ఎక్కడ ప్రాశ్నికుల్ గనగనెక్కడ యీ యవధాని., చూచువా... రెక్కడనో! సభాపతియునెక్కడొ! వింతగ దోచుచుండెడిన్! ప్రక్కన తోడు లేరెవరు! భారతి మాత్రము నాకు తోడుగా నిక్కడ యుండె! భక్తి ఘటియించెదనెల్లరకున్ నమస్కృతుల్!!
నిషిద్ధాక్షరి....
శ్రీ చింతా రామకృష్ణారావు గారు. హైదరాబాద్ 1)అంశం.. 🙏🏻 జ్ఞానానందము గొల్పు శార్వరనుచున్ జ్ఞానీ! వచించుండయా.
సందర్భము: రామ రాజ్యంలో పన్నులు బాగా తగ్గి పోవడంతో.. "ఇది కరోన (కర..ఊన.. పన్నులు తగ్గిన..) రాజ్యము.." అన్నా డొక (సంస్కృత) సుకవి. అది విన్న ఒక యోగి వెంటనే "అది (కరోన) కలియుగంలో ఒక భయంకర రోగం. కాబట్టి అలా అనకు." అన్నాడు. (రాముని రాజ్యంలో ప్రజలెప్పుడూ అంత భయానికి గురి కాలేదు. అని అతని భావం.) అత డింకా ఇలా అన్నాడు. "నవ్య వత్సరం ఇదే! జనులంతా కరోనా.. కరోనా.. అంటూ వుండగా వస్తుంది." (అంతే గాని కొత్త వత్సరం పేరు కరోనా అని కాదు.) కవి కంటే యోగి ఇంకా పైమెట్టు వాడు. కవి భావంమీద ఆధారపడుతాడు. యోగి భావాతీత మైన దానిపై ఆధార పడుతాడు. కవి శబ్దంమీద ఆధార పడుతాడు. యోగి నిశ్శబ్దం (మౌనం) మీద ఆధార పడుతాడు. కవి అర్థాని కనుగుణంగా శబ్దాన్ని నడిపిస్తాడు. యోగి నోటినుంచి వెలువడుతున్న మాట వెంబడే అర్థం పరుగెత్తుకొని వచ్చి అనుసరిస్తుంది. వాచ మర్థోనుధావతి.. అన్నా రందుకే!.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*కరోన*
"ఇది కరోన రాజ్య" మ్మనియె నొక సుకవి..
పన్ను లవి రామ రాజ్యానఁ బడమి..యోగి
"యది కలిన్ ఘోర రోగ..మ ట్లనకు" మనియె..
"నవ్య వత్సర మిదె కరోనా యనంగ"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 28.03.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
కవులున్ పండితు లెల్లరున్ కరములన్ గర్వమ్ము మోదమ్ముతో
పవలున్ రేయిని శానిటైజరులతో ప్రక్షాళనన్ జేయుచున్
సవరింపంగను నాసికాల పయినన్ జంబమ్ములౌ మాస్కులన్
నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ
మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
చవిలేనట్టివి కంపెనీలు సెలవుల్ సంప్రీతినిన్ దెల్పగా
పవలున్ రేయిని వాసమందు నెలమిన్ వర్ధిల్ల బోవంగ హా!
జవరాలే కడు దూరముండమనగా సాంగత్యమున్ వీడెడిన్
నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ
'సోషల్ డిస్టెన్స్!'
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
🙏
తొలగించండిగృహిణి కోర్కె ను దీర్చక గేహ మందె
రిప్లయితొలగించండితమకు నిర్బంధ మై యుండ తలచ వచ్చె
నవ్య వత్సర మిదె కరోనా యనంగ
శార్వరి కి బదులు గ బిల్చె నుర్వి యంత
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశార్వరీ నామ మాయెను చక్కబెట్టు
నవ్య వత్సరమిదె! కరోనా యనంగ
రాదె తల్లి! "కొరోనా"యె వ్రాయ వలెను
నేటి పాఠమ్ము లాయెను నిదుర పొమ్మ!
