20-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పోతన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”
(లేదా...)
“పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంయాతన బెట్టుచుఁ జంపగఘాతకుల పలువురినంపె కంసుడు, కృష్ణుండాతడు చన్గుడుచు నపుడెపో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్ఉత్పలమాలయాతన బెట్టుచున్ దునుమ నంబుజ నేత్రుని బాలకృష్ణునిన్ఘాతకులైన రాక్షసుల కంసుడు పంపెను ప్రాణభీతితోచేతన గల్గువాడనఁగఁ జిక్కియుఁ జన్గుడుపంగ నప్పుడేపో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్!
కం॥ పూతన వృత్తాంతమునటుప్రీతిగ నేను చదువగను వెన్నుడు కలలోద్యోతకమయ్యి పరఁగెనిటుపోతన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్ఉ॥ పూతన గాథ నేనటుల పోడిమి మీర పఠించు చుండఁగన్రాతిరి పూట ధ్యాసఁగని రాక్షసి రూపును దల్చి తూగఁగన్బ్రీతిగ స్వప్నమందునను వెన్నునిఁ గాంచితి రాచఠీవితోఁబోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతమ్ముగన్ ఇలా కలలు రావడము సామాన్యమే నండి. కాకపోతే కొంత స్పష్టత లోపిస్తుందండి.
కోతల రాయుడు నుడివెను ,తాత తనకు దెలిపినట్టి తరుణము నందోయాతడు వాచించక మునుపో , తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతి నటించి శిశువు నాఘాతింపగ జేరె క్రూర కంసుండంపన్ నాతి యొకతి, గని కృష్ణుడె పో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్.ప్రీతి నటించి బాలకుల పేరడగింపగ కంసుడంపగానాతియె జేరె స్తన్యమును నందసుతుండగు నిచ్చు వంకతో కైతవ ప్రేమ జూపు కలకంఠిని గాంచుచు బాల కృష్ణుడే పో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్.
ఘాతుకమున కొడిగట్టగపూతన చేరెనట వెన్న ముచ్చును జంపన్పాతకి యని గ్రహియించెనుపో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్పాతకి చేరవచ్చెనట పంతముతో మురభిత్తు హత్యకైబాతిని తెల్పెనో దరికివచ్చిన దానిని రంపెలాడిగాచేతన తెల్పెనో శిశువు చేష్టలు చెల్లియొ లేక చిన్నచూపో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ప్రీతిని జూపుచు కృష్ణుని మాతగ పాలీ య వచ్చు మాయావి ని యా పాఠకి మోసము గను గొ నె పో :: తన యిలు జొ చ్చి నట్టి పూతన జంపె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పాతకి' టైపాటు.
ఓ తరుణీ విను తెలిపెదనాతఁడు గిరిధారి శౌరి యతనిని జంపన్పాతకి చనుబాలు గుడుపఁ“పో తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”
పాతకియైన పూతనను పంపగ కంసుఁడు పల్లెపల్లెకున్ఘాతకి మారు రూపు గొని క్రన్నన జేరెను నందునింటికిన్బ్రాఁతిగ స్తన్యముంగుడిపి బాలుని జంపగ బూన, కృష్ణుడేపో తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కం:నీ తెలివి యెట్టి దైననువ్రాతయె యడ్డమ్ము వచ్చె రాజా!కంసా!చైతన్య నిథియె కృష్ణుడు పో ! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”(అని ఆ విషయాన్ని గూఢచారులు కంసునికి చెప్పారు.)
ఉ:"హేతువు నాకె వచ్చు నని యిట్టుల బల్కె నొకండు "పిచ్చివౌవ్రాతలు కాదె!చంపుటకు పాలను త్రాపుట యొండె మార్గమా! హేతువు లేని యట్టి చదువే యిది,కృష్ణుడు దేవు డందువేపో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్.(కృష్ణుణ్ని చంపాలంటే పాలు పట్టటం తప్ప ఇంకే ఉపాయం దొరకదా!అన్నీ పిచ్చి కథలు అని ఎక్కిరించి సర్లే! దేవుడే పో!చంపాడు లే అన్నాడు.)
వాట్సప్ సమూహంలో సమీక్షించిన మిత్రుల పూరణలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించ మనవి.
