31, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3325 (పతి సంపర్కము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"
(లేదా...)
"పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై"

109 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సుతునున్ గోరుచు పండితుండు సరియౌ సూత్రమ్ము పాటించుచున్
  నుతమౌ కాన్పుల శాలయందు నిడగా నోరారుచున్ పత్నినిన్
  జతగా సర్జను మత్తువైద్యుడచటన్ శస్త్రమ్ములన్ పన్నగా
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై....

  సంపర్కము = కలయిక

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   సతినిన్ వీడుచు శాస్త్రి వర్యుడయయో జల్గాము పట్నమ్మునన్
   వెతలన్ సైచుచు ఖర్గపూరు వనినిన్ వేవేల దండాలతో
   ప్రతి రోజెంచగ గంటలన్ నిమిషముల్; భద్రమ్ము లాభమ్ముగా
   పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై......

   సంపర్కము = కలయిక

   తొలగించు
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   అయితే మీకు పుత్రోదయమైనపుడు పత్నికి దూరంగా ఖర్గపూరులో ఉన్నారన్నమాట!

   తొలగించు
  3. 🙏

   చాలా నెలల పాటు...

   http://gpsastry.blogspot.com/2014/08/great-indian-complaints-book-repeat.html?m=0

   తొలగించు
 2. యతి దుర్వాసుని కృపచే
  నతిమహిమాన్విత వరమ్ము ననుధావనమే
  గతి జూడ కుంతి, యవనీ
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
 3. పతికిన్ శాపము గలదని
  పతియానతి తోడఁ గుంతి భానుజునిఁ దమిన్
  నుతి సేసి మంత్రఫలమున
  "పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"

  రిప్లయితొలగించు
 4. యతి యొసగిన మంత్రముతో
  కుతుకమ్మున రవిని బిలిచి కుంతియె గొలువన్
  నుతముగ నాతని వరమున
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
 5. అతిగ జనాదర.నొందిన
  యితిహా సములందు జూడ నెరుకకు వచ్చున్
  నతివలు పలు సమయంబుల
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
 6. (జోసఫ్ సతీమణి మేరీకి లోకరక్షకుడు జన్మిస్తాడని
  దేవుని సువార్తను దివ్యదూతికలు వినిపించారు )
  నతులన్ జేయుచు దూతికల్ మరియకున్
  నమ్రమ్ముగా "దైవమే
  సతతమ్మున్ నరజాతిరక్షకుడునై
  జన్మించు నీ కడ్పునం"
  చతిమోదంబుగ దెల్పమేరియును జో
  సఫ్ ధన్యులై వెల్గగా ;
  పతిసంపర్కము లేక పుత్రుని గనెన్
  వామాక్షి సచ్చీలయై .
  (నతులై -మ్రొక్కినవారై;నమ్రమ్ముగా-వినయముగా )  రిప్లయితొలగించు
 7. కం//
  జతగా సహదేవ నకులు
  సతిమాద్రికి, అశ్వినులచె సంతతి నొసగన్ !
  పతిపాండురాజు యున్నను
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రులన్ !!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదాన్ని "జతగ సహదేవ నకులులు" అనండి. 'అశ్వినులచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "అశ్వినులదె సంతతి..." అనండి. 'రాజు+ఉన్నను' అన్నపుడు యడాగమం రాదు. "పాండురాజె యున్నను" అనవచ్చు.

   తొలగించు
 8. జతగా పరీక్ష నాళిక
  శ్రుతి నిడు విజ్ఞాన మడర చూలాలై నా
  సతి నవమాసము లందగ
  పతి సంపర్కమ్ము లేక బడసెన్ బుత్రున్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చూలాలై యా సతి..." అని ఉండాలనుకుంటాను.

   తొలగించు
  2. అలాగే సవరిస్తానండి. ధన్యవాదములు.

