6, మే 2025, మంగళవారం

సమస్య - 5115

7-5-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్”

(లేదా...)

“రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో డా. వెలుదండ సత్యనారాయణ గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. కందం
    ఆ మాధవి సీతయనఁగ
    దామోదరుఁడె భువిలోన దాశరథి యనన్
    దామముతో సీత నిలువ
    రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్!

    శార్దూలవిక్రీడితము
    భూమిన్ రాముడె విష్ణుమూర్తి కుజయే ముమ్మూర్తులన్ లక్ష్మియే
    భీముండై శివ కార్ముకమ్ము విరువన్ వేంచేయ సౌమిత్రితో,
    దామమ్మున్ ధరియించ సీత యట నుద్వాహమ్ముకై నిల్వఁగన్,
    రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్!

    రిప్లయితొలగించండి
  2. తాము కొసరిరని గనుగొన
    నామమడుగిన దరువాత నాకము నందున్ 
    ఆ మహిత నటుడు దారక
    రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్

    రిప్లయితొలగించండి

  3. *(సీతమ్మనపహరించ సన్నద్ధుడగుచున్న రావణునితో మారీచుని మాటలుగా)*

    సామాన్యుండని దలవకు
    క్షేమంబది కాదటంచు చెప్పెద వినుమా
    భూమిభృతా! రణ ధీరుడు
    రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్.


    నేమమ్మున్ విడి రామపత్ని నిటులన్ నీవెట్టు లాశింతువో
    నామాటన్ విను రావణా కలను నిష్ణాతుండతండంటినే
    సామాన్యుండని యెంచినట్టి నరుడా సచ్ఛీలుడైనట్టి శ్రీ
    రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్.

    రిప్లయితొలగించండి
  4. కం॥ రాముఁడు సజ్జన త్రాణము
    రాముఁడు దుర్గుణ విరోధి రత్నసువునిటుల్
    ధామముగన్ గన దుష్టులు
    రాముండున్నాఁడు చేర రాదెవ్వరికిన్


    శా॥ రాముండాశ్రిత శిష్ట కామ్య పరదా త్రాణాఢ్య సద్వర్తనా
    ప్రేమాధీశుఁడు దుష్ట శిక్షణఁ గనున్ భీతా వహుండై ధరన్
    గామోపేతపు దుర్గుణమ్ములిల సొక్కంబంచు భాసిల్లగన్
    రాముండున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్

    రత్నసువు భూమి

    మంచితనము అంతరించి నందున రాముడున్నా యెవ్వరు చేర లేరు స్థూల భావమండి

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఆమన్నుచూలి కనుగొనె
    రాముని శివధనువు విరిచి రాణించంగా
    భూమిజ మానసమందున
    రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్

    సామాన్యుల్ గెలువంగ సాధ్యమగునే సౌందర్య రత్నాలనే
    రాముండే సభమందు నిల్చెనుగదా రాణించుచున్ మిన్నగా
    భామారత్నము సీత చేతి సరమే ప్రత్యేకమై తోచెగా
    రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  7. రాముడు జగదభిరాముడు
    దీమసమున లేరు తనకు దీటగువారల్
    భూమిజ హృదయేశ్వరునిగ
    రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్

    రిప్లయితొలగించండి
  8. ధీమంతుండగు రామచంద్రునకిలన్ దీటైన యోధాగ్రణుల్
    భూమీశుల్ గనరారు, సద్గుణములే భూషల్ విలోకింపగన్
    నీమంబుల్ విడనాడకెన్నఁడు ప్రజానీకావనోత్సాహియౌ
    రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  9. రాముడు సర్వో త్త మ్ము డు
    కామిత వరదుడు సుగుణపు ఖని యై వెలుగున్
    ధీమతు డొ కడ నె నెందు కు
    రాముం డున్నాడు చేర రా దె వ్వ రి కిన్?

    రిప్లయితొలగించండి
  10. కం:"ప్రేమగ భద్రాచలమున
    రాముం డున్నాఁడు, చేర రాదెవ్వరికిన్
    ప్రేమన్ జంపు నయోధ్యా
    రాము" ననుచు పిచ్చిజనము రంకెలు వేసెన్.
    (అయోధ్య రామాలయం ప్రారంభిస్తుంటే అన్ని రకాల అడ్డు పడే ప్రయత్నం చేసిన కొందరు చివరి అస్త్రం గా మన భద్రాచలం లో రాముడున్నాడు.అయోధ్యకి పోకండి.వాళ్కకి చంద్ర ఇవ్వకండి అంటూ గోల చేసారు.)

    రిప్లయితొలగించండి
  11. శా:"సేమ మెప్పుడు లౌకికమ్మె" యనుచున్ జింతించు వా డిట్లనెన్
    "ప్రేమన్ జంపు మతాభిమానము కదా వీక్షింపు డీ పక్షమున్
    నీమ మ్మేమియు లేదు దీనికి కడున్ నీచమ్ము సంభాషణన్
    రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్”
    (ఈ పార్టీ వాళ్లకి మాటల్లోనే రాముడుంటాడు కానీ ఇది చాలా చెడ్డది.దీనిలో ఎవరూ చేర వద్దు అని ఒక లౌకికవాది ప్రచారం చేసాడు.)

    రిప్లయితొలగించండి
  12. బీమాసుర వృత దండక
    నా మారణ్యమున ముని జన హితకరుఁడు సం
    గ్రామంబున శత్రుంజయ
    రాముం డున్నాఁడు చేర రా దెవ్వరికిన్


    సీమల్లేవు రమాధినాథునకు నృశ్రేష్ఠాత్మలే యా పరం
    ధా మావాసము లౌను దప్పకను సత్యం బెన్ని వీక్షింపఁగన్
    రామా రత్న శచీ సమేత సుర సువ్రాతేశ్వరుం డైన సు
    త్రాముం డున్నను లోకు లెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్వామియె రక్షించుననుచు
    నీమముతో పూజలెన్నొ నిత్యము సలుపన్
    క్షేమముగా దరి చేర్చెడు
    రాముండున్నాడు చేర రాదెవ్వరికిన్.

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    రాముండున్నను లోకులెవ్వరికి జేరన్ రాదు ముమ్మాటికిన్.

    శార్దూలము:

    కాముండై తన సోదరుం సతినియే కాంక్షించెనే వాలియే
    నామంబున్ స్మరియించు మారుతియు నా నాథుండనే రామునే
    ఆమంత్రించుచు నీవు స్నేహమనుమా యా స్వామి రక్షించులే
    నీమంబౌ రఘరాముడే జనెనుగా నీచంపు వాలిన్ తెగన్
    రాముండున్నను లోకులెవ్వరికి జేరన్ రాదు ముమ్మాటికిన్.

    రిప్లయితొలగించండి