మీ ఆటవిడుపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'ప్రభాకర కరదీపిక'ను ప్రమాణంగా తీసుకున్నాక కాదనడానికి ఎన్ని గుండెలు కావాలి? కలకత్తాలోని కోమల హోటల్ మద్రాసీలదా?
మారెను లోకమే యికను మానస వైఖరి విశ్వసింపగన్ కోరిక లెన్నియుండినను గుప్తముగా సరి పెట్టుకొంట లో వైరసు కారణమ్మగుట వైదిక పద్ధతి వ్యాప్తి చెందుటన్ బారె శరణ్య మయ్యెగద పండిత పామరు లెల్ల వారికిన్
సందర్భము: భగవంతుని కరుణను సంపాదించుకోవడం అన్ని సంపాదనలలో కెల్లా మిన్న యనదగినది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, ఆరోగ్యం, పదవి, పలుకుబడి, డబ్బు యింకా వేటికోసమో నానా తంటాలూ పడుతారే! వీటిలో ఏదడిగినా హుషారుగా జవాబు చెబుతారే! కాని భగవ దనుగ్రహంకోసం ఎలా కష్టపడుతున్నా రంటే మాత్రం ఏం చెప్పాలో మాట రాక ఆముదం తాగిన ముఖం పెట్టి దిక్కులు చూస్తారు. ఉన్నదంతా దానిమీదే ఆధారపడివుంటే ఆషామాషీగా లాపర్వాగా కాలం గడిపేస్తారు. మందులు లేని జబ్బులు వచ్చినా చికిత్సా సౌకర్యాలు లేని పరిస్థితు లెదురైనా సర్వ శక్తిమంతుడైన పరాత్పరుడు మాత్రం మనకు గుర్తు రాడు. తక్కు వేమి మనకు రాముం డొక్క డుండువరకు.. అని రామదాసు అంతులేని ఆత్మ విశ్వాసాన్ని ఏ విధంగా ప్రకటించగలిగినాడో.. నిధి చాల సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! మీరే తేల్చుకొనండి.. అని త్యాగరాజు ఏ విధంగా సవాలు చేయగలిగినాడో.. పలికెడిది భాగవత మట! పలికించెడి వాడు రామ భద్రుం డట!.. అని పోతన ఏ విధంగా అనుభూతి చెందగలిగినాడో.. ఒకింత యోచించగలిగితే రామానుగ్రహం విలువ అర్థమౌతుంది. ఏ శాస్త్రంలో ఎంత పండితులైనా ఎంత డబ్బు వెదజల్లి పండితుల మనిపించుకున్నా సన్మానాల సంబరాలలో మురిసి మైమరచినా భగవదనుగ్రహం సంపాదించుకోలేకపోతే వెనుక బడ్డట్టే లెక్క. అటువంటి పండితు లందరికీ రామదాసు లాంటి భక్త శిఖామణులే ఎన్నటికైనా ఆదర్శ మౌతారు. (వీరికి వారు కారు.) ~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామానుగ్రహము*
రామదాసు, త్యాగరాజు, పోతన వోలె
రామ భద్రు కరుణ రమణ మీరి
భద్రశీలు రయిన భక్తాగ్రగణ్యుల
బారె శరణ మయ్యెఁ బండితులకు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 26.03.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
Hindustan Unilever Ad:
చేరగ దాసికత్తెలయొ జీతము పెంచెడి సమ్మెనందునన్
దారయె పోవగా వడిగ తమ్ముని గూడుచు పుట్టినింటికిన్
పోరగ గిన్నెలందు కడు పోకిరి జిడ్డును;...నిమ్మకాయ "విం
బారె" శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
'విమ్' బారుతో మీ సరదా పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
తొలగించండి1960 లలో మా IIT Kharagpur Campus లో Maid Servants Union ఉండేది...
https://gpsastry.blogspot.com/2012/05/left-right.html?m=0
చాలా బాగుందండి
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బోరతి కొట్టగా తినుచు బోలెడు స్వీటులు వంగభూమినిన్
కోరిక తీర కొల్కతను కోమల హోటలు నందునన్ భళా
వారెవ! ఉల్లిపాయలను బంగళ దుంపల తోడ వండు సాం
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
బోరు + అతి = బోరతి (పరమ బోరు)
("ప్రభాకర కరదీపిక; రెండవ ముద్రణ"; అన్యదేశ్య సంధి ప్రకరణము)
కోమల హోటలు = Komala Vilas, Rashbihari Avenue, Ballygunge, Kolakata
మీ ఆటవిడుపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'ప్రభాకర కరదీపిక'ను ప్రమాణంగా తీసుకున్నాక కాదనడానికి ఎన్ని గుండెలు కావాలి?
