26, మే 2025, సోమవారం

సమస్య - 5133

27-5-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా”

(లేదా...)

“కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”

16 కామెంట్‌లు:

  1. కందం
    తెలవారు స్వార్థపరులై
    ప్రలోభములకు గురిచేయ పాల్గొనకుండన్
    విలువలెరిగి జావగ నూ
    కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా?

    మత్తేభవిక్రీడితము
    తెలవారల్ మన దేశ సంపదలతో దేదీప్యమానంబుగన్
    వెలుగంగన్ నిరతంబు దోచుకొన చూపించన్ ప్రలోభమ్ములన్
    విలువల్ ముఖ్యమటంచు దేశమున భక్తిన్ జావ చాలంచు నూ
    కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!


    రిప్లయితొలగించండి
  2. అలపు నెరుగకుండుటకయి
    కలిసిన మిత్రులను గూడి కాలక్షేపం
    సలుపగ , వేయించిన శన 
    గలు సేవింపుఁడనె గాంధి , గాదనఁగలవా

    రిప్లయితొలగించండి

  3. వలదిక మతమౌఢ్యమని ప్ర
    జలన్న దమ్ముల వలెనిల సంభావనతో
    మెలగుచు శ్రీరాముని తుర
    కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా.


    వలదీ దాస్యము స్వేచ్ఛ కావలయు సౌభాగ్యంబదే కావునన్
    ఖలు లాంగ్లేయుల పాఱనొత్తుటదియే కర్తవ్యమై సాగగన్
    కులభేదమ్ములు వీడు, సంపదలు లేకున్నన్ జనాలెల్ల నూ
    కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా.

    రిప్లయితొలగించండి
  4. వలదా మాంసాహారము
    తలపగ శక్తినిడునె తృణ ధాన్యము కంటెన్
    బలమొసగు గింజలను నూ
    కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా

    కలదా గింజల కంటె పుష్టికరమై గట్టిల్లు నాహారమే
    వలదేమాత్రము మాంస భక్షణము సంప్రాప్తంబులౌ ధాన్యముల్
    బలమున్ గూర్చెడి కూరగాయలు సహా ప్రాణంబులన్ నిల్పు నూ
    కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా

    రిప్లయితొలగించండి
  5. తలపన్ వచ్చె ప్రపంచ యుద్ధమిపుడున్ దన్నవ్వగా పాలకుల్
    విలసిల్లంగను స్వేచ్చనిచ్చు మనకున్ వెయ్యేల సాయంబు లో
    కుల ధర్మంబగు గాన మిమ్ముననికై కోరంగ నాంగ్లేయ మూ
    కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా!!

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ తొలఁగఁగ విదేశ పాలన
      వలచి స్వదేశ వలువలనె పరిణితిఁ బడయన్
      బిలుపు నొసంగి యిచటి కో
      కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!

      మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదా
      పొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడఁగన్
      బిలుపున్ జేసె తిరస్కరించుటయె సంవేద్యమ్ము చేనేత కో
      కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా

      కోక వస్త్రము

      కోకలు సేవించు (ఉపయోగించు అర్థముతో వాడినానండి) దోషమైతే

      కం॥ తొలఁగఁగ విదేశ పాలన
      వలచి స్వదేశ విలువలను బరిణతిఁ బడయన్
      బిలిచెను నిరసనఁ గని య
      ల్కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా!

      మ॥ వలపుల్ మీర స్వదేశ వస్తువులు సంభావించుచున్ సర్వదా
      పొలుపున్ బూని విదేశ వస్తువులు సంపూర్ణమ్ముగన్ వీడుచున్
      జలియించంగఁ దిరస్కరించి వరలన్ సత్యాగ్రహోత్పన్న య
      ల్కలు సేవించు డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా

      తొలగించండి
  7. ఇలలో తరగని స్వాస్థ్యము
    నెలకొల్పఁగ వెరవిదెయని నిరతము మనుజుల్
    తెలివిడితో పాలకు మే
    కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా

    రిప్లయితొలగించండి
  8. కలుషంబుల్గనరాని దుగ్ధమది మేకల్ బెంచగా లభ్యమౌ
    విలువంగట్టగ శక్యమే జనులకున్ విత్తంబుతోదాని? మే
    కలు గోవుల్ మనుజాళి కెల్లరకు సౌఖ్యంబున్ ప్రసాదించు మే
    కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా

    రిప్లయితొలగించండి
  9. కం:"తలతుము గోమాతనె,మే
    కల పాలే శ్రేష్ఠ మనుచు కమ్మగ గొని త
    ల్లుల తో సమములు గా మే
    కలు! సేవింపుఁ"డనె గాంధి గాదనఁగలవా”

    రిప్లయితొలగించండి
  10. తులువలు నాంగ్లేయుల తో
    చెలువము గా జట్టు గట్టి చేరితిరి గదా
    పలు విధ ముల వార ల కో
    కలు సేవింపు డనె గాంధి గాదన గలవా?

    రిప్లయితొలగించండి
  11. మ;పలు రోగమ్ముల బాపి స్వాస్థ్య మొసగున్ పాలిచ్చి, నే నెంచ గో
    వులకున్ సాటియె మేక తల్లి యనుచున్, పోదోలు డేహ్యమ్ము హిం
    సల బాధింపకు డట్టి త
    ల్లిని నమస్కారార్హహలే యౌను మే
    కలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”

    రిప్లయితొలగించండి
  12. కలిగిన దుర్భరముగ బా
    ధలు మీకున్ మిత్రు లార తఱుఁగుటకై రా
    హు లనం దా విఖ్యాతుఁడు
    కలు సేవింపుఁ డనె గాంధి గా దనఁ గలవా


    అల సత్యాగ్రహ ముండ రక్షణకు నన్యాయమ్ము నాపంగ క్ష్మా
    తలమం దింపుగ వీడు సందియము డెందం బందు నిర్భీతి వం
    తలు వాటిల్లిననున్ నిరంతరము సత్యమ్మున్, విసర్జించి వం
    కలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా

    రిప్లయితొలగించండి
  13. కం.
    బలమును గలుగగ జేసెడి
    కలిమిని నిండుగ కలిగిన కమ్మని రుచితో
    మెలగెడి మొలిచిన పలు మొల
    కలు సేవింపుడనె గాంధి గాదన గలవా ?

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    బలమునకు పప్పులు తినగ
    పిలుపు నిడెను చౌక యనుచు పేదలకెల్లన్
    విలువ తెలిసి జావగ నూ
    కలు సేవింపుడనె గాంధి గాదనఁ గలవా?

    రిప్లయితొలగించండి