   తొలగించు
 9. అతి లాఘవముగ గిరిరా
  ట్సుత నలుగున బొమ్మచేసి చోద్యముగా నా
  ప్రతిమకుఁ బ్రాణంబిడి పశు
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
 10. గతరాత్రంబున స్వప్నమయ్యె నిదురన్ గన్నాడ నద్దానిలో
  నతిభక్తిన్ గిరిజాధిపున్ గొలిచి "జే"యన్నన్ సమీపంబునం
  దత డచ్చోటను జేర తన్మయముతో నర్థించి యద్దేవతా సత్కృపన్
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర గణభంగం. సవరించండి.

   తొలగించు
  2. ఆర్యా!
   ధన్యవాదాలు.
   సవరించాను.


   గతరాత్రంబున స్వప్నమయ్యె నిదురన్ గన్నాడ నద్దానిలో
   నతిభక్తిన్ గిరిజాధిపున్ గొలిచి "జే"యన్నన్ సమీపంబునం
   దత డచ్చోటను జేర బ్రార్థనముతో నద్దేవతా సత్కృపన్
   పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై.

   తొలగించు
 11. అతిగా యోచించకురా 
  పతి కూడక సంతు గలుగు పద్ధతు  లెన్నో 
  సతి యనలేదా కుంతిని 
  "పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"  

  రిప్లయితొలగించు
 12. నుతియించి సూర్య దేవుని
  సతమతమై కుంతి పొందె సబలుని కర్ణున్
  వితతానందము పొందుచు-
  పతి సంపర్కమ్ము లేక పడసెన్ బుత్రున్

  రిప్లయితొలగించు
 13. గతిఁదప్పెం గద పూర్వపద్ధతులు లోకన్యాయవిశ్వాసముల్
  స్మృతిశాస్త్రమ్ముల తీరు మారెను, ధరిత్రిన్ వీడి శూన్యమ్ము, న
  ద్భుతరీతిం గన పంట పండె, మహిలో త్రోవల్ విభిన్నమ్ములై
  పతిసంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించు


 14. పుట్టిన కొమరుల్లారా మీరట్లా బలము పడయటానికి కారణము, దైవసంభూతులవడానికి కారణము గట్రా గట్రా కారణము వర్జినిటీ యే !  ఇతిహాసమ్ముల చదువ ప
  డతులను వక్రీకరించి డంబమ్ములతో
  డు తరించెడు కట్టుకతలె!
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్!  జిలేబి

  రిప్లయితొలగించు


 15. Virginity thy name is Divinity


  ఇతిహాసమ్ముల ధోరణుల్ ధరణిలో నెంతేనియో చిత్రముల్!
  సుతులన్ గొప్పగ నిల్ప దేవతలతో శోభాయమానమ్ముగా
  కతలన్ గట్టిరి చేతనైన విధముల్ కావ్యమ్ములన్ వ్రాసిరే
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై


  జిలేబి

  రిప్లయితొలగించు
 16. సుతు నొకని బడయ దలచియు
  మెతకరి రాజ సభ వీడి రమణిని గలిసె న్
  జత గూడి యుండ నాభూ
  పతి సంపర్కమ్ము లేక పడసె న్ బుత్రు న్

  రిప్లయితొలగించు
 17. గురువు గారికి నమస్సులు
  అతివకు వయసొచ్చెన్ శ్రీ
  యుతులెల్ల తలచి వరింప, యుక్తిగ ధీమo
  తతకున్ నొప్పెన్, దరిద్రా
  పతిసంపర్కమ్ము లేక పడసెo బుత్రున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. అక్కడ "వయసయ్యెన్" అనవచ్చు.

   తొలగించు
 18. రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   యతి దుర్వాసునిఁ ప్రీతిఁ గొల్వ పృథ, ప్రత్యక్షమ్మునై దేవతల్
   మతిఁ బ్రార్తించిన యంత సంతునిడెడున్ మంత్రమ్ము నందించగన్
   ద్యుతి కారుండగు సూర్యునిన్ దలఁచి సద్యోగర్భ సంవేదనన్
   పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

   తొలగించు
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   '...బ్రార్థించిన' టైపాటు.

