ఉ:"విద్య యనంగ తత్త్వ మని, వేరొక టేదియు గా" దటన్న నీ వాద్యము నాపు మయ్య,మరి భౌతిక జీవితమున్ ద్యజింతువే వైద్యము,నార్థికమ్ము,పరిపాలన,క్షాత్రము లందు నెన్న డే విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్? (వేదం అనేది తత్త్వాన్ని మాత్రమే బోధిస్తుందని,అదొక్కటే విద్య అనే నీ దరువు కొట్టటం ఆపవయ్యా!వైద్యం,ఎకనమిక్స్,పబ్లిక్ అడ్మిన్స్ట్రేషన్,యుద్ధవిద్య అన్నీ వేదాలలో ఉన్నాయి? ఏ విద్యకి పాడె కట్టుమని వేదం చెప్పింది? అలా చెప్ప లేదు.)
తేటగీతి
రిప్లయితొలగించండిమనుజుడు మనుజునిన్ జంపు మహిని చర్య
వాంఛనీయము కాదది వన్యమృగము
లొప్పు దమననీతి ,చెలఁగు యుగ్రవాద
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
ఉత్పలమాల
ఉద్యమమన్న మానవులకున్నతిఁ గోరిన వాంఛనీయమౌ
వేద్యము తోడిమానవుల వేదన బాపెడు సత్పథమ్మదే
వద్యము కాదుగా ప్రజల ప్రాణము దీయుట! లుగ్రవాదపున్
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
విద్యయె జ్ఞానసంపద వివేక
రిప్లయితొలగించండివిచక్షణ బెంచు సర్వదా
విద్యయె యెల్ల మానవుల పేదరి
కంబును బాపునట్టి యా
విద్యను నేర్చిపొందవలె వేడ్కను,
మోసము చేయువారి దు
ర్విద్యకు పాడె గట్టుమని వేదము
సెప్పెను ఘోష జేయుచున్.
తే||గీ||
రిప్లయితొలగించండివినయము నిడుచు పాత్రతబెంచి దాని
వలన ధనమును , దానము బన్నజేయు
విద్యకుం "బాడెఁ గట్టుట వేదవాక్కు"
యనుట పిచ్చివాని పలుకులనదగు గద
రిప్లయితొలగించండివిద్య విజ్ఞాన వినయ వివేకములను
చక్కనైన సంస్కార మొసంగు నదిగ
నుండ మేలు దుష్టులు మెచ్చెడుర్వి క్షుద్ర
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు.
వేద్యులు చెప్పిరెప్పుడొ వివేకము పెంచుచు జ్ఞానవంతునిన్
విద్యయె చేయు సత్యమిది విశ్వము నేకము చేయునందురీ
విద్యను సాంప్రదాయమన ప్రీతిని పెంచును, ధర్మ దూరమౌ
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్.
పరుల హింసింప నేర్చిన పాడు విద్య
రిప్లయితొలగించండివలదు భువిలోన నెవరికీ వాస్త వముగ
నట్టి వాటిని యరికట్టి యవని క్షుద్ర
విద్య కుం బాడి గట్టుట వేద వాక్కు
తే॥ సర్వులకు హితము నొసఁగి సంతసమ్ముఁ
రిప్లయితొలగించండిగూర్చునదియె విద్య యగును గుటిలతనిడి
జనుల నాశముఁ గను చోర జార జూద
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
ఉ॥ సద్యము దైన్యమొంద నరిషడ్గుణ భాగ్యమొసంగి పెంచెడిన్
విద్యకుఁ బాడెఁగట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
వేద్యమటంచుఁ దెల్పెనిటు ప్రీతినిఁ గాంచుచు నేర్చి సాగ స
ద్విద్యను భాసమానతను దీటుగ జీవిత మొప్పు సర్వదా
సద్యము తత్కాలము అప్పుడు వేద్యము తెలుసుకో దగినది.
