కవి మిత్రులకు శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తే: క్రోధమేల వృద్ధులపై కరోన, మేము కొంపలోనుండి కడతాము గోరి నీకు కాచుకో సహాయపు నిరాకరణ, నేడె వచ్చె శార్వరి నీకథ వమ్ముచేయ తే: భిన్న జాతుల యేకత్వ మున్న జాతి రాజకీయాలు లేవు సంగ్రామమందు నీదు యంతుతేల్చక మేము నిదురపోము ముఖ్య మంత్రి హుకుం మాకు సౌఖ్య మొదవు
రిప్లయితొలగించండిశార్వరి.
(తోటకములు)
వరసంపద లిచ్చట పంచుటకై
నిరతంబగు సౌఖ్యము నింపుటకై
స్థిరతంగొని వచ్చెను క్షేమములన్
ధర జూపగ 'శార్వరి' తానిటకున్. 1.
ఇటజూడ 'కరోనకు' నెల్లెడలన్
పటుసత్వము కూడె ప్రపంచమునం
దెటులైనను మ్రింగగ నిద్ధరణిన్
నటియించుచు నుండెను నాశకయై. 2.
సభ యొక్కటి చేయరు శార్వరికై
విభవంబులు చూపరు విజ్ఞు లిటన్
శుభకామన లంచును సోదరులం
దభయంబున జేరరు హర్షితులై. 3.
కవివర్యులు శ్రోతలు కర్మఠులున్
స్తవనీయులు వక్తలు సన్మతులీ
యవనిం గలవారలు 'హా'యనుచున్
జవముం గొన రందగ సన్నుతులన్. 4.
హరి రక్షకుడై సకలామయముల్
నిరతంబును గూల్చుచు నిత్యమిలన్
పరిపాలన చేసెడి వాడగుటన్
గరుణించును క్షేమము కల్గుటకై. 5.
విను "శార్వరి"! సత్యము భీతికిటన్
నిను జేర్చము సన్నుత నిష్ఠలతో
ఘనకీర్తిని గూర్తుము కావున నీ
వనుమానము వీడుము హాయనమా! 6.
కవులందరు పావన కాంక్షలతో
భవదీయశుభాగమ వైభవమున్
కవనంబున నింపుచు కావ్యముగా
ప్రవచింతురు నిస్తుల భాగ్యముగన్. 7.
వర"శార్వరి"నీకిదె స్వాగతమీ
ధరణిన్ సుఖజీవన దార్ఢ్యతలన్
నరులందున నింపుము నాన్యము నిన్
వరమిమ్మని కోరెద వందనముల్. 8.
హ.వేం.స.నా.మూర్తి
ఉర్వీతలమ్ము నేలగ
రిప్లయితొలగించండిపర్వముగాది కొనితెచ్చె వత్సర కాంతన్
శార్వరి నామమ్ము గలిగి
సర్వశ్రేయమ్ము నొసగ సరుగున వచ్చెన్.
శాంతి సౌఖ్యము కల్గించి సమత బెంచి
రిప్లయితొలగించండియీతి బాధలు తొలగించి యిడుము లుడుగ
మంచి మనసున రాగదే మహికి నేడు
శార్వరీ వత్సర మ నీకు స్వాగ తమ్ము
వచ్చె ను శార్వరి యనగనె
తెచ్చె కరో నా ను వెంటఁ తెగులుగ మనకు న్
విచ్చి న హృదయాలు రగిలె
చిచ్చును రేపియు జగతికి చెడు నొనరించె న్
విలయ తాండవ మాడుచు విశ్వ మంత
వ్యాప్తి చెందియు వణికించి వంత గూర్చె
నంత మొందింప శార్వరీ యాగ్ర హించి
జయము నొందియు గావుము జనుల నెల్ల
హరియించె జనుల స్వేచ్చ ను
తరిమెను సంతోష మెల్ల దైన్యము బెంచెన్
నిరుపమ భయ కంప ము ల న్
విరివిగ కల్పించి మించె వైరస్ కదరా
చివరి పాదం లో విక్రమ వైరస్ అని సవరణ చేయడమైనది
తొలగించండిచనెను వికారి వత్సరము, "చైన కరోన" కృతార్తతాగమం
రిప్లయితొలగించండిబున జనులెల్ల భీతులయి భోరున దుఃఖిలి మృత్యుహేలిఁ గూ
ర్చిన వ్యథ లిచ్చి! నీ వయినఁ బ్రీతినిఁ గావఁ, గరోనఁ జీల్ప, మా
మనుజులకున్ శుభంబు లిడ, మాతరొ వేగమె రావె శార్వరీ!
స్వస్తి
కవి మిత్రులకు శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండితే: క్రోధమేల వృద్ధులపై కరోన, మేము
కొంపలోనుండి కడతాము గోరి నీకు
కాచుకో సహాయపు నిరాకరణ, నేడె
వచ్చె శార్వరి నీకథ వమ్ముచేయ
తే: భిన్న జాతుల యేకత్వ మున్న జాతి
రాజకీయాలు లేవు సంగ్రామమందు
నీదు యంతుతేల్చక మేము నిదురపోము
ముఖ్య మంత్రి హుకుం మాకు సౌఖ్య మొదవు
నాశమగుగాత యీ కరోనా విషూచి
రిప్లయితొలగించండియఖిల జనులకు నారోగ్యమబ్బు గాత
శార్వరి యుగాది ప్రజకు ప్రశాంతినిడుత
వెలుగు రేకలు జగమెల్ల విచ్చు గాత
ఉగాది శుభాకాంక్షలతో
చిటితోటి విజయకుమార్
ఉగాది
రిప్లయితొలగించండి1)అల్పాక్కర :
పర్వ శోభలు నిండె ప్రకృతి యంత!
ఉర్వి సంబరముల నోలలాడె !
శార్వరీ! నీకిదే స్వాగతంబు!
సర్వుల కిడు సుఖ సంపదలు !
2)అంతరార్కర:
వేప, మామిడి పూత విందు కనులకు !
దాపులో మల్లె పూల తావి పిలచెను!
చూపు మేర నేయెడను జూడ ప్రకృతినన్ !
నోప లేని హాయి మది నూయల లూపెగా !
3)
మధురాక్కర:
నవ్య భావాల కాది యన యుగాది నడచి వచ్చె!
సవ్యమగు బాట మనుగడ సాగగ సౌఖ్యముగన్!
దివ్య శక్తుల వేడగ దీవన లిడనెపుడు !
భవ్యముగ మది కొరతలు బాపుగ కోరుకొనన్ !
4)
మధ్యాక్కర:
పిల్ల, పాపల గూడి పేర్మి నెల్లరు సంతసమనము |
నుల్లమలర పండుగ జరుపు కొనెదరు త్సాహముగను |
పల్లె, పట్టణములో భక్తి, పంచాంగ శ్రవణము జేసి|
చల్లగ కాపాడ మనుచు నెల్ల గ్రహముల వేడగను|
5. మహాక్కర:
ఆరు రుచుల యుగాది పచ్చడి భక్తి నారగించి, వెడలిరి కవులెల్ల|
జోరుగ కవితా గోష్టుల పాల్గొనన్, జూడగ వేడుకనగ పద్యపు
హోరులన్ దద్దరిల్లెగ వేదిక, పోరును గాంచగ భళిరే నిదే |
శారదా ప్రాంగణమని మురిసి సరస హృదయు లెల్లరు పరవశింపన్ |
ఉర్విని జనులందరకున్
రిప్లయితొలగించండిశర్వుడొసంగును శుభములు సత్ఫలితంబుల్
పర్వముగా ప్రతి దినమిక
శార్వరి యందరి కిడ వలె సంతోషమునే
ఉగాదిశుభాకాంక్షలతో.....
రిప్లయితొలగించండి-----
శిశిరఋతువునందుజీర్ణమైయాకులు
పండుటాకువోలెబరగిభువిని
రాలుచుండునవియరాశివోలెను,జూడ
ముచ్చటించెప్రకృతిమురిసెనేమొ
రాగవర్ణముతోడనురమ్యమలరి
వృక్షసంపదమనలనువెఱగుపఱచ
వచ్చెశార్వరినూతనవత్సరమ్ము
స్వాగతమ్మునుజెప్పుదుసాదరముగ
ఉప్పుకారములాదిగానొప్పురుచులు
జీవితమ్మునసమపాలుచేరుకొఱకు
చేయుదురుగదపచ్చడి సీమజనులు
వత్సరపుతొలిరోజుననుత్సుకముగ
శార్వరినామకంబలరిసర్వజనావళిమోదమందగా
నుర్వికివచ్చిమాకీడుమయోపినకొద్దిగభోగభాగ్యముల్
పర్వమువోలెనీయునికిభావనజేయుచుబాయసంబునున్
సర్వమునేనివేదనముశార్వరి!సేతునునారగింపుమా
కావుముపశుసంపదలను
గావుముమాపిల్లవాండ్రగరుణనునెపుడున్
గావుముపాడినిపంటను
గావగ నేవేడుకొందుగామితవరదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥
రిప్లయితొలగించండివికటాట్టహాసము సలిపి
వికారి సంవత్సరంబు వెడలుచు నుండెన్
వికృతమగు చేష్టతో భూ
లోకమును నెరపి కరోన రోగము తోడన్
కం॥
శ్రీశార్వరి వత్సరమిది
యా శాంకరి మీపయి దయ నందించుచునే
దేశము నెల్లెడ లందున
క్లేశమును సలుపు కరోన క్రిములను జంపున్
కం॥
మనజేతులె మన శత్రువు
మనశుభ్రతె మనకు రక్ష , మఱుగె హితంబౌ
మన వందనమే యుక్తము
తనువు శుచియయిన కరోన దరిచేరదుగా
కం॥
శ్రీశార్వరి వత్సరమున
నీశానుడు కృపనుజూపి
యిమ్ముగనిడు మీ
కోశము నిండుగ సంపద ,
లేశమయిన కూడ శంకలేదు నిజముగన్
త్రయి
రిప్లయితొలగించండి----
కానగలేనివాడవయి
కాచెడి చెట్లను గూల్చివేయుటల్;
వీనులవిందు గానముల
పిట్టల జంటల మట్టుపెట్టుటల్;
చేనుల నన్నిటిన్ రొయల
చెర్వుల దొర్వుల జేయుచుండుటల్;
మానవ!మానవా దుడుకు
మాటలు చేతలు జన్మజన్మకున్?
ఐదగు ప్రాణముల్ వలెనె
యా భువనాధిపు డిచ్చినాడుగా
నీదగునట్లుగా భువిని
నింగిని గాలిని నీటి నగ్నినిన్;
శోధకునట్టు లన్నిటిని
శూన్యమొనర్చుచు,జంతుజాలమున్
వేదన నింపుచున్ నరకి
వేడుక మాంసము మ్రింగుచుంటివే!
కొండకోనల జంతుపక్షుల
గూర్మిప్రేమల నింపుమా!
నిండుగుండెల దివ్యమాతకు
నీదు సేవను జేయుమా!
చెండుచుండిన యీ కరోనను
చెంపలేసుక పంపుమా!
పండురా ఘనశార్వరీనవ
పర్వమందున నీ కలల్!!
కం. మదిలో నాశల నింపగ
రిప్లయితొలగించండిమదమడచుచు నా కరోన మార్గము నడ్డన్
సుదినమ్ముల నరుని కొసగ
నిదె శార్వరి యరుగుదెంచె నిమ్ముగ యిలపై!
కం. శంకలతో భీతిల్లక
సంకటమగు స్థితిని దాటి చక్కగ నడువన్
బింకము గొనుడనె శార్వరి
సంకోచించకు కరోన సరియగు ననియెన్!
ఉగాది శుభాకాంక్షలతో
మాచవోలు శ్రీధరరావు
శార్వరీ కరోనాసి హస్తమున దాల్చి
రిప్లయితొలగించండితెలుగు రాష్ట్రాల ప్రజలకు దెలియజేయు
స్వచ్ఛ శుభ్రతారోగ్య విశ్వాసమలర
వచ్చినను నీకు స్వాగత పవనమేది?
కోయిలాస్వనముల గొండొక యపశృతి
నెమలుల నటనాన గుమిలెనడక
మావివేపాకుల మనసునాందోళనల్
గుడము తింత్రిణిఫలం బడగబట్టె
వెజ్జునొజ్జలు ద్విజుల్ వెడుగంది బారిరి
పంచాంగ మేరీతి పలుకునంచు
దేశప్రాంతాల నేతాశలేతీరునో
దెలియనేరక జనమలిగిపారె
ఔర!శార్వరీవత్సరాకారఘోర
తామసావృతాజ్ఞానసంతాపహార
విశ్వరోగోపశాంతిని వేడుకొనుచు
గోడుగోడుననేడ్చుచు పాడుకొనరె
మ.కో.::నంద నంబన వృక్షవాటిక నంద మొందగ బూచెలే
రిప్లయితొలగించండిసుందరాంగుడు తేనెరాయడు సోయగంబుల నించెలే
మంది మార్బల మన్య పుష్టము మైన కీరము లన్నియున్
సందడించుచు స్వాగతాంజలి శార్వరిన్ నుతియించెలే.౧
ఉ::స్వాగత తోరణావళి మృషాలకపత్ర విశీర్ణ పర్ణముల్
కోగెల సుస్వ రావళులు కుట్మలముల్ గుమి గుండె నిండుగా
వేగిర మాగ మించుమని వేత్రధరుల్ లత లంజలించె న
భ్యాగతుడైన శార్వరకు బాసట గాడె పటీరు డెప్పుడున్.౨
ఉ::గుండెల నిండ మాధురిమ కొండల బండల నింద్రచాపమే
నిండిన మండు వేసవికి నించిన పంచిన యంద చందముల్
గొండొక కోక గట్టెనొకొ కూజిత రాజియు వక్రతుండముల్
మెండుగ మెక్కిశార్వరికి మేలొన గూడుత స్వాగతంబనెన్.౩
సీ::చెట్టు చెట్టున జూడ జిగిబిగి సొగసులు కొమ్మ కొమ్మయు వింత కోక గట్టె
నాకు నాకు నమరె నందచందమ్ముల చేతమ్ము జివురులు సిరుల గనులు
పసరుఱెక్కలపక్కి పంచాంగముఁజదివె పంచమాస్యము బాడె పరవశించి
జుట్టునట్టువపిట్ట గట్టెక్కినర్తించె
ప్రకృతి హృదయ మెల్ల పాత్రలాడె
తే.గీ::మంత్ర దండపు గరిమయో మరుని మహిమొ
శార్వరీ చైత్రు నాజ్ఞయో స్వాగతించ
ప్రకృతియ పురమాయించెనో పర్వమనుచు
పరిమ ళాభరణంబుల బరగ దాల్చె.౪
చం:: శుక ఫిక శారికాస్వనము చూతము చైత్ర వసంతు నాగమం
బొక యుగమాగమించె ఫలపుష్ప విరాజిత చేతనాంగమై
ప్రకృతి యుగాది శోభగొని పర్వము నొక్కటి దెచ్చె దెన్గుకున్
సకల శుభాశుభాశ్రితము షడ్రుచి శార్వరి విందు ముందు గన్.౫
చం::ప్రకృతి చిగిర్చి బిల్చె భువి భాగ్యము నాయు వమేయ సౌఖ్యదం
పకహర తింత్రిణీ ఫల ప్రియాంభు గడోలము నారికేళ మా
ధిక కుసుమాళి పచ్చడి యదృష్ట మనిష్టద మిశ్ర యోగమై
సకల చరాచరాళి శుభశార్వరి సన్నిధి సంస్తుతించెనో.౬
అందరికీ శార్వరి నామ నూతన తెలుగువత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
శార్వరినామ వత్సరమ! సంతసమెక్కడ నీవు రాగ, నీ
యుర్విని గ్రమ్మె జీకటు లయోమయమాయెను, మానవాళి తా
సర్వమునా "కరోన"బడి "చైను"ల ద్రెంపగ నిండ్ల లోపలన్
పర్వము లేక యుండిరిగ బాధగ, 'శార్వరి' యన్న 'రాత్రి' యే.
---గోలి.😐
సీ|| శంబరారి విరుల అంబకముల్ తాక
రిప్లయితొలగించండిపరవశంబునసొక్కు పడుచువాండ్రు
మావిచివురుమెక్కి మత్తుగాకొమ్మపై
కవ్వించుపికములకలరవములు
అంబరసీమలోనంబుదమ్మునుగాంచి
పరవశంబుననాడు బర్హిణములు
పువ్వపువ్వునవాలిపూదేనెదొంగిలి
జుంటీగలొనరించుఝంకృతులతొ
విశ్వమంతయునుక్రాంతి విస్తరించ
కారుచీకటిదారులకాంతినింప
వీడుకోలనిపల్కుచు వెతలకెల్ల
వచ్చె శార్వరి నూతన వత్సరంబు!
1).
రిప్లయితొలగించండిఉర్వీతలమ్ము నేలగ
పర్వముగాది కొనితెచ్చె వత్సర కాంతన్
శార్వరి నామమ్ము గలిగి
సర్వశ్రేయమ్ము నొసగ సరుగున వచ్చెన్.
2).
శీతలా నిలముల శిశిరంబు మరుగాయే
మండు వేసంగియే మరలి వచ్చె
అభిసారికై ధాత్రి యందాల ప్రియుడైన
వరుణు కై వేచియే వ్రయ్యలయ్యె
కొదమ తేటుల ధాటు మధువు నన్వేషింప
పూదోట దిరుగంగ పూవు పూవు
బంభరంబుల పక్ష భ్రమర నాదాలతో
భూపాల రాగాలు పోటులెత్తె
భాను తప్త మైన వాయువుల్ చెలరేగి
వేడి వడిన వీచు వేళ యిదియె
వసుధ నే రమింప వడగండ్ల వానయై
వరుణ దేవు డిలకు వచ్చు నిపుడు
3).
నిరుడు కూసిన పిట్ట సరిగమ రాగాల
తిరిగి యాలాపించు తరుణ మిదియె
నవ పల్లవంబుల నవ నవోన్మేషంబు
నేలనే మురిపించు వేళ ఇదియె
ఖగ జాతి కువ కువల్ కమనీయ దృశ్యాల
మేళవింపుల మేటి వేళ ఇదియె
మంచు తెరల్ తొల్గి మరులు గొల్పెడు రీతి
కౌముదుల్ విరిసేటి కాలమిదియె
పడతి తనువు జేరు పరువాల వోలెను
వంపు సోంపు లన్ని వసుధకమరి
కులుకు లీనుచుండె కువలయ మీవేళ
మదిని దోచు మాస మాగ మించె
4).
పల్ల వించిన నవ పల్లవంబుల చేత
పాదపముల శోభ పరిడ విల్లె
విరియ కాసిన ఫల బరముచే మావిళ్ళు
నిండు చూలాలున్న నెలత లయ్యె
పూప పల్లవముల పొట్టార భుజియింప
కలకంటి కంఠాన కలిమి నిండె
మురిపాన గళమెత్తి మోహన రాగాన
స్వాగాతాల్ పలికె వసంతమునకు
పులుగు పాటతోడ పులకరించిన నీవు
వసుధ మురియు నిండు వర్ష మిచ్చి
పాడి పంటలిచ్చి పసిడి రాశుల నిచ్చి
శాంతి నొసగు మో వసంత కాంత .
5).
కోకిల కూజిత కోమలత్వము వింటు
. పరవశింప దలచి వత్సరాంబ
యయనాలనే రెండు నయనాల సుకుమారి
. యారుఋతువులనే చీర గట్టి
ద్వాదశ మాసాలు ధరణినేలగ నెంచి
. కాలశకటమెక్కి కదలి వచ్చె
తీయతేనియలొల్కు తెలుగు మాధుర్యమున్
. గ్రోలనెంచుచువచ్చె కోమలాంగి
శిశిర మేగినంత చెలివికారియె తాను
పారిపోయె నయ్యె వసుధవీడి
సకల శుభము లగొని శార్వరి వచ్చేను
పాడుదౌ కరోనఁ బార ద్రోల.
6).
ఏల విలంబమింకను మహీతలమేలి వి కారి యే వడిన్
కాలరథమ్ము పైన తన కాలము తీరిన దంచు సాగగన్
బాలిక యైన శార్వరియె వచ్చెను పాలన జేయ నెంచుచున్
నేలకు, స్వాగతించుమిక నెయ్యము తానె శుభమ్ము గూర్చగన్.
7).
స్వచ్ఛత లీనుచున్ ప్రకృతి భాసురమై వెలుగొందు వేళలో
పచ్చని మావి తోరణము స్వాగత మంచును గోరి బిల్వగా
వచ్చెను నూత్నవత్సరము వాసిగ తెల్గు ధరిత్రికిన్ యిటన్
ముచ్చట గొల్పుగాత్రమున పూపచిగుళ్ళను మేసి కోయిలల్
మెచ్చెడి రీతి పాడగను మేదిని జేరెనుగాది పర్వమే. ......
8).
పాదపముల్ ధరించు నవ పల్లవ శోభల గాంచి కోయిలల్
మోదము నంది పిల్చెనట మోహనరాగము నాలపించుచున్
సోదరి యావికారి తన చోటును శార్వరి కివ్వఁ బిల్వగా
నీ దరి జేరవచ్చెగద యింపుగ నామని వెంట వేగమై. ....
9).
చెలి యామని జత గూడగ
పలు శుభముల మూటతోడ వడివడి నడకన్
తెలుగుధరిత్రిన కాలిడు
జలజాక్షికి స్వాగతమ్ము, శార్వరి రావే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ కందఱకు శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తొలగించండిశార్వరి నామ సంవత్సరపు టుగాది:
సర్వ సుఖప్రదమ్ము నయి శాంతిదమై సుజ నౌఘ సమ్మ దా
ఖర్వ వినోద సంభరిత కార్య కలాప విరాజితమ్మునై
పూర్వ సమోధ్భ వాధమ విమోహ వికార వినాశకారియై
శార్వరి యుర్విఁ బర్వములఁ జారుతరమ్ముగ నిచ్చుఁ గావుతన్ 1.
క్రిమివర కరోన కుక్షి
క్రిమి కలుష కరానుగత వికీర్ణ వ్యతిరే
క మహోజ్వల బల సంప
న్న మయి విరాజిల్లు గాక నవ శార్వరియే
[కర +ఊన + కుక్షిక్రిమి = కరోనకుక్షిక్రిమి : చేతులు తక్కువగాఁ బొట్ట గలిగిన క్రిమి] 2.
మాన వేతర ప్రాణమ్ము గానిపించ
నీయ దీల్గ నెందు వికారి యెసక మెసఁగి
దాని గుణ మెంచి శార్వరి మానవులకు
మేలు సేయుఁ గాక దయ నిక్కాల మందు 3.
పోచిరాజు కామేశ్వర రావు.
ఉ:
రిప్లయితొలగించండిభారత సాంప్రదాయమున పాడ్యమి చైత్రము మాసమందునన్
పూరణ మయ్యు సృష్టికిని పుష్టిన దెల్ప పురాణ మందునన్
కారణ మాయ నందులకు కాలపు రీతి నుగాదిగా నిలన్
మారిన కాలమానమున మారె నుగాదియు నాంగ్ల తేదికిన్
వై. చంద్రశేఖర్
భూరికరోనవైరసది భూతము భంగి, వికారిపుణ్యమై
రిప్లయితొలగించండికోరలు సాచి యుక్కడచె కోట్ల కొలంది జనావళిం గటా!,
ఘోరదురంతఁ దాన నిలఁ గూల్చుచు స్వైరవిహారహారివై
శారదచంద్రికాసుధలఁ జల్లుము శార్వరి నూతనాబ్దమా!,
స్వాగతమెట్లు నిత్తుమొ? విషాదమె నిండె హృదంబుజంబులన్,
మా గడపం గడించఁ దరమా? యిలుఁదాటి కరోనభీతితో?,
నే గతి వేపఁబువ్వులు లభించునొ? మామిడికాయలేడ?, మా
యోగము లెట్లు నుండెనొ? వియుక్తుల మౌదుమొ? ప్రోవు శార్వరీ!.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
శార్వరీమాతా!
రిప్లయితొలగించండిసంతోషమే నీ ఆగమనం
చీకట్లనుచీల్చేవెలుగులే
నీగమనం
వెల్తూవెల్తూవికారాల్ని
మిగిల్చింది వికారగమనంలో
అన్నీచీకట్లోనేకలుస్తాయి
కాలంతోబాటు
అడ్డుకోశార్వరీ
కబళించేకరోనాన్ని
చీకట్లోపంజావిప్పేనీకు
కరోనాని
మాతాశార్వరీ
నీకిదేస్వాగతం
స్వాహాగతం
సంతోషం,ఆనందం,శార్వరీ ఆగమనం
మరువసంతంవరకు
మంచినేచేయి
ఆపై ఆగమనం
---రచన పోచిరాజు రామమోహనరావు,అప్పనపల్లి
సీసము
రిప్లయితొలగించండిశర్వుని కోపాగ్ని చైత్రసారథి జంపె
శార్వరిని కరోన సంహరించె
కానమెచ్చట కంతునానవాలు విరుల
బూయక వేపతా మూగబోయె
కవిగాయక గళాలు చెవిని బడవదేమొ
ఉత్సవముల విందు లూసులేదు
దేశమంత ప్రబల క్లేశమొకటి తాను
గుళ్ళు గోపురములు బళ్ళుబందు
వీథులు నిర్జన పాథులుగను దోచె
శార్వరి గొనితెకచ్చె చావుభయము
తే.గీ.
ఇట్టి దారుణ ప్రళయాన గట్టిగాను
నీలకంఠుడె కాపాడ నేర్పరియగు
శార్వరీశమౌళి!శరణు!శరణు! మాత
పార్వతితోగూడి కాపాడు భరతభూమి!
పూజ్య గురుదేవులకు , కవిమిత్రులెల్లరకు ఉగాది శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండికం..
వందనమమ్మా శార్వరి
నందనముగ జేయుమమ్మ నయముగ ధరనే
సుందర కుసుమాకరమున
చిందర వందరలు తొలగి సేమము నిడుమా!!!
మానిని...
కొత్త కరోనయె కోరలు చాచగ కూయగ లేదిల కోయిలలే
మత్తును గొల్పెడు మల్లెసుగంధముమండెను వేసవి మంటలుగా
హత్తుకు పోయెడు నామ్రపు గాలులు నందక రేగెను నావిరులై
కత్తుల బోనుగ కాలము మారగ కాసులు రాలక కార్మికులే
చిత్తడి చేయగ చేరెను నేలకు చిక్కిన యాశలు జీర్ణములై
యిత్తరి శార్వరి! యింపుగ నీకును యెట్టుల స్వాగత మిత్తుములే!!!
చకచక సాగెడు జగమున
రిప్లయితొలగించండివికారి- చివరన కరోన విధి వంచించెన్
సకల జనంబుల సంకట
మిక శార్వరి దీర్చరావె యీభువిలోనన్.
యజ్ఞేశ్.
హంసగతి రగడ..
రిప్లయితొలగించండికరోనాను తరుమగ కదలకండి
కరములను కడుగుటే మరువకండి
దూరముగ నుండుటే దారియండి
నారాయణ నామమె సారమండి!!!
ఉ:
రిప్లయితొలగించండిహిందువు శ్రేష్ఠ పండుగిది హేతువు చెట్లు చిగుర్చు మేలిమి
న్నందము చిందు భూతలము నాదము గొల్పెడు పిల్ల దెమ్మరల్
పొందగ కృష్ణ రాగముల పొందిక మల్లెల గండు తుమ్మెదల్
గంధపు వాసనల్ విరియ గన్నియ తోడుగ ముచ్చటాడగన్
వై. చంద్రశేఖర్
1)శార్వరి యుగాదివిచ్చేయు సమయమందు
రిప్లయితొలగించండివెళ్లును కరోనను వికారివెంటనంటి!
ప్రజల బాగోగులెంచు సంబ్రమము లందు
సంతసంబును దైవమేసాకుగాక!
2) పండుగ నాత్మీయతనే
పండించుట ధర్మమనగ? వ్యతిరేకతయే
నిండ? సమాజములో మా
కండగ శార్వరి యుగాది ఘనముగరమ్మా!
3) కలియుగమందు కరోనా
వలవేసియు జనులజంప ఫలమవికారీ?
నిలుపగ శార్వరి వచ్చును
నిల జనులకు రక్షగూర్చ? నీశ్వరయాజ్ఞే!
“శార్వరీ”! (ఉగాది కవిత)
రిప్లయితొలగించండిరచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~
మావి చిగురు వౌచు, మధుమాస మీవౌచు,
కోయిలమ్మ తీపి కూత వౌచు,
కొలది కొలది మదిని క్రొత్త ఆశలు రేపు
నవ యుగాది! వేగ నడచి రావె!
కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపునున్,
తీపి యనెడి రుచుల తీర్చి యొకట –
బ్రదుకులోని వివిధ వర్ణాల నుపమింప,
వండితిని ‘ఉగాది పచ్చ’ డిదిగొ!
నిర్భయముగ నడి రాతిరి
అర్భకురాండ్రైన వీధి నరిగెడు ఘన సం
దర్భము లికపై నిలుపుము –
దుర్భాగ్య “దిశ ఘటన” లిక దొరలనియటులన్!!
చేతులన్ కలుపుట, చెంపలానించుట
ఆధునికత యనునట్టి వారు –
కౌగిలించుకొనుచు, కడు చేరువగ నుంచు
అతి ప్రేమ నటియించునట్టి వారు –
ఆకు కూరలు, ఫలాహారాల వలదని
బర్గర్లు, పిజ్జాల వలచు వారు –
అన్నమ్ము, రొట్టె, శాకాహార మేలని
మాంసమ్ము, బిర్యాని మరుగు వారు –
మాని హోటళ్ళు, సినిమాలు, మాల్సు, పబ్సు,
ఇంట నుండి, శాకాహార మింత దినుచు,
తప్పక బయటి కేగ, ఇతరుల కిపుడు
దూరముగ నిలిచి యొనరింతురు “నమస్తె”!
“శార్వరి” నామ సుందర ప్రసన్న నవీన సువత్సరాంగనా!
ఉర్విని నీదు రాక – ఒక ఉజ్జ్వల పూర్ణిమ రాత్రి జ్యోత్స్నయై –
సర్వ భువిన్ భయంపు తమసంబున నిల్పు “కరోన” వ్యాధికిన్
గర్వము భంగమున్ సలిపి కావుము, బ్రోవుము మానవాళినిన్!
కళకళ లాడగ పొలములు,
గలగలమని పొంగి పొరలి కాళేశ్వర స
జ్జలములె అభిషేకింపగ –
తెలగాణకు వెలుగు నిమ్ము తెలుగు యుగాదీ!
ఎప్పుడు మన ప్రజలందరు
గొప్పగ జీవితము గడుపు కొలువుల నిడుచున్,
ముప్పులవి ఎన్ని వచ్చిన –
చప్పున తొలగించుము నవ సంవత్సరమా! #
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ. శార్వర మాయె మా బ్రతుకు సర్వము సూక్ష్మ కరోన నామయౌ
రిప్లయితొలగించండిపుర్వుకు జిక్కి జీవితపు పోరున నెట్టులు గెల్తుమో మహా
పర్వమె నీదు రాక మరి బాధల నుంటిమి స్వాగత మ్మిడన్
శార్వరి! రాదు మా మనము క్షాంతిని బూనుము చూడు మా కృపన్.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిశ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదిన శభాకాంక్షలు.
****: శ్రీపతిశాస్త్రి
శ్రీకరమగు నీ వర్షము
శ్రీకారము జుట్టుచుంటి శ్రీరస్తనుచున్
శ్రీకాంతుండిల బ్రోచును
శ్రీకంఠుడు శ్రియము లొసగు స్థిరముగ నెపుడున్
శార్వరి నామ వత్సరము శంభు శిరంబున చంద్రరేఖయై
సర్వ శుభంకరంబగుచు శాంతి నహింసల పండు వెన్నెల
న్నుర్వి కొసంగి బ్రోచునని యూహల జేసి యభీష్ట సిద్ధికై
పర్వపు వేళ శర్వునకు ప్రార్థన జేయుచు విన్నవించెదన్
ఆకులు రాలు కాలమున యాశలు రేపు వసంత కాలమై
ఆకలి గొన్న వారలకు నన్నము పెట్టెడి యన్నపూర్ణయై
లోకహితార్థ మాకమలలోచను నట్లరుదెంచు శార్వరీ
నీకిదె స్వాగతంబు కడు నిర్మల భక్తిని నిన్ను కొల్చెదన్
గర్వము లేని జీవులకు గౌరవమెంతయు వృద్ధి చెందుచున్
సర్వ శుభంకరంబగుచు సత్య మహింసయు సద్గుణంబులన్
యుర్విన బొందునట్లు శుభ యోగము గూర్చగ నేగుదెంచుచున్
శార్వరి పూర్ణిమా మిళిత చంద్రికయై ప్రభవించు నెల్లెడన్
మత్తకోకిల గానమందలి మాధురీ రసభావనల్
చిత్తమందున విస్తరించగ చిత్రమౌ యనుభూతితోన్
క్రొత్తక్రొత్తగ యూహలందున కోటియాశలు రేపగా
మెత్తమెత్తని లేచిగుళ్ళతొ మేదినీ పులకించనీ
పర్వపు వేళ పండితుల భవ్య కవిత్వపు వర్షధారలే
కుర్వగ నందులో తడసి కోమలభావ పునీత చిత్తుడై
శర్వుని గొల్చి వేడుదును సర్వ జగంబుల మేలునెంచి యీ
శార్వరి సౌఖ్యమున్నొసగ శ్రామిక జీవులు సేద దీరగాన్.