శుభోదయం
వాట్సాపావధానపు విశేషములేమిటి తెలుపగలరు.
జిలేబి
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ:
ప్రార్థన..
శ్రీ గణపతి! నీవే గతి!
బాగుగ నవధానమిచట పండింపంగా!
హే గిరిరాడ్దౌహిత్రా!
వేగమె దయజూపవయ్య విఘ్నాపహరా !!
గురుతరవిద్యలనేర్పిన
గురువరులకు వందనములు గురుతరభక్తిన్!
స్మరియించెద మీ పదముల!
నిరతము దీవింపుడయ్య నేర్పుగ నన్నున్.!!
విలసితశంకరాభరణవేదిక పద్యములల్లగల్గు వా...
రలకు వధానులౌ కవివరాళికి , నెందరికో మహాముదం...
బిల సమకూర్చుచున్నది! యనేకుల దేశవిదేశవాసులన్
గలిపెడి దివ్యవారధి! జగమ్మున శారదకున్ నివాసమౌ !!
ఎక్కడ ప్రాశ్నికుల్ గనగనెక్కడ యీ యవధాని., చూచువా...
రెక్కడనో! సభాపతియునెక్కడొ! వింతగ దోచుచుండెడిన్!
ప్రక్కన తోడు లేరెవరు! భారతి మాత్రము నాకు తోడుగా
నిక్కడ యుండె! భక్తి ఘటియించెదనెల్లరకున్ నమస్కృతుల్!!
నిషిద్ధాక్షరి....
శ్రీ చింతా రామకృష్ణారావు గారు. హైదరాబాద్
1)అంశం.. 🙏🏻
జ్ఞానానందము గొల్పు శార్వరనుచున్ జ్ఞానీ! వచించుండయా.
శ్రీ ధీనిమ్మా మాలో...
కాధింజంపంగ దయ మహాభారంబున్!
శోధింప మందు., శార్వరి!
బోధించుము జ్ఞానదీప్తి మ్రొక్కెద నీకున్.!!
2) సమస్య..
శ్రీ వజ్జల రంగాచార్యులు వరంగల్
స్తంభాగ్రమ్మున నిల్చి నిక్కెదవు గ్రద్దా! పెద్దవైనావటే.!!
దంభమ్మా కురువంశవర్ధన మదౌధ్ధత్యంబ గర్వంబ., సం...
రంభంబౌగతి తూలనాడ గురులన్ రౌద్రమ్ముగా పాడియే?
అంభోజాసనవంశజాతులనునన్యాయమ్ముగా బల్కెదో!
స్తంభాగ్రమ్మున నిల్చి నిక్కెదవు గ్రద్దా! పెద్దవైనావటే.!!
3) దత్తపది.. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్
తాపము.... కోపము... పాపము... శాపము
ఉత్పలమాలలో.. వికారి చేసిన గాయమును మాన్పుమని శార్వరిని కోరుతూ..
తాపము కల్గజేసితివి దారుణమౌగతి నీకు న్యాయమా
కోపము మానుమా సదయ కూరిమి జూడుమ ఆర్తి బాపుమా!
పాపముగా దలంపుమ! ప్రపంచపు భీతిని పారద్రోలుమా!
శాపములేల! మాకిక ప్రశాంతతనిమ్ము వికారి! మా నుతుల్!!
4) న్యస్తాక్షరి..
మధురకవి శ్రీ గుండు మధుసూదన్ గారు.. వరంగల్
ఉత్పలమాలలో..
1పాదం...1శ్రీ....
2లో....6శా
3లో...14ర్వ
4లో... 20రీ..
కరోనా తుదముట్టింపప్రార్థన..
శ్రీకరమై శుభాస్పదవిశేషసమన్వితమై మనోజ్ఞమై
ప్రాకటమైనశాంతమును భద్రముగా నెలకొల్పి నేలపై!
మాకిట క్షేమమిచ్చుచు ప్రమాదము సర్వము ద్రోసివేయగా
నీకు నమస్కృతుల్ గొనవె! నీతిని నిల్పుచు బ్రోవు శార్వరీ!!
