5-5-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె”
(లేదా...)
“చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో రంప సాయికుమార్ గారి సమస్య)
తేటగీతిఆటపాటలు సృజనలు నంకురింపవిదురతఁ బెనుచు రీతిగన్ విద్య మలచనొప్పు శ్రేయమై, గుదిగొను యొత్తిడి నిడచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండెచంపకమాలవిదురత పెంచు భావనను విద్యకు తోడుగ నాటపాటలన్సదమల రీతిగన్ మలచ సాధ్యమగున్ సృజనాత్మకమ్మదే!గుదిగొన జేసెడున్ బగిదిఁ గూర్చిన పాఠ్యము పెంచ నొత్తిడిన్చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
చదువులీనాడు విపణిలో సరుకులయ్యెచదువుఁ గొనవలెనననది చాల ప్రియముపుస్తకమ్ముల బరువును మోయలేకచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
చదువుఁ 'గొనంగ' నాస్తులను సైతము నమ్మెడు కాలమొచ్చెనీచదువుల వల్ల ఛాత్రులకు శ్రాంతి లభింపక మానసంబునన్బెదురు జనించి యొత్తిడిని పెంపొనరింపఁగఁ జేయు గానగన్చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
హృదయ వికసనమేగద చదువనంగతట్టుకొనలేని పీడన తామొసంగిచదువు నేర్పుట కలవడ్డ సంస్థ లయ్యెచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండెమృదువుగ విద్యనేర్పుటయె మృగ్యము నేడిట పాఠశాలలోవదలక సంతతమ్ము బలవంతము చేసెడు సంస్థలేకదాచదువుల లక్ష్యమే కడకు సాగుచునున్నది విత్తమార్గమైచదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
తే||గీ||జోయగు పాఠశాలలో చోటునొంద గోరి కష్టపడి చదువ గోరనగునుగాని , బలవంతమున దానికయి చదివెడిచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
తే॥ మనఁగ మార్కులు ర్యాంకులు మన్ననఁగనిజదువులకిపుడు హెచ్చఁగ స్పర్ధ మితినిఁగానక విరిసి పరితాపమున ముడివడఁజదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె చం॥ కదనముఁ దల్పు స్పర్ధఁ గని కామిత కల్పము మార్కులై యిటుల్ ముదముగ గీటు రాయిగను మోదము పొందఁగ నయ్యొ చూడవోసదమదమైరి ఛాత్రులటు శక్తికి మించిన భారమై యహోచదువులు నేఁడు ఛాత్రులను జంపుచునుండె భయావహమ్ములైచంపు కు literary meaning కాకుండా figurative meaning సామాన్యంగా వాడే రీతిలో తీసుకోవాలండి.
మరొక పూరణండిచం॥ పదిలము జ్ఞాన సంపదల ప్రాభవ భాగ్యము విజ్ఞతాదులున్జదువులు పెక్కు రీతులిల శ్రద్ధను గాంచరె యిష్టమైనచోఁ బదుగురు నొక్క బాటఁగని భవ్యత నొందఁగ సంతు కెంచఁగన్జదువులు నేఁడు ఛాత్రులను జంపుచునుండె భయావహమ్ములైFigurative meaning తీసుకో వాలండి.అందరూ పిల్లల పరిమితులు ఇష్టాయిష్టాలు గమనించక భవిష్యత్తుకు ఇదే బంగారు బాట అని చూడడము వలన పోటీ పెరిగి అనర్థాలకు దారి తీస్తున్నది. పిల్లలకు ఇష్టమున్న విద్యలో వారు రాణించగలరని పరిగణించడం లేదండి.
విఫణి వీధిని సరుకయ్యె విద్యలనినర్యాంకు లందించు కొట్లు విద్యాలయాలుదినదినము పిల్లలకవి యొత్తిడిని పెంచచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె.పదుగురిలోన పాటవము వాసిగ జూపుచు ర్యాంకు లందునన్ మొదటిదె పొందుటొక్కటదె ముఖ్యమటంచును తల్లిదండ్రులున్ జదువులు చెప్పె డొజ్జలును సంతత మొత్తిడి సేయునట్టి యీ చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై.
మూర్తి మత్వము పెంచని పొత్తము లును బ్రతుకు తెరువును దెలుపని పాఠములును నేటి విద్యా వి ధా నము నీరు గార్చు చదువు లిప్పుడు ఛాత్రుల చంపు చుండె
తలకుమించిన బరువుతో తల్లడిల్లుచున్న బాలబాలికలకు శోష వచ్చెనాటపాటలకు సమయ మసలులేకచదువు లిప్పుడు ఛాత్రుల చంపుచుండె.అదుపులు తప్పుచుండె గను డాంగ్లపు విద్యలు నేర్చు మోజులోసదనము లందు నొత్తిడియు జాస్తియు నయ్యెను నాటపాటకున్వదలక తల్లిదండ్రులును పల్మరు బోధలు చేయు చుండగా*“చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై”*
ధరలు కబళించు చున్నవి నరుల నిపుడు ప్రభుత యిప్పుడు పీడించుఁ బౌర వరులఁ గొలువు లిప్పుడు పనివారిఁ గూల్చు చుండెఁ జదువు లిప్పుడు ఛాత్రులఁ జంపు చుండె పదిలము లేక కొల్వులను వంతలు రేఁగ గురూత్త మాళికేయొదిఁగిన యట్టి నెన్నడుము లుండఁగఁ బిల్లల కెల్ల నూరిలో నుదితమ యిట్టు లెల్లెడల నొజ్జల నక్కట కాక యింకనుం జదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచు నుండె భయావహమ్ములై
పెద్ద సంచుల డబ్బును బుద్ధి గానుబడికి గట్టిచు, బ్యాగుల బరువు బెంచి,యిష్ట మెరుగక బిడ్డల ,, కష్ట బెడుచుచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె”సురేష్ కుమార్ రామోజు
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తల్లిదండ్రులు మరి యుపాధ్యాయులు చదువుడని విద్యార్థుల పయి నొత్తిడిని పెంచతట్టుకొనలేని కొందరాత్మబలి దానము నొనరించుకొనుచునుండె మూర్ఖమతినిచదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె.
తేటగీతి
రిప్లయితొలగించండిఆటపాటలు సృజనలు నంకురింప
విదురతఁ బెనుచు రీతిగన్ విద్య మలచ
నొప్పు శ్రేయమై, గుదిగొను యొత్తిడి నిడ
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
చంపకమాల
విదురత పెంచు భావనను విద్యకు తోడుగ నాటపాటలన్
సదమల రీతిగన్ మలచ సాధ్యమగున్ సృజనాత్మకమ్మదే!
గుదిగొన జేసెడున్ బగిదిఁ గూర్చిన పాఠ్యము పెంచ నొత్తిడిన్
చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
చదువులీనాడు విపణిలో సరుకులయ్యె
రిప్లయితొలగించండిచదువుఁ గొనవలెనననది చాల ప్రియము
పుస్తకమ్ముల బరువును మోయలేక
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
చదువుఁ 'గొనంగ' నాస్తులను సైతము నమ్మెడు కాలమొచ్చెనీ
రిప్లయితొలగించండిచదువుల వల్ల ఛాత్రులకు శ్రాంతి లభింపక మానసంబునన్
బెదురు జనించి యొత్తిడిని పెంపొనరింపఁగఁ జేయు గానగన్
చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
హృదయ వికసనమేగద చదువనంగ
రిప్లయితొలగించండితట్టుకొనలేని పీడన తామొసంగి
చదువు నేర్పుట కలవడ్డ సంస్థ లయ్యె
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
మృదువుగ విద్యనేర్పుటయె మృగ్యము నేడిట పాఠశాలలో
వదలక సంతతమ్ము బలవంతము చేసెడు సంస్థలేకదా
చదువుల లక్ష్యమే కడకు సాగుచునున్నది విత్తమార్గమై
చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై
తే||గీ||
రిప్లయితొలగించండిజోయగు పాఠశాలలో చోటునొంద
గోరి కష్టపడి చదువ గోరనగును
గాని , బలవంతమున దానికయి చదివెడి
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
తే॥ మనఁగ మార్కులు ర్యాంకులు మన్ననఁగని
రిప్లయితొలగించండిజదువులకిపుడు హెచ్చఁగ స్పర్ధ మితినిఁ
గానక విరిసి పరితాపమున ముడివడఁ
జదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె
చం॥ కదనముఁ దల్పు స్పర్ధఁ గని కామిత కల్పము మార్కులై యిటుల్
ముదముగ గీటు రాయిగను మోదము పొందఁగ నయ్యొ చూడవో
సదమదమైరి ఛాత్రులటు శక్తికి మించిన భారమై యహో
చదువులు నేఁడు ఛాత్రులను జంపుచునుండె భయావహమ్ములై
చంపు కు literary meaning కాకుండా figurative meaning సామాన్యంగా వాడే రీతిలో తీసుకోవాలండి.
మరొక పూరణండి
తొలగించండిచం॥ పదిలము జ్ఞాన సంపదల ప్రాభవ భాగ్యము విజ్ఞతాదులున్
జదువులు పెక్కు రీతులిల శ్రద్ధను గాంచరె యిష్టమైనచోఁ
బదుగురు నొక్క బాటఁగని భవ్యత నొందఁగ సంతు కెంచఁగన్
జదువులు నేఁడు ఛాత్రులను జంపుచునుండె భయావహమ్ములై
Figurative meaning తీసుకో వాలండి.
అందరూ పిల్లల పరిమితులు ఇష్టాయిష్టాలు గమనించక భవిష్యత్తుకు ఇదే బంగారు బాట అని చూడడము వలన పోటీ పెరిగి అనర్థాలకు దారి తీస్తున్నది. పిల్లలకు ఇష్టమున్న విద్యలో వారు రాణించగలరని పరిగణించడం లేదండి.
విఫణి వీధిని సరుకయ్యె విద్యలనిన
రిప్లయితొలగించండిర్యాంకు లందించు కొట్లు విద్యాలయాలు
దినదినము పిల్లలకవి యొత్తిడిని పెంచ
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె.
పదుగురిలోన పాటవము వాసిగ జూపుచు ర్యాంకు లందునన్
మొదటిదె పొందుటొక్కటదె ముఖ్యమటంచును తల్లిదండ్రులున్
జదువులు చెప్పె డొజ్జలును సంతత మొత్తిడి సేయునట్టి యీ
చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై.
మూర్తి మత్వము పెంచని పొత్తము లును
రిప్లయితొలగించండిబ్రతుకు తెరువును దెలుపని పాఠములును
నేటి విద్యా వి ధా నము నీరు గార్చు
చదువు లిప్పుడు ఛాత్రుల చంపు చుండె
తలకుమించిన బరువుతో తల్లడిల్లు
రిప్లయితొలగించండిచున్న బాలబాలికలకు శోష వచ్చె
నాటపాటలకు సమయ మసలులేక
చదువు లిప్పుడు ఛాత్రుల చంపుచుండె.
అదుపులు తప్పుచుండె గను డాంగ్లపు విద్యలు నేర్చు మోజులో
సదనము లందు నొత్తిడియు జాస్తియు నయ్యెను నాటపాటకున్
వదలక తల్లిదండ్రులును పల్మరు బోధలు చేయు చుండగా
*“చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై”*
ధరలు కబళించు చున్నవి నరుల నిపుడు
రిప్లయితొలగించండిప్రభుత యిప్పుడు పీడించుఁ బౌర వరులఁ
గొలువు లిప్పుడు పనివారిఁ గూల్చు చుండెఁ
జదువు లిప్పుడు ఛాత్రులఁ జంపు చుండె
పదిలము లేక కొల్వులను వంతలు రేఁగ గురూత్త మాళికే
యొదిఁగిన యట్టి నెన్నడుము లుండఁగఁ బిల్లల కెల్ల నూరిలో
నుదితమ యిట్టు లెల్లెడల నొజ్జల నక్కట కాక యింకనుం
జదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచు నుండె భయావహమ్ములై
పెద్ద సంచుల డబ్బును బుద్ధి గాను
రిప్లయితొలగించండిబడికి గట్టిచు, బ్యాగుల బరువు బెంచి,
యిష్ట మెరుగక బిడ్డల ,, కష్ట బెడుచు
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె”
సురేష్ కుమార్ రామోజు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తల్లిదండ్రులు మరి యుపాధ్యాయులు చదు
వుడని విద్యార్థుల పయి నొత్తిడిని పెంచ
తట్టుకొనలేని కొందరాత్మబలి దాన
ము నొనరించుకొనుచునుండె మూర్ఖమతిని
చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె.