సందర్భము: శక్తి స్వరూపిణి కినుక వహిస్తే యుక్తులు పని చేస్తాయా! సుమ సుకుమారియైన సీత త్రికూట పర్వతం మీదున్న లంకా పట్టణాన్నే పీనుగు పెంట గావించింది. అంటే పర్వతాన్నే ఛిన్నాభిన్నం చేసివేసింది. ఇది చాలా విచిత్రం. అనూహ్యం. మనకు అనూహ్యమైన విషయాలన్నీ విచిత్రాలుగానే భాసిస్తూ వుంటాయి. లేదా ఘోరాలుగా భయపెడుతూ వుంటాయి. దానికి కారణం ఆ విషయాలు కావు. ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయిన మనమే! అలా వెళ్ళడానికి కారణం మన అహంకారం. అహంకారాన్ని వంచనను ద్వేషాన్ని చేజేతులా పెంచి పోషించి అవి తీరా నెత్తి నెక్కి తైతక్క లాడుతుంటే ఇంక పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మవలన చావు లేని వరాలు పొందిన రావణు నంతవాడినైనా ప్రకృతి వదలిపెట్టే ముచ్చటే లేదు. (నేటి చైనాలాగా) ప్రకృతి.. మాత లాంటిది. అందుకే ప్రకృతి మాత.. అన్నారు. అది ప్రేమ పంచి జీవితా న్నిస్తుంది. దానిని సవతి తల్లిలాగానో రాక్షసిలాగానో మనమే తయారు చేసుకుంటే ఘోర పతనం మన వెనుకనే పొంచి వుంటుం దన్నది యథార్థం. మాయా స్వరూపిణి యైన ప్రకృతికి అసాధ్యం లేదు. *ప్రకృతి వికృతి యైతే పతనమే గతి* యౌతుం దన్న సారాంశాన్నే సీతాపహరణం రావణపతనం అనే సంఘటనల ద్వారా రామాయణం ఎన్నడో మన దేశానికి బల్లగుద్ది చెప్పింది. (వేరే దేశాల సంగతి వేరు.) కోమలమైన పుష్పం చీల్చి వేయా లనుకుంటే కొండనైనా చాలా చక్కగా చీల్చి వేస్తుంది. అది చిత్రమే కాదు సుమా! ~~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
ప్రేమను మధ్యదేశమున వింధ్యను వోలు ప్రభుత్వమేలగా
గోముగ జ్యోతి రాజు కడు గొప్పగు రీతిని జంపు చేయగా
భామలు మోదమొందగను భాజప పార్టికి చిహ్నమయ్యెదిన్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
జ్యోతి రాజు = Jyotiraditya Scindia
భామలు = Vasundhara Raje Scindia, Yasodhara Raje Scindia
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వింధ్యను+పోలు' అన్నపుడు సరళాదేశం వస్తుంది. గసడదవాదేశం రాదు. "వింధ్యను బోలు" అనండి. "చిహ్నమయ్యెడిన్" టైపాటు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భూములు త్రవ్వుటన్ విడిచి పోడిమి మీర యమేఠి నందునన్
దోమల త్రోలుచున్ ప్రజలు తోరపు గుంపుల చూచుచుండగా
కోమలి రాహులున్ గెలువ; కొట్టుచు డ్రమ్ములు పాడిరివ్విధిన్:👇
“కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"
తొలగించండి"నమేఠి"?
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి"మీర నమేథి" అనడమే సాధువు.
🙏
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"
*తే.గీ**
త్రాసు లోని కృష్ణుడు తూగు తాడనుకొని
సత్యభామ కనకమంత చక్కబెట్టె
స్వల్పమైన లేవగలేదు చక్రపాణి
తులసి దళముతో రుక్మిణి తూగజేసె
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
..................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తూగుతాడు' అనడం వ్యావహారికం.
కోట్ల జనులకు స్వాస్థ్యముఁ కూల్చివేసి
రిప్లయితొలగించండిగడప దాటక నింటయే గడుప జేసి
జగముఁ స్తంభింపజేయఁ చెలగె కరోన
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"స్తంభింపజేయఁ జెలగె" అనండి.
(విష్ణుభక్తుడైన విప్రనారాయణుడు వారవనిత దేవదేవికి
రిప్లయితొలగించండివశమైనాడని విన్న పౌరులలో ఒకరు మరొకరితో)
శ్యామలవర్ణుడైన హరి;
సారసనేత్రు;రమాసమేతునిన్
నేమము దప్పకుండ తన
నెమ్మనమందున గొల్చుచుండు నా
ధీమణి- దేవదేవి యిటు
దింపెన మోహపురొంపిలోనికిన్!