5)వర్ణన...శ్రీ విరించి గారు హైదరాబాద్
జనతాకర్ఫ్యూ... శార్దూలవృత్తములో
క్రౌర్యంబైన కరోన జంప జనతాకర్ఫ్యూను పాటించుడీ
ధైర్యంబొప్పననన్ ప్రధాని బిలువన్ తద్వాక్యసంబద్ధ గాం...
భీర్యంబంది జనాళినిల్చిరి గదా! విశ్వమ్ము సర్వమ్ము మా...
స్థైర్యంబుంగని విస్తుపోవ నదిగాదా! ఐకమత్యంబనన్.!!
6)ఆశువు.. శ్రీమతి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు..
ఆశువుకు ప్రశ్న - 1
అన్నీ ఆరోగ్యసూత్రాలనే పాటించే మనదేశం పాశ్చాత్య విషసంస్కృతినుండి బయట పడిందా
వాని పాటింపనందుకీవ్యథ జనించె
మన నమస్కృతి నేనాడొ మరచినాము!
బోడి చేతుల చేతుల పూసుకొనక
భారతీయత నిల్పుడీ భద్రముగను!!
ప్రశ్న - 2
పిల్లల అభిప్రాయాలను పెద్దలు అంగీకరించాలా
పిల్లలను గని ప్రేమతో పెంచిపెంచి
వారి తప్పుల సరిదిద్ది ధీరతనిడి
మంచి పౌరుల జేయుచో మాటలేల
వినగ వలయును దోసమ్ము గనగలేము!!
రిప్లయితొలగించండిఆకాశవాణికి పంపినది
If you can't go outside go inside !
అవకాశమ్మిది దేశముల్ జనులు సాహాయ్యమ్మునే నొందగా
తవరాజమ్మగు ధ్యానమార్గమున సంస్థానమ్ములో శుభ్రమై
న వతండమ్ముల రీతి స్వస్థతకు ప్రాణాపానులన్కొల్వగా
నవ వాసంత శుభాగమంబిది కరోనా నామ నూత్నాబ్దమౌ!
వతండ- వనతి ఏకచరో భవతి ఒంటరిగా
ప్రాణాపానులు - అశ్వినీకుమారులు
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవనిన్ నేడు సమస్తదిక్కుల గనన్ హర్షంబులం గూల్చి దా
రిప్లయితొలగించండినవభావంబున మానవాళిగతుల న్దర్జించుచున్ ద్రుంచె తా
మెవరైనన్ గృహసీమదాటనివిధం బెంచంగ నన్పించు నీ
నవవాసంత శుభాగమం బిదె కరోనానామ నూత్నాబ్దమౌ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి(కవిహృదయాలు "కరోనా" అంటే "చేయండి"అని ప్రజలతో అంటున్నవి.అదే నవవసంతనామమయింది)
రిప్లయితొలగించండిబవరంబిప్పుడు సాగుచుండెను గదా
భల్లూకరోగంబుకున్
నవజీవంబుల నందజేసెడి మహా
నారాయణాఖ్యాళికిన్;
కవిగుండెల్ వచియించుచుండె తమదౌ
కారుణ్యభావంబుతో
నవవాసంతశుభాగమంబిదె; "కరో
నా" నామనూత్నాబ్దమౌ.
(బవరంబు -యుద్ధము;కరోనా -చేయండి)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'రోగంబునకున్' అనడం సాధువు కదా? (ప్రౌఢవ్యాకర్త సూత్రాన్ని పట్టించుకోవద్దు).
నవలావణ్యము లోకమంతటను సంధానించు సంరంభమున్
రిప్లయితొలగించండిశ్రవణీయమ్ముగఁ గోకిలల్ తెలుప నారంభించు నీ శార్వరిన్
శవ పేటుల్ కదలన్ విషాదమున! నిస్సందేహ మీ వాక్కునన్
నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ!!
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిభవ్యమైనట్టి నూతన వత్సరమ్ము
రిప్లయితొలగించండిదివ్యముగను జరుగు నాంధ్ర దేశమందు
సేవ్యమానము కాకుండ చేదు మిగిలె
"నవ్య వత్సరమిదె కరోనా యనంగ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండిఅవనిన్ శార్వరి చేరవచ్చెనని తామానందమున్ బొందెడిన్
వ్యవధానమ్మును నీరుగార్చుచు నిలన్ వ్యాపించి యా భూతమే
యవలీలన్ గబళింపబూన జనులాహాకార శోకమ్ములే
నవవాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎవరేనిన్ నవజాతపుత్రికకు పేరెంచన్ గతప్రాణులై
దివికింజేరిన బామ్మదో భగినిదో దీపింపగా పేరులో
నవనామమ్మును బెట్టుచుందురిల., మాన్యా! యట్టులే మాకునీ
నవవాసంతశుభాగమమ్మిదె కరోనానామనూత్నాబ్దమౌ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండినవరోగంబఁట! తాకనంటునఁట!చైనాదంట! జాగ్రత్త ! మా...
తొలగించండినవ! యిల్వీడి చరింపరాదట! కరోనా దీని పేరంట! మా...
నవ యూరింబడి సంచరించుట?! నిదానంబేది?! నీ బుద్ధి మా..
నవ?! వాసంత శుభాగమంబిదె ?! కరోనా నామ నూత్నాబ్దమౌ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కవనారంభపు భావసంపదకుసౌకర్యంబుగానిల్చుచు
రిప్లయితొలగించండిన్నవరోధంబుల బాపుమార్గముల సన్నాహంబుగావించుచున్,
శివసంకల్పము విశ్వమానవుల సుశ్రేయంబు కాంక్షించుచు
న్నవవాసంతశుభాగమంబిదెకరోనానామనూత్నాబ్దమౌ
కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్,రంగారెడ్డి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రవణీయగ్రహరాశివత్సరలసత్సాఫల్యవైఫల్యమున్
రిప్లయితొలగించండినవనేతృత్వము నాయమున్ వ్యయములన్ తద్భావిసంభావ్యమున్
వివరమ్మెవ్వ రుగాది రోజు వినిరో? విన్నారమా చావులన్
నవవాసంతశుభాగమంబిదె, కరోనా నామ నూత్నాబ్దమౌ
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవనీనాధులునార్తులర్థులొరులన్యాయంబుశాంతింపవే
రిప్లయితొలగించండికవులైగాయకశాస్త్రవేత్తలుమహాకారుణ్యశ్రీనాధులున్
భవితానందముగోరియిచ్చుశుభసౌభాగ్యాశయాకాంక్షమౌ
నవవాసంతశుభాగమంబిదెకరోనానామనూత్నాబ్ధమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవితాగోష్ఠులుకానరావెచటనేకాంతంబె నల్దిక్కులన్
రిప్లయితొలగించండిచివురుల్ మెక్కవుమత్తకోకిలలహో చిత్తంబునన్ చింతతో
శ్రవణానందమొనర్చురాశిఫలముల్, సత్కారముల్ శూన్యమే
నవవాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ!