సమస్య:“పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”ఉత్పలమాల" పోత యనంగ శ్రీహరియె పోడిమి బమ్మెర వ్రాసె లీలలన్ మాతుల బంపు రక్కసుల మాయల జంపిన రీతులచ్చటన్ పూతన నంపె కంసుడును పూనిక కృష్ణుని మట్టుబెట్టగన్ యాతని నెత్తు దెల్సి నడయాడెడు బాలుడు చన్గుడే భళా ! “పో ! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె, మహాద్భుతంబుగన్”
నాతిని విషధర కుచనుంబ్రాతః కాలమ్ము నందుఁ బరికింపంగానాతఁడు ప్రాకృత బాలుఁడె పో తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్ పోతన వంటి సత్కవినిఁ బుణ్య చరిత్రునిఁ బండితోత్తముంజూతమ టన్న నిక్కముగఁ జోద్యము గాదె ధరాతలమ్ములోనాతత భక్తి తత్పరుఁడు యాదవ సింహుని లీల వ్రాయఁడే పోతన యింటఁ జేరె నని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
శ్రీతిలకాంకవక్షుడయి చె న్నెస లారెడు విష్ణుమూర్తి నిర్ధూతసమస్తపాపచయలోకమనోహరబాలకృష్ణుఁడై మాతయశోద కచ్చెరువు మైకొనఁ దొల్దొలి లీల ౙూపెనే!పో! తన యింటఁ జేరె నని పూతనఁ ౙంపె మహాద్భుతంబుగన్ !
పాతిగ మాత చెంతను విభాస్పద మోహన సత్స్మితాస్యుడౌభూతరుణీ మనోనిలయ భూషిత కౌస్తుభ రత్న దేహ విశ్వాతత తత్త్వ నామ సుర శాంతిద కృష్ణుడు చిన్నిబాలుడే పో ! తన యింట జేరెనని పూతనఁ జంపె మహాద్భుతమ్ముగా !
చేతము లో చింతించుచుఘాతకులను పంపమామ కలవర పడకన్యాతనలిడ కన్నయయేపో, తన యిలు జొచ్చినట్టి పూతన జంపెన్ఈతడెశంఖచక్రములనిమ్ముగదాల్చిజనించెకృష్ణుడైయీతడె చేసెబాల్యముననెన్నియొ నద్భుతకార్యజాలముల్యీతడెకంసుడంపగను నేతెర పాల నొసంగనెంచగన్*పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండియాతన బెట్టుచుఁ జంపగ
ఘాతకుల పలువురినంపె కంసుడు, కృష్ణుం
డాతడు చన్గుడుచు నపుడె
పో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
ఉత్పలమాల
యాతన బెట్టుచున్ దునుమ నంబుజ నేత్రుని బాలకృష్ణునిన్
ఘాతకులైన రాక్షసుల కంసుడు పంపెను ప్రాణభీతితో
చేతన గల్గువాడనఁగఁ జిక్కియుఁ జన్గుడుపంగ నప్పుడే
పో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్!
కం॥ పూతన వృత్తాంతమునటు
రిప్లయితొలగించండిప్రీతిగ నేను చదువగను వెన్నుడు కలలో
ద్యోతకమయ్యి పరఁగెనిటు
పోతన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
ఉ॥ పూతన గాథ నేనటుల పోడిమి మీర పఠించు చుండఁగన్
రాతిరి పూట ధ్యాసఁగని రాక్షసి రూపును దల్చి తూగఁగన్
బ్రీతిగ స్వప్నమందునను వెన్నునిఁ గాంచితి రాచఠీవితోఁ
బోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతమ్ముగన్
ఇలా కలలు రావడము సామాన్యమే నండి. కాకపోతే కొంత స్పష్టత లోపిస్తుందండి.
కోతల రాయుడు నుడివెను ,
రిప్లయితొలగించండితాత తనకు దెలిపినట్టి తరుణము నందో
యాతడు వాచించక మును
పో , తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రీతి నటించి శిశువు నా
ఘాతింపగ జేరె క్రూర కంసుండంపన్
నాతి యొకతి, గని కృష్ణుడె
పో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్.
ప్రీతి నటించి బాలకుల పేరడగింపగ కంసుడంపగా
నాతియె జేరె స్తన్యమును నందసుతుండగు నిచ్చు వంకతో
కైతవ ప్రేమ జూపు కలకంఠిని గాంచుచు బాల కృష్ణుడే
పో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్.
ఘాతుకమున కొడిగట్టగ
రిప్లయితొలగించండిపూతన చేరెనట వెన్న ముచ్చును జంపన్
పాతకి యని గ్రహియించెను
పో! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
పాతకి చేరవచ్చెనట పంతముతో మురభిత్తు హత్యకై
బాతిని తెల్పెనో దరికివచ్చిన దానిని రంపెలాడిగా
చేతన తెల్పెనో శిశువు చేష్టలు చెల్లియొ లేక చిన్నచూ
పో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిప్రీతిని జూపుచు కృష్ణుని
రిప్లయితొలగించండిమాతగ పాలీ య వచ్చు మాయావి ని యా
పాఠకి మోసము గను గొ నె
పో :: తన యిలు జొ చ్చి నట్టి పూతన జంపె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాతకి' టైపాటు.