కోమలపుష్పపత్రమదె
కొండను జీల్చె;గనంగ జిత్రమే!!
(నేము -నియమము ;ధీమణిన్ -బుద్ధిమంతుని)
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి"శ్యామలవర్ణుడౌ హరిని..." అంటే ఇంకా బాగుంటుందేమో?
నేమము
రిప్లయితొలగించండి[27/03, 04:49] PKSKumar: పోతన భాగవతమును సింగరాయ భూపతికిఅంకితము ఇవ్వమనగా శ్రీనాదునితో పోతన పలుకు సందర్భము సీసములో నా పూరణము
రిప్లయితొలగించండిఎవ్వడీ సృష్టికి హేతువాయెను, యే మ
హాత్ముని కుక్షిలొ నబ్ధి నేమి
లీనమై నుండునో, మానవ జాతికి
మూలమౌ కారణము లెచట గను
గొంటినో,, యెవ్వడు, తొంటి,నడుమ,లయ
కారకుం డెవ్వడో ,కరుణ రసము
నాపై గుప్పించి ఘనమగు నీ భాగవ
తామృత సారమ్ము ధరణి లోన
ప్రజలకు నా జేత బంచగ పూనెనో
నాతండు, దశరధ నందనుండు
సీతా సహచరుడు,శ్రీనాధు డర్హుడీ
భాగవతా కృతిన్ పట్టబోవ,
వినుము శ్రీ నాద, పోతన యివ్వ జాలడు
సింగరా యునకును,చెప్పు చుంటి
రాఘ వుండు ఘనుడు రమ్యగతి నిడెద
నంకి తమ్ము నతని కెప్పుడైన
రామ కొలువు నాకు, రాజుల మేటి ద
ర్బారె శరణ మయ్యెపండితులకు
: గురువు గారు నమస్కారం శుభోదయము నిన్నటి పూరణము ఒకసారి పరిశీలించండి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నాపై గుప్పించి' అన్నచోట గణభంగం.
రిప్లయితొలగించండిమనుజు డారడుగుల పైని మంకుఘటము
మాలిని కనులు రెపరెప మసకలాడె
హత్తుకొనమటంచు ఫలితమాయె పెండ్లి
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచైన వదలిన వైరసు మనల చేరి
రిప్లయితొలగించండికనబడదు కాని జనులను కడకు చేర్చు
రక్ష లేదు రాజుకు యువరాజు నకును
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి[27/03, 05:52] PKSKumar: పిల్ల వానికి నిత్తు ప్రేమతో పాలని శిశువును
రిప్లయితొలగించండిముద్దాడి చీర కప్పి
కంచుకమును తొలగించి కుచము నొక్క
దానిని జొనప, పెదవులు తెరచి
మొదటి గుటక వేయ ముదముగ బాలుడు,
కనబడె చుక్కలు కళ్ళ యెదుట,
రెండవ గుటకకు గుండె ఘోషిల్లగా
పూతన ప్రాణముల్ పోయె గాదె
మూడవ గుటక వేయంగ,
తాడి చెట్టు
వోలె కూలె ధరణి పైన, బాల కుడిని
గాంచి జనులు పలికె నిట్లు యెంచి చూడ
కుసుమ పత్రము ఛేధించె కొండనౌర
నేటి శంకరాభరణం వారి సమస్య నా పూరణ. సీసములో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జనులు పలికి రిటు లెంచి చూడ" అనండి.
రిప్లయితొలగించండిఆ మనుజుండు మంకు ఘటమాయెను ప్రేముడి హెచ్చుగానగా
కోమలి కన్బొమల్ ముడిచి కోరిక మీరగ సైగ చేయగా
కాముని వింటి బాణపు ప్రకంపన తాకగ పాణిబంధమున్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసంజయుడు.. ధృతరాష్ట్రునితో...
ధీమహితుండు ద్రోణుడు మతిప్రతిభన్ రచియింప నేటి సం...
గ్రామమునందు వ్యూహమును., రాజితధైర్యపరాక్రమక్రమా..
క్రామితపద్మతంత్రునిగ రాజిలు పార్థసుతానురూపమౌ
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅయ్యపర్ణపై మోహమ్ము నలుము కొనక
వెండికొండవలెన్ శివుడుండె మార!
కొమరుఁ డుదయించు టెట్లని యమరులడుఁగ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమునిబాలుడైన లవు డద్భుతమౌనటు లావనస్థలిన్
రిప్లయితొలగించండినీమముతోడ నశ్వమును నిల్పి గ్రహింపగ జేరు సైన్యమున్
క్షేమము గూలునట్లుగను జేసిన వానిని మెచ్చి రీగతిన్
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిమా మర! తారకాసురుని మార్కొనఁ గల్గు కుమారసంభవ
మ్మే! మన యాది శంకరుడు మిన్నక నుండెను వెండికొండయై
భామ నపర్ణఁ గూర్చెడు వివాహము సాధ్యము నీకనన్ సురల్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రసిద్ధ అవధానులు శ్రీ నరాల రామారెడ్డి గారి సూచన మేరకు సవరించిన పూరణ :
తొలగించండిఉత్పలమాల
ఓ మధుసారథీ! యసురు నుక్కడఁగించు కుమారసంభవ
మ్మే! మన యాది శంకరుడు మిన్నక యుండెను వెండికొండయై
భామ నపర్ణఁ గూర్చెడు వివాహము సాధ్యము నీకనన్ సురల్
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!
చాలరకముల క్రిములను చంపగలదు
రిప్లయితొలగించండికుసుమపత్రంబు ; ఛేదించెఁ గొండ నౌర
యనుచు నాశ్చర్య పడనేల ! యతి సహజమె
మనకువచ్చు రోగమునొక మలగ తలచ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాలుడీతడైననుగాని భయము లేక
రిప్లయితొలగించండిగిరిని తానెత్తి పట్టెను కేలు తోడ
కుసుమ పత్రము ఛేదించె కొండ నౌర
యనుచు గాంచిరి ప్రజలెల్ల రబ్బురమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగర్వ భంగము సత్యకు గల్గి నపుడు
రిప్లయితొలగించండిభక్తి తోడ తులసి వేయ ఫలిత మబ్బె
దీని వలనను దెలిసెను ధీజను లకు
కుసుమ పత్రము ఛే దించె కొండ నౌర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదోమ కాటు వలన పెద్ద సామజములె
రిప్లయితొలగించండిసమసి పోయెనకట వ్యాధి సంక్రమింప
చెరుప నల్పులె చాలుగా చేటు మూడ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[నరకునితోడి యుద్ధమందు సత్యభామ శృంగారవీరరసయుక్తయై నరక సైన్యమును నుగ్గుసేసిన వైనమును నిట ననుసంధానించుకొనునది]
కోమలి సత్యభామ నరకుం దునుమంగను విల్లునందియున్
దా మురభిత్తునిం గుజుని దందడి శృంగము వీరముల్ దగన్
గోముగఁ గోపిగం గనుచు గొబ్బునఁ జీల్చెను దైత్యమండలిన్!
గోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసూక్ష్మ జీవది జగమెల్ల చుట్టె చూడు
రిప్లయితొలగించండికోట్ల జనులను భయపెట్టి కూకపెట్టె
వినక రోనా విలయంబు వింతగొలిపె
కుసుమ పత్రము ఛేదించెఁ గొండనౌర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "విన కరోనా విలయమది వింత గొలిపె" అనండి.
ఏమి సమస్యనిచ్చిరిది యెట్టుల పూరణ సేయనౌనొకో!
రిప్లయితొలగించండిభామల వాలుచూపుల ప్రభావము వైరసు వోలె నంగనా
కామము రేగఁజేయుఁ గద! గాధిజు మేనక భ్రష్టుఁ జల్పదే!
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భ్రష్టుఁ జేయదే" అంటే ఇంకా బాగుంటుందనుకుంటాను.
శంకరాభరణం ...27/03/2020
రిప్లయితొలగించండిశుక్రవారం
సమస్య
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"
నా పూరణ
**** **** **
భామిని సత్యభామ తన భర్తని త్రాసున దూచనెంచుచున్
హేమము వేయ బళ్ళెమున నించుకయున్ హరి పైకి రాడొకో
క్షేమ మొసంగు శౌరి తులసీదళ శక్తికి దూగె నబ్రమే!
"కోమల పుష్పపత్రమదె కొండను జీల్చె గనంగ జిత్రమే"
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భర్తను... పైకి రాడయో..." అనండి.
ఏమని యందుమీ విలయమిట్టి భయమ్మును గల్గజేసెనే
రిప్లయితొలగించండిసేమము దూరమాయె భువి జిన్న విషక్రిమి వల్ల జూడగా
నేమరుపాటునుండిననిదెంతటి కష్టము దెచ్చిపెట్టునో
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిరాణి రుద్రమ చెండాడె రౌద్ర మరుల !
రిప్లయితొలగించండిఝాన్శి రాణి శౌర్యము సాటి జాతి గలర ?
అతివ తలచిన ఢీకొను నమిత శక్తి !
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షేమము గూర్చమంచు దరి జేర, నమర్త్యుల బాధతీర్చగన్
రిప్లయితొలగించండితామసు డైన దానవుడు తారకుఁ ద్రుంచిన బాలకుండు షో
డాముఖు డైన పావకి మృడాని కుమారుని గాథ తెల్పదే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికానిపించదువైరస్సు కంటికకట
రిప్లయితొలగించండివేలకొలదిగ జనములువిగతులైరి
యేమిపాపముజేసితిమేమొ మేము
కుసుమపత్రంబుఛేదించెగొండనౌర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమనిజెప్పనొప్పుదునునీశ్వర!గావుమయీకరోన,మా
రిప్లయితొలగించండిసేమమునూడలాగుటకుజిత్రముగానరుదెంచెనిత్తరిన్
భామలువృద్ధులున్మఱియుపాపలుపోయిరిసోకినంతనే
కోమలపుష్పపత్రమిదెకొండనుజీల్చెగనంగజిత్రమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉగ్ర సంగరమున నాపె నుగ్రుఁ డౌచు
రిప్లయితొలగించండినొక్క దివసమ్ము చెలరేఁగి యక్కజముగ
సింధుపతి భీమసేనాది సింహబలులఁ
గుసుమ పత్రంబు ఛేదించెఁ గొండ నౌర
బీమ బలాఢ్య దేశ తతి భీతిలఁ జేసె సమౌనరాగ కే
ళీ మనుజాంతక ప్రగతి రేఁగుచు విశ్వము నెల్లఁ జంపునా
యేమి కరోనకుక్షికృమి హీన తరాన్య మృదూపజీవియే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
[కర +ఊన కుక్షి కృమి = కరోన కుక్షి కృమి = చేతులు లేని పొట్టగల క్రిమి]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:
రిప్లయితొలగించండిప్రేమము దెల్ప రాజసుత వీడెను భీష్ముని, సాళ్వ రాజునున్
నేమము మేర, సోమునిగ నెంచి శిఖండిగ మార్పు జెందగన్
కోమలి జేర నర్జునుని కూబరి జంపగ గంగ పుత్రునిన్
కోమల పుష్ప పత్ర మదె కొండను జీల్చె గనంగ జిత్రమే
రాజసుత: అంబ
సోమునిగ: శంకరుని గూర్చి తపస్సు చేయడం తో
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్యామలవర్ణుడైన హరి చక్కగనవ్వుచు ప్రేమమీరగా
రిప్లయితొలగించండినేమరుపాటులేక క్రమమేడు దినమ్ములు నొక్కహస్తమున్
దామరపూవువోలె గిరిదాల్చగ గాచుచు గోకులంబునన్
కోమల పత్రపుష్పమదె కొండనుజీల్చె గనంగచిత్రమే!
వామనరూపుడై గదిసి వద్దనె స్వర్ణము పాడియావులన్
తొలగించండికామన కొద్దిపాటిదగు గట్టిది క్షేత్రము మూడడుంగులే
క్షేమము నెంచుచున్ భువికిచేర్చె బలిన్ వడి నాగలోకమున్
కోమల పత్రపుష్పమదె కొండనుజీల్చె గనంగచిత్రమే!
మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురుదేవా,నమస్సులు!
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిలంక వాసులు పోరున లక్ష్మణుడను
మూర్ఛ జేసిరి యంతట మూర్తి మంతు
బల్క,జగతిన విడ్డూర బాహి నందు
కుసుమ పత్రము చేదించె కొండ నౌర.
ఉత్పలమాల
రిప్లయితొలగించండికోమలి 'పూలసోయగము' 'కొండ' నుఁ బోలిన నాదుగుండెనే
వేమరు చెప్పినన్ వినక వెఱ్ఱిగ లాగెనటన్న కీచకున్
దా మరులొల్కి మాలినియె నర్తన శాలకుఁ బిల్వఁ 'జీలె' నే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే!