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిదివిలో నుల్కలు రాలి నట్టులుగ మా దేహంబులే కూలగన్
రిప్లయితొలగించండిభువిలో సోకిన వారి కెయ్యెడ నహో! భూతమ్ముగాఁ దోచుచున్
భవదీయాఖ్యను శార్వరీ ! యిటుల సంభావింప లేమమ్మ! యీ
నవ వాసంత శుభాగమంబిది కరోనా నామ నూత్నాబ్దమౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశార్వరీ నామ మాయెను చక్కబెట్టు
నవ్య వత్సరమిదె! కరోనా యనంగ
రాదె తల్లి! "కొరోనా"యె వ్రాయ వలెను
నేటి పాఠమ్ము లాయెను నిదుర పొమ్మ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి.మ:
తొలగించండిఅవినా భావము గూర్చె కోవిదుడు నేమాలోచనో యే మదో
కవితా వస్తువు నేదొకో యొకటి యుక్తంబంచు తానెంచగన్
శివమున్ గోరగ విస్మరింప మతి వాసిన్గూర్చు నాశర్వుడే
నవ వాసంత సుగాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ
చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవనీమండల మంతయున్ బ్రబల హాహాకారముల్ వ్యాధిచే
రిప్లయితొలగించండిస్తవనీయంబగు దేవతార్చనలవే స్తంభించిపోవంగ నీ
బవరంబందున నింటికిన్ పరిమితంబై పోరగా చిత్రమౌ
నవవాసంత శుభాగమంబిదె కరోనానామ నూత్నాబ్దమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిదివ్య శుభమును బడయక దివిన వచ్చె
పర్వమిదియేగ శార్వరి ,ప్రజకు కలిగె
రోగ బాధలు జగమున రోసిరoత
నవ్య వత్సరమిది కరోనాయనంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"దివిని" అనండి.
"భవబంధమ్ముల యూబిలో బడుచు నే పాపమ్ములన్ జేసెనో
రిప్లయితొలగించండినవచైనీయుని చేష్టతో నరుని ప్రాణంబుల్ కరోనా గొనన్
భువిపై కాలిడినంత శార్వరియు వాపోవంగ తా నిట్లనెన్,
"నవ వాసంత శుభాగమమ్మిదె కరోనా నామ నూత్నాబ్దమౌ"!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివివరింతున్ వినుమీ విపత్కరము దప్పింపంగనౌ నెల్లరున్
రిప్లయితొలగించండిఅవగాహమ్మున దూరముండిన ననాయాసమ్ముగా మాయమౌ
నవకాశమ్మిది మానవాళిని సమాయత్తంబు గావింపగా
నవ వాసంత శుభాగమంబిది కరోనా నామ నూత్నాబ్దమౌ
(ఆకాశవాణికి పంపినది)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవవాసంతశుభాగమంబిదికరోనానామనూత్నాబ్దమౌ
రిప్లయితొలగించండియవురాయేమనిబల్కియుంటిరిటయావైరస్సుకాహ్వానమా?
యవనిన్ బ్రాణములుండునేనికనునాయమ్మోరువేంచేసితే?
పవలున్ ఱేయియుగంటికిన్ గునుకునెప్పట్టున్ నుండుమాకికన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక'లియు గాంతమా యన్నట్లు గాన వచ్చె
రిప్లయితొలగించండి'రో"గ మొకదాని గలిగించి , లోకమంత
'న'రకమునుజూపి మొదలిడె నడత గాన
నవ్య వత్సరమిదె కరోనా యనంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివచ్చు నామని నూతన వత్సరమ్ము
రిప్లయితొలగించండితోడ ననుచు నెఱంగిన వాడొకండు
తెలిపె నిట్లు వసంతము తెచ్చెఁ దాను
నవ్య వత్సర మదె కరోనా యనంగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసంత సమ్మను మాటయే జనులు లోన
వెదకినన్ గానరాదయ్యె విశ్వ మందు
పేరు తలచిన యంతనే భీతి గూర్చు
నవ్య వత్సర మిదె కరోనాయనంగ
కవిసెన్ భీతియు నెల్లవారికని చీకాకుల్ కడున్ హెచ్చగా
రవమున్ చేయుచు పిల్లలెల్లరకు కారాగా రమంచేడ్వగా
నవవాసంతశుభాగమంబిదెకరోనానామ నూత్నాబ్దమౌ
దివమున్ రేయియుచింతలేపెరుగ నే దేవుళ్ళపూ
జింతునే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినేటి ఆకాశవాణి విశేషములు తెలుపగలరు
జిలేబి
అనివార్యకారణములవలన సమస్యాపూరణం కార్యక్రమం ప్రసారము చేయలేకపోయారట.
తొలగించండితేటగీతి :
రిప్లయితొలగించండిఅష్టపాది:
బంధు, మిత్రుల సంబర విందు లేవి?