   తొలగించు
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ

   మత్తేభవిక్రీడితము
   యతి దుర్వాసునిఁ ప్రీతిఁ గొల్వ పృథ, ప్రత్యక్షమ్మునై దేవతల్
   మతిఁ బ్రార్థించిన యంత సంతునిడెడున్ మంత్రమ్ము నందించగన్
   ద్యుతి కారుండగు సూర్యునిన్ దలఁచి సద్యోగర్భ సంవేదనన్
   పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

   తొలగించు
 19. మిత్రులందఱకు నమస్సులు!

  వ్రతనిర్వర్తితభక్తిఁ గుంతి యట దుర్వాసున్ గరం బోర్మిచే
  సతమర్చించఁగఁ దృప్తినంది ముని యా శంపాంగికిన్ మంత్ర మి
  చ్చి, తగన్ సంతస మంది యేఁగఁగఁ, బరీక్షింపన్, దినేశాంశచేఁ,

  బతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై!

  రిప్లయితొలగించు
 20. కందం
  కందం
  యతి దుర్వాసుని వరమై
  ద్యుతికారుని సూర్యుఁ గొల్వ నువిద పృథకు సం
  తతి సద్యోగర్భమ్మిడ
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
 21. సుతులను బడయని నెపమున
  అతిగతి యెరుగని యనాధ, నాదర మొప్పన్
  నతివ తలచె సాకెదమని
  "పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "... నాదరమున నా యతివ తలచె..." అనండి.

   తొలగించు
 22. డా.బల్లూరి ఉమాదేవి

  వ్రతమును చేసెడి మునికట
  సతతము సేవలను చేసి చక్కని వరమున్
  సతియౌ కుంతి పడసి తా
  *పతి సంపర్కమ్ము లేక పడసెన్ బుత్రున్*

  రిప్లయితొలగించు
 23. సుతులన్ బొందగ పూజలన్ సలిపినన్ శూన్యంబగున్ గాదొకో
  పతి సంపర్కము లేక; పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై
  పతితో చక్కని కాపురమ్ము నిల సౌభాగ్యమ్ము సంప్రాప్తమై;
  పతి బాటన్ సతి యామె మాట నతడున్ పాటింప మేలౌ సదా

  రిప్లయితొలగించు
 24. మఱియొక పూరణము:

  పతియన్నన్ విముఖమ్ముచేత భువిలోఁ బంతమ్ముతోడన్ దగన్
  సతతం బౌరస వత్సలత్వ మెనయన్ సంతాన సాఫల్య కేం
  ద్ర తరుచ్ఛాయను నాశ్రయించి వెసఁ దాఁ బ్రాకామ్య వైద్యాప్తిచేఁ

  బతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై!

  రిప్లయితొలగించు
 25. పతియానతి గైకొని యా
  సతి పృథ ప్రార్థించి పాక శాసనుఁ గృపచే
  శతముఖ సుతుండ నామెయె
  పతిసంపర్కమ్ము లేక పడసెంబుత్రున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "శతమఖసుతు నర్జును గనె" అనండి.

   తొలగించు
 26. రిప్లయిలు
  1. నా పూరణ ప్రయత్నం 🙏🙏

   *కం||*

   అతిశయమనుకొనవలదుగ
   సతి పతితోకలలయందు సయ్యాటలలో
   గతి తప్పిన క్రీడలలో
   *"పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😊🙏😊🙏

   తొలగించు
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భావం కొంత అస్పష్టంగా ఉన్నది.

   తొలగించు
 27. మైలవరపు వారి పూరణ

  అతులార్థార్జనఁగోరి శ్రేష్ఠి యరిగెన్ వ్యాపారమున్ జేయఁ., ద...
  త్పతినే తల్చుచు, వాని సేమమును సంభావించుచున్ రేయి నొ...
  క్కతె నిద్రింపగ స్వప్నసీమఁ గొమరున్ గాంచెన్! విచిత్రమ్ముగా
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి స్వాప్నిక పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 28. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.

  ఎద సొదల తాళని బ్రజలె
  మదిరా పానరతులు గద ! మాచెర్ల జనుల్
  చెదరని యాతిథ్యముతో
  పదికాలము లలర జేయు బంధువు లందున్!

