1-7-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే”
(లేదా...)
“స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా”
1-7-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే”
(లేదా...)
“స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా”
30-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాటుమాటుగా వినుట సంస్కారమగును”
(లేదా...)
“విననొప్పున్ గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేర మాటాడఁగన్”
29-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును పరువే”
(లేదా...)
“పరువే పోవును దల్లిదండ్రులను సంభావించి పూజించినన్”
28-6-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు”
(లేదా...)
“యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
27-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
(లేదా...)
“అండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”
26-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ”
(లేదా...)
“నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే”
25-6-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భావశూన్యపద్యమే వినఁ దగు”
(లేదా...)
“భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే”
24-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె”
(లేదా...)
“కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో”
23-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానమ్మునకు జ్ఞాన మక్కర యగునా”
(లేదా...)
“అవధానమ్మున జ్ఞాననేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్”
22-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి”
(లేదా...)
“స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”
21-6-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్”
(లేదా...)
“తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్”
20-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే”
(లేదా...)
“కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్”
19-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు”
(లేదా...)
“మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే”
18-6-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్”
(లేదా...)
“పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్”
17-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు”
(లేదా...)
“కూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్”
16-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్”
(లేదా...)
“గంగన్ శ్రీహరి దాల్చె నౌదల నుమాకాంతుండు మేల్మేలనన్”
15-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె”
(లేదా...)
“మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో”
14-6-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీ మీసము మీఁద నడచె చీమ రయమునన్”
(లేదా...)
“స్త్రీ మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్ జీకాకు గల్గించుచున్”
13-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దైవోపహతునకు సౌఖ్యమబ్బు”
(లేదా...)
“దైవోపహతుండు పోవు కడకుం జేరున్ గదా సౌఖ్యముల్”
(ఛందో గోపనము)
12-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల”
(లేదా...)
“పీడను బాపినట్టి రణవిక్రము నెల్లరు దూలనాడిరే”
11-6-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”
(లేదా...)
“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”
10-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మనము మార్దవ మాతని పనియొ హింస”
(లేదా...)
“మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ”
9-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్”
(లేదా...)
“నైవేద్యం బిడనట్టి పూజయె మాహానందంబునుం గూర్చెడిన్”
8-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్”
(లేదా...)
“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
7-6-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము”
(లేదా...)
“లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్”
(నిజానికి ర-ల యతి నాకు ఇష్టం లేనిది. కాని ఇప్పుడందరూ యథేచ్ఛగా వాడుతున్నారు)
6-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు”
(లేదా...)
“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్”
5-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వేచ్ఛ హెచ్చినపుడె సిరులు కలుగు”
(లేదా...)
“స్వేచ్ఛ మరింత హెచ్చినపుడే సిరులెన్నియొ పొందఁగా నగున్”
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
4-6-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామము లేనట్టివానిఁ గాంత వరించెన్”
(లేదా...)
“కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
3-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాడ దొంగ యెటుల్ భగవంతుఁడగును”
(లేదా...)
“వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా”
2-6-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్”
(లేదా...)
“నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్”