సందర్భము: దేహాత్మ భ్రాంతితో (దేహమే శాశ్వత మనే భ్రాంతితో) దాన్నే ప్రేమిస్తూ ఇంతకుమించి మరేమీ లే దనే మాయలో పడిపోయి భోగలాలసు డౌతాడు జీవుడు. ఇది మొదటి దశ. తద్వారా నిర్మలమైన శాశ్వతమైన దివ్యతత్వంలో తన మనస్సును స్థిరంగా నిలుపలేకపోతాడు. ఇది రెండవ దశ. ఇక అప్పటినుంచి మృత్యు వెప్పుడు కబళిస్తుందో అనే సంశయంతో ప్రతినిత్యం తెగ భయపడి పోతుంటాడు. అదే అతని నిత్య భావన. ఇది మూడవ దశ. ఇలా భావన చేస్తూ చేస్తూ మరణ స్మరణమే కాని మాధవ స్మరణం లేనందువల్ల.. మృత్యు స్మరణమే గాని మృత్యుంజయ స్మరణం లేనందువల్ల అతడు అనుకోకుండానే దైవానికి దూరమైపోతాడు. (రామ భక్తుడు కాకుండా పోతాడు.) ఇది నాల్గవ దశ. అట్లాంటి జనాళికి అంటే రామ భక్తులు కాని వాళ్ళకు భయం కలిగించేటట్టుగా శార్వరి వచ్చేసింది. అంటే రామ భక్తులైన వాళ్ళకు భయం తొలగించేటట్టుగా వచ్చేసిం దని అర్థం. అట్టి శార్వరికి స్వాగతం పలుకండి!! ~~~~~~~~~~~~~~~~~~~~~~
*దశల వారీగా..*
అకలుష దివ్య తత్వమున నాత్మను నిల్పక దేహమందు ప్రే మికు లయి.. భోగ లాలసత మృత్యు సమాగమ రూప సంశయ ప్రకటిత నిత్య భావు లయి, రాముని భక్తులు కాని వారలౌ సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 25.03.20 -----------------------------------------------------------
సందర్భము: రావణ వధకు ముందు రాత్రి. విచారంలో మునిగిపోయిన రావణుని మదిలో తాను విభీషణుని తిరస్కరించడం, అతడు తా నెన్నడూ ఊహించని విధంగా రాముని వైపు వెళ్ళిపోవడం గురుతుకు వచ్చి బాగా కలవరపడిపోయాడు. అతని స్మృతి పథంలో విభీషణుడు తన యెదుట నిలిచి ఇలా అంటున్నట్టు స్ఫురించసాగింది. "జిహ్వ గుహ్యములు రెండే సుఖ మిస్తా యనుకుంటారు మూర్ఖులు. ఇవే బలవత్తరమైన యింద్రియాలు. (మొదటి దానికి లొంగిపోయినవాడు కనిపించిందల్లా కడుపులోకి తోసేస్తూ వుంటాడు. రెండవదానికి దాసోఽహ మన్నవాడు కంటికి నదురురుగా కనిపించే ప్రతి యువతీ కావాలంటాడు.) ఒకటి విజృంభిస్తే మరొకటి విజృంభిస్తుంది.. ఒకటి అణిగితే మరొకటి అణగుతుంది. (చైనాలో రుచుల యావ పెచ్చుపెరిగి పోవడం, జనాభా చెట్టెక్కి కూర్చోవడం ఈ రెండింద్రియాల విజృంభణయే!) (కుంభకర్ణుడు జిహ్వకు, రావణుడు గుహ్యానికీ సంకేతాలు.) కుంభకర్ణుడు ఉట్టి పుణ్యానికే నేలకూలాడు. తర్వాతి వంతు నీదే! ఈ (లంకలోని) సకల జనాలు భీతిల్లే శార్వరి (రాత్రి) ఇదే! ఇదే నీకు చివరి రాత్రి. తెల్లవారితే నీ జీవితానికి భద్రత లేదు. (రాముని చేతిలో మృత్యువే!)" ("శార్వరి" అంటే "రాత్రి" అనే అర్థంలో ప్రయుక్తము.) మన ఇంద్రియాలలో కండ్లకు చూడడ మనే పని, చెవులకు వినడ మనే పని ఒక్కొక్కటే అప్పజెప్పబడినవి. అలాగే తక్కిన వాటికీ.. కాని జిహ్వకు రుచి చూడడం, మాట్లాడడం అనే రెండు పనులూ, గుహ్యానికి మూత్ర విసర్జనం, మైథునం అనే రెండు పనులూ అప్పజెప్పబడినవి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జంట కవులు*
"సుక మిడు జిహ్వ గుహ్యములె సు" మ్మనుకొందురు మూర్ఖు..లిందులో నొకటి శమింప వేరొకటి యున్ శమియింపదె! కుంభకర్ణు డూ రక కనుమూసెనే! పిదప రాగల దా దురవస్థ నీకె!.. ఈ సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 25.03.20 -----------------------------------------------------------
వికలమె చెందితిమి గద
రిప్లయితొలగించండివికారిని విరివిగ నీయ వెతల కరోనా!
