మాంసముఁ దిను, ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్” (చిక్కుడు కాయలకి పేదల మాంసము అని పేరు.పోషక పదార్థం కనుక.బ్రాహ్మణుడి శిష్యుడ వై మాంసం తినే బదులు పేదల మాంసం ఐన చిక్కుడు కాయ తిను. )
ఉ:"మాంసము ముట్టె కౌశికుడు,మాన్య మహర్షియె?" యంచు నెంచ, కా హంసను బోలు మౌని తరణార్థము మంత్రము నిచ్చె, దుర్విధిన్ మాంసమె మార్గమై తినిన మాత్రమునన్ ఋషినింద జేయ, కా మాంసముఁ దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్” (కరవు కాలం లో విశ్వామిత్ర మహర్షి కుక్క మాంసము తిన్నాడని ఒక కథ ఉన్నది. తప్పని పరిస్థితిలో ఆయన తింటే దానికి నింద చెయ్యకు.హంస వంటి ఆ మహర్షి కదా!తరింప జేసే గాయత్రీ మంత్రాన్ని ఇచ్చింది!)
కందం
రిప్లయితొలగించండిధ్వంసమగునె జన్మమ్మది
మాంసము దిని చేయు వృత్తి మనుజుండున్నన్
కంసారిఁ గొల్చి శూద్రుడు
మాంసముఁ దిను, ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్!
ఉత్పలమాల
ధ్వంసము కాదుగా బ్రతుకు వారల వృత్తికి నొప్పురీతిగన్
మాంసము దిన్న మానవుడు, మన్ననలందుచు కార్యమగ్నుఁడై
కంస వినాశకున్ గొలిచి గర్వము వీడిన శూద్రజన్ముడై
మాంసముఁ దిన్న, శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్
ధ్వంసమొనర్చును ధర్మము
రిప్లయితొలగించండిమాంసముఁ దిను ద్విజుఁడు, ముక్తిమార్గముఁ జూపున్
హంసను బోలిన సద్గుణ
సంసర్గముఁ గలిగి మసలు సత్పురుషుఁడిలన్
ధ్వంసమొనర్చు ధర్మమును దప్పిన దుష్టుల సంగతమ్మునన్
రిప్లయితొలగించండిమాంసముఁ దిన్న శ్రోత్రియుఁడు, మార్గముఁ జూపును ముక్తినందఁగన్
హంసనుఁ బోలు స్వచ్ఛమగు నాతుమ గల్గిన సచ్చరిత్రుడై
హింసను వీడి ధర్మమును హృత్కమలమ్మున నూన్చు సిద్ధుఁడే
హింసను వీడమనుచు వి
రిప్లయితొలగించండిధ్వంసము కూడదని తెలుపు తత్వము తనదై
హంసను బురుడించుచు మీ
మాంసముఁ దిను ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్
హింసను ప్రోత్సహించక యహింసను సాధన సేయనొప్పు వి
ధ్వంసము కూడదన్న నిశితత్వము నీమది నింపుచుండు ను
త్తంసములైన వక్త్రజులు తప్పులు దిద్దుచు నుండ్రుగాదె మీ
మాంసముఁ దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్
రిప్లయితొలగించండికంసుని దునుమాడిన యా
హంసుని పామరు డొకండు నర్చించుచు స
ర్వంసహ లో తా నెఱుగక
మాంసముఁ దిను , ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్.
కంసుని సంహరించుటకె కల్పము నందు జనించి నట్టి యా
హంసుని గొల్వగావలె నహర్నిశ మందున నెవ్వరేని స
ర్వంసహలోన పామరులు బాలిశు లౌచును రాలు పాటుతో
మాంసముఁ దిన్న , శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్.
శంస నడంచక నల్పుడు
రిప్లయితొలగించండిమాంసముఁ దిను ; ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్
హంసుని వైపున మదితో
కాంసీయమువలె ధృడతను కలిగిన యెడలన్
కం॥ హింసనిడి చంపి సింగము
రిప్లయితొలగించండిమాంసముఁ దిను, ద్విజుఁడు ముక్తి మార్గముఁ జూపున్
సంసక్త సదాచారము
నంసముపై నిలుప హరియె యరయుటఁ దెలుపున్
ఉ॥ ధ్వంసము సంప్రదాయమగుఁ దానుగ బ్రాహ్మణుఁ డొప్పుచు నిష్ఠ వీడుచున్
మాంసముఁ దిన్న, శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్
హింసనుఁ బ్రేఁచు దుష్టతను హీనమటంచును, దెల్పుచున్ సఖా
యంసము పైన నిల్పఁదగు నార్ద్రత భక్తియుఁ గావ వెన్నుఁడే
సంసక్త చేరినది కలిసినది అంసము భుజశిరస్సు అరయు ఆదుకొను శ్రోతియుడు ఇక్కడ వేదము తెలిసి ధర్మమార్గము దప్పని బ్రాహ్మణుడు (నిఘంటువు సహాయము)
కం:మాంసము మానుము పేదల
రిప్లయితొలగించండిమాంసము చిక్కుళ్లనియెడి మాట వినవె!నీ
హింసను విడి యా పేదల
మాంసముఁ దిను, ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్”
(చిక్కుడు కాయలకి పేదల మాంసము అని పేరు.పోషక పదార్థం కనుక.బ్రాహ్మణుడి శిష్యుడ వై మాంసం తినే బదులు పేదల మాంసం ఐన చిక్కుడు కాయ తిను. )
ఉ:"మాంసము ముట్టె కౌశికుడు,మాన్య మహర్షియె?" యంచు నెంచ, కా
రిప్లయితొలగించండిహంసను బోలు మౌని తరణార్థము మంత్రము నిచ్చె, దుర్విధిన్
మాంసమె మార్గమై తినిన మాత్రమునన్ ఋషినింద జేయ, కా
మాంసముఁ దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్”
(కరవు కాలం లో విశ్వామిత్ర మహర్షి కుక్క మాంసము తిన్నాడని ఒక కథ ఉన్నది. తప్పని పరిస్థితిలో ఆయన తింటే దానికి నింద చెయ్యకు.హంస వంటి ఆ మహర్షి కదా!తరింప జేసే గాయత్రీ మంత్రాన్ని ఇచ్చింది!)
హింస ను జేసెడి వాడిల
రిప్లయితొలగించండిమాంసము దిను :: ద్విజుడు ముక్తి మార్గము జూపున్
ధ్వంస ము జేసియు జెడు న
హింస ను బాటించు టొ ప్పు ని ద్దర ప్రజకున్
సంసార బంధ ముక్తుఁడు
రిప్లయితొలగించండికంసారి పదాబ్జ సక్త కమనీయ నరో
త్తంసుం డన్నమ్ము విగత
మాంసముఁ దిను ద్విజుఁడు ముక్తి మార్గముఁ జూపున్
మాంస విసర్జితుండు జన మాన్యుఁడు సచ్చరితుండు సంయమో
త్తంసుఁడు ధర్మ బోధకుఁడు దాఁ బర మాంచిత శబ్ద యుక్తుఁడౌ
హంస తపోబలాన్వితుఁడు యజ్ఞ ఫలమ్మును, వీడు లగ్న మీ
మాంసముఁ, దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తి నందఁగన్
[ లగ్న మీమాంసము = తగులుకొనిన మీమాంస కలది, ఇక్కడ మనస్సు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
హింసని యెఱిగియు జనులిల
మాంసము దిను; ద్విజుడు ముక్తిమార్గము
జూపున్
హింసను విడనాడుడని య
హింసను పాటించువాని యెడనెడ పొగడున్.