ఉ॥ రావము లేని గీతమిల రమ్యతఁ గాంచుచు నొప్పు రీతిగన్ దావియె లేని పుష్పములు తప్పక నింతుల కిష్టమై నటుల్ దేవుఁడు లేని కోవెలను దీరుగ భక్తులు చూచు రీతిగన్ భావము లేని పద్యమునె పండితు లెల్లఁ బఠించి మెచ్చిరే!
వ్యంగార్థములో నండి. మొదటి 3 పాదములు ఎంత నిజమో చివరిది అంతే నిజమని భావము
జీవము కావ్యమందునను
రిప్లయితొలగించండిజేరును భావ విశుద్ధతా ధ్వనిన్
తావి స్పృశించి నెమ్మనము
దాకుచు పద్యవిశాల వీధి సం
రావముతో జనించుమృదు
రాగ విహారపు హారమందు దు
ర్భావము లేని పద్యమునె
పండితులెల్లఁ బఠించి మెచ్చిరే!
ఆ||వె||
రిప్లయితొలగించండిపద్యపఠన జేయు పఠకుని మదియందు
నున్నతి నిడుచుండ నొప్ప లేక ,
ప్రగతిభావ శూన్యపద్యమే వినఁ దగు
ననుచు జెప్పునుగద నబ్బకాడు
ఆటవెలది
రిప్లయితొలగించండిగొప్పవాడిననుచు నెప్పటివలె కాక
సామరస్యమెంచి సరళముగను
కవనమొల్కినంత స్తవములిడిరి యహం
భావశూన్యపద్యమే వినఁ దగు
ఉత్పలమాల
చేవ గలుంగు వాడనని చెప్పక చెప్పెడు రీతి పద్యముల్
జీవము మృగ్యమై వినఁగఁ జేల్లని పోకడ వ్రాయు పండితుం
డావల మారుచున్ గవనమల్గగ నార్ద్రత నిండగా నహం
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే!
చక్క నైన భావ సంస్కార యుక్త మై
రిప్లయితొలగించండిపండితాళి మెప్పు బదసి జనుల
చెవుల కింపు సొంపు చేకూ ర్చు చు విరోధ
భావ శూన్య పద్య మే విన దగు
ఆ॥ వినఁదగు నవివేకి విహితముఁ గరపఁగ
రిప్లయితొలగించండివినఁదగునె యసత్య వివరణలును
వినఁదగు నుచితముల విరియు ప్రగతి యన
భావ శూన్య పద్యమే వినఁదగు
ఉ॥ రావము లేని గీతమిల రమ్యతఁ గాంచుచు నొప్పు రీతిగన్
దావియె లేని పుష్పములు తప్పక నింతుల కిష్టమై నటుల్
దేవుఁడు లేని కోవెలను దీరుగ భక్తులు చూచు రీతిగన్
భావము లేని పద్యమునె పండితు లెల్లఁ బఠించి మెచ్చిరే!
వ్యంగార్థములో నండి. మొదటి 3 పాదములు ఎంత నిజమో చివరిది అంతే నిజమని భావము
ఉ.
రిప్లయితొలగించండిపావన కావ్యతాభ తతి భాసిత లక్షణ భూష తత్త్వమున్
దేవ వతంసు రుద్రుని స్తుతించు మహత్వము సేత నొప్పి, శ్రీ
జీవ రసాత్మకంబయిన చెన్నెసలారెడి దోష పూరమౌ
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే !
రిప్లయితొలగించండిమధుర స్వరము గలిగి మాధుర్యమొలుకగ
పాడనేమి వాడు పద్య మొకటి
పండితుండ్రు మెచ్చు పదముల గల్గి దు
ర్భావశూన్యపద్యమే వినఁ దగు.
కోవెల లోని దేవతల గొల్వగ నెంచిన మానవాళియే
కావలె నంచు కోరెదరు కల్పము నందున గబ్బు లేనివౌ
పూవులవేగదా సతము మోదము గూర్చునదే విధమ్ము దు
ర్భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే.
పద్యకావ్యమనినఁ బఠితలెపుడు కోరు
రిప్లయితొలగించండిభావయుక్తమైన పద్య రచన
భక్తి భావమలరఁ బరవశింపగ నన్య
భావశూన్యపద్యమే వినఁ దగు
పావనరామచంద్రునికి పద్యసుమంబుల నేర్చి కూర్చ సం
భావితమైన మానసము పద్యములే రచియింప గాఢమౌ
భావతరంగ యుక్తమయి భక్తిరసార్ద్రత తప్పనన్యథా
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే