5-9-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్”
(లేదా...)
“సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి సమస్య)
శా.కంసారాతి పదంబు నమ్మి మహిపై కష్టంబులం దాల్మితో హింసావాదము మాని జీవితమునన్ హీరంబుగా నుండి విధ్వాంసుల్ మెచ్చెడి రీతి జ్ఞాననిధితో వర్ధిల్లి దీపించు త త్సంసారంబె సుఖావహంబనుచు నా సన్న్యాసి బోధింపడే ?
హింస రహితముగ నుండుచుసంసారమున గల దేశ జనులందరొకే శంసపయి నిలచి యుండిన సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్
సంసారంబన సాగరంబనుచు నిస్సారంబుగానెంచియాసంసర్గంబును వీడి ప్రవ్రజనమున్ క్షాంతమ్ముగా గైకొనెన్సంసారొక్కఁడు, ముక్తసంగుడగుటన్ సంస్కారహీనంబుగాసంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!
కందంహంసగ తన కౌపీనముధ్వంసము కాకుండు కతన దారను గొను మీమాంసను తర్కింపంగన్సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్!శార్దూలవిక్రీడితముహంసధ్యానికి శత్రువాఖువయి తానందంగ కౌపీనమున్హింసామార్గము ద్రొక్కెడున్ గతన దానిల్లాలినిన్ బొందు మీమాంసన్ దర్కము నెంచి చూడ మనకున్ మర్మంబు వీడంగనేసంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!
సంసారము సాగరమనిసంసర్గము వీడి మారె సన్యాసిగ, విధ్వంసఁపు పోకడ జూపుచుసంసారమె సుఖకరమని సన్యాసి యనెన్
హంసుని కొలుచుచు పరులనుహింసించని సతియె యుండి యిమ్మగు తన ప్రేయాంసున కనుకూలమయిన సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్.అంసమ్మందున నున్న బాధ్యతలకై యాయాస మున్ వీడుచున్ హంసన్ నమ్మిన సాధ్వియే పతిని ప్రత్యక్షేతనుండంచు ప్రే యాంసున్ గొల్చెడమాయకంపు సతియే యర్ధాంగి గా నున్నచో సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే.
శా.
రిప్లయితొలగించండికంసారాతి పదంబు నమ్మి మహిపై కష్టంబులం దాల్మితో
హింసావాదము మాని జీవితమునన్ హీరంబుగా నుండి వి
ధ్వాంసుల్ మెచ్చెడి రీతి జ్ఞాననిధితో వర్ధిల్లి దీపించు త
త్సంసారంబె సుఖావహంబనుచు నా సన్న్యాసి బోధింపడే ?
హింస రహితముగ నుండుచు
రిప్లయితొలగించండిసంసారమున గల దేశ జనులందరొకే
శంసపయి నిలచి యుండిన
సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్
సంసారంబన సాగరంబనుచు నిస్సారంబుగానెంచియా
రిప్లయితొలగించండిసంసర్గంబును వీడి ప్రవ్రజనమున్ క్షాంతమ్ముగా గైకొనెన్
సంసారొక్కఁడు, ముక్తసంగుడగుటన్ సంస్కారహీనంబుగా
సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!
కందం
రిప్లయితొలగించండిహంసగ తన కౌపీనము
ధ్వంసము కాకుండు కతన దారను గొను మీ
మాంసను తర్కింపంగన్
సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్!
శార్దూలవిక్రీడితము
హంసధ్యానికి శత్రువాఖువయి తానందంగ కౌపీనమున్
హింసామార్గము ద్రొక్కెడున్ గతన దానిల్లాలినిన్ బొందు మీ
మాంసన్ దర్కము నెంచి చూడ మనకున్ మర్మంబు వీడంగనే
సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే!
సంసారము సాగరమని
రిప్లయితొలగించండిసంసర్గము వీడి మారె సన్యాసిగ, వి
ధ్వంసఁపు పోకడ జూపుచు
సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్
రిప్లయితొలగించండిహంసుని కొలుచుచు పరులను
హింసించని సతియె యుండి యిమ్మగు తన ప్రే
యాంసున కనుకూలమయిన
సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్.
అంసమ్మందున నున్న బాధ్యతలకై యాయాస మున్ వీడుచున్
హంసన్ నమ్మిన సాధ్వియే పతిని ప్రత్యక్షేతనుండంచు ప్రే
యాంసున్ గొల్చెడమాయకంపు సతియే యర్ధాంగి గా నున్నచో
సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే.