9, మే 2025, శుక్రవారం

సమస్య - 5118

10-5-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్”

(లేదా...)

“హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. కందం
    పరమేశ్వరు చాపమ్మును
    గిరులు జలధులు నదురంగఁ గేల్మోపుచుఁ దా
    విరువ రఘురాముని మనో
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్

    చంపకమాల
    సరసిజనేత్రుఁడున్ సకల సద్గుణ చిత్తుడు రామచంద్రుడున్
    హరువిలు ద్రుంచగన్ గిరులునంబుధులెల్లను కంపమొందఁగన్
    మురిసిన మానసమ్మున సమున్నత తేజుని వీరునిన్ మనో
    హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో

    రిప్లయితొలగించండి
  2. ( సీత మా పక్కింటి అమ్మాయి}
    గరిమమగు విద్యల నెరిగి 
    యిరువది యేండ్ల పరువమున నింపగు రీతిన్
    అరుదగు విధంబున మనో.
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్

    రిప్లయితొలగించండి
  3. హరివిల్లుఁ విరిచె రాముడు
    ధరణిజ కనుదోయి ముందు తానేవరుడై
    మురియుచు తన హృదయ మనో
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్

    హరుని ధనుస్సునెత్తితన యద్భుత శక్తినిఁ జూపె రాముడే
    ధరణిజకై విదేహపతి తానమరించిన శ్రేష్టమౌ స్వయం
    వరమున సీతయున్ మురిసె వానిని కన్గొని ధీరుడౌ మనో
    హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో

    రిప్లయితొలగించండి

  4. సురుచిర సుందర రూపుడు
    కరుణా సంద్రుండటంచు ఖ్యాతిని గల దా
    శరథిని ఖలు తాటక సం
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్.


    ధరణిని ధర్మమున్ నిలుప దానవ మూకల మట్టుబెట్ట దా
    శరథిగ పుట్టినట్టి ధనుజద్విషు డాతడు సద్గుణాంబుధిన్
    సురుచిర సుందరాననుని శూరుని దానవుడౌ సుబాహు సం
    హరుని వివాహమాడె మహామహి పుత్రిక సీత ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  5. కం॥ వరదుఁడు రక్షకుఁడై యటు
    ధరణిని ధర్మము నిలిపిన దశరథపుత్రున్
    స్థిర చిత్తున్ భవబాధా
    హరునిం బెండ్లాడె సీత యతి సంప్రీతిన్

    చం॥ వరదుఁడు రాక్షసాంతకుఁడు వారిజనేత్రుఁడు ధర్మ పాలనన్
    ధరణినిఁ గాంచఁ దల్చుచుచుఁ దానుగ వచ్చిన యచ్యుతుండు సు
    స్థిరముగ సజ్జనాళికిల శ్రేయమొసంగెడి వాఁడునౌ వ్యథా
    హరుని వివాహమాడె మహామహి పుత్రిక సీత ప్రేమతో

    బాధా వ్యథా పదాలు నిఘంటువులో ఉన్నాయండి

    రిప్లయితొలగించండి
  6. సరగున యంతకాంతకుని చాపమునెక్కిడ రామచంద్రుడే
    విరిగెను పెళ్ళుపెళ్ళని గుభిల్లన గుండెలు మన్నెకాండ్రకున్
    ధరణిజ మానసమ్మున ముదమ్ము వెలార్చఁగ ధీరుడౌ మనో
    హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో

    రిప్లయితొలగించండి
  7. అరవిందాక్షుడు రాముఁడు
    హరుని ధనువు చేతబూని యవలీలగ తా
    విరువఁగ పులకించి మనో
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్

    రిప్లయితొలగించండి
  8. చం:విరువగ విల్లు రాము డతి విస్మయ మంది మనమ్ము నందు దా
    వరణ మొనర్చె కాని యది "భర్గునకున్ గలిగించు క్రోధమో?
    గురుతర వైర మౌనొ? యని, క్రోధము నొందకు "మంచు వేడుచున్
    హరుని, వివాహమాడెను మహామహిపుత్రిక సీత ప్రేమతో”

    రిప్లయితొలగించండి
  9. నిరుపమ శక్తి యుతు o డై
    హరు చాపము ద్రుంచ గానె హర్షం బొద వన్
    మరలుగ వరియించి మనో
    హరు నిం బెండ్లాడె సీత యతి సం ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  10. పరమ విశిష్ట మైన ఘన బల్లిదు

    లెత్తని కార్ముకంబునున్

    విరచి సభాస్థలిన్ ప్రముఖ

    వీరుల సిగ్గిల జేసినట్టి శ్రీ

    కరు రఘురామచంద్రుడిని

    కంజ దలాక్షుని కుంభినీ మనో

    హరుని వివాహమాడె మహా మహి

    పుత్రిక సీత ప్రేమతో. 9/5/25

    రిప్లయితొలగించండి
  11. ధరణీ ధవుఁడు జనకుఁ డం
    తరంగమున సంతసింప దాశరథి ధరన్
    ధరణీ తనయ నిజ మనో
    హరునిం బెండ్లాడె సీత యతి సంప్రీతిన్


    అరుణము సింద నాస్యమున నాత్మ మనోరథ పూర్ణ వేళలో
    నర నిచయోత్తముం దమి మనమ్మున రేఁగఁగ హర్ష చిత్తయై
    మరు హరు విల్లుఁ ద్రుంపఁగను మానవ కంటక తాట కాది సం
    హరుని వివాహ మాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పరమేశుని ధనువును తా
    విరువగ శ్రీరాముడంత పేరోలగమున్
    హరుసించ సభికులు మనో
    హరునిం బెండ్లాడె సీత యతి సంప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  13. వరునిగ రాముని రాకను
    వరముగ మనసున దలచుచు వదనము నందున్
    ధరహాసముతోన్ రావణ
    హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్”

    సురేష్ కుమార్ రామోజు

    రిప్లయితొలగించండి
  14. హరుని ధనువునా సభలో
    విరువగ శ్రీరాఘవుండు వేడుక తోడన్
    నరయుచునచ్చోటమనో
    *“హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్”*
    చం.మా
    హరుని విలున్వడిన్ విరువ హర్షము తోడను గాంచనెల్లరున్
    చరచుచుచేతులన్ వడిగసంబరమంబరమంటుచుండగా
    ధరణియుసంతసమ్ముననుతన్మయమొందుచునుండనామనో
    *"హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో”*

    రిప్లయితొలగించండి