శా:ఆశీర్వాదము చేరె మా గృహము తా నా బైబిలున్ బట్టి "దై వాశీర్వాదము దక్కు"నంచు,సరియౌ నారోగ్య మంచున్ భళా ఆశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్ మా శుంఠల్ విడినారు విప్రవిధులన్ మా దంచు నా బైబిలున్ (ఆశీర్వాదం అనే పేరు కలవాడు దైవాశీర్వాదం దక్కుతిందని బైబిల్ తెచ్చి అంటించాడు.ఈ బ్రాహ్మణుడి పిల్లలు వీళ్ల సంధ్యావందనాది ఆచారాలు మాని క్రైస్తవం లోకి పోయారు.)
కందం
రిప్లయితొలగించండిసౌశీల్యమొప్పు ద్రౌపది
యాశించ సుమంగళీ భవా! యనె భీష్ముం
డాశీస్సుగ నని తనదౌ
యాశీర్వాదమ్ము శాపమై బాధించెన్
శార్దూలవిక్రీడితము
సౌశీల్యంబున ద్రౌపదీ లలన కంసారాతి యాదేశమై
యాశింపంగ 'సుమంగళీభవ! 'యటంచార్యుండు భీష్ముండనెన్
పాశంబందున జిక్కి, యుద్ధమున సూ! పర్యావసానాన న
య్యాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్!
కాశీ గుడిలో బొందితి
రిప్లయితొలగించండినాశీర్వాదమ్ము ; శాపమై బాధించెన్
గోశాలన నే జేసిన
నాశపు పనులకు బదులుగ నయమగు రీతిన్
లేశంబైనను చూపకన్ కరుణ యాలీలన్ దురంబందునన్
రిప్లయితొలగించండియాశీర్వాదము గోరె శాంతనవు నన్యాయంబుగా ద్రుంచగన్
యీశానా! దయమాలి ధర్మజుఁడు తానీరీతి వర్తించునా!
యాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్
ఈశానా! కౌంతేయుఁడు
రిప్లయితొలగించండియాశీర్వాదమ్ము గోరె నాపగతనయున్
యాశించి వాని మరణము
ఆశీర్వాదమ్ము శాపమై బాధించెన్
రిప్లయితొలగించండిఆ శీలవతి పృథకు ముని
వైశిష్ట్యంబగు వరమును వాత్సల్యముతో
సౌశీల్యము మెచ్చి నొసగు
నాశీర్వాదమ్ము శాపమై బాధించెన్.
సౌశీల్యంబును జూపి కొల్చెననుచున్ సౌమేధికుండప్పు డా
వైశిష్ట్యంబగు సేవలన్ గని వరంబా కన్య కిచ్చెన్ గదా
ప్రాశస్త్యంబగు వారితో సుతుడు సంప్రాప్తించు సౌలభ్యమే
యాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్.
కం॥ ఆశలు వీడుచు భీష్ముఁడు
రిప్లయితొలగించండిసౌశీల్యతను ప్రతిననిడ జనుకుఁడు నొసఁగన్
వైశిష్ట్యంబగు దీవన
నాశీర్వాదమ్ము శాపమై బాధించెన్
శా॥ ఆశావాహినిఁ ద్రుంచి యొప్పుచును భవ్యాత్ముండు భీష్ముండటుల్
వైశిష్ట్యంబగు బాస చేసెనని సంభావించి దీవించఁగన్
సౌశీల్యంబును మెచ్చి తండ్రి యమితోత్సాహమ్ము నిండంగ నా
యాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్
ఆశపడి నిర్దయ నడిగె
రిప్లయితొలగించండినాశుభ్రిని కుంభ కర్ణ నరభుజుడే వా
గీశుడు తథాస్తని బలుక
నాశీర్వాదమ్ము శాపమై బాధించెన్
ఆశాభావము తోడకోరెనుకదా యాకుంభకర్ణుండటన్
బైశాచత్వము నిండు నిర్దయత సంప్రాప్తింప గానెంచుచున్
బాశంబయ్యె తథాస్తటంచు రయమున్ వాగీశుడేపల్కగా
నాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్
దోసెలు వేసెడు బామ్మకు
రిప్లయితొలగించండివీసా దొరికెను విదేశ వినువీధులకై
దూసి కరోనా యెగబడ
నాశీర్వాదమ్ము శాపమై బాధించెన్ :)
కం;ఆశీర్వాదము కారము
రిప్లయితొలగించండినాశకముర!యనగ కొడుకు నమ్మక దెచ్చెన్
నాశ మయె నావకాయయె
ఆశీర్వాదమ్ము శాపమై బాధించెన్
కాశీ యాత్రకు వెడలగ
రిప్లయితొలగించండిలేశము నిబ్బంది కూడ లే కుండగ దా
నాశించి మాకు నొసగి న
నాశీ ర్వా ద మ్ము శాప మై బాధి o చెన్
రెండవ పాదంలో లేశము ధన సాయ మిడక లేవడి యై తా అని సవరణ చేయడమైనది
తొలగించండిశా:ఆశీర్వాదము చేరె మా గృహము తా నా బైబిలున్ బట్టి "దై
రిప్లయితొలగించండివాశీర్వాదము దక్కు"నంచు,సరియౌ నారోగ్య మంచున్ భళా
ఆశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్
మా శుంఠల్ విడినారు విప్రవిధులన్ మా దంచు నా బైబిలున్
(ఆశీర్వాదం అనే పేరు కలవాడు దైవాశీర్వాదం దక్కుతిందని బైబిల్ తెచ్చి అంటించాడు.ఈ బ్రాహ్మణుడి పిల్లలు వీళ్ల సంధ్యావందనాది ఆచారాలు మాని క్రైస్తవం లోకి పోయారు.)
ఆశించి కీర్తి వసుధా
రిప్లయితొలగించండిధీశుఁడు వేఁడఁగ నెఱుఁగకయే వాణీ ప్రా
ణేశుఁ డొసఁగ గయునకు వర
మాశీర్వాదమ్ము శాపమై బాధించెన్
కాశీ నాథు దయార్ద్ర వీక్షణము లొల్కంగన్ సమీక్షింప నే
యాశన్ ధర్మము వెల్గుచుండు విజయం బందంచు ఘోరమ్ముగా
నాశా భంగము నంగరాజునకుఁ బార్థార్థమ్ము తచ్ఛౌరి యీ
నాశీర్వాదము శాప మయ్యెను గదా యారాటముం గూర్పఁగన్
(అశ్వత్థామ రోదన)
రిప్లయితొలగించండిపాశమ్మున తండ్రొసగిన
ఆశీర్వాదమ్ము శాపమై బాధించెన్
క్లేశము కృశించిన తనువుఁ
లేశంబైనను సహింప లేనిక కృష్ణా.
శా.
రిప్లయితొలగించండిరాశీభూత మహత్ఖరాశుగముచే రాజిల్లి గాండీవి యా
శ్రీశాదేశము వీనులన్ నిలిపి తా సింధు క్షితీంద్ర ప్రతా
పాశం గూల్చి శిరంబుఁ దండ్రి కడకుం బంపంగ వ్యర్థంబుగా
నాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చగన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆశీర్వాదము చేసి సద్గురువులే యాకాశ యానంబుకై
తొలగించండిరాశీభూతపు నందచందముల పారాడంగ యాలేపనన్
ఆశీతంపు హిమంబు జార కరిగే యా పూత నిశ్శక్తియై
యాశీర్వాదము శాపమయ్యెను గదా యారాటమున్ గూర్చగన్!!
(వరూధినిని చూడకముందు, గృహంబున సంధ్యవార్చుటకై పైకెగురలేని శక్తి కోల్పోయిన ప్రవరాఖ్యుని స్వగతం)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సౌశీల్యము మెచ్చి మునియు
వైశిష్ట్యమగు వరమివ్వ వనితకు పృథయున్
ఆశగ పుత్రుని గనగా
నాశీర్వాదమ్ము శాపమై బాధించెన్..