16, మే 2025, శుక్రవారం

సమస్య - 5123

17-5-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే”

(లేదా...)

“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే”

16 కామెంట్‌లు:

  1. కం||

    వేడుకగ కృష్ణుడనె దన
    కోడియను గేస్తుడు శివుడు , కూరిమి తోడన్
    వీడుననె పేడ వేయగ
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే”

    రిప్లయితొలగించండి
  2. కందం
    తోడుండి చిత్రసీమను
    బాడిగ రూపాన మేటి పాత్రల మించెన్
    వాడగ జేయుచు వృత్తిని
    గీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే

    ఉత్పలమాల
    ఈడొకటై నటుండనఁగ నెప్పుడు స్పర్దను చిత్రసీమలోఁ
    గూడుచు మంచి పాత్రలను గొట్టుకు బోవును రాణకెక్కుచున్
    బాడిగ నెత్తునన్ మరియు బంగరు రూపున మించి వృత్తిలోఁ
    గీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    రిప్లయితొలగించండి
  3. వాడు శిశుపాలుడేగద
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని; శివుఁడే
    వేడిన వేల్పుల మొఱవిని
    గోడును తొలగంగజేయ గ్రోలెను విషమున్

    చూడగ వచ్చుగాదె మన సుందర కావ్యమునందు దృశ్యముల్
    పాడయినట్టివాడు శిశుపాలుడు గర్వమధాంధ మూఢుడై
    కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను; నీలకంఠుఁడే
    వేడిన వేల్పులన్నరయ వేగమె మ్రింగెను హాలహాలమున్

    రిప్లయితొలగించండి
  4. నిందా స్తుతి

    కం॥ వేడగ దైత్యులు వరములు
    వాడుక యిచ్చుటయె నాకు వారు కఱటులై
    పీడించఁ ద్రుంచి వారికిఁ
    గీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే

    ఉ॥ చూడఁగ దానవాగ్రణులు స్ఫూర్తినిఁ గాంచి తపమ్ము సేయఁగన్
    వాడుక నాకు ప్రోచుటయె వారలు నేమముఁ దప్పి సర్వులన్
    బీడనఁ జేయఁ గూల్చెదవు విచ్చును ధర్మము దానవాళికిన్
    గీడు నొసంగు వాఁ డనుచుఁ గృష్టునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    కఱటి దుష్టుడు (నిఘంటువు సహాయమండి) పీడన నిఘంటువులో ఉన్నదండి
    కృష్ణుడు విష్ణువు ఒకటే అనే భావముతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి

      ఉ॥ వాఁడొక బుద్ధి హీనుఁడుగ వాసిగఁ బొందిన వెఱ్ఱివల్లనో
      వాఁడు మదోద్ధరుండగునొ పాలసుఁడో శివ కేశవాకృతుల్
      చూడఁగ వేరుకాదనెడి సూక్ష్మము వీడుచుఁ దూరెఁ దప్పుగన్
      గీడు నొసంగు వాఁడనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

      తొలగించండి
  5. (కృష్ణుడు శివుడు స్నేహితులు)

    చేడియను ధనము తెమ్మని
    పీడించగ కాంచి దుష్ట పెనిమిటి వనుచున్
    చూడగ కట్నము జాతికి
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే.


    (నీలకంఠుని పొరుగు వాడు కృష్ణుడు )

    వీడట నాస్తికత్వమును విశ్వము నంతట వ్యాప్తి జేయగా
    వీడెను బంధు జాలమును వేదనకున్ గురిచేైసి వృద్ధులన్
    చీడగ మారెనే యనుచు చెప్పుచు గాంచ నతండు జాతికిన్
    కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    రిప్లయితొలగించండి
  6. తోడుగ శివుఁడును కృష్ణుడు
    వీడక నుండిరి సుఖముల వేదనలందున్
    వీడుము నీ వెసనమ్ముల
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే

    రిప్లయితొలగించండి
  7. తోడుగ నీడగా మసలు తోరఁపు మిత్రులు వారలిర్వురున్
    వీడకనుండి రొండొరులు వేదనలందున సమ్మదమ్ములన్
    వీడుము మైత్రి ధూర్తుఁడగు భీమునితో నటువీడకున్నచో
    కీడు నొసంగు వాఁడనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    రిప్లయితొలగించండి


  8. షాడబము గ్రోలి మత్తున
    నాడిక వేయగ తగునె యల్పుని వలె ను
    ద్దీడా! వచింపు మెప్పుడు
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే.

    షాడబము ..మద్యము; ఉద్దీడు... స్నేహితుడు.


    షాడబ మెచ్చు గ్రోలి మన సంస్కృతి తెల్పు పురాణ జ్ఞానమున్
    వీడితి వేమొ పింగళుడు విష్ణువు లిద్దరు గాంచ మేటి యు
    ద్దీడులు వారువాస్తవము దేబెవు నీవిక చెప్పు మెప్పుడో
    కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య:
      కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుడే

      ఉత్పలమాల.

      వేడుక కాదు నాకు హర వేదన మీరెను నిన్ను కోరగా
      మాడెను మన్మథుండతడు మాధవు పుత్రుడు కన్నతండ్రియే
      కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను, నీలకంఠుడే
      కీడును బాపి బ్రోచెనని కేలను మ్రొక్కెను గౌరి యంతటన్

      (మొండి మన్మథుని పుట్టించిన వాడు కృష్ణుడని, సాయం వద్దన్నా వినక ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడని పార్వతి వాపోవడము)

      తొలగించండి
  10. వేడుక గా దైత్యా ళు ల
    దాడుల నరికట్ట వలయు ధైర్యము దోడన్
    జూడకు దేలిక గ సతము
    కీడు నొసగు ననుచు ది ట్టె కృష్ణుని శివు డే

    రిప్లయితొలగించండి
  11. కం:వాడొక శైవుడు,వానికి
    తోడుగ శివు డనెడు కొడుకు దుష్టుండై మా
    టాడు ,సభను శివుని పొగడి
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే

    రిప్లయితొలగించండి
  12. క్రీడి సఖు వాసు దేవుని
    క్షే డాభరణుం డలుకను సిత శశి రేఖా
    చూడుఁడు బాణున కీతఁడు
    కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే


    వీఁ డొక వీర వర్యుఁ డట వీని బలమ్మును నేఁడు గాంచెదన్
    దాడి యొనర్ప నే పగిదిఁ దా నెదిరింపఁగ నోపు నంచునున్
    వీడక మౌని వేషమును వింటిని నెక్కిడి వేఁట నీతికిం
    గీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే

    [కృష్ణుఁడు = అర్జునుఁడు]

    రిప్లయితొలగించండి
  13. ఉ:వాడొక వీరశైవు డయి వైరము, ద్వేషము తోడ రెచ్చి "యా
    టాదెను గొల్ల భామినుల యందున బ్రేమను, యుద్ధకాంక్షి యై
    కీడు నొసంగువాఁ" డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను, నీలకంఠుఁడే”
    తోడగు ముక్తికాంక్షులకు దూరము చేయకు డంచు బల్కుచున్

    రిప్లయితొలగించండి
  14. :
    వాడొకచోరుడటంచును
    *“కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని, ,శివుఁడే”*
    వాడిగ సాత్వతి తనయుడు
    కాడున, క్రీడికి నొసంగె కార్ముక మునటన్
    ఉ.మా:
    వీడెగ పూతనాంతకుడు వీడెగ కంసుని ప్రాణహర్తయున్
    వాడు దురాత్ముడంచుశిశుపాలుడువెన్నునిగాంచియాసభన్
    *“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను, నీలకంఠుఁడే”*
    కాడున మెచ్చియిచ్చెనుగ కవ్వడికిన్ విలువైన యస్త్రమున్


    రిప్లయితొలగించండి