  రిప్లయితొలగించు
 29. మతిచెడువిధానమొచ్చెను
  అతివలు టిష్యూ విధాన నండములిడగన్
  కృతకపునాళముచేతన్
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చె'ను 'ఒచ్చె'నన్నారు. "మతిచెడ వచ్చె విధానం బతివలు..." అనండి.

   తొలగించు
 30. యతి దుర్వాసుడొసంగినట్టి వర మాహాత్మ్యమ్ము చే కుంతి ధీ
  ధితివంతున్ స్మరియించినంత యతివన్ దీప్తాంశుడే బ్రోచి యి
  చ్చె తనూజుండనటంచు చెప్పె నతడా చిత్రాంగితో నివ్విధిన్
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్చీలయై.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "స్మరియించినంత నతివన్" అనండి.

   తొలగించు
 31. ఇతివృత్తంబున, చిత్రరాజమది త్రీయిడ్యట్సు, విద్యార్థిచే
  నతి చోద్యంబుగ కాన్పొనర్చి, మిగులానందమ్ము నందించె నా
  సతి వైద్యంబును తాల్మి జూపి విడియోచాటున్, ఒనర్చెన్ టెలీ
  పతి! సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై౹౹

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కడు నానందమ్ము నందించె..." అనండి. 'చాటున్ ఒనర్చెన్' అని విసంధిగా వ్రాయరాదు కదా?

   తొలగించు
 32. ఉ:

  శ్రుతినిన్ జేరగ లోకులున్ బలుక నాశూన్యంబునున్ చాటుగా
  వెతలన్ బాయగ సత్య మున్నెరిగి భావింపన్ పతిన్ గోరుటై
  సుతునిన్ బొందగ దత్తుగా ననుట నా శూరుండు నొప్పేయుటన్
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

  శూన్యము: సంతానలేమి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 33. మితిమీరవెకిలిచేష్టలు
  నతివలలోగొంతమందియచ్చెరువందన్
  బతితులుగానున్నందున
  బతిసంపర్కమ్ములేకపడసెంబుత్రున్

  రిప్లయితొలగించు
 34. కుతపుని సన్నుతి జేయుచు
  వ్రతముగ మంత్రమ్ము జదివి పరితోషముతో
  అతివ యగు కుంతి యా దిన
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్!!!

  రిప్లయితొలగించు
 35. అతివకు యతి వరమిచ్చెను
  నతికుతుకముతోడనామెయర్కునిగోరెన్
  యతివరమువీగిపోవునె?
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వరమ్మిచ్చిన । నతి కుతుకము.." అనండి.

   తొలగించు
  2. అతివకు యతి వరమిచ్చిన
   నతికుతుకముతోడనామెయర్కునిగోరెన్
   యతివరమువీగిపోవునె?
   పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"

   తొలగించు
 36. వితరణమతియై పిల్లల
  ధృతితో దత్తతగొనంగ దేశముమెచ్చన్
  స్తుతమతి హన్సిక తానే
  పతి సంపర్కములేక పడసెంబుత్రున్

  రిప్లయితొలగించు
 37. కం//
  పతి లేకనె బుట్టుదురట
  మితిమీరిన సైన్సువలన మీరేమనినన్ !
  సతియుండిన చాలుననెను
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్ !!

  రిప్లయితొలగించు
 38. అతి దుర్లభమ్ము సుమ్మీ
  సతులకుఁ గాన్పగుట నే డశస్త్ర మ్మెలమిన్
  సతి కెట్టి శస్త్రముల, రఘు
  పతి, సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్


  విత తానుగ్రహ దత్త దేవగణ సంప్రీతాత్మ నిర్దోషియై
  సత తాచార పరాయ ణైక సుమహాసాధ్వీ లలా మాంబయే
  త్రితయం బైన కుమార పూర్వమునఁ గుంతీ దేవియే స్వీయపుం
  బతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

  రిప్లయితొలగించు
 39. యతిదుర్వాసువరంబునున్ సుదతియయ్యారే పరీక్షింపగన్
  సుతపున్నావహనంబొనర్చగనెనాసూర్యుండు మన్నించె హా!
  వెతతానొందెనుకుంతిభోజుసుతయుద్వేగంబునన్ కన్యగా
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

  రిప్లయితొలగించు
 40. గురువుగార్కి నమస్కారముతో 🙏
  కం//
  జతగ సహదేవ నకులులు
  సతిమాద్రికి, అశ్వినులదె సంతతి నొసగన్ !
  పతి పాండురాజె యున్నను
  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రులన్ !!

