24-4-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”
(లేదా...)
“చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో సురభి శంకర శర్మ గారి సమస్య)
కందంగోముగ పెంచియు సుతునకుఁబ్రేమగ రవిచంద్రుఁ బోలు పేనీలీయన్లేమకు చిరాకు పుట్టఁగఁజీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్?ఉత్పలమాలగోముగ పెంచ బాలునకు కోరినదీయక యూరకుండునా?సామజమాది జంతువుల చంద్రుని సూర్యుని బోలు బొమ్మలన్దామరకంటి చక్కెరను దండిగ పాకము బట్టి చేయగన్జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా?
ఏమనుచు జెప్పమనెదవు నీమముగనె రాజధాని నిర్మాణమునన్నీమధ్య రాజకీయపుచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్చంద్రుడు = చంద్రబాబు నాయుడు
సోమలమగ్గలమ్ముగను శోషిల జేయఁగ భూతలమ్మునన్చీమలు సంబ్రమమ్మునను జేరి శశాంకుని మ్రోలనార్తితోనో మహనీయ బ్రోవుమని యుత్తలపాటున మ్రొక్కె, నయ్యరే!చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా!
భూమిని వేసవి గాడ్పులువైమాలముగా నలజడిబరచగ భీతిన్సోమలమును తట్టుకొనఁగచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్
సరదాకి:మామా! పూరింపుమురా!“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”సోముడు చక్కెరబొమ్మర“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”- * - *- * - *- * - *- * - *- * - *- * - *ఏమిది యన్నఁ గాని జను లిట్టి సమస్యకు నే వధాని మున్నేమని చెప్పినన్ బిదప నీ శశి చక్కెరబొమ్మయంచు నారామయె దీని నిల్పెఁ గడు రమ్యముగానని చెప్పి యిట్లనున్“చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా”
సోముని రూపము పాకముతో మగువయె చేసి యమ్ము ద్యుమ్నము కొరకై తేమయె చేరగ నచ్చటచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్.క్షేమము కాదు తీపితిన చెక్కెర వ్యాధికటంచు పేర్మితో కోమలి కోవబిళ్ళలను గోరిన నివ్వక దాచ నాశతో మామయె దొంగిలించినవి మంచము పైగల చందమామలో భామకు తెల్యకుండకడు భద్రముచేసిన నేమి కాంచగా చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా. (చందమామ= మాసపత్రిక)
కం॥ ఏమనిఁ దెల్పుదు మనుజులుతామటు శోధించఁ జనఁగఁ ద్రచ్చుచు ఖదిరున్జీమలు చక్కెరతోఁ జనెఁజీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్రమెటులగున్ఉ॥ చీమలు వట్టె చంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగాయేమిది యంచు కారణము నెంచఁగఁ దెల్లము మానవుల్ చనన్దామటు లారయంగ శశి ధామముగన్ ధర రీతి సామ్యమో చీమలు చేరెనచ్చటికిఁ జిత్రము కాదిది పంచదారతోన్ ఖదిరుడు ఇంద్రుడు చంద్రుడు నిఘంటువు సహాయమండి పెనుకొండ రామబ్రహ్మం ఎల్ డొరాడో హిల్స్
ప్రేముడి పిల్లల కోసముభామిని పచనమ్మొనర్చె భక్ష్యంబులనేకోమల చంద్రాకృతిలోచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్ప్రేముడి సంతుకోసమని వింతగు నాకృతు లెంచి హాయిగాశ్యాముని తల్లిచేసెనట చక్కని కమ్మని పిండివంటలన్గాములఱేనిగా మరియు కల్వలసామిగ రూపు దిద్దుచున్జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా
భామిని చక్కర ముగ్గును కామితముగ రూపు దిద్దె కమనియ ముగ న్ ప్రేమగ తినుటకు వఛ్చియు చీమలు చంద్రునికి బట్టె చిత్ర మెటు లగు న్
కం:ఆ మానిని కూతురకైప్రేమగనే చందమామ బిళ్లను గొనె,తానే మరచి బిడ్డ కీయకచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”(చందమామ ఆకారం లో నిమ్మ తొనలు, బిస్కట్లు ఉంటాయి.పిల్లలు చందమామ బిళ్లలు మొదలైన పదాలు వాడతారు.)
డాక్టర్ బల్లూరి ఉమాదేవి శ్రీమతి చక్కర యచ్చులునేమముతోచేసితానునీడనుబెట్టన్సామముతోతిననెంచుచు*“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”*
భీముడు.., చక్కెర బొమ్మలవాములు, యంగడిని బెట్టె , వ్యాపారముకున్సోముని ప్రతిమందుగలదు“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”సురేష్ కుమార్ రామోజు.
ఏమఱక విన్న దెల్లను గోముగ వచియించుచుంటిఁ గుట్టక నిలుఁ డీజామున గ్రహణము వినుఁ డో చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటు లగున్ ఆమని పోయి గ్రీష్మ ఋతు వంతము గాఁ ద్రుటి వర్ష కాలమే భూమినిఁ దాఁక వేగముగఁ బున్నమి నాఁటి నిశీథ వేళలో సోముని కాంతి సన్నగిలఁ జుట్టుఁ జరించుచుఁ గారు మబ్బు లంజీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్ర విచిత్రము కాదు కాదుగా
లేమ లిఖించుచుండ నట రేదొర చిత్తరువద్భుతంబుగానేమరుపాటు నామె కరమించుక తాకగ శర్కరంబయో గీమున జిందె నల్దెసల కించిదమా పటమందు వెంటనే చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కోమలి చక్కెర బొమ్మలుభామలతో కలసి చేయ పండుగ యనుచున్నీమముగా బొమ్మల గనిచీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్రమెటులగున్.
కందం
రిప్లయితొలగించండిగోముగ పెంచియు సుతునకుఁ
బ్రేమగ రవిచంద్రుఁ బోలు పేనీలీయన్
లేమకు చిరాకు పుట్టఁగఁ
జీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్?
ఉత్పలమాల
గోముగ పెంచ బాలునకు కోరినదీయక యూరకుండునా?
సామజమాది జంతువుల చంద్రుని సూర్యుని బోలు బొమ్మలన్
దామరకంటి చక్కెరను దండిగ పాకము బట్టి చేయగన్
జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా?
ఏమనుచు జెప్పమనెదవు
రిప్లయితొలగించండినీమముగనె రాజధాని నిర్మాణమునన్
నీమధ్య రాజకీయపు
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్
చంద్రుడు = చంద్రబాబు నాయుడు
సోమలమగ్గలమ్ముగను శోషిల జేయఁగ భూతలమ్మునన్
రిప్లయితొలగించండిచీమలు సంబ్రమమ్మునను జేరి శశాంకుని మ్రోలనార్తితో
నో మహనీయ బ్రోవుమని యుత్తలపాటున మ్రొక్కె, నయ్యరే!
చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా!
భూమిని వేసవి గాడ్పులు
రిప్లయితొలగించండివైమాలముగా నలజడిబరచగ భీతిన్
సోమలమును తట్టుకొనఁగ
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్
సరదాకి:
రిప్లయితొలగించండిమామా! పూరింపుమురా!
“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”
సోముడు చక్కెరబొమ్మర
“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”
- * - *- * - *- * - *- * - *- * - *- * - *
ఏమిది యన్నఁ గాని జను లిట్టి సమస్యకు నే వధాని ము
న్నేమని చెప్పినన్ బిదప నీ శశి చక్కెరబొమ్మయంచు నా
రామయె దీని నిల్పెఁ గడు రమ్యముగానని చెప్పి యిట్లనున్
“చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా”
సోముని రూపము పాకము
రిప్లయితొలగించండితో మగువయె చేసి యమ్ము ద్యుమ్నము కొరకై
తేమయె చేరగ నచ్చట
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్.
క్షేమము కాదు తీపితిన చెక్కెర వ్యాధికటంచు పేర్మితో
కోమలి కోవబిళ్ళలను గోరిన నివ్వక దాచ నాశతో
మామయె దొంగిలించినవి మంచము పైగల చందమామలో
భామకు తెల్యకుండకడు భద్రముచేసిన నేమి కాంచగా
చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా.
(చందమామ= మాసపత్రిక)
కం॥ ఏమనిఁ దెల్పుదు మనుజులు
రిప్లయితొలగించండితామటు శోధించఁ జనఁగఁ ద్రచ్చుచు ఖదిరున్
జీమలు చక్కెరతోఁ జనెఁ
జీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్రమెటులగున్
ఉ॥ చీమలు వట్టె చంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా
యేమిది యంచు కారణము నెంచఁగఁ దెల్లము మానవుల్ చనన్
దామటు లారయంగ శశి ధామముగన్ ధర రీతి సామ్యమో
చీమలు చేరెనచ్చటికిఁ జిత్రము కాదిది పంచదారతోన్
ఖదిరుడు ఇంద్రుడు చంద్రుడు నిఘంటువు సహాయమండి
పెనుకొండ రామబ్రహ్మం ఎల్ డొరాడో హిల్స్
ప్రేముడి పిల్లల కోసము
రిప్లయితొలగించండిభామిని పచనమ్మొనర్చె భక్ష్యంబులనే
కోమల చంద్రాకృతిలో
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్
ప్రేముడి సంతుకోసమని వింతగు నాకృతు లెంచి హాయిగా
శ్యాముని తల్లిచేసెనట చక్కని కమ్మని పిండివంటలన్
గాములఱేనిగా మరియు కల్వలసామిగ రూపు దిద్దుచున్
జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా
భామిని చక్కర ముగ్గును
రిప్లయితొలగించండికామితముగ రూపు దిద్దె కమనియ ముగ న్
ప్రేమగ తినుటకు వఛ్చియు
చీమలు చంద్రునికి బట్టె చిత్ర మెటు లగు న్
కం:ఆ మానిని కూతురకై
రిప్లయితొలగించండిప్రేమగనే చందమామ బిళ్లను గొనె,తా
నే మరచి బిడ్డ కీయక
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”
(చందమామ ఆకారం లో నిమ్మ తొనలు, బిస్కట్లు ఉంటాయి.పిల్లలు చందమామ బిళ్లలు మొదలైన పదాలు వాడతారు.)
డాక్టర్ బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిశ్రీమతి చక్కర యచ్చులు
నేమముతోచేసితానునీడనుబెట్టన్
సామముతోతిననెంచుచు
*“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”*
భీముడు.., చక్కెర బొమ్మల
రిప్లయితొలగించండివాములు, యంగడిని బెట్టె , వ్యాపారముకున్
సోముని ప్రతిమందుగలదు
“చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటులగున్”
సురేష్ కుమార్ రామోజు.
ఏమఱక విన్న దెల్లను
రిప్లయితొలగించండిగోముగ వచియించుచుంటిఁ గుట్టక నిలుఁ డీ
జామున గ్రహణము వినుఁ డో
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటు లగున్
ఆమని పోయి గ్రీష్మ ఋతు వంతము గాఁ ద్రుటి వర్ష కాలమే
భూమినిఁ దాఁక వేగముగఁ బున్నమి నాఁటి నిశీథ వేళలో
సోముని కాంతి సన్నగిలఁ జుట్టుఁ జరించుచుఁ గారు మబ్బు లం
జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్ర విచిత్రము కాదు కాదుగా
లేమ లిఖించుచుండ నట రేదొర చిత్తరువద్భుతంబుగా
రిప్లయితొలగించండినేమరుపాటు నామె కరమించుక తాకగ శర్కరంబయో
గీమున జిందె నల్దెసల కించిదమా పటమందు వెంటనే
చీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్రవిచిత్రము కాదు కాదుగా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోమలి చక్కెర బొమ్మలు
భామలతో కలసి చేయ పండుగ యనుచున్
నీమముగా బొమ్మల గని
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్రమెటులగున్.