పద్మదళములకెనయగు పడతికనులు
రిప్లయితొలగించండికనులుకావవి పదునగుకత్తి మొనలు
మొనయ మోహము చెలికాని మోముఁగనఁగ
కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర
కోమలివాలుకన్నుగవ కోలుమసంగినమారు తూపులే
రిప్లయితొలగించండిగోముగనోరకంటగనగుండెగుభిల్లనునేరికైననా
మోమున పద్మపత్రములె మోదముగూర్చెడు నాపె చూడ్కులా
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"కోమల పుష్పపత్ర మదె కొండనుఁ జీల్చెఁ
గనంగఁ జిత్రమే"
సందర్భము:
శక్తి స్వరూపిణి కినుక వహిస్తే యుక్తులు పని చేస్తాయా!
సుమ సుకుమారియైన సీత త్రికూట పర్వతం మీదున్న లంకా పట్టణాన్నే పీనుగు పెంట గావించింది. అంటే పర్వతాన్నే ఛిన్నాభిన్నం చేసివేసింది. ఇది చాలా విచిత్రం. అనూహ్యం. మనకు అనూహ్యమైన విషయాలన్నీ విచిత్రాలుగానే భాసిస్తూ వుంటాయి. లేదా ఘోరాలుగా భయపెడుతూ వుంటాయి. దానికి కారణం ఆ విషయాలు కావు. ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయిన మనమే! అలా వెళ్ళడానికి కారణం మన అహంకారం.
అహంకారాన్ని వంచనను ద్వేషాన్ని చేజేతులా పెంచి పోషించి అవి తీరా నెత్తి నెక్కి తైతక్క లాడుతుంటే ఇంక పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మవలన చావు లేని వరాలు పొందిన రావణు నంతవాడినైనా ప్రకృతి వదలిపెట్టే ముచ్చటే లేదు. (నేటి చైనాలాగా)
ప్రకృతి.. మాత లాంటిది. అందుకే ప్రకృతి మాత.. అన్నారు. అది ప్రేమ పంచి జీవితా న్నిస్తుంది. దానిని సవతి తల్లిలాగానో రాక్షసిలాగానో మనమే తయారు చేసుకుంటే ఘోర పతనం మన వెనుకనే పొంచి వుంటుం దన్నది యథార్థం. మాయా స్వరూపిణి యైన ప్రకృతికి అసాధ్యం లేదు.
*ప్రకృతి వికృతి యైతే పతనమే గతి*
యౌతుం దన్న సారాంశాన్నే సీతాపహరణం రావణపతనం అనే సంఘటనల ద్వారా రామాయణం ఎన్నడో మన దేశానికి బల్లగుద్ది చెప్పింది. (వేరే దేశాల సంగతి వేరు.)
కోమలమైన పుష్పం చీల్చి వేయా లనుకుంటే కొండనైనా చాలా చక్కగా చీల్చి వేస్తుంది. అది చిత్రమే కాదు సుమా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ప్రకృతి వికృతి యైతే..*
కోమల పుష్ప పత్ర సమ,
కోమలి సీతమ యా త్రికూట మన్
శ్రీ మహనీయ శైలమునఁ
జెల్వగు లంకకుఁ జేటు దెచ్చె నౌ
రా! మరి యేమి చెప్పవలె?
రాదు తలంప, వచింప నేరికిన్
గోమల పుష్ప పత్ర మదె
కొండనుఁ జీల్చెఁ.. గనంగఁ జిత్రమే!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.03.20
-----------------------------------------------------------
భామవు చేయ సంగరము వచ్చితివా యిటు చూడు మాడగా
రిప్లయితొలగించండిప్రేమపు క్రీడలన్ రయమె వీడి శరమ్ముల చేర రాగదే
కామిని యన్న రక్కసుని కాలుని చెంతకు నంపె దుర్గయై
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే?
నీమముఁ దప్పనీక కడు నిశ్చల బుద్ధిఁ తపంబు జేయుచున్
రిప్లయితొలగించండిధామము వీడి శీతనగధామము జేరెను శైలపుత్రి యా
ప్రేమకు శంకరాచలము భిన్నముజెందె సురాళి మెచ్చెనే !!
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే
పొరుగు దేశము నందున పుట్టి నట్టి
రిప్లయితొలగించండిచిన్న కీటకమ్మది యింత చేసె హాని
*కుసుమపత్రంబు ఛేదించె గొండ నౌర*
దైవ లీలల నెన్నంగ తరమె భువిని.