కలకత్తాలోని కోమల హోటల్ మద్రాసీలదా?
తొలగించండినెల్లూరు కోమలాస్ వారి తరపువారిది . ఓ మోస్తరు చేతులు మారి పోయిందనుకుంటా.
జిలేబి
తొలగించండి"అతి కోమల" ఉప్పుడు బియ్యము తో వారి అన్నము గురించి విడిచి పెట్ఠేసారే :) పచ్చిబియ్యము వడ్డించని కోమల :)
జిలేబి
🙏🙏🙏
తొలగించండి
తొలగించండివంగ దేశస్తులు ఉప్పుడు బియ్యం తింటారు...మా యిండ్లల్లో ఉప్పుడు బియ్యం ఇడ్లీ పిండికి వాడే వారు. దక్షిణ భారతం అయ్యరులు (మేము కూడా ఆకోవ వారమే) ఉప్పుడు బియ్యం తినే వారు...
బాగుందండి
తొలగించండి🙏
తొలగించండి(ప్రస్తుతం ప్రభుత్వకఠిననిర్ణయాల వరుసను
రిప్లయితొలగించండిపాటించటమే ప్రజలందరికి క్షేమదాయకం)
మీరు కరోన చిచ్చువలె
మ్రింగుచునుండగ జాతినంతటిన్;
ఊరవు కోర్కెలెవ్వియును;
నొద్దిక- యోర్పును- వచ్చిచేరెలే;
తీరుగ ఘాటుగా ప్రభుత
దెల్పిన సూత్రపు నిష్ట్తురంబునౌ
బారె ; శరణ్యమయ్యె గద!
పండితపామరు లెల్లవారికిన్.
(బారు-వరుస;ప్రభుత-ప్రభుత్వము)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'నిష్ఠురంబు' టైపాటు.
పప్పు తినగ మదిని వాంఛయన్నను గాని
రిప్లయితొలగించండియాకు కూర లేవి యందుబాటు
లోన లేక పోవ జానియు చేయు సాం
బారె శరణ మయ్యె పండితునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జాని యొనర్చు సాంబారె' అంటే బాగుంటుందేమో?
కవివర్యులకు, పెద్దలకు నమ్మస్సులు 🙏
రిప్లయితొలగించండిశారద దీవెనల్ వెలయు శార్వరి వత్సర యాగమంబునన్
కోరగ స్వాంతమున్ సొగసు కోర్కెల పూచెను మంజులంబులై
చేరగ హాసచంద్రికల జీవనమందు నితాంతమైన దర్
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
కస్తూరి శివశంకర్
ముంబయి 🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వత్సర+అగమంబు=వత్సరాగమంబు' అవుతుంది. యడాగమం రాదు. "...వత్సర మేగుదెంచగా..." అందామా?
రిప్లయితొలగించండిజేజేల్ వాట్సప్పావధానమునకు. విశేషములు తెలుప గలరు.
గుంపు చేర ప్రభుత కోతవేయంగను
వాట్సపు హయి టెక్కు పట్టుగ నవ
ధానమున్ జరుప వధాని వర్యులమర
బారె శరణమయ్యెఁ బండితులకు!
జిలేబి
కూర లేమి లేవు సారెసారెకు నన్ను
రిప్లయితొలగించండిఏల బాధ పెట్ట యింతగాను
పాడి కాదని సతి పలుక పచ్చడియు సాం
బారె శరణమయ్యె పండితునకు
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికురుసభగాంచుచు... ఒక భటుని ఆవేదన
నోరు మెదల్పజాలరిట! నూటికి నూరు విధాల తప్పులన్
కౌరవనాథుడున్ శకుని కర్ణుడు ధూర్తుడు దుస్ససేనుడున్
కోరి యొనర్ప., పెద్దలయి కూడ! సహించునె మమ్ము ?! గ్రుడ్డి ద....