యిక తేరుకొనక ముందే...
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "వికలమ్మె చెందితిమి గద" అనండి.
కవి మిత్రులందరికీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండివికలమవగ మానసములు
తికమక బెట్టెడి కరోన తీరునుజూడన్
ఒకరికొకరు దూరమవగ
సకలజన భయంకరముగ శార్వరివచ్చెన్
మీ పూరణపై వాట్సప్ సమీక్షను గమనించండి.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!
తొలగించండిపకపకలే కరవాయెను
తొలగించండిమకరాంకుని జాడగనము మరణభయమ్మే
ప్రకటితమై పీడింపగ
సకలజన భయంకరముగ శార్వరివచ్చెన్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
శుకములు మూగగా తనరి చూడగ ముచ్చటమీర జామలన్
పికములు కూయుచుండగను ప్రీతిని మామిడి తోటలందునన్
తికమక లేక వేపలది తియ్యని పచ్చడి నింట గ్రోలుచున్
వికలపు మానసమ్ము విడి వేడుక జేయుడు!;...వెంగళప్పలౌ
సకలజనాళి భీతిలఁగ;...శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!
ఇప్పటి దుర్భర పరిస్థితిలో అందరికీ ధైర్యం చెప్తూ చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. (ఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు!). అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
స్వర్గారోహణ పర్వము (Police Warning):
పకపక నవ్వి వీధులను పండుగ జేయుచు నాట్యమాడుచున్
సుకముల వీడకుండగను శుంఠల ముద్దిడి కాగలించగా
నకనక లాడకుండగను నందము నొందుచు జైలునందునన్
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కౌగిలించగా" టైపాటు.
🙏
తొలగించండికంది గురువులకు, కవివర్యులందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు నమస్సులు 🙏🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ 🙏
*కం||*
అకటా! వికారి గడిచెను
సకలము సంతోషమనగ శాపము బెట్టెన్
యొకపరి తరచిట జూచిన
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
మరో పూరణ 🌹🌹🙏
తొలగించండి*కం||*
కకలా వికలము జేయగ
పకపక నవ్వుచు వికారి పరుగులు దీసెన్
సకలము శాంతమె తదుపరి
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'...బెట్టెన్ + ఒకపరి' అన్నపుడు యడాగమం రాదు. "శాపము నిడె నే । నొకపరి..." అనండి.
రిప్లయితొలగించండినా పూరణ :: చంపకమాల
**** ***** ***** ***** ***** ***
వికలము జెందె మానసము వేగన గోవిడు భూత మేగుచున్
తికమక జేసి భూరి గడతేర్చ ప్రజాళి వికారి నందునన్
ఇక యరుదెంచు వత్సరమె ఎంతటి ఘోరము జేయునో యనిన్
సకలజనాళి భీతిలగ...శార్వరి వచ్చెను స్వాగతింపుడీ!
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వేగను/వేగమె కోవిడు... తికమక సేసి మించి... వికారి యందు తా నిక నరుదెంచు... జేయునంచు నీ సకల..." అనండి.
ధన్యవాదాలు గురువు గారూ...
తొలగించండి(చల్లని శార్వరి - కరకు కరోన)
రిప్లయితొలగించండివికలము నందె చిత్తములు
వేకి కరోనయె విస్తరిల్లగా;
నికరములైన సంపదలు
నిండుకొనెన్ బ్రతిదేశమందున;
న్నిక మనజీవితమ్మెటుల
నింపుగ సాగెడునన్ దలంపుతో
సకలజనాళి భీతిలగ;
శార్వరి వచ్చెను స్వాగతింపుడీ!
(వేకి -వ్యాధి;నిండుకొను -శూన్యమగు)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'... అందునన్+ఇక' ఇక్కడ ద్విత్వ నకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు వర్జించండి.
రిప్లయితొలగించండిశార్వరి ఆగమనంతో ప్రపంచాన్ని వికారంగా మారుస్తున్న కరోన వీడుతుందని ఆశిస్తో
శుభాకాంక్షలతో
వికటాట్టహాసముల సూ
క్ష్మకృమియె నెదిరింప గా సుమా మనుజులనే
నకటా! ఏమని చెప్పుదు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
***
సకల జనుల పోరామియు
నిక పోవుటకు పరమాత్మ నిమ్మళమును జే
ర్చ కరుణ జూపవలయు ఆ
నక "కోయీ రోడ్డు పైన నా నికలే" జీ!
జిలేబి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"మనుజులనే యకటా..." అనండి.
'జేర్చ(న్)' ద్రుతాంతం కనుక "జేర్చ గరుణ..." అవుతుంది.
చకచకబ్రాకి లోకమున సర్వవిధంబుల మానసంబులన్
రిప్లయితొలగించండివికలము జేసె దుర్మతిని విజ్ఞతలేని "కరోన"దానిచే
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను, స్వాగతింపుఁడీ
యకలుష భావదీప్తి నిట నందును స్వాస్థ్యము సౌఖ్యసంపదల్.
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీకరమగునని దలచగ
రిప్లయితొలగించండివికటంబుగ నడుగుబెట్టె భీకర వైరస్
అకటా! విధి నేమందును
సకలజన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు 💐🙏
నకనకలాడు రక్కసియనంగ కరోనయె తాండవింప., న...
ప్రకటితబంధనమ్ముల కరమ్ముల కాళ్లకు కట్లు కట్టి మీ...
రిక పరుగెత్తుడీ యనగనెట్టులొ పొందుట వేపపువ్విలన్
సకలజనాళి భీతిలగ శార్వరి వచ్చెను స్వాగతింపుడీ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅకట! వికారి గడచె గద
రిప్లయితొలగించండిసకలజన భయంకరముగ! శార్వరి వచ్చెన్
మకిలము తొలగించి ప్రజకు
సుకమును సౌఖ్యమ్ము లిడుచు సోయగ మొప్పన్!
గురువర్యులకు, పెద్దలకు, శంకరాభరణంబ్లాగ్ సభ్యులందరికి శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.🌹🌹🌹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచకితుల జేయుచు జనులను
రిప్లయితొలగించండివికటంబుగ నవ్వు చుండె వింత కరోనా
ప్రకటం బ య్యెను గదరా
సకల జన భయంకరముగ శార్వరి వ చ్చె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరో పూరణ 🌹🌹🌹
రిప్లయితొలగించండి*కం||*
సకలము శాంతమ్మికపై
సకలము సంతోషముండు శార్వరి తోడౌ
నికయిది మొదలే గనుకను
*"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"*
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ శార్వరీ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచంపకమాల (పంచపాది)
పెకలు కరోనచే పికము వేదనఁ బాడెడు మృత్యుగీతితో
సకలము మూసివేసికొని సాంతము వ్యక్తులు దూరముండుటన్
వికలముఁ జెందె మానసము వీధుల పండుగ శోభవీడగన్
నికరము షడ్రుచుల్ గలియ నేరక దూర ముగాది యుంచుటన్
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచకచక నంటుకున్నదిలఁ శక్యము గాదె కరోన నాపుటే?
రిప్లయితొలగించండివికలములైన దేహములు, వేదన పీడిత మర్త్యులన్ కనెన్
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ
సకలము దుఃఖముల్ మరచి షడ్రుచులూరిన పచ్చడిన్ గొనిన్౹౹
గురువుగారికీ, శంకరాభరణం బ్లాగు ఉపయోక్తలందరికీ శార్వరి ఉగాది శుభాకాంక్షలు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపెకలిన కరోన ధాటికి
నొకరి కొకరు దూరమైన నుద్విగ్నతలన్
చకిత యుగాదినొ సంగుచు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు శ్రీ శార్వరి యుగాది పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిప్రకటభయంకరోచ్ఛిఖలఁ బైఁ కెగఁద్రోయుచుఁ గాల్చివేయుచున్
వికట కరోన వైరసులఁ బెంచి వికారియె రోగియై చనెన్
సకలజనాళి భీతిలఁగ! శార్వరి వచ్చెను స్వాగతింపుఁ డీ
వికట కరోనఁ ద్రుంచియు, భవిష్య మరోగతఁ బ్రోవ, మ్రొక్కుచున్!
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండివికటపు పరిహాసంబిది
రిప్లయితొలగించండిప్రకటంబై ప్రకృతి నాశ పరిహారముగా
వికలము జేయుచు మనసులు
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండితికమక జేయుచు మహమ్మా
రికరో నావై రస్సే హరిని వణికింపన్
అకటా యేమని చెపుదును
సకల జనభ యంకరముగ శార్వరి వచ్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి, రెండవ పాదాలలో గణభంగం. "...జేసి మహమ్మా... వైరసే" అనండి.