వేప పచ్చడి వితరణ వేడుకేది?
పన్నుగ తెలియ గోచార ఫలము లేవి?
కవిత గోష్టుల వాసంత కళయె లేదు|
వింత రోగము వ్యాపింప వెరపు కలిగె|
భయము గుప్పెట ప్రజలెల్ల బ్రతుక మనుచు |
సందడెరుగని పండుగ శార్వరొచ్చె |
"నవ్య వత్సరమిదె కరోనా యనంగ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సంబారా లెందు పోయె?" అనండి. 'కవితాగోష్ఠులు' అనడం సాధువు. "కవుల గోష్ఠుల..." అనండి. 'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "శార్వరి యిదె" అనండి.
సంతసంబుగవచ్చినశార్వరియను
రిప్లయితొలగించండినవ్యవత్సరమిదె,కరోనాయనంగ
విషముజిమ్మెడుభూతము,వేలకొలది
మనుజునసువులుబలిగొన్నమాయజీవి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మనుజుల యుసురు బలిగొన్న..." అనండి.
శార్వ రికిచేయ ఘనమైన స్వాగతంబు
రిప్లయితొలగించండిమాయరోగక రోనాయె మాటు వేసె
భద్ర తకొరకు సడలింపు పండగాయె
నవ్యవత్సరమిదె కరోనా యనంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"ఇవి చేయం దగదంచు నెల్లెడల నివ్వే యాచరించన్ దగున్"
చెవులన్ మ్రోగగ విందు మీ నుడులనున్ సేవించ నీ శార్వరిన్,
వివరాంశమ్ములుఁ దెల్పు నిట్టి కతనన్ సాజమ్ము పేరియ్యదే
నవ వాసంత శుభాగమంబిదె 'కరో' ' 'నా' నామ నూత్నాబ్దమౌ
కంర్ల రామాచార్య.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిభువి నో శార్వరి! యీ కరోనకృమిగాముల్పృథ్విలో నిండి, రేఁ
బవళు ల్మానవజాతికి న్మిగుల దిగ్భ్రాంతిం బ్రసాదించి, మ
మ్మెవరి న్వెల్పల సంచరింప నిడదే! యిద్దాని మ్రందించుచో!
నవవాసంతశుభాగమం బిదె! "కరోనానామనూత్నాబ్ద" మౌ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఏ యుగాది నాడైననుఁ బాయరుఁ గద
తలఁచకుండ వత్సర నామ మిలను జనులు?
శార్వరిన్ మఱపి 'కరోన' యుర్వినేల!
నవ్య వత్సరమిదె కరోనా యనంగ! !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచీన మనెడు దేశమ్మునఁ దాను జనన
రిప్లయితొలగించండిమంది వేగఁ బర్వఁగ గాలి చందమునను
జన భయంకరము నిటఁ గాంచె నొక క్రిమిని
నవ్య వత్సర మిదె కరోనా యనంగ
అవివేక మ్మగు ని ట్లనాదరపు వాక్యం బూనఁ జిత్తమ్ములో
నవమానించ మనం బెటుల్ దనరె నయ్యా నూత నాబ్దమ్మునే
యవనిన్ శార్వరి నామ వర్షమును విన్యాసంబుగా నివ్విధిన్
నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఒంటరిగగడుపవలయునింటియందు
రిప్లయితొలగించండివేడుకలకెల్లనిప్పుడు వీడుకోలు
శార్వరికిసార్థకతగూర్చసంతమమ్ము
నవ్య వత్సరమిదె కరోనా యనంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"నవ్య వత్సరమిదె కరోనా యనంగ"
సందర్భము: రామ రాజ్యంలో పన్నులు బాగా తగ్గి పోవడంతో..
"ఇది కరోన (కర..ఊన.. పన్నులు తగ్గిన..) రాజ్యము.." అన్నా డొక (సంస్కృత) సుకవి.