ఓ తరుణీ విను తెలిపెద
రిప్లయితొలగించండినాతఁడు గిరిధారి శౌరి యతనిని జంపన్
పాతకి చనుబాలు గుడుపఁ
“పో తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాతకియైన పూతనను పంపగ కంసుఁడు పల్లెపల్లెకున్
రిప్లయితొలగించండిఘాతకి మారు రూపు గొని క్రన్నన జేరెను నందునింటికిన్
బ్రాఁతిగ స్తన్యముంగుడిపి బాలుని జంపగ బూన, కృష్ణుడే
పో తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:నీ తెలివి యెట్టి దైనను
రిప్లయితొలగించండివ్రాతయె యడ్డమ్ము వచ్చె రాజా!కంసా!
చైతన్య నిథియె కృష్ణుడు
పో ! తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”
(అని ఆ విషయాన్ని గూఢచారులు కంసునికి చెప్పారు.)
ఉ:"హేతువు నాకె వచ్చు నని యిట్టుల బల్కె నొకండు
రిప్లయితొలగించండి"పిచ్చివౌ
వ్రాతలు కాదె!చంపుటకు పాలను త్రాపుట యొండె మార్గమా!
హేతువు లేని యట్టి చదువే యిది,కృష్ణుడు దేవు డందువే
పో! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్.
(కృష్ణుణ్ని చంపాలంటే పాలు పట్టటం తప్ప ఇంకే ఉపాయం దొరకదా!అన్నీ పిచ్చి కథలు అని ఎక్కిరించి సర్లే! దేవుడే పో!చంపాడు లే అన్నాడు.)
వాట్సప్ సమూహంలో సమీక్షించిన మిత్రుల పూరణలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించ మనవి.
రిప్లయితొలగించండిసమస్య:
రిప్లయితొలగించండి“పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”
ఉత్పలమాల"
పోత యనంగ శ్రీహరియె పోడిమి బమ్మెర వ్రాసె లీలలన్
మాతుల బంపు రక్కసుల మాయల జంపిన రీతులచ్చటన్
పూతన నంపె కంసుడును పూనిక కృష్ణుని మట్టుబెట్టగన్
యాతని నెత్తు దెల్సి నడయాడెడు బాలుడు చన్గుడే భళా !
“పో ! తన యింటఁ జేరెనని పూతనఁ జంపె, మహాద్భుతంబుగన్”
నాతిని విషధర కుచనుం
రిప్లయితొలగించండిబ్రాతః కాలమ్ము నందుఁ బరికింపంగా
నాతఁడు ప్రాకృత బాలుఁడె
పో తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్
పోతన వంటి సత్కవినిఁ బుణ్య చరిత్రునిఁ బండితోత్తముం
జూతమ టన్న నిక్కముగఁ జోద్యము గాదె ధరాతలమ్ములో
నాతత భక్తి తత్పరుఁడు యాదవ సింహుని లీల వ్రాయఁడే
పోతన యింటఁ జేరె నని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్
శ్రీతిలకాంకవక్షుడయి చె న్నెస లారెడు విష్ణుమూర్తి ని
రిప్లయితొలగించండిర్ధూతసమస్తపాపచయలోకమనోహరబాలకృష్ణుఁడై
మాతయశోద కచ్చెరువు మైకొనఁ దొల్దొలి లీల ౙూపెనే!
పో! తన యింటఁ జేరె నని పూతనఁ ౙంపె మహాద్భుతంబుగన్ !
పాతిగ మాత చెంతను విభాస్పద మోహన సత్స్మితాస్యుడౌ
రిప్లయితొలగించండిభూతరుణీ మనోనిలయ భూషిత కౌస్తుభ రత్న దేహ వి
శ్వాతత తత్త్వ నామ సుర శాంతిద కృష్ణుడు చిన్నిబాలుడే
పో ! తన యింట జేరెనని పూతనఁ జంపె మహాద్భుతమ్ముగా !
చేతము లో చింతించుచు
రిప్లయితొలగించండిఘాతకులను పంపమామ కలవర పడకన్
యాతనలిడ కన్నయయే
పో, తన యిలు జొచ్చినట్టి పూతన జంపెన్
ఈతడెశంఖచక్రములనిమ్ముగదాల్చిజనించెకృష్ణుడై
యీతడె చేసెబాల్యముననెన్నియొ నద్భుతకార్యజాలముల్
యీతడెకంసుడంపగను నేతెర పాల నొసంగనెంచగన్
*పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”*