సుక, సంకటముల నెల్లరు
రిప్లయితొలగించండివికలము జెందక ధృతిమతి వేల్పుల వేడన్
మకిలము బాపుగ మురహరి
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సుకముల నిడుముల నెల్లరు..." అనండి.
అకటా కరోన యను లా
రిప్లయితొలగించండిలికమ్మునెక్కి జముడు విహరించుచు
కాకా
వికలము జేసెడి వేళను
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"విహరించుచును కకా వికలము..." అనండి.
ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికం॥
వికటపు కరోన క్రిములను
వికృతమయిన నడత తోడ వెంబడి తేవన్
ఒకసారిగ జగమందలి
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తేవన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
ప్రకృతి వికటింప మనసులు
రిప్లయితొలగించండివికలము నొందెను, జనాళి వేదనఁ గనుచున్
వికవికలాడె కరోనా
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండివికరము ముంచు కొచ్చె కడు భీకర వేదన విశ్వమంతటన్
కకవిక లాడ నెల్లెడల కారణ మైన కరోన వైరసు
న్నిక నిటు భారతమ్మునను నెంచక నుండె నుగాది పండుగన్
సకల జనాళి భీతిలగ శార్వరి వచ్చెను స్వాగతింపుడీ
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికలము నొంద మానవులు, వేడుకఁ గాంచి కరోన తృప్తితో
రిప్లయితొలగించండివికవికలాడె, వైద్యులను వేడుచు నుండ్రి ప్రజాళి భీతితో
చకచక సాగుచున్ ప్రభుత సాయము చేయుచు నుండ, కొంపలో
సకలజనాళి భీతిలఁగ, శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రకటిత మై కరోనయె ప్రపంచము నందున రోజురోజుకున్
రిప్లయితొలగించండిజకచక విస్తరించుచు విచారము పెంచగఁ బ్రాణ భీతితో
నకమున లోకమే మునుగు నత్తరి వృద్ధ వికారి వెళ్ళగా
సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నకమున'?
వికలముజేయుచుడెందము
రిప్లయితొలగించండిపకపకమనునవ్వుతోడపాడుకరోనా
వికటాట్టహాసనడుమున
సకలజనభయంకరముగశార్వరివచ్చెన్
ఉగాదిశుభాకాంక్షలు
తొలగించండిసోదరసోదరీమణులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వికటంపు నగవుల నడుమ/వికట్టాటహాస మొనరుచు" అనండి.
శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివికలము కాఁగ నుపాయము
లకటా దీపమ్ము లన్ని యార నొక ద్రుటిన్
వికృతంపురూప మడరన్
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
[శార్వరి = రాత్రి]
ప్రకటిత శుద్ధ వత్సరము బాంధవ మిత్రజ నోఘ చిత్త మో
ద కర మనోర థాది వర దాయక సౌఖ్య విహార మగ్నతన్
సకల బుధవ్రజాలి మనసార నుతించ వినా సుధీ మన
స్సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండివికలముతోడమానసమువీగకరోనయెవచ్చెచూడరో
రిప్లయితొలగించండిసకలజనాళిభీతిలిగ,శార్వరివచ్చెనుస్వాగతింపుడీ
నవనవలాడుచుండుచునున్యాయముజేయగభూజనాళికిన్
సకలజనంబులియ్యెడనుశార్వరిరాకకుమోదమొందుడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికలమొనర్చుచువెడలెను
రిప్లయితొలగించండిసకలముజగమునవికారిసంవత్సరమే
చకచక కరోనచేగొని
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"
సందర్భము: దేహాత్మ భ్రాంతితో (దేహమే శాశ్వత మనే భ్రాంతితో) దాన్నే ప్రేమిస్తూ ఇంతకుమించి మరేమీ లే దనే మాయలో పడిపోయి భోగలాలసు డౌతాడు జీవుడు. ఇది మొదటి దశ.
తద్వారా నిర్మలమైన శాశ్వతమైన దివ్యతత్వంలో తన మనస్సును స్థిరంగా నిలుపలేకపోతాడు. ఇది రెండవ దశ.
ఇక అప్పటినుంచి మృత్యు వెప్పుడు కబళిస్తుందో అనే సంశయంతో ప్రతినిత్యం తెగ భయపడి పోతుంటాడు. అదే అతని నిత్య భావన. ఇది మూడవ దశ.