ర్బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
గళము మూగ వోయె కవులకు దేశాన
రిప్లయితొలగించండికఠిన నిర్ణయమ్ము కళ్ళెమాయె
చిన్న పాటి సభను చేసిన సుమముల
బారె శరణ మ య్యె పండితులకు
ఖలు కరోన కికను కళ్ళెమ్ము వేయగ
రిప్లయితొలగించండిప్రజలు గృహమునందె బంధి యవగ
కూరగాయలకట కొరతయేర్పడగ సాం
బారె శరణమయ్యెఁ బండితులకు
తరచి తరచి కనగ ధనమున్న వాడెపో
రిప్లయితొలగించండిధన్యజీవనదగు ధరణి యందు
కొంతకాలమాయె కొవిడుధాటి కిగుర
బారె శరణమయ్యెఁ బండితులకు
Covid-19: Yesterday's example.
(మన అవధానము కాదు గురువుగారూ).
కారణమేమొ సృష్టికి నకారణ వైరము దాపురించెనో
రిప్లయితొలగించండికోరొన వేకి కోరలకు గుంది నరాధిపుల్ నరుల్ గృహా
హారము మెక్కి జిక్కిరి భయంబును భక్తియ వెన్నుదన్ను సాం
*బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్*
దారులు వేరునైన నవధాన రహస్యము సాహితీసుధన్
గోరెడు సాహితీ ప్రియుల గొంగున వేయుట లక్ష్య లక్ష్యమై
పారెను శంకరాభరణ వాట్సపు వాహిని లోన హర్షమున్
*బారె ,శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్*
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండితెలుగు కవికి రుచిన తేటగ మునగసాo
బారె శరణమయ్యె, పండితులకు
భాష గమ్య మిచ్చు పంచతంత్రoబులు
మనసు తోడ మంచి మాట చాలు!
ఉ:
రిప్లయితొలగించండిమారెను లోకమే యికను మానస వైఖరి విశ్వసింపగన్
కోరిక లెన్నియుండినను గుప్తముగా సరి పెట్టుకొంట లో
వైరసు కారణమ్మగుట వైదిక పద్ధతి వ్యాప్తి చెందుటన్
బారె శరణ్య మయ్యెగద పండిత పామరు లెల్ల వారికిన్
వై. చంద్రశేఖర్
సభల లోన చర్చ సలుపగ నిప్పుడు
రిప్లయితొలగించండిబూతె శరణమయ్యె బుడమి యందు
మెచ్చు రచన నలుప మృదు పదముల
బారె శరణమయ్యెఁ బండితులకు
చేరెను చీన నుండి యది చిందె విషమ్ము జగమ్మునంతటన్
రిప్లయితొలగించండిదారుణమైన ఘోరకలి దారియె లేదుగ జూడ గీము ద
ర్బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
దూరమె మేలు సేయునట దుర్భరమైననిదే శరణ్యమౌ
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
రిప్లయితొలగించండి"బారె శరణమయ్యెఁ బండితులకు"
కవిత గోష్టి జేసి కదలిరి కవులెల్ల
మెస్సు నొకటి జేరి మింగ కూడు |
కూర లేవి కనక కుందెను మనము, సాం
"బారె శరణమయ్యెఁ బండితులకు"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకుకూరలేవియందుబాటునలేక
రిప్లయితొలగించండిపప్పుదినుసుకూడభారమగుట
పొట్టనింపుకొఱకుపూటపూటకునుసాం
బారెశరణమయ్యెబండితులకు
కూరలు నమ్మువారలిక కొంపల లోపల బంధియై మహ
రిప్లయితొలగించండిమ్మారి కరోనఁ నిల్పమని మాన్యుల మాటల గౌరవింపగా
కూరలు లేవులేవనుచు కొమ్మలు వండిన నీళ్ళచారు సాం
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
తెలుగు నేర్చుకొనెడు తీరికేలేకుండె
రిప్లయితొలగించండిబడిన తెలుగు చెప్పు పంతు లేల?
కాలమహిమచూడు కాఫీటిఫినుటీల
బారె శరణమయ్యె పండితునకు
'బా'సిపీట లేక చూసి 'రె'డ్డిగమును
రిప్లయితొలగించండియోగ చేయు వాడు బాగ జేయుఁ
పూజ కార్యములను కూర్చుండి జేయగా
'బా''రె' శరణమయ్యెఁ బండితులకు౹౹
ఉత్పలమాల:
రిప్లయితొలగించండికోరని కోవిడుక్రిముల కోరల కాటుల కోర్వజాలకన్
తీరును మార్చుచున్ ప్రభుత తేరుగ యింటను నుండమంచనన్
కోరిన రీతినన్ సరుకు కొట్టున నిండుకొనంగనేడు సాం
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
ఆరయయీకరోనయిటయారడివెట్టుచునుండెగానసాం
రిప్లయితొలగించండిబారెశరణ్యమయ్యెగదపండితపామరులెల్లవారికిన్
గూరలుదుంపలుల్గనగఘోరముగానటయుండెసంతలో
కారణమీకరోనెగదకాలమునెట్లుగవీగిపోయెనో
విద్వత్సభలో నోటమి పాలయిన పండితుల పరిస్థితి:
రిప్లయితొలగించండిముష్టిపీడనమ్ము, మూర్ధంగత నఖ చా
లనము, కలవరమ్ము, కనికరమ్మ,
దిఙ్నిరీక్షణ, వినతిమతి, మౌనవ్రతం
బారె, శరణమయ్యెఁ బండితులకు
[ఆరె = ముగిసినవి; కనికరమ్మే శరణ మయ్యె]
ఆరయ మెన్నఁ డివ్విధి మహా భయ దాయక సంకటమ్ములన్
వీరవిహార లీల నల విశ్వము నెల్లయు దుష్టకీట దు
ర్నైరృతుఁ డేల నొంటరి తనంబిల జీవనయాత్రలో, సుఖం
బారె, శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండివారలు శంకరాభరణ వాట్సపు గ్రూపున నీ యుగాదికిన్
దీరుచగన్ వధానమునదే మురళీవర పండితాఖ్యుచే
వేరొక దారిలేక మురిపెమ్ములు దీరగ నాను లైను ద
ర్బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిభారిగఁ బెండ్లి సేసి, పలువంటలు విందున నుంచి, విందుకుం
గోరిక లెల్లఁ దీరునటు కూర్చిరి మెండుగ మద్యమాంసముల్!
కూరలు మాత్రమే తినఁగఁ గోరియు, నయ్యవి మృగ్యమౌట, సాం
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బారె శరణమయ్యెఁ బండితులకు"
సందర్భము: భగవంతుని కరుణను సంపాదించుకోవడం అన్ని సంపాదనలలో కెల్లా మిన్న యనదగినది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, ఆరోగ్యం, పదవి, పలుకుబడి, డబ్బు యింకా వేటికోసమో నానా తంటాలూ పడుతారే!
వీటిలో ఏదడిగినా హుషారుగా జవాబు చెబుతారే! కాని భగవ దనుగ్రహంకోసం ఎలా కష్టపడుతున్నా రంటే మాత్రం ఏం చెప్పాలో మాట రాక ఆముదం తాగిన ముఖం పెట్టి దిక్కులు చూస్తారు.
ఉన్నదంతా దానిమీదే ఆధారపడివుంటే ఆషామాషీగా లాపర్వాగా కాలం గడిపేస్తారు.
మందులు లేని జబ్బులు వచ్చినా చికిత్సా సౌకర్యాలు లేని పరిస్థితు లెదురైనా సర్వ శక్తిమంతుడైన పరాత్పరుడు మాత్రం మనకు గుర్తు రాడు.
తక్కు వేమి మనకు రాముం డొక్క డుండువరకు.. అని రామదాసు అంతులేని ఆత్మ విశ్వాసాన్ని ఏ విధంగా ప్రకటించగలిగినాడో..
నిధి చాల సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! మీరే తేల్చుకొనండి.. అని త్యాగరాజు ఏ విధంగా సవాలు చేయగలిగినాడో..
పలికెడిది భాగవత మట! పలికించెడి వాడు రామ భద్రుం డట!.. అని పోతన ఏ విధంగా అనుభూతి చెందగలిగినాడో.. ఒకింత యోచించగలిగితే రామానుగ్రహం విలువ అర్థమౌతుంది.
ఏ శాస్త్రంలో ఎంత పండితులైనా ఎంత డబ్బు వెదజల్లి పండితుల మనిపించుకున్నా సన్మానాల సంబరాలలో మురిసి మైమరచినా భగవదనుగ్రహం సంపాదించుకోలేకపోతే వెనుక బడ్డట్టే లెక్క.
అటువంటి పండితు లందరికీ రామదాసు లాంటి భక్త శిఖామణులే ఎన్నటికైనా ఆదర్శ మౌతారు. (వీరికి వారు కారు.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రామానుగ్రహము*
రామదాసు, త్యాగరాజు, పోతన వోలె
రామ భద్రు కరుణ రమణ మీరి
భద్రశీలు రయిన భక్తాగ్రగణ్యుల
బారె శరణ మయ్యెఁ బండితులకు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.03.20
-----------------------------------------------------------
కాయగూరలింకగనరావు విపణిలో
రిప్లయితొలగించండితిండిగింజలేమొనిండుకొనియె
కడుపుమంటనార్పగత్యంతరమికసాం
బారె శరణమయ్యెఁ బండితులకు
బారులుతీరిపౌరులొకపంక్తిని నిల్వగవీలులేదుయిం
రిప్లయితొలగించండిపారగదూరతీరములబంధుజనంబులఁజూడబోము వ్యా
పారములెల్లమూతబడె బంధనజేసెకరోనయింకసాం
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్ల వారికిన్
కోరిక దీర్చుమా యనుచు గొల్చెను మాతను గాళిదాసు, సం
రిప్లయితొలగించండిస్కారము నేర్పు విద్యనిడె చండిక, శీఘ్రగతిన్ గవిత్వ సం
భారము చేరె జిహ్వపయి పావన సత్కవితా ప్రవాహమున్
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్.
ఆటవెలది
రిప్లయితొలగించండివిశ్వమును కరోన బీగము వేయించ
శార్వరీయుగాది సభలు లేక
దొరలి పద్యములవి చరవాణి నందునన్
బారె! శరణమయ్యెఁ బండితులకు
మేరలుపెట్టగా ప్రభుత మేలునుగోరుచు నెల్లవారికిన్
రిప్లయితొలగించండిదీరుగ నింటనుండుమని,దిక్కునుదోచక నెట్టునింటికిన్
బారె,శరణ్యమయ్యెగద పండితపామరు లెల్లవారికిన్
వారెవ!స్మార్టుఫోనులవి వాట్సపువార్తల జేరవేయగా
నేటి పరిస్థితుల దృష్ట్యా భక్తులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనార్థమై పరుగులిడుచున్నారనే భావముతో........
రిప్లయితొలగించండికోరిన కోర్కెలెల్ల ననుకూలముజేయుచు భారతావనిన్
దారుణ సంభవంబుల నుదాహరణంబుగ తాఁ వచించున్
పారగుఁడయ్యె బ్రహ్మమిట భక్త సమూహము నిన్ను చేరగాఁ
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్
రిప్లయితొలగించండివారినిచూచిపండితులు వైధికకర్మలు మూలనొడ్డగన్
కోరినదెల్లపొందవలె కొంచెము చాలదు తక్కువేటికిన్
మారగహద్దులేపిదప మైకముబానిసలైరికావునన్
బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్.
మఱొక పూరణము:
రిప్లయితొలగించండిశ్రీ రమ శార్వరీ ప్రభల శ్రేష్ఠ కవిత్వ విభా విభావముల్
గూరిన పద్యరత్నములఁ గూర్మిఁ బఠింపఁ గరోన యడ్డెఁ! ద
ద్వారధి శంకరాభరణ వాట్సపు బృందపు శంకరార్యు ద
ర్బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్!
రిప్లయితొలగించండిపోతన భాగవతమును సింగరాయ భూపతికిఅంకితము ఇవ్వమనగా శ్రీనాదునితో పోతన పలుకు సందర్భము సీసములో నా పూరణము
ఎవ్వడీ సృష్టికి హేతువాయెను, యే మ
హాత్ముని కుక్షిలొ నబ్ధి నేమి
లీనమై నుండునో, మానవ జాతికి
మూలమౌ కారణము లెచట గను
గొంటినో,, యెవ్వడు, తొంటి,నడుమ,లయ
కారకుం డెవ్వడో ,కరుణ రసము
నాపై గుప్పించి ఘనమగు నీ భాగవ
తామృత సారమ్ము ధరణి లోన
ప్రజలకు నా జేత బంచగ పూనెనో
నాతండు, దశరధ నందనుండు
సీతా సహచరుడు,శ్రీనాధు డర్హుడీ
భాగవతా కృతిన్ పట్టబోవ,
వినుము శ్రీ నాద, పోతన యివ్వ జాలడు
సింగరా యునకును,చెప్పు చుంటి
రాఘ వుండు ఘనుడు రమ్యగతి నిడెద
నంకి తమ్ము నతని కెప్పుడైన
రామ కొలువు నాకు, రాజుల మేటి ద
ర్బారె శరణ మయ్యెపండితులకు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బారె శరణ్యమయ్యెఁ గద పండిత
పామరు లెల్ల వారికిన్"
సందర్భము:
వామే భూమిసుతా పురస్తు హనుమాన్
పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో
ర్వాయ్వాది కోణే ష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్
తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమలరుచిం
రామం భజే శ్యామలమ్
(శ్రీ రామ కర్ణామృతం 28 శ్లో.)
*రాముని దర్బారు*
ఎడమ సీత
వెనుక లక్ష్మణుడు
ముందు హనుమ
పక్కలు భరత శత్రుఘ్నులు
విదిక్కులు సుగ్రీవ విభీషణ అంగద
జాంబవంతులు
నడుమ రాముడు
సోదర సమానులు = సుగ్రీవ విభీషణ అంగద జాంబవంతులు (పద్యంలో)
అటువంటి రాముని దర్బారు పండిత పామరులకు శరణ్య మగుగాక!
*ఆంజనేయుని దర్బారు*
ఛత్రము పట్టేవాడు... సుషేణుడు
చామరాలు వీచేవారు.. మైందుడు ద్వివిదుడు
బెత్తము పట్టేవాడు... మాగధుడు
వంశకీర్తన చేసేవాడు.. గంధ మాదనుడు
పాదుకలు మోసేవాడు.. పసనుడు
మంత్రాంగం నెరపే వాడు..జాంబవంతుడు
వెనుక నడిచే వారు.. గవాక్షాది వానరులు
హనుమ పక్కన.. భార్య సువర్చల
హనుమ వాహనం..ఒంటె
హనుమ విహారం.. పంపాతీరం
అటువంటి హనుమ దర్బారు పండిత పామరులకు శరణ్య మగుగాక!
రెండు పద్యాలలోను విశేషాలు వీలైనంతమటుకే పొందుపరచటం జరిగింది. ఈ రెండు పద్యాల లోని విశేషాలూ ప్రతినిత్యం స్మరించదగినవిగా ప్రాజ్ఞులు భావిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*రాముని దర్బారు*
చేర వయారమై యెడమ
సీతమ, లక్ష్మణ మూర్తి వెన్కయున్,
మారుతి ముందు, సోదర స
మానులు మూలల, తమ్ము లిట్టటున్
గోరిక మీరగా నడుమఁ
గోమల రాముడు వెల్గు రాము ద
ర్బారె శరణ్య మయ్యెఁ గద
పండిత పామరు లెల్లవారికిన్!
*ఆంజనేయుని దర్బారు*
చేరువ ఛత్రధారుడు సు
షేణుడు, చామర ధారు లిద్ద రిం
పారగ మైందుడున్ ద్వివిదు,
లద్దరి బెత్తము బట్టు మాగధుం,
డారయఁ బాదుకార్చకుడు
నౌ పసనుండును, గంధమాద నో
దారుడు వంశ కీర్తనుడు..
దండ సువర్చల.. యాంజనేయు ద
ర్బారె శరణ్య మయ్యెఁ గద
పండిత పామరు లెల్ల వారికిన్!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.03.20
-----------------------------------------------------------