అది విన్న ఒక యోగి వెంటనే "అది (కరోన) కలియుగంలో ఒక భయంకర రోగం. కాబట్టి అలా అనకు." అన్నాడు. (రాముని రాజ్యంలో ప్రజలెప్పుడూ అంత భయానికి గురి కాలేదు. అని అతని భావం.) అత డింకా ఇలా అన్నాడు.
"నవ్య వత్సరం ఇదే! జనులంతా కరోనా.. కరోనా.. అంటూ వుండగా వస్తుంది."
(అంతే గాని కొత్త వత్సరం పేరు కరోనా అని కాదు.)
కవి కంటే యోగి ఇంకా పైమెట్టు వాడు. కవి భావంమీద ఆధారపడుతాడు. యోగి భావాతీత మైన దానిపై ఆధార పడుతాడు. కవి శబ్దంమీద ఆధార పడుతాడు. యోగి నిశ్శబ్దం (మౌనం) మీద ఆధార పడుతాడు. కవి అర్థాని కనుగుణంగా శబ్దాన్ని నడిపిస్తాడు. యోగి నోటినుంచి వెలువడుతున్న మాట వెంబడే అర్థం పరుగెత్తుకొని వచ్చి అనుసరిస్తుంది.
వాచ మర్థోనుధావతి.. అన్నా రందుకే!..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*కరోన*
"ఇది కరోన రాజ్య" మ్మనియె నొక సుకవి..
పన్ను లవి రామ రాజ్యానఁ బడమి..యోగి
"యది కలిన్ ఘోర రోగ..మ
ట్లనకు" మనియె..
"నవ్య వత్సర మిదె కరోనా యనంగ"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
28.03.20
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు
రిప్లయితొలగించండిపైలను,ఫని,హుద్ హుద్ యని బలుక పేర్లు
పెట్ట పలు నుపద్రవములు వెదకి చూడ
నల్పమైనది కాదిది నరుల చంప
నవ్య వత్సర మిదె కరోనా యనంగ
వాణిశ్రీ నైనాల, హైదరాబాద్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హుద్+అని' అన్నపుడు యడాగమం రాదు.
రిప్లయితొలగించండిచివురుల్ మేయుచు కోయిలల్ తరులపై సేమంబుగా బాడినన్
చెవులన్ జేరునె గానమాధురులు నిస్తేజంబునింపారగన్
పవలున్ రేయియు భీతితో గడుపు దౌర్భాగ్యంబు ప్రాప్తించగా
నవవాసంత శుభాగమింబిది ,కరోనా నామ నూత్నబ్దమౌ!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్తవనీయంబుగ బాడుకోయిలలు నిశ్శబ్డంబుగా మారగా
రిప్లయితొలగించండిచవులురించెడు నామ్రముల్ చవికి నిస్సారంబులై తోచగా
సువిశాలంబులగు రాజమార్గములవే శూన్యంబులై కన్బడన్
జవనాశ్వంబుల మించెడిన్ యువత నిస్త్రాణంబునొందంగ దా
నవతారంబది దాల్చనేడిట కరోనాయంచు భూతంబదే
నవవాసంత శుభాగమంబిదె కరోనానామ నూత్నాబ్దమౌ
అవిరామంబుగ వ్యాప్తిజెందుచును తానఙ్ఞాతరూపంబునన్
యువరాజైన ప్రధానియైన విడకే హుందాగసోకున్గదా
నవజాతంబగు నీక్రిమిన్నడచగా నైర్మల్యమే వైద్యమౌ
అవనీభారము ద్రుంచగా పురహరుండాడేటి నాట్యమ్మిదా?
నవవాసంత శుభాగమంబిదె కరోనినామ నూత్నాబ్దమౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజవమింతైనను జారలేదు ఘన సత్సాంగత్య సంభాషణా
రిప్లయితొలగించండివ్యవధానంబిసుమంతలేదు కవనవ్యాపరముల్ సాగెనే
శివసాన్నిధ్యము గల్గు హైందవులు నిశ్చింతన్ గనన్ శార్వరీ
నవ వాసంత శుభాగమంబిదె, కరోనా! నామ నూత్నాబ్దమౌ