్
   జిలేబి

   తొలగించు
 6. (తనముందే మాచర్ల నేలే మలిదేవరాజు పౌరులు గురజాలవారిని గురించి
  అవమానకరంగా మాట్లాడారని నలగామనరసింగరాజులను రెచ్చగొడుతున్ననాగమ్మ)
  మెదడుల్ కొయ్యగ మారెనా కనికర
  మ్మెట్లుండె మీ గుండెలన్ ?
  మదమెక్కన్ మరియాద వీడెదరుగా ?
  మా ముందె యిట్లందురా ?
  కదలన్నేరవ మీ పదమ్ము లికపై
  కయ్యంబు గావింపగా ?
  మదిరాపానవిశేషమత్తులు గదా !
  మాచర్లవాసుల్ సదా !


  రిప్లయితొలగించు
 7. నిన్నటి శంకరా భరణము వారి సమస్య

  పండు మంచిది తినగ పనికి రాదు

  నా పూరణము సీసములో


  హనుమంతుడు తన బాల్యములో ఆకలి వేసి ఎర్ర టి పండు అనుకొని సూర్యుని పట్ట బోయి ప్రాణములు కోల్పోయి తిరిగి బ్రదికిన తర్వాత. అంజని తన బిడ్డకు లాలించి చెప్పు సందర్భము


  కాంచితి నొక్కటి ఘనమగు నెర్రటి
  పండును నేనా నభమున ననుచు

  నింగికి నెగిరి యా నీరజ బంధువున్
  పట్ట తలచనేల ,గొట్టగ తన


  వజ్రాయుధము తోడ పాకారి, ప్రాణముల్
  పోవగ నేల,నా పూర్వ జన్మ

  పుణ్యము వలన నీవు తిరిగి బ్రతికితి
  విగద నా బాలకా, వినుము నీవు

  తినగ వచ్చు నెపుడు తీయ మామిడిని, యీ

  పండు మంచిది, తినగ పనికి రాదు

  నాకసమున నున్న నా ఫలమని బల్కె

  నంజని తన బిడ్డ హనుమ గాంచి

  రిప్లయితొలగించు
 8. కం//
  పదిలముగ దిరుగువైరుల
  గదలక బంధించిజంప కాంక్షలుదీరన్ !
  మది యుల్లాసము జెందగ
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్ !!

  రిప్లయితొలగించు


 9. మదినిండుగ నవధానపు
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్
  కుదురుగ కూర్చొని వీక్షిం
  చెదరంటావా? నడుమ కచేరి ఢమాలో?  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అంటావా' అనడం వ్యావహారికం. "వీక్షిం।చెదరందువొకో నడుమ..." అందామా?

   తొలగించు
 10. కం//
  ముదముగ శ్రామికులెల్లరు
  మదిరాపానరతులు గద, మాచర్లజనుల్ ।
  కదనము నందిష్టపడుచు
  తుదివరకును పోరుసలిపి తుళ్ళెదరింకన్ ।।

  రిప్లయితొలగించు
 11. పదరా నడు మాచర్లకు 
  అదె చూతమురా తెలుగున అభిమానమ్మున్ 
  పద సంపద,  సాహిత్యపు   
  "మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"    

  రిప్లయితొలగించు
 12. మదిలో భక్తిని నింపెడి
  చెదరని కేశవుని గుడిని చెన్నుగ నిలపన్
  వదరుట తగదు మహాత్మా
  మదిరా పానరతులుగద మాచర్ల జనుల్.

  రిప్లయితొలగించు
 13. కదనపు విక్రమ సింహులు
  బెదరని హృదయాలు గలుగు పేరిమి యోధుల్
  కుదురుగ వీర రసంబ ను
  మదిరా పాన రతులు గద మాచ ర్ల జను ల్

  రిప్లయితొలగించు
 14. సుదతీహింసకు కారకుల్ ఖలులు, ధీశూన్యుల్, మహన్మూర్ఖులున్
  మదిరాపాన విశేష మత్తులు గదా, మాచర్ల వాసుల్ సదా
  మది నన్నాతుల పట్ల సాధుహృదులై మాన్యత్వముం గూర్చుచున్
  ముదముం గాంతురు సాంప్రదాయయుతులై మోక్షార్థులై విజ్ఞులై.

  రిప్లయితొలగించు
 15. అదిగోహైహవ రాజగోపురము,నందా చెన్నకేశుండు నా
  నదికిన్ వడ్డున పూజలన్ గొనుచు నానాదీవెనల్నివ్వగా
  ముదితల్ బాలురు పెద్దలున్ గలిసి సమ్మోహంబునన్భక్తియన్
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నది తీరమ్మున్న... దీవెనల్ బంపగా..." అనండి.

   తొలగించు
 16. కందం
  మది తేలఁ బరవశమ్మున
  పద మాధుర్యమ్ములొలుకు పటిమనొసంగన్
  వదలరు! కవిత్వమనెడున్
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
   కందం
   మది తేలఁ బరవశమ్మున
   పద మాధుర్యమ్ములొలుకు పటిమనొసంగన్
   వదలరు! కవిత్వమను స
   న్మదిరాపానరతులు గద మాచర్ల జనుల్!

   తొలగించు
 17. మత్తేభవిక్రీడితము
  పదముల్ దిక్కని వర్ణమాతృకను సంప్రాప్తింపఁగా వేడగన్
  పదమాధుర్య మనుగ్రహించ మది వైవశ్యమ్మునన్ దేలఁగన్
  వదలన్ జాలక నిత్యకృత్యమనగన్ భక్తిన్ గవిత్వంపు స
  న్మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా!

  రిప్లయితొలగించు
 18. మిత్రులందఱకు నమస్సులు!

  సదనంబందునఁ గావ్యశాస్త్రఫణితుల్ సంస్తుత్యమౌరీతి వా
  రిదె చర్చింతురు! కావ్యపాఠములపై హేతూక్త వాదమ్ముచే
  సదసద్భేదవివాదదూరమతముల్ సంధింత్రు! సత్కావ్యకృ

  న్మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా!

  రిప్లయితొలగించు
 19. మృదు మధురపు మాటలతో
  సదమల మతులై చరించు సజ్జనులును కో
  విదులు సతము సాహిత్యపు
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్

  రిప్లయితొలగించు
 20. కదనంబొక్కటె మమ్ముఁ దల్చునపుడున్ కారాదు గుర్తింపు, కో
  విదులన్ గన్నది పుణ్యభూమి యిదియే, విద్వత్తు చూపించిరే
  సదమున్ భారతి నిండినట్లు కవులే సంతోషమున్ సాహితీ
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా౹౹

  రిప్లయితొలగించు
 21. పెద్దలకి నమస్సులు.

  కం :
  మదిలో భావా మృతముల్
  హృదయంబందున ప్రమోదహేరాళంబుల్
  వదనంబందున తేనెల
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్


  కస్తూరి శివశంకర్

  రిప్లయితొలగించు
 22. ఇదియేమి చిత్రమో మరి
  "మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"
  కదియించిరిటుల నెవ్వరు ?
  యిది పలనాడును గురించి యెరుగని వాడే !

  రిప్లయితొలగించు
 23. మైలవరపు వారి పూరణ

  చదువుల్పెక్కులు నేర్చినట్టి ఘనులౌ జ్ఞానప్రపూర్ణుల్., జ్వల..
  త్కదనక్షోణివిజృంభమాణమతిదుర్గామూర్తులౌ నారులున్!
  మదిలో భక్తిని చెన్నకేశవుని సంభావించి తచ్చింతనా
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు

  2. మరో పూరణ 🙏

   సదయన్ కేశవభక్తివాగమృతమున్ సాహిత్యపీయూషమున్
   పదిలంబౌ గతి త్రాగి మత్తుగొనినన్ వైరిన్ గనన్ క్రుద్ధులై
   కదనంబున్ బొనరించువారు! కరుణన్ కక్షన్ గొనున్ వారి నె........
   మ్మదిరా! పానవిశేషమత్తులు కదా! మాచర్ల వాసుల్ సదా !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 24. అదిగదిగోజూడుమరమ!
  మదిరాపానరతులుగదమాచర్లజనుల్
  మదిరపుసాలలెయచ్చట
  పదిగజములకొక్కటగుచుబారులుదీరెన్

  రిప్లయితొలగించు
 25. మదిలో కల్మషముండబోదచట సామాన్యుండె మాన్యుండుగా
  చదువుల్ వాసిగ నేర్చినట్టి విబుధుల్ సంస్కారమే మూల సం
  పదయై వెల్గెడి సద్గుణాంబుధులటన్ వైమాలమై సాహితీ
  మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా

  రిప్లయితొలగించు
 26. మ:

  పదరా చూతము నేటికిన్ తగుదు నబ్బాయంచు దా నుండునా ?
  బదలా యింపున రూపు రేఖ లిట సంభాలించెనా మార్పులన్ ?
  కదరా నిట్లన పేరుకే, కనగ నేకాడన్ వికాసమ్మెగా !
  మదిరా పాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు


 27. కదనము నందున శూరులు
  మదిలో రాగము చిలికెడు మాయని మమతల్
  సదమల సుందర కవితా
  మదిరా పానరతులు గద మాచర్ల జనుల్.

  రిప్లయితొలగించు
 28. మదగర్వోద్ధతులైన రాక్షసులె కామాంధుల్ గనన్ వారలే
  మదిరాపాన విశేష మత్తులు గదా; మాచర్ల వాసుల్ సదా
  మదిలో నమ్ముచు చెన్నకేశవుని నామంబున్ పవిత్రమ్ముగా
  మదిరా పాన విముక్తులై మనుచు సన్మార్గమ్మునొందన్ దగున్

  రిప్లయితొలగించు
 29. సదమల చిత్తులు సున్నిత
  హృదయులు సన్నుత చరితులు నెల్ల రహో సం
  విద గాన సుధా పాన
  మ్మది రా పానరతులు గద మాచర్ల జనుల్


  చదువుల్ నేరని మూఢచిత్త నరు లజ్ఞానాంధ సంతప్తు లా
  హ! దివం బెల్ల జరా రుజా మరణ దాహక్లేశ సంఘాతముల్
  మది భావించుచు దీని తేనియ వడిం బాపంగఁ బాత్రంబు నా
  మదిరాపాన విశేష మత్తులు గదా మా చర్ల వాసుల్ సదా

  [చఱుల = చర్ల; చఱి = కొండ చఱియ]

  రిప్లయితొలగించు
 30. "మదిరాపానవిశేషమత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"
  యిదియా! నీవను మాట సత్కవివరా! యిట్లేల భావింతువో?
  యదె పల్నాడు, విరించిబాలశశినాగాంబాదియోధాగ్రులన్
  కదనోత్సాహపరాక్రమాన్వితమహోగ్రావేశులం గాంచవో!

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించు
 31. ఇదిగోనెట్లుగ జెప్పగల్గితివియోలేమా!కలంగంటివే?
  మదిరాపానవిశేషమత్తులుగదామాచర్లవాసుల్సదా
  యిదమిత్ధంబుగనొక్కిచెప్పగనునీవేమీసదాచారివా
  మదిరంబెవ్వడుద్రాగునోనతడుదుర్మార్గుండునైనొప్పుగా

  రిప్లయితొలగించు
 32. నా పూరణ ఈ క్రింది విధంగా గలదు.
  చదివిన చదువుల్ రసజ్ఞ
  తదెచ్చి యదనిండ మెత్తదనమున్ పరచేన్
  మదినిండ కళా సాహితి
  మదిరా నుపాతరతుల్ మాచర్ల వాసుల్.

  రిప్లయితొలగించు
 33. హృదయ మనురాగ పూర్ణము
  సదమల మతితో సతమ్ము సాగు బుధవరుల్
  అదనున కవితామృత మను
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్

  రిప్లయితొలగించు
 34. సదమలచరితమువారిది
  ముదమారగకవితలల్లిమోదముగూర్చన్
  మదినెంతురునవకవితా
  మదిరాపానరతులు గద మాచర్ల జనుల్

  రిప్లయితొలగించు
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  మదిరా పాన రతులు గద మాచర్ల జనుల్


  సందర్భము:
  "మాచర్ల చెన్నుని మన్నన వడసి..." అన్న ద్విపద పాదం ప్రసిద్ధం. చెన్న కేశవ స్వామి.. ప్రసిద్ధి మాచర్లలో.. అక్కడి వారి కా స్వామియే కులదైవం..
  మొదటి పద్యంలో.. ఏ కొందరో.. అనడం వల్ల తక్కిన వారంతా రాముని చెన్నకేశవుని ధ్యానిస్తారు..నామస్మరణ చేస్తారు.. అని..
  రెండవ పద్యంలో కొందరు.. అనడంవల్ల అందరూ కాదని, తక్కిన వాళ్ళంతా దైవ స్మరణ చేసే వాళ్ళే అని... చాలామంది చెన్నకేశవ స్మరణ సుధనో..రామ స్మరణ సుధనో నెమ్మదిని మరిమరీ ఆనందంగా నింపుకుంటూ వుంటారు. కొందరు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోక మదిరా పా నాసక్తు లౌతున్నారు.
  మొత్తంమీద దైవానికి దూరమైన వారే మదిరా పానానికి మరిగినా రని, దైవ స్మరణ చేసే వారంతా మదిరకు దూరమైనా రని
  అంతరార్థం. ఒక్క ఒరలో రెండు కత్తు లిముడవు కదా!
  మాధవుడా!.. మదిరనా!.. తేల్చుకో వలసి వుంది మానవుడు ఎదిగే క్రమంలో.. అంటే తమోగుణంనుంచి సత్వగుణంలోకి అన్నమాట!
  "తమసోమా జ్యోతిర్గమయ.." అంటే ఇదే!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *మదిరనా.. మాధవుడా..*

  ముదమున శ్రీ రాముని రూ
  పెదలో ధ్యానింపరు.. మరి యే కొందరొ "భా
  గ్యద! చెన్నకేశవ!" యనరు..
  మదిరా పాన రతులు గద మాచర్ల జనుల్!1

  ఎదఁ జెన్న కేశవునొ నె
  మ్మది రాముని స్మరణ సుధనొ
  మరి మరియున్ స
  మ్ముదమున నింపరు.. కొందరు
  మదిరా పాన రతులు గద మాచర్ల జనుల్!2

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  30.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు


 36. నహుషుడి భార్య ప్రియంవద ఎవరి కుమార్తె ? అన్న ప్తశ్న వచ్చె తెలిసిన చెప్పగలరు.  జిలేబి

  రిప్లయితొలగించు
 37. మదిలో కృష్ణుని పాదపద్మ యుగమున్ మన్నించుచున్ గొల్చుచున్
  ముదమున్ బొందుచు శాంతిబెంచుచు లసన్మోక్షార్థులై దీవ్యసం
  పద శ్రీభాగతామృతంబు గొనుచున్ వైకుంఠులీలా కళా
  మదిరా పాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా !

  రిప్లయితొలగించు