ఉ:తేజము లేదు వీని కొక తీరగు చింతన లేదు వీని నే నాజికి బిల్వ నమ్మొ యను,నంగన నెవ్వతె జూపసొమ్మునం దే జడుపౌను బిచ్చమున కెవ్వడు వచ్చిన బిల్చు నక్కటా ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్” (ఒక దానికి అట్లా భయం.మరొక దానికి ఇలా భయం.అడుక్కునే వాణ్ని మాత్రం పిలుస్తాడు.అని ఆక్షేపణ.)
తేజముకలిగిన ధీరుడు
రిప్లయితొలగించండినాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
తేజము లేనిదరిద్రుడు
నాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
తేజము చెంగలించు మగ ధీరుని చెంతకు వేడబోయినన్
యాజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
దేజము లేకయున్న కడు దీనుని వద్దకు వేడబోయినన్
యాజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
క్రమాలంకారమండి
రిప్లయితొలగించండికం॥ యోజన దూరము చననొకొ
పూజించెదఁ దల్లి వలెను బోఁడిమిఁ గనుచున్
మోజుగ నొసఁగెద, సౌమ్యుఁడు
నాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
ఉ॥ యోజన దూరమై చనెద యోచనఁ జేయను శాంతి ప్రీతియౌ!
పూజలు సేయఁగన్ దగును బోఁడిమి మీరఁగఁ దల్లియౌఁ గదా!
మోజుగ నిచ్చి చూడనొకొ మెప్పునుఁ గోరక, సౌమ్యమూర్తియే
ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
పోడిమి గౌరవము
రాజులను ముంచెదవుగా !
రిప్లయితొలగించండిపూజ సలుపదగిన నిన్ను పొందపొసగునా !
భోజన మొసగెద రావలె !
ఆజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
ఆజికి నెన్నడు సిద్ధము
రిప్లయితొలగించండిపూజాభావమునజూచు పొలఁతిని కనగన్
నైజగుణము దాతృత్వము
ఆజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
రిప్లయితొలగించండివాజినదల్చి శాత్రవుల పైబడ నన్నెదిరింప శక్యమే;
పూజితమెన్నడేనియును పుణ్య సుమంగళి పాదపద్మముల్;
భ్రాజిత కీర్తి కారకమవశ్యము దానము సత్కృతంబిలన్;
రిప్లయితొలగించండిమోజు సమరమన్నను నా
రాజిని తీతు నిటులన్ కరమ్ముల మోడ్తున్
పూజితకు కయి విదిల్చెద
నాజికిఁ, బరసతికి, నర్థి కట్లిట్లనురా
రాజికి రానివేళ సమరమ్మును సేయగ తీతునిట్లు నా
రాజిని యంచు చూపుచు కరమ్ముల మోడ్చుచు మ్రొక్కువాడనే
పూజితు రాండ్రకంచు ధనమున్ నిధనుండ్రకు పంచ నిట్లుగా
నాజికి నట్లనున్, బరుని యాలికి నిట్లను, నర్థి కిట్లనున్.
ఆజయె వలదని పలుకుచు
రిప్లయితొలగించండిమోజు గ పరసతి ని గాంచి పొందును గోరున్
రాజుగ న ర్థి కి నిచ్చు చు
నాజి కి పరసతికి నర్థి క ట్లి ట్లను రా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండితేజమొలుకు హావమ్మున,
మోజున పరునాలి చూడ పూజ్యత మ్రొక్కున్,
తా జాలిఁ గను. ,ప్రభువనఁగ
నాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
ఉత్పలమాల
ఆజికి సిద్ధమంచని, పరాంగన కోరగ మాతవంచనున్
భోజనమెంచగన్ బడుగు భుక్తిని గూర్చెదనంచు రమ్మనున్
సాజమనంగ శీర్షము ప్రసన్నతనూపుచు రాజనంగ తా
నాజికి నట్లనున్! బరుని యాలికి నిట్లను! నర్థి కిట్లనున్!
రా జని చని యడిగినఁ బ్ర
రిప్లయితొలగించండియోజన మిసు మంత యైన నుండదు సుమ్మీ
నైజమునఁ గపటి యాతం
డాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా
తేజుల నాయుధమ్ములను దీయను మంగళ వార మెన్నఁడున్
గాజుల కంద మబ్బెఁ గద కాంతరొ నీవు ధరించి నంతటన్
వ్యాజపు మాట లాడగను న్యాయమె తక్కుమ బీద యార్పులే
యాజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
ఆజియనంగ నెన్నడును నంజికనొందను వెన్నుజూపి, నే
రిప్లయితొలగించండిపూజితభావమెన్నడును వొందుదు చానల గాంచినంతనే,
సాజగుణంబు దీనులకు సాయమొనర్చెటయన్న, నివ్విధిన్
ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
కం:తేజమ్ము లేదు వీనికి,
రిప్లయితొలగించండివాజమ్మయె, వీని నడుగ వచ్చెదవా యం
చీ జిడ్డు సరిగ చెప్పక
నాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా”
(వీడొక జిడ్డు.తగువు కైనా,పరసతి కోసమే ఐనా వస్తావా? అంటే అట్టా,ఇట్టా అంటాడు.అంటే సరైన సమాధాన మివ్వడు.అర్థికి అంటే అడిగిన వాడికి.)
ఉ:తేజము లేదు వీని కొక తీరగు చింతన లేదు వీని నే
రిప్లయితొలగించండినాజికి బిల్వ నమ్మొ యను,నంగన నెవ్వతె జూపసొమ్మునం
దే జడుపౌను బిచ్చమున కెవ్వడు వచ్చిన బిల్చు నక్కటా
ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్”
(ఒక దానికి అట్లా భయం.మరొక దానికి ఇలా భయం.అడుక్కునే వాణ్ని మాత్రం పిలుస్తాడు.అని ఆక్షేపణ.)