విద్యనరయగ మార్గము వేదమనుచు
రిప్లయితొలగించండివిపుల మైనది ప్రాచీన వేద ఘోష
అల్పులు శ్మశాన వాటిని సల్పు క్షుద్ర
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
విద్య తొలంగజేయు పిస విద్యకు మార్గము వేదమేకదా
విద్యయె సాటిలేనిదని వేదము చెప్పుట స్పష్టమేకదా
చోద్యముగా శ్మశానమున క్షుద్రులొనర్చుచునున్న క్షుద్రమౌ
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
జనుల కుపయుక్తమైనట్టి చదువు గాక
రిప్లయితొలగించండిమారణము నేర్పు చదువులు మనకవేల?
యట్టి విధ్వంసకారకమైన యెడల
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
విద్యయొసంగు జ్ఞానము వివేకము గూర్చును ధర్మనిష్ఠ యా
రిప్లయితొలగించండివిద్యయె లేనివాడిలను వింతమృగమ్మని యండ్రు పండితుల్
సద్యశమీయజాలని విషమ్మును జిమ్మెడి విద్యయేలనా
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
హృద్యము మాతృభాషఁబలురీతుల ముచ్చట గొల్పునద్దియే
రిప్లయితొలగించండిపద్యములల్లగా దగునుభావము నంతయు దెల్పవచ్చు సం
పాద్యము లన్నిభాషలన భవ్యము దివ్యము లైచెలంగు నే
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
తే.గీ:లౌకికమ్మున పాఠశా లల, బ్రభుత్వ
రిప్లయితొలగించండికార్యశాలల మతముల కలహములను
నిలివరించగ నన్ని రీతుల మతముల
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు”
(లౌకికవాదం లో మతవిద్యలకి పాడె కట్టటమే వేద వాక్కు.)
ఉ:"విద్య యనంగ తత్త్వ మని, వేరొక టేదియు గా" దటన్న నీ
రిప్లయితొలగించండివాద్యము నాపు మయ్య,మరి భౌతిక జీవితమున్ ద్యజింతువే
వైద్యము,నార్థికమ్ము,పరిపాలన,క్షాత్రము లందు నెన్న డే
విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్?
(వేదం అనేది తత్త్వాన్ని మాత్రమే బోధిస్తుందని,అదొక్కటే విద్య అనే నీ దరువు కొట్టటం ఆపవయ్యా!వైద్యం,ఎకనమిక్స్,పబ్లిక్ అడ్మిన్స్ట్రేషన్,యుద్ధవిద్య అన్నీ వేదాలలో ఉన్నాయి? ఏ విద్యకి పాడె కట్టుమని వేదం చెప్పింది? అలా చెప్ప లేదు.)
సార్థక మొనర్చె నామము వ్యర్థ మించు
రిప్లయితొలగించండికేని కానీక తా నభ్యసించె విద్య
మరణ మందిన యట్టి కోమలికి నమ్మ
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
పాద్య మొసంగి సోమ రస పాన నిమిత్తము వజ్రి వేఁడు నా
విద్యకుఁ బట్ట మింపుగను వేదము సెప్పును గట్టు మం చిలం
జోద్యమె చెప్పు మిట్టు లన క్షుద్ర దురాసద దేవతార్చనా
విద్యకుఁ బాడెఁ గట్టు మని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్
రిప్లయితొలగించండితల్లి భాషను వీడుట తగదదియగు
విద్యకుం బాడెగట్టుట,వేదవాక్కు
లెపుడువిస్మరించక విన్న నిలను సతత
మాచరించినశుభమగుననవరతము
ఆద్యులు పూర్వకా లమున అన్నియు నభ్యస నమ్మొనర్చిస
ద్విద్యలు నేర్వగా వలయు విశ్వము నందున నెల్లవేళలన్
మద్యము గ్రోలుచున్సతముమాటలతోడనుమభ్యపెట్టుదు
*“ర్విద్యకుఁ బాడెఁ గట్టుమని, వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విద్య జ్ఞానముఁ పెంచి వివేకమునిడి
జనులకున్ చక్కనైన సంస్కార మిడుచు
నుండవలె, నాశమున్ జేయ నుర్వి క్షుద్ర
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు.
భరత భూమిని హింసించ భయము లేక
రిప్లయితొలగించండిమానవత్వము లేకను మతము నెంచి,
ప్రజల జంపు వికృతముగ్రవాద మనెడి
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు
సురేష్ కుమార్ రామోజు