ఇది నిజమండి. అంతర్దేశీయ (domestic) ప్రయాణాలలో. ఇప్పుడు దాదాపుగా ఇండిగోది మోనోపలి అయ్యింది. నీరు తప్ప ఏదీ ఫ్రీగా దొరకదండి. నచ్చిన సీటు కావాలన్నా అదనంగా చెల్లించాల్సిందే నండి. విదేశయానములో తిండి వరకు ఫరవాలేదు. నెట్ లాంటివి ప్రీమియం సీటు కావలంటే డబ్బుకట్టాలండి. ఆకాశములో విపణులకు కొదవ లేదండి.
కం;ఈ కాలపు చిత్రమ్మై మాకు నపార్ట్మెంటు దక్కె మా కందని వౌ నే కార్లు,బీర్లు? భూమిని నాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై” (పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగ్.దానిలో భూమి మీద (గ్రౌండ్ ఫ్లోర్ లో) కార్లు,ఆకాశం లో బీర్లు దొరుకుతాయి.అన్ని వ్యాపారాలు ఆ భవనం లో ఉన్నాయి.)
కాకమ్మ కథగ దలచకు ,
రిప్లయితొలగించండిమాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై !
నీకెవరు చెప్పిరనకుము,
వాకబు జేయగ దెలిసిన వార్త యిదెగదా !
శాకమ్ములు సరుకులధర
రిప్లయితొలగించండిలాకసమంటెను జనులకు నందని రీతిన్
వ్యాకులపడి పేదలనిరి
యాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై
కందం
రిప్లయితొలగించండిలోకుల దీపావళి కల
సాకారము మందుగుండు సామాగ్రులతోన్,
జేకూర్చ నిశి వెలుగుల
య్యాకసమునఁ, గలవు విపణులమ్మకమునకై!
ఉత్పలమాల
చేకుర గెల్పు నా నరకుఁ జీల్చఁగ కృష్ణుడు సత్యభామలున్!
లోకులు దీపముల్ వెలుగ రోతురు పర్వమమాసనాడనన్
ప్రాకటమై! మతాబులను రంజిల గాల్చుచు వెల్గునింప, న
య్యాకసమందుఁ, బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై!
ఆకసమున చంద్రతలముఁ
రిప్లయితొలగించండిబ్రాకటముగ నమ్మినారు వ్యాపారులిలన్
జేకొన నెంచిన భాగ్యం
బాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై
ఆకస వీధులందు నిను హాయిగఁ దిప్పెడు యాత్రసాధ్యమే
దాకొన నంతరిక్షమున స్థావరమొక్కటి లభ్యమేకదా
ఆకసమందుపగ్రహములమ్మగ జూపెడు సంస్థలేర్పడె
న్నాకసమందుఁ బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై
రిప్లయితొలగించండినాకము నంటు మడువులో
ప్రాకటమౌ యంగడులట రమణమ్మవగా
పోకిరి గని పలికె నిటుల
ఆకసమునఁ గలవు విపణు లమ్మకమునకై.
ప్రాకటమౌ పురమ్ము గన భ్రాష్ట్రము నంటెడు పెక్కు సౌధముల్
చీకటి మచ్చమాపుచును స్నిగ్ధము లీనెడి యానుపూర్వియౌ
యోకము లందు నంగడులె యుప్పర మంటుట గాంచి పల్కెనే
యాకసమందుఁ బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై.
(ఆనుపూర్వి ...దొంతర)
కం॥ సోకుగ విమాన యానము
రిప్లయితొలగించండిస్వీకారముఁ జేసి చనఁగ విషయము తెలిసెన్
రూకలకు తిండి దొరకుట
ఆకసమునఁ గలవు విపణు లమ్మకమునకై
ఉ॥ ఈ కలి కాలమందు విన నెన్నియొ వింతల కంతులేదయా
సోకుగ నెంచి పైనమును శోభగఁ గాంచ విమానయానమున్
బ్రాకటనమ్ముగన్ గనఁగ వాడుక యన్నియు విక్రయించుటే
ఆకసమందుఁ బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై
ఇది నిజమండి. అంతర్దేశీయ (domestic) ప్రయాణాలలో. ఇప్పుడు దాదాపుగా ఇండిగోది మోనోపలి అయ్యింది. నీరు తప్ప ఏదీ ఫ్రీగా దొరకదండి. నచ్చిన సీటు కావాలన్నా అదనంగా చెల్లించాల్సిందే నండి. విదేశయానములో తిండి వరకు ఫరవాలేదు. నెట్ లాంటివి ప్రీమియం సీటు కావలంటే డబ్బుకట్టాలండి. ఆకాశములో విపణులకు కొదవ లేదండి.
రూకలు సంచులందుగొని లోకులు యంగడులందు వస్తువుల్
రిప్లయితొలగించండిజేకొను కాలమొచ్చినది చేదునిజంబిది, పేదవారికిన్
వ్యాకులపాటు యేర్పడగ వారు తలంచిరి నిస్పృహాత్ములై
యాకసమందుఁ బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం;ఈ కాలపు చిత్రమ్మై
రిప్లయితొలగించండిమాకు నపార్ట్మెంటు దక్కె మా కందని వౌ
నే కార్లు,బీర్లు? భూమిని
నాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై”
(పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగ్.దానిలో భూమి మీద (గ్రౌండ్ ఫ్లోర్ లో) కార్లు,ఆకాశం లో బీర్లు దొరుకుతాయి.అన్ని వ్యాపారాలు ఆ భవనం లో ఉన్నాయి.)
ఉ:లోకవినాశకమ్మయిన,లోభపు బుద్ధిని వర్తకేచ్ఛ జీ
రిప్లయితొలగించండికాకుల బెంచు దేశములు క్రౌర్యము నిండిన చిన్న దేశముల్
భీకర యుద్ధ మందు నరివీరుల గెల్వగ శస్త్ర రాశితో
నాకసమందుఁ, బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై”
(చిన్న దేశాలు అరివీరులని ఆకాశం లో గెలవటానికి శస్త్రరాశితో అగ్రరాజ్యాలు అంగడులు పెట్టారు.)
శోకము దిగ మ్రింగి జనులు
రిప్లయితొలగించండినాకము జేరంగ దెలి సె నవ్యపు రీతిన్
ప్రాకట ముగ గనబడె నట
నాకస ముగ గలవు విప ణు లమ్మ కము న కై
నీ కేలనొ యిట్టి తలఁపు
రిప్లయితొలగించండిరాక యిచట లాభములు నిరంతర మకటా
కోకొల్లలు, విహరింపకు
మాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై
సాఁక నశక్యమై విపణి సంచయ మెల్లను బీద సాదలౌ
లోకుల కందరాని గతి లోచన యుగ్మము చెమ్మగిల్లఁగాఁ
దాఁకఁగ సూర్య చంద్రులను దగ్గక మూల్యము లెల్ల నుండఁగా
నాకస మందుఁ బెట్టి రఁట యంగడు లెన్నియొ యమ్మకానికై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
చీకటిని మెఱయు తారలు
ఆకసమునఁ గలవు; విపణు లమ్మకమునకై
లోకమునన్ జాల గలవు
లోకుల యవసరముఁ దీర్చు లోపము లేకన్.
కేకలు వినినంతనె యిటు
రిప్లయితొలగించండి*"ఆకసమునఁ గలవు విపణు లమ్మకమునకై”*
లోకపు సాగుచునుండిరి
మూకలుగా సాగుచుంద్రు భూరి్ కొనగన్.
రూకలు గోరుచున్ వడిగ రొప్చుచు చేరెను వర్తకాళియే
చేకురులాభమంచునిలచింతనచేయుచు నాశహెచ్చగన్
రాకెటు లెక్కుచున్ చనుచు రాశులు గాసరుకమ్మనెంచుచున్
నాకసమందు బెట్టిరట యంగడులెన్నియొ యమ్మకానికై