  రిప్లయితొలగించు
 41. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"

  సందర్భము: జిత కందర్పుడు.. మన్మథుని జయించినవాడు. శివుడు. శివ తేజస్సును వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదించగా హనుజ్జననం జరిగింది. అందుకనే శివవీర్య సంభవుడని సంభావిస్తారు.
  భర్త యనుమతితో వాయుదేవుని గురించి తీవ్ర తపస్సు చేస్తున్న అంజనాదేవి క్షుద్బాధ పోగొట్టేందుకు వాయుదేవుడు రోజొక పండును అదృశ్యంగా ఆమె ముందుంచేవాడు. అలా చాలా కాలం గడిచింది. పుత్రార్థిని ఐన ఆమె తపస్సుకు మెచ్చి మున్ను ఈశ్వరుడు తన యందు నిక్షిప్తం చేసిన రుద్రతేజాన్ని ఒకరోజు ఫలరూపంలో ఆమె ముందుంచాడు వాయుదేవుడు.
  ఆమె ఆరగించి గర్భవతి అయింది. గర్భ చిహ్నాలు గమనించి అంజన కంగారు పడిపోగా ఆకాశవాణి ఇలా చెప్పింది.
  "మున్ను మర్కటరూపంలో పార్వతీ పరమేశ్వరులు వనంలో క్రీడించిన వేళ రుద్ర తేజాన్ని భరించడానికి పార్వతి అశక్తురాలైన కారణంగా భూమియందు, అగ్నియందు, వాయువునందు దానిని నిక్షిప్తం చేయటం జరిగింది. ఆ తేజాన్నే ఫలరూపంలో వాయువు నీయందు గర్భీకరించాడు. శివుడే ప్రత్యక్షంగా నీ గర్భాన ప్రభవించబోతున్నాడు."
  వాయుదేవుడూ ప్రసన్నుడై "నీ శీలం కలంకితం కాకుండా వర మిస్తున్నాను. నీ భర్తకు యథాతథంగా విన్నవించు." అన్నాడు.
  అంజన భర్తకు విషయమంతా చెప్పింది. అతడూ సంతోషించినాడు. కొన్నాళ్ళకు అంజన గర్భంలో ఆంజనేయుడు జన్మించాడు.
  ఆవిధంగా పతి సమాగమం లేకుండానే ప్రభవించిన వాడు హనుమంతుడు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *హనుమజ్జననము*

  జిత కందర్పుని తేజం

  బతి భద్రంబుగను దెచ్చి యనిలుం డీయన్

  నుతగుణ యా యంజన గొని

  పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  31.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 42. పతిలోలోపముగల్గుటన్ నడరియెవ్వారిన్సతాయించకన్
  బతినిన్సైతముదూలనాడకనుదాభర్తన్శదిన్గొల్వగా
  బతియేకృత్రిమగర్భమున్గొఱకుదావైద్యమ్ముజేయించగా
  బతిసంపర్కములేకపుత్రునిగనెన్ వామాక్షిసచ్ఛీలయై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "లోపము గల్గగా నడరి... (సతాయించక... అన్యదేశ్యం)" అనండి. 'భర్తన్శదిన్గొల్వగా'?

   తొలగించు
 43. అతులంబైన సభక్తిపూర్వముగ నత్యంతోగ్ర దూర్వాస స
  న్నుతిచే దివ్యవరప్రభావమున సన్మోదమ్ముతో నర్క సం
  స్తుతిఁ భాగ్యంబున కుంతి గాంచె నదె సత్శోభాకరున్ కర్ణునిన్
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై

  రిప్లయితొలగించు
 44. పతితోడన్ చెరసాలలో దనదు సౌభాగ్యప్రసాదమ్ముగా
  శ్రుతిసారంబగు వానినా పరమ పూర్ణుండౌ ఘనశ్యామునిన్
  మతిలేకే పడియుండగా ప్రజ నిశామధ్యంబునన్నా దివాం
  పతి సంపర్కములేక పుత్రునిగనెన్ వామాక్షి సచ్ఛీలయై

  రిప్లయితొలగించు
 45. అతులితమైన సుభక్తని స్థుతియించ కుమారి కుంతి సూర్యుని మదిలో దృతితోడ వరములిడ గో పతి సంపర్కమ్ములేకపడసెన్ బుత్రున్

  రిప్లయితొలగించు
 46. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "పతి సంపర్కము లేక పుత్రుని గనెన్
  వామాక్షి సచ్ఛీలయై"

  సందర్భము:
  ఒక హనుమద్భక్తుడు హనుమజ్జననం గురించి మిత్రునితో చెబుతూ "పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై" అన్నాడు అంజనాదేవిని పేర్కొంటూ..
  ఆంజనేయుడు వాయుదేవు డిచ్చిన పండువల్ల అంజనాదేవికి జన్మించినా డని ఆతని అభిప్రాయం.
  రామ భక్తుడైన ఆతని స్నేహితు డది విని "ఓస్! ఇందులో విశేష మేముంది? రామ జననం మాత్రం తక్కువదా! ఇటువంటిదే కదా! పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై" అన్నాడు కౌసల్యను పేర్కొంటూ..
  రాముడు కూడా యజ్ఞ ఫలంగా లభించిన పాయసం వల్ల జన్మించిన వాడే కదా!.. అని అతని అభిప్రాయం.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *ఇద్ద రిద్దరే!*

  "పతి సంపర్కము లేక పుత్రుని గనెన్
  వామాక్షి సచ్ఛీలయై
  జతగాడా!" యని యంజనా సుతుని స
  జ్జన్మంబుఁ బేర్కొన్న స్నే
  హితుతోఁ బల్కెను "రామ జన్మము నిదే
  లే!" యంచు నొక్కం డిటుల్
  "పతి సంపర్కము లేక పుత్రుని గనెన్
  వామాక్షి సచ్ఛీలయై"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  31.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 47. మూఁడవ పూరణము:

  [షణ్మాతురుఁడైన కుమారస్వామి పార్వతికిఁ గడుపారఁ గన్నకొడుకు కాఁడుగదా! స్నానీయ పిష్టోద్భవుఁడైన విఘ్నేశ్వరుఁడు కూడఁ బార్వతికిఁ గన్నకొడుకు కాఁడుగదా! వారు పుట్టిన పిదపనే శివపార్వతులకుఁ గొడుకులైనారు! పతి సంపర్కము లేకయే పార్వతి యా కుమారులనుఁ గాంచినది (=చూచినది) గదా! అనుట]

  సతతప్రార్థ్యుడు త్ర్యక్షు పుత్త్రకుఁడు తా జన్మించె షణ్మాతృఁడై!
  కృతపిష్టోద్భవబాలకుండును ప్రవర్తిల్లెన్ గజాస్యుండునై!
  సతియున్ శంకరు లేకమైరె ద్వయులౌ స్వచ్ఛందజుల్ వుట్టఁ? దం
  పతికిం బుత్త్రకులైరి స్కందుఁడును శూర్పశ్రోత్రుఁ డా వెన్కనే!

  పతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై!
  [దంపతీ>దంపతి తత్సమము. దంపతికిన్-దంపతులకు; కనెన్=చూచెను;]

  రిప్లయితొలగించు
 48. సతియా పార్వతి తానమాడునపుడా చాయాహరిద్రమ్ముతో
  ప్రతిమన్ చేయుచు నొద్దికన్ నలుగుకున్ ప్రాణంబులే పోయగా
  పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై
  యతడే విఘ్నవినాయకుండగుచు బ్రహ్మాండంబునేయేలెగా.

  రిప్లయితొలగించు