ఇలా భావన చేస్తూ చేస్తూ మరణ స్మరణమే కాని మాధవ స్మరణం లేనందువల్ల.. మృత్యు స్మరణమే గాని మృత్యుంజయ స్మరణం లేనందువల్ల అతడు అనుకోకుండానే దైవానికి దూరమైపోతాడు. (రామ భక్తుడు కాకుండా పోతాడు.) ఇది నాల్గవ దశ.
అట్లాంటి జనాళికి అంటే రామ భక్తులు కాని వాళ్ళకు భయం కలిగించేటట్టుగా శార్వరి వచ్చేసింది. అంటే రామ భక్తులైన వాళ్ళకు భయం తొలగించేటట్టుగా వచ్చేసిం దని అర్థం.
అట్టి శార్వరికి స్వాగతం పలుకండి!!
~~~~~~~~~~~~~~~~~~~~~~
*దశల వారీగా..*
అకలుష దివ్య తత్వమున
నాత్మను నిల్పక దేహమందు ప్రే
మికు లయి.. భోగ లాలసత
మృత్యు సమాగమ రూప సంశయ
ప్రకటిత నిత్య భావు లయి,
రాముని భక్తులు కాని వారలౌ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను
స్వాగతింపుఁడీ"
సందర్భము:
రావణ వధకు ముందు రాత్రి.
విచారంలో మునిగిపోయిన రావణుని మదిలో తాను విభీషణుని తిరస్కరించడం, అతడు తా నెన్నడూ ఊహించని విధంగా రాముని వైపు వెళ్ళిపోవడం గురుతుకు వచ్చి బాగా కలవరపడిపోయాడు. అతని స్మృతి పథంలో విభీషణుడు తన యెదుట నిలిచి ఇలా అంటున్నట్టు స్ఫురించసాగింది.
"జిహ్వ గుహ్యములు రెండే సుఖ మిస్తా యనుకుంటారు మూర్ఖులు. ఇవే బలవత్తరమైన యింద్రియాలు.
(మొదటి దానికి లొంగిపోయినవాడు కనిపించిందల్లా కడుపులోకి తోసేస్తూ వుంటాడు. రెండవదానికి దాసోఽహ మన్నవాడు కంటికి నదురురుగా కనిపించే ప్రతి యువతీ కావాలంటాడు.)
ఒకటి విజృంభిస్తే మరొకటి విజృంభిస్తుంది.. ఒకటి అణిగితే మరొకటి అణగుతుంది.
(చైనాలో రుచుల యావ పెచ్చుపెరిగి పోవడం, జనాభా చెట్టెక్కి కూర్చోవడం ఈ రెండింద్రియాల విజృంభణయే!)
(కుంభకర్ణుడు జిహ్వకు, రావణుడు గుహ్యానికీ సంకేతాలు.)
కుంభకర్ణుడు ఉట్టి పుణ్యానికే నేలకూలాడు. తర్వాతి వంతు నీదే!
ఈ (లంకలోని) సకల జనాలు భీతిల్లే శార్వరి (రాత్రి) ఇదే! ఇదే నీకు చివరి రాత్రి. తెల్లవారితే నీ జీవితానికి భద్రత లేదు. (రాముని చేతిలో మృత్యువే!)"
("శార్వరి" అంటే "రాత్రి" అనే అర్థంలో ప్రయుక్తము.)
మన ఇంద్రియాలలో కండ్లకు చూడడ మనే పని, చెవులకు వినడ మనే పని ఒక్కొక్కటే అప్పజెప్పబడినవి. అలాగే తక్కిన వాటికీ.. కాని జిహ్వకు రుచి చూడడం, మాట్లాడడం అనే రెండు పనులూ, గుహ్యానికి మూత్ర విసర్జనం, మైథునం అనే రెండు పనులూ అప్పజెప్పబడినవి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జంట కవులు*
"సుక మిడు జిహ్వ గుహ్యములె
సు" మ్మనుకొందురు మూర్ఖు..లిందులో
నొకటి శమింప వేరొకటి
యున్ శమియింపదె! కుంభకర్ణు డూ
రక కనుమూసెనే! పిదప
రాగల దా దురవస్థ నీకె!.. ఈ
సకల జనాళి భీతిలఁగ
శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ!"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.03.20
-----------------------------------------------------------
"ప్రకటన లందుకరోనా
రిప్లయితొలగించండిసకలజనభయంకరముగ"!" శార్వరివచ్చెన్
నికరములేని వికారి బ
హు కళంకములందువెళ్ల!" హుందాతనమున్!
వికల మనస్కులయి జనులు
రిప్లయితొలగించండికకావికలయి గృహమందె కరొన భయంతో
ఒకరొకరై బ్రతుకు గడప
సకలజన భయంకరముగ శార్వరి వచ్చెన్