28, జూన్ 2025, శనివారం

సమస్య - 5166

29-6-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును పరువే”

(లేదా...)

“పరువే పోవును దల్లిదండ్రులను సంభావించి పూజించినన్”

7 కామెంట్‌లు:

  1. కలుగును పుణ్యము సతతము
    తలిదండ్రులఁ బూజ సేయఁ ; దలఁగును పరువే
    యిలునుండి పంపనెంచి ము
    సలివారి నెలవున జేర్చ సాగిన యెడలన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    కలతలు రేపుచు నింటను
    తెలివిగ సతి నిందవేయ దేభ్యపు పతి యా
    వల నాశ్రమములకంపియు
    తలిదండ్రులఁ, బూజ సేయఁ దలఁగును పరువే!


    మత్తేభవిక్రీడితము
    నిరతమ్మాలియె రేపుచున్ గలతలన్ నిందింప లౌక్యమ్ముగన్
    దరలింపంగను గన్నవారి పతి నిర్దాక్షిణ్యుఁడై వెంటనే
    బుర వృద్ధాశ్రమమందు, పెంచిరనుచున్ బోవంగ కుక్కొక్కటే!
    పరువే పోవును దల్లిదండ్రులను సంభావించి పూజించినన్!

    రిప్లయితొలగించండి
  3. కం॥ తలఁచుచుఁ బిల్లల భవితను
    జెలిమినిఁ బెంచఁగ నియతియె చెడు నడవడితో
    విలువలఁ గరపక మనఁగన్
    దలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును పరువే

    మ॥ నెరవై జీవన గమ్య సూత్ర భృతియై నిత్యమ్ముఁ గష్టించుచున్
    వరమై స్ఫూర్రినిఁ బొందు ధామముగనై వర్తిల్లఁ బూజ్యార్హులే
    బరువై బిడ్డలు భోగ మట్లు ముదమై భారమ్మటంచున్ జనన్
    బరువే పోవును దల్లదండ్రులను సంభావించి పూజించినన్

    నెమ్మదిగా అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వస్తున్న కథనం ఆధారితంగా నండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మ॥ రెండవ పాదము 2వ పదము స్ఫూర్తిని తప్పుగా టైపు చేసానండి.

      తొలగించండి
    2. తల్లిదండ్రులను కూడ పొరపాటున తప్పుగా టైపు చేసానండి

      తొలగించండి

  4. లలన తనమాటకు నెదురు
    పలుకగ లేడు మగడంచు పలికె నిటుల గా
    దిలి, నే డాధునికుల కిల
    తలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును పరువే.


    భరమౌ వృద్ధులు చెంతనున్న సుఖముల్ ప్రహ్లాదముల్ లేక చా
    కిరి నేచేయగ లేనటంచు సతియే క్లేశంబుతో పల్కె పా
    ర్పరులన్ గాంచ వికారులై కన సహింపన్ జాల డెవ్వండిలన్
    బరువే పోవును దల్లిదండ్రులను సంభావించి పూజించినన్.

    **************** **************** ****** ****

    వలదిక యింట ముదుసలుల
    ని లలనయె జగడములాడ నేత్రుడు పలికెన్
    కలనపు మాటల వీడుము
    తలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును పరువే?


    ధరణిన్ వృద్ధుల గాంచ వ్యర్థులనుచున్ ధాత్రేయకే వారలున్
    భరమంచున్ వచియించు నీ నుడలనెవ్వండైన నాలించినన్
    బరువే పోవును , దల్లిదండ్రులను సంభావించి పూజించినన్
    దురితమ్ముల్ నశియించు మోక్షమదె యందున్ దోషికైనన్ గదా!

    రిప్లయితొలగించండి
  5. కలుగక పోవునె పుణ్యము
    తలిదండ్రులఁ బూజ సేయఁ; దలఁగును పరువే
    నెలవని వృద్ధాశ్రమమున
    తలిదండ్రులఁ వీడనాడు తనయులకిలలో

    కరుణామూర్తులు తల్లిదండ్రులు సదా కాపాడరే బిడ్డలన్
    బరమానందము కూర్చకున్నఁ సుతులే వారిన్ దిగద్రోచినన్
    బరువే పోవును; దల్లిదండ్రులను సంభావించి పూజించినన్
    దరికింజేరును పుణ్యసిద్ధి దివికిన్ దామేగుటే తథ్యమౌ

    రిప